హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు.... అసలు కథ‌ !

హైదరాబాద్

(బీ. రామకృష్ణ రాసిన మెట్రో రైలు ప్రాజెక్టు ఎవరి కోసం ? అనే ఈ వ్యాసం వీక్షణం జనవరి 2018 సంచికలో ప్రచురించబడినది)

మెట్రోరైలు వస్తే ట్రాఫిక్‌ సమస్య తీరిపోతుందని, కాలుష్యం తగ్గుతుందని, ప్రపంచస్థాయి రవాణా వ్యవస్థ సాక్షాత్కరిస్తుందని ప్రభుత్వా లు చెబుతూ వచ్చాయి. హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యపై సమగ్రమైన, శాస్త్రీయమైన అధ్యయనాలు జరిగి మెట్రోనే పరిష్కారమని చెప్పాయా? ఎవరకీ తెలియదు. హైదరాబాద్‌లో, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి భారతీయ రైల్వే లైన్లను ఉపయోగించుకుంటూ 2003లో మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టం (ఎంఎంటిఎస్‌)ను ఏర్పాటు చేశారు. అప్పట్లో దీనికి సంబంధించి 167 కోట్ల రూపాయలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించారుు. ఎంఎంటిఎస్‌ను అనుసంధానిస్తూ బస్‌ సర్వీసులు లేకపోవడం ఒక లోపంగా ఉండిపోయింది. 2003లోనే హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్టు (ఎచ్‌ఎంఆర్‌పి)పై సర్వే చేయమని ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డిఎంఆర్‌సి)ను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ధేశించింది. ఈ ప్రణాళిక ప్రకారం మెట్రోను అప్పటికే ఉన్న ఎంఎంటిఎస్‌తో అలాగే ఇతర ప్రత్యామ్నాయ రవాణా మార్గాలతో అనుసంధానించాలి. ఇందుకోసం 4 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుంద ని అంచనా వేశారు. ప్రస్థుత మెట్రో రైలు ఇలా ఏమైనా నిర్మించ బడిందా, బస్‌స్టాప్‌లకు దగ్గరగాగాని, మెట్రో స్టేషన్‌కు రాకపోకల కోసం ప్రజా రవాణా ఏర్పాట్లు ఏమైనా ఏర్పాటు చేశారా అంటే సమాధానం కష్టమే.

హైదరాబాద్‌కు వలసలు ఎందుకు పెరుగుతున్నారుు? హైదరాబాద్‌లో జనాభా ఎందుకు పెరుగుతున్నది? వికేంద్రీకృత, సుస్థిరమైన అభివృద్ధి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఎక్కడికక్కడ జరిగే పద్ధతుల గురించి ఆలోచిస్తున్నారా. ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధులు ఎక్కడికక్కడ లభించే ప్రయత్నాలు చేస్తూ, వాటికి పరిష్కారాలు తెలుసుకోగలిగితే హైదరాబాద్‌ వంటి నగరాలకు వలసలు ఎందుకు పెరుగుతాయనేది మౌలికమైన ప్రశ్న.

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యకు మెట్రోను ఒక పరిష్కార మార్గంగా భావిస్తే తప్పు లేదేమో గాని అదే సర్వరోగ నివారిణి అయితే కాదు. విశ్వనగరంగా ఎదగడానికి మెట్రో దోహదపడుతుందని, ప్రజలకు రవాణా వేగవంతంగా, సౌకర్యవంతంగా మారుతుందని ప్రచారం చాలానే జరిగింది. మెట్రో రైలు రావడం భాగ్యంగా, అపురూపంగా, ఆనంద డోలికలతో విశ్వనగరంగా హైదరాబాద్‌ రూపొందుతున్నదని ప్రభుత్వాలు పరవశింప చేస్తున్నారుు. పాక్షికంగా పూర్తయిన మెట్రో రైలును 2017 నవంబర్‌ 28న భారత ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా ప్రారంభించారు.

హైదరాబాద్‌ను విశ్వనగరంగా ప్రొజెక్ట్‌ చేయాలని తపిస్తున్న ప్రభుత్వం మరో పార్శ్వాన్ని కూడా వెలుగులోకి తెచ్చి పరిష్కరించవల్సి ఉన్నది. అధికారిక లెక్కల ప్రకారమే జిఎచ్‌ఎంసి పరిధిలో 80.45 చ.కి.మీ. విస్తీర్ణంతో మొత్తం 1,476 మురికివాడలు ఉన్నారుు. అందులో 68,09,970 ప్రజలు నివసిస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రకటించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు వీరిలో కొద్ది మంది కోసం ఉద్దేశించబడినవే. వీటిని అపార్ట్‌మెంట్‌లలో ఐదారువందల చదరపు అడుగుల విస్తీర్ణంలోపు ఫ్లాట్లుగా నిర్మించాలని ప్రతిపాదించారు. ఇంత ఇరుకు ఫ్లాట్‌లలో సంసారాలు నెట్టుకురావడం కష్టమే అరుునప్పటికీ అవైనా సరే దొరికితే అదే మహాభాగ్యంగా, భావించి వాటివైపు ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితిని, లేబర్‌ అడ్డాలలోని కూలీలను, ఇళ్లలో పనిచేసే వాళ్లను, మరితర నిరుద్యోగులను, నిరుపేదలను చూస్తుంటే విశ్వనగరం(?) ప్రజల స్థితిగతులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పకనే చెబుతున్నారుు. విలాసవంతమైన జీవితాలు ఓ వైపు, మురికివాడల్లో ఎంతోమంది కష్ట నష్ట జీవితాలు మరోవైపు అసమ అభివృద్ధితో సాగుతున్న హైదరాబాద్‌ నగరానికి మెట్రో వచ్చి విశ్వనగర వెలుగులు చిమ్ముతుందన్నమాట.

హైదరాబాద్‌ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయినప్పడు ఎవరైనా మెట్రోవైపు చూడడం సహజంగానే జరుగుతున్నది. మెట్రో వస్తే ఈ సమస్యలు తీరుతాయని అనుకోనివారు తక్కువగానే ఉంటారు. వాస్తవంలో అలా జరుగుతుందా అని, హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్టు వెనుకున్న అసలు ఉద్దేశాలేమై ఉంటాయని గాని లోతుల్లోకెళ్లి ఆలోచించింది ఎంతమంది. అలా ఆలోచించిన వారిలో సహితం ఏమైతేనేమి కొంతవరకైనా ట్రాఫిక్‌ సమస్య తీరకపోతుందా అని అనుకున్న వారే అధికం. 2003 నుండి మొదలైన మెట్రో రైలు ఆలోచన 2007 మే 14న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ సంస్థ ఏర్పాటు కావడంతో కార్యరూపంలోకి వచ్చింది. పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యం(పిపిపి)నమూనాలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 71.16 కి.మీ పొడవైన మెట్రోరైలు మార్గాన్ని నిర్మించడం కోసం 2008 సెప్టెంబర్‌ 19న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మైటాస్‌ కంపెనీతో హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు పై ఒప్పందం జరిగింది. మైటాస్‌ కంపెని రు. 12,132 కోట్లతో కాంట్రాక్టు కుదుర్చు కుంది. ఈ ఒప్పందానికి ముందు టెండర్లు పిలిచినప్పుడు మైటాస్‌ సంస్థ ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం కోరకుండానే ప్రభుత్వానికే రాయల్టీగా ఎదురు ధనాన్ని ఇస్తానని కోట్‌ చేసింది. నిజానికి కాంట్రాక్ట్‌ సంస్థలు ప్రభుత్వం నుండి సబ్సిడీలను కోరతారుు. హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్టు విషయంలో మైటాస్‌ సంస్థ ప్రభుత్వానికి తిరిగి ఇస్తాననడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏ ప్రయోజనాలను ఆశించకుండానే మైటాస్‌ ఇలా ప్రకటిస్తుందా? దాని వెనుక ఉన్న అంతర్యాన్ని అర్థం చేసుకుంటే హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు ఎవరికోసం అనేది అర్థమవుతుంది.

మైటాస్‌కు హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టును కట్టబెట్టడంపై భారత మెట్రో మనిషిగా పిలువబడే శ్రీధరన్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెప్టెంబర్‌ 2008లో అప్పటి ప్రణాళికా సంఘ డిప్యూటీ చైర్మన్‌ మాంటెక్‌ అహ్లువాలియాకు ఉత్తరం రాశాడు. 269 ఎకరాల అతి ఖరీదైన భూము లను వ్యాపార ప్రయోజనాల కోసం మైటాస్‌కు నిర్మించు, నిర్వహించు, బదిలీచేయు (బిఒటి) పద్ధతిలో అప్పచెప్పడం సరైంది కాదని ఇందులో ల్యాండ్‌ మాఫియా చేతులున్నాయని అనుమానించాడు. మెట్రో కారిడార్‌ ను కాంట్రాక్టు సంస్థ తన భూములున్న చోటు వరకు పొడిగించుకుని ఆ భూముల ధరలను నాలుగైదింతలు పెంచుకునే రహస్య అజెండా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. రాబోయే కాలంలో ఇదొక రాజకీయ కుంభకోణంగా మారవచ్చనే అనుమానాలు అప్పట్లోనే వచ్చాయి.

శ్రీధరన్‌ రాసిన ఉత్తరం అప్పట్లో తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రతిగా అప్పటి ఆర్థిక శాఖామంత్రి రోశయ్య, మున్సిపల్‌ వ్యవహారాల శాఖ మంత్రి కోనేరు రంగారావు, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.వి.ఎస్‌.రెడ్డి సంయుక్తంగా పత్రికా సమావేశం నిర్వహించారు. శ్రీధరన్‌ అనవసర ఆరోపణలు చేస్తున్నారని, దీనికి సంబంధించి క్షమాపణలు చెప్పాలని లేదంటే కోర్టులో కేసు వేస్తామని ఆ పత్రికా సమావేశంలో చెప్పారు. అరుుతే శ్రీధరన్‌ తన మాటలకే కట్టుబడి ఉన్నాడు కాని క్షమాపణలు చెప్పలేదు. ప్రభుత్వం కూడా అతనిపై ఎలాంటి న్యాయపర చర్యలు తీసుకోలేదు. అతి తక్కువ బిడ్డర్‌కే ప్రాజెక్టును అప్పగిస్తామని అందులో భాగంగానే మైటాస్‌ సంస్థతో అంగీకారానికి వచ్చామని దానివల్ల ప్రభుత్వానికి పదివేల కోట్లు ఆదా అవుతాయని అప్పటి ప్రభుత్వం చెప్పింది.

పిపిపి నమూనాలో ప్రపంచ వ్యాప్తంగా మెట్రో ప్రాజెక్టులేవి కూడా నిర్మించు, నిర్వహించు, బదిలీ చేయు (బిఒఒటి) పద్ధతిపై ఆధారపడి విజయ వంతం కాలేదని శ్రీధరన్‌ చెబుతూ వస్తున్నాడు. కేవలం ప్రయాణీకులు చెల్లించే చార్జీల నుండి ప్రాజెక్టు ఖర్చు వ్యయాన్ని రాబట్టుకోవడం కుదరనిపని. ఊహించిన ప్రయాణికుల్లో సగం మంది కూడా భవిష్యత్‌లో ప్రయాణించరు. ఏ ప్రైవేట్‌ కంపెనీ అరుునా కూడా పెట్టుబడి పెడుతున్నదంటే లాభాలను ఆశించే కదా! ఆ లాభాలు ఎక్కువా? తక్కువా? అనేది వేరే విషయం. తాము పెట్టిన పెట్టుబడి పిల్లలు చేయకపోతే ఏ కంపెనీ అరుునా ఎందుకు ముందుకొస్తుంది అనేది చిన్న ప్రశ్న. ఈ ప్రశ్నను శోధిస్తూ పోతే పాలకుల, ప్రైవేటు కంపెనీల దుర్మార్గమైన కుటిల నీతులు బయటపడతారుు. వారిపై వ్యతిరేకత, ఆగ్రహాన్ని తెప్పిస్తారుు.

టిక్కెట్ల ద్వారా రాబడి రాదన్నది ప్రభుత్వాలకు, ప్రైవేటు కాంట్రాక్టు సంస్థలకు తెలియందేమికాదు. దీన్ని అధిగమించడానికి 269 ఎకరాలు అతి ఖరీదైన భూములను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల కోసం కాంట్రాక్ట్‌ సంస్థలకు కట్టబెట్టే అంగీకార ఒప్పందాన్ని సిద్దం చేశారు. అంతేకాదు మెట్రో నిర్మాణం కోసం కావల్సిన స్థలాలను ప్రభుత్వమే సేకరించి పెడుతుంది. ఆ స్థలాలకు సంబంధించిన పరిహారాలు, అంగీకారాలు, రోడ్డు వెడల్పుపనులు, న్యాయపరమైన చిక్కులు మొదలైన వ్యవహారా లన్నింటిని ప్రభుత్వమే చూసుకుంటుంది.

హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్టు పైకి ఎంతో ఉపయోగకరంగా గొప్పగా కనిపిస్తున్నప్పటికీ అంతర్యం మాత్రం అతి ఖరీదైన భూములను పొంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల్ని చేయడం ద్వారా అధిక లాభాలను రాబట్టుకోవడంగా ఉన్నది. మియాపూర్‌ వద్ద 99 ఎకరాలు, ఫలక్‌నుమా వద్ద 17 ఎకరాలు, నాగోల్‌ వద్ద 96 ఎకరాలు, 34 మెట్రో స్టేషన్ల వద్ద 57 ఎకరాల భూమిని ఒప్పందంలో భాగంగా లార్సన్‌ అండ్‌ టుబ్రూ కంపెనీకి ఇచ్చారు. భూములు అదనంగా ఇవ్వవద్దని ఒప్పందంలో లేదు. కాబట్టి కాంట్రాక్టు సంస్థల ప్రయోజనాల కోసం మరిన్ని భూములను భవిష్యత్‌లో కేటారుుంచినా ఆశ్చర్యపోవల్సిందేమిలేదు.

ప్రభుత్వానికి చెల్లించాల్సిన రు. 240 కోట్లు చెల్లించకపోవడం, మైటాస్‌ పనితీరు ఆశించిన స్థారుులో లేకపోవడం, మైటాస్‌కు ఉన్న ఆర్థిక ఇబ్బందులు, తదితర కారణాల రిత్యా మెట్రో నిర్మాణాన్ని మైటాస్‌ నిర్వహించలేదని అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జూలై 2009లో ఒప్పందాన్ని రద్దు చేసింది. మైటాస్‌కు అనధికార మాతృ సంస్థ సత్యం కంప్యూటర్స్‌ అధినేత రామలింగరాజు ఆర్థికనేరాలు, ఆ సంస్థ పాల్పడిన ఆర్థిక అక్రమాలు ఒక్కొక్కటిగా అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్నారుు. మొత్తానికి మైటాస్‌తో మెట్రోరైలు ప్రాజెక్టు మైత్రి తెగిపోరుుంది.

జూలై 2010లో రెండోసారి హైద్రాబాద్‌ మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (ఎచ్‌ఎంఆర్‌ఎల్‌) టెండర్లు పిలిచింది. దీని ద్వారా ఎల్‌.అండ్‌.టి హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల మధ్య హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు కోసం 2010 సెప్టెంబర్‌ 4న ఒప్పందం జరిగింది. రూపకల్పన, నిర్మాణం, సొంత పెట్టుబడి, నిర్వహించడం, అప్పగించడం (డిబిఎఫ్‌ఓటి) అనే పద్ధతి ఆధారంగా ఈ ఒప్పందం జరిగింది. ఈ ప్రాజెక్టు వ్యయం రు. 14,132 కోట్లు, ఇందులో వయోబిలిటీ గ్రాంట్‌ ఫండ్‌ కింద రు. 1,458 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 5 ఏళ్ల నిర్మాణ కాలాన్ని కలుపుకుని మొత్తం 35 ఏళ్లు మెట్రోరైల్‌ను ఎల్‌.అండ్‌.టి హైదరాబాద్‌ మెట్రో ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వహిస్తుంది. ఈ కాలాన్ని మరో 25 ఏళ్లు పొడిగించుకునే అవకాశం ఉన్నది. ఈ ప్రాజెక్టును మియాపూర్‌ నుండి ఎల్‌బినగర్‌ వరకు (28.87కి.మీ.), జూబ్లీ బస్‌స్టేషన్‌ నుండి ఫలక్‌నుమా వరకు (14.78కి.మీ), నాగోల్‌ నుండి శిల్పారామం వరకు (27.51కి.మీ.)

మొత్తం మూడు కారిడార్లుగా నిర్మిస్తున్నారు. రవాణా ఆధారిత అభివృద్ధి (టిఓడి) పేరుతో మెట్రో రైల్‌ నిర్మాణం జరుగుతున్నది. మెట్రో కారిడార్‌లో 1.85 కోట్ల చదరపు అడుగుల వాణిజ్య సముదాయాల నిర్మాణాలను చేపట్టవచ్చని, ఒప్పందంలో భాగంగా అందించబడే 269 ఎకరాల భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకోవడానికి అంగీకారం ఒప్పందంలో ఉన్నారుు. నిర్మాణ వ్యయాన్ని తిరిగి పొందడానికి టిక్కెట్ల ద్వారా 50 శాతం, రియల్‌ ఎస్టేట్‌ ద్వారా 45 శాతం, ప్రకటనల ద్వారా 5 శాతం సొమ్మును రాబడతారని ప్రకటించారు.

మెట్రోరైలు మార్గంలో చారిత్రక కట్టడాలు/స్థలాలు ఎన్నో ఉన్నారుు. వాటికి మెట్రో రైలు మార్గ నిర్మాణం వల్ల నష్టం కలుగుతుందని అప్పుడే నేటి తెలంగాణ ముఖ్యమంత్రి నాటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని అలాగే ఎల్‌&టి సంస్థను తీవ్రంగా విమర్శించారు. చారిత్రక కట్టడాలకు, స్థలాలకు నష్టం కలిగించే పక్షంలో మెట్రో రైలు మార్గాన్ని కూల్చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. తొందరపడి మెట్రో నిర్మాణాన్ని కొనసాగించవద్దని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొత్తం హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్టును సమీక్షిస్తామని కఠినంగా మాట్లాడారు. కోఠి సుల్తాన్‌బజార్‌, మొజాంజాహి మార్కెట్‌, కోఠి మహిళా కళాశాల, యూనివర్సిటీ స్థలాలు అసెంబ్లీ, తెలంగాణ అమరవీరుల స్థూపం వంటి ఎన్నింటికో మెట్రో నష్టం కలుగచేస్తున్నదని/మసకబారుస్తు న్నదని వాటిని రక్షించడం కోసం మెట్రో మార్గాన్ని మార్చుకోవాలని కెసిఆర్‌ చెప్పారు. చారిత్రక ప్రదేశాల వద్ద భూగర్భ రైలుమార్గాన్నే నిర్మించాలని కెసిఆర్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ తాను గతంలో చెప్పిన వాటిని ఎంతమేరకు హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్టులో మార్పులు చేయగలిగారో అప్పటి ప్రభుత్వానికి ఎల్‌&టి మధ్య జరిగిన అవకతవకల రహస్యాలను ఎంతమేరకు బయట పెట్టగలిగారో ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత కెసిఆర్‌పై ఉండకుండా పోతుందా? లేని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని ఎలా అంచనా వేయాల్సి ఉంటుందో ఎవరికి వారు తేల్చుకోవల్సిందే.

2017 నాటికి 80 శాతం పనులు పూర్తిచేసి 30 కి.మీ. మేర నాగోల్‌ నుండి మియాపూర్‌ వరకు 2017 నవంబర్‌ 28న ప్రారంభించారు. మిగతా మొత్తాన్ని నవంబర్‌ 2018 లోగా పూర్తి చేస్తామని ఎల్‌&టి ప్రకటించింది. ప్రాజెక్టు నిర్మాణ సందర్భంలో భూముల సేకరణ, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన, కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ప్రాజెక్టు మార్గంలో మార్పు, కోర్టు కేసులు వంటి కారణాల రిత్యా నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందని, ఈ జాప్యం వల్ల అదనంగా 3,700 కోట్ల భారం పడుతున్నదని దాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని ఎల్‌&టి పట్టుపడుతున్నది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రు. 14,132 కోట్లలో వయబుల్‌ గ్రాంట్‌ ఫండ్‌గా రు. 1,458 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి వస్తారుు. మిగిలిన దాంట్లో ఎస్‌బిఐ ప్రధాన బ్యాంకుగా మొత్తం పది బ్యాంకుల నుండి 11 వేల కోట్ల రూపాయలకు పైగా రుణాలు పొందింది. దీంతో ఎల్‌&టి స్వంతంగా పెట్టుకున్నది తక్కువేనన్నమాట. ఒప్పందం పూర్తయ్యాక మెట్రో పనులు సంవత్సరంన్నరకు పైగా ఆలస్యంగా ప్రారంభం అయ్యారుు. మెట్రో పనులు ప్రారంభం అరుునప్పటి నుండి హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కష్టాలు అంతా ఇంతా కావు. రోడ్‌ డివైడింగ్‌లు, రోడ్‌ డైవర్షన్‌లు, తవ్వకాలు, ధుమ్ము ధూళి, శబ్ధ కాలుష్యం, వాతావరణ కాలుష్యం వంటివి ఎన్నో నగర ప్రజల్ని నానా యాతనలకు గురి చేశారుు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారుు. గత ఐదారేళ్లుగా కొనసాగుతున్న ఈ సమస్య నుండి ఇంకా బయట పడలేదు.

మెట్రో రైలు మార్గానికి ఇరువైపులా శబ్ధ కాలుష్యానికి, సున్నితమైన ప్రాంతాలైన పాఠశాలలు, కాలేజీలు, దవాఖానాలు, ప్రార్థనా మందిరాలు అలాగే కోర్టులు వంటివెన్నో ఉన్నారుు. ఇక్కడ ధ్వని కాలుష్యానికి సంబంధించిన కాలుష్య నియంత్రణ బోర్డు ప్రమాణాలేవి పాటించడం లేదు. అరుునా మెట్రో నిర్మాణ పనులు జరిగారుు. జరుగుతున్నారుు.

ఒప్పందం ప్రకారం మెట్రో చార్జీలు 8 రూపాయల నుండి 19 రూపాయల వరకు ఉండాలి. మెట్రో ప్రారంభం అయిన నాడు ఈ రేట్లు రు. 10 నుండి రు. 60 ఉన్నాయి. దీనిని ప్రభుత్వం వ్యతిరేకించడం లేదు. రేట్ల నిర్ణయ హక్కు ఎల్‌&టి చేతిలో ఉన్నది. రద్దీ సమయంలో మెట్రో టిక్కెట్‌ ధరలు సాధారణ ధరల కంటే 25 శాతం అధికంగా వసూలు చేసుకోవచ్చు. అంతే కాకుండా హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్టు పరిధిలో 25 ఏళ్ల వరకు ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాల్లోని ప్రజా రవాణా వ్యవస్థలో టికెట్‌ ధరలు మెట్రో రైలు ధరల కంటే కనీసం 25 శాతం అధికంగా ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. ఫలితంగా భవిష్యత్‌లో ఆర్‌టిసి ఆధునిక బస్సులను తక్కువ ధరల్లో అందించే అవకాశాన్ని కోల్పోతున్నది.

హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్టుకు ప్రభుత్వం సమకూర్చిన అతి ఖరీదైన భూములను, వ్యాపార సముదాయాలుగా, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంగా, చేసుకుంటున్నప్పుడు, ప్రకటనల ద్వారా ఆదాయం సమకూర్చబడుతున్నప్పుడు టికెట్‌ ధరలు తక్కువగానే ఉండాలి. కాని అలా జరుగలేదు. అసలు రవాణా వ్యవస్థ అనేది ప్రజల సౌకర్యం కోసం ఉంటుంది. దాని ద్వారా వ్యాపారాలు చేసి లాభాలు గడించడానికి కాదు.

మొన్న ప్రారంభించిన మెట్రో మార్గంలోని స్టేషన్‌లలో మరుగుదొడ్ల సౌకర్యం సరిగ్గాలేవు. పార్కింగ్‌ స్థలాలు లేవు. మెట్రోస్టేషన్ల నుండి ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లడానికి అనుసంధానంగా రవాణా వ్యవస్థ లేదు. ఒప్పంద సమయంలోనూ ఆ తరువాత ఎల్‌.అండ్‌.టి చెప్పినటువంటి అనుసంధాన రవాణా వ్యవస్థ(మెర్రిగోరౌండ్‌)ను ఏర్పాటు చేయనేలేదు. ఇప్పుడు ఆ మాటే ఎత్తడమే లేదు.

మెట్రోరైలు కోసం ప్రైవేటు కాంట్రాక్టు సంస్థకు 269 ఎకరాల అతి ఖరీదైన భూములను ఇచ్చి ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం అదే డబ్బును ఆర్‌టిసి కోసమో అలాగే ప్రస్తుతమున్న ఎంఎంటిఎస్‌ రైలు వ్యవస్థను అభివృద్ధి చేయడం కోసమో వినియోగించడానికి చేతులు రావడం లేదు. పోనీ అదే డబ్బుతో ప్రైవేటు కాంట్రాక్టు సంస్థలకు ఇచ్చి వారికి లాభాలు చేకూర్చి పెట్టడం కాకుండా ప్రభుత్వమే ఆ పని చేసి ఉండవచ్చు కదా అంటే సమాధానం ఉండదు. ఈ ప్రాజెక్టు ప్రజల కోసం, ప్రజా రవాణా కోసం, ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కోసం అనే కంటే ప్రైవేటు కంపెనీల, పాలక వర్గాల్లో కొందరి ప్రయోజనాల కోసమని అనుకోకుండా ఉండలేని పరిస్థితి ఉన్నది.

హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాల ప్రాజెక్టు రిపోర్టు(డిపిఆర్‌)ను చర్చకు పెట్టలేదు. ఇంత పెద్ద ప్రాజెక్టును చేపట్టే ముందు అసెంబ్లీలో సహితం బయటపెట్టలేదు. రాజశేఖర్‌రెడ్డి, రోషయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డిల గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలైతేనేమి నేటి కెసిఆర్‌ ప్రభుత్వమైతేనేమి పారదర్శకత లేకుండా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రైవేటు కాంట్రాక్టు సంస్థలకు ప్రయోజనాలు చేకూర్చేలా ఒప్పందాలు చేసుకున్నాయనేది స్పష్టం. పెద్దపెద్ద ప్రాజెక్టులకు సంబంధించి ప్రజాక్షేత్రంలో చర్చించబడాలనేది, వాటి వివరాలు ప్రజలకు అందుబాటు లో ఉండడమనేది ప్రజలహక్కు. దీన్ని ఉల్లంఘిస్తూ పాలన జరుగుతున్నది.

ఇప్పటికే విద్య, వైద్యంను ఇంచుమించుగా ప్రైవేటు రంగాలకు వదిలేసి చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను కూడా ప్రైవేటు కంపెనీలకు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇది ఇప్పుడు గాని, భవిష్యత్‌లో గాని వ్యతిరేక ఫలితాలనిస్తుంది. మొన్న ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం మెట్రో రైల్‌ విధానాన్ని ముందుకు తెచ్చింది. అందులో పిపిపి నిబంధనను తప్పనిసరిచేస్తూ ప్రైవేటు రంగానికి అనుకూలంగా కీలకమైన నిర్ణయాలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం పేరు మీద ప్రజల అభిప్రాయాలకు విలువలేకుండా చేస్తూ కార్పొరేటు శక్తులకు అనుకూలంగా విధానాలు చేపడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమే తప్ప మరొకటి కాదు.
- బీ. రామకృష్ణ
(రచయిత ఉపాధ్యాయులు)

Keywords : metro rail project, hyderabad, kcr, trs, rtc
(2024-04-24 20:45:05)



No. of visitors : 2784

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి

ʹభారత దేశం జైళ్ళలో 90 శాతం పేదలే మగ్గుతున్నారు. కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్‌కు వచ్చామో కూడా తెలియదుʹʹ ఈ మాటలన్నది హక్కుల సంఘాల కార్యకర్తలు కాదు. కమ్యూనిస్టులు కాదు. మావోయిస్టులసలే కాదు. ఓ ఐపీఎస్ అధికారి ఈ మాటలు మాట్లాడారు.

కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం - విరసం

కామ్రేడ్ మారోజు వీరన్న స్మృతి చిహ్నాన్ని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని పాలకులు విధ్వంసకర అభివృద్దిని శరవేగంగా ముందుకు తీసుకొనిపోతున్నారు....

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


హైదరాబాద్