ʹపరుష పదజాలంʹ జీవోపై వెనక్కి తగ్గిన కేసీఆర్ !


ʹపరుష పదజాలంʹ జీవోపై వెనక్కి తగ్గిన కేసీఆర్ !

ʹపరుష

తెలంగాణ ప్రభుత్వం .. ʹపరుష పదజాలంʹ జీవో విషయంలో వెనక్కి తగ్గింది, రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, పార్టీనేతలపై సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న ఆరోపణలు, విమర్శలు, వ్యాఖ్యలకు అడ్డుకట్ట వేసేందుకే 506,507 సెక్షన్లలో మార్పులు చేస్తూ పరుష పదజాలం పేరుతో ఒక జీవో జారీ చేయాలన్న ఆలోచనను ప్రస్తుతం పక్కన పెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోందని ఆదాబ్ హైదరాబాద్ పత్రిక రాసింది. భావప్రకటనా స్వేచ్చపై ఉక్కుపాదం మోపే ఈ జీవోపై ప్రతిపక్షాలు, ప్రజలనుండి తీవ్ర వ్యతిరేకత, సోషల్ మీడియాలో నెటిజన్ల ఎదురుదాడి నేపథ్యంలో నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో వైపు తాను, తన పార్టీ నాయకులు విపక్షాలపై, జేఏసీ నేత కోదండరాం పై, తమను వ్యతిరేకించే ప్రతి ఒక్కరిపై చేసే దాడి , మాట్లాడుతున్న మాటలు అత్యంత పరుషపదజాలమని..అందువల్ల ఆ జీవో తమ కొంపకూడా ముంచే అవకాశం ఉందని భావించినట్టు సమాచారం.
అనేక తర్జన భర్జనలు,సుదీర్ఘ మంతనాల అనంతరం సాధారణ పరిపాలన శాఖ, హోం, న్యాయశాఖ విభాగాల ఉన్నతాధికారులు ఈ జీవో జారీ చేయకూడదని కేసీఆర్ కు సూచించినట్టు సమాచారం. ఇటువంటి జీవో జారీచేస్తే భవిష్యత్తులో వచ్చే పరిణామాలను నిశితంగా బేరీజు వేసిన ఉన్నతాధికారులు ఈ ప్రతిపాదన విరమించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. దీనికి బదులు యథాతథ స్థితిని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాల విమర్శలకు దీటైన బదులివ్వాలని ప్రభుత్వ భావిస్తోంది. దీనిద్వారా ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నామని చాటిచెప్పినట్టు అవుతుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం సంతకం చేసిన ఫైలును తిప్పి పంపాలని న్యాయశాఖను కోరారని తెలుస్తోంది.ఇదే విషయాన్ని ఆదాబ్ హైదరాబాద్ పత్రిక తన కథనంలో పేర్కొంది.
అయితే 506,507 సెక్షన్స్ ఆధారంగా తమ వ్యతిరేకులపై కక్ష సాధించే అవకాశాలను కేసీఆర్ వదులుకోడు కదా !

Keywords : telangana, kcr, ktr, facebook, trs, congress
(2018-05-22 10:22:55)



No. of visitors : 724

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

మహాజనాద్భుత సాగరహారానికి నాలుగేళ్ళు

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది....

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

Search Engine

కథువా నిందితులకు అనుకూలంగా మళ్ళీ ర్యాలీ తీసిన బీజేపీ నేతలు - మెహబూబా ముఫ్తీపై బూతుల వర్షం
కాలుష్యకారణ కంపెనీపై ప్రజల పోరాటం...పోలీసు కాల్పులు.. 11 మంది మృతి !
RDF Kerala Speaking Against Operation Green Hunt and Gadricholi Massacre
Long live Ibrahim Kaypakkaya in the 45th anniversary of his assasination!
చారిత్రాత్మక కమ్యూనిస్టు ప్రణాళిక (రెండవ భాగం) - ఎ.నర్సింహరెడ్డి
చారిత్రాత్మక కమ్యూనిస్టు ప్రణాళిక (మొదటి భాగం) - ఎ.నర్సింహరెడ్డి
తెలంగాణపై కాగ్ నివేదిక‌
కొంచెం ఆలోచించి మాట్లాడుదాం - ఎ.సునిత‌, తేజ‌స్విని మాడ‌భూషి
వ‌న‌రుల దోపిడీ కోస‌మే గ‌డ్చిరోలి హ‌త్యాకాండ - మావోయిస్టు అధికార ప్ర‌తినిధి శ్రీనివాస్‌
మ‌తం మీద విమ‌ర్శ రాజ‌కీయాల మీద విమ‌ర్శే - మార్క్స్‌
ఐసిస్ చేరాలంటూ బ్యానర్లు కట్టిన బీజేపీ కార్యకర్తల అరెస్టు !
అమరులైన మన బిడ్డలను యాజ్జేసుకుందాం రండి !
అమరులైన మన బిడ్డలను యాజ్జేసుకుందాం రండి !
పోలీసులు ఎన్ని కుట్రలు చేసినా రేపు అమరుల సభ జరిపి తీరుతాం
మార్క్స్ నుంచి నేర్చుకుందాం - సి. కాశీం
గడ్చిరోలీలో జరిగింది ఎన్కౌంటర్ కాదు,సామూహిక‌ హత్యలు - నిజ నిర్దారణ బృందం రిపోర్ట్
పేదోళ్ల కైనా,ఉన్నోళ్ల కైనా ఒకే బడి ఒకే చదువు కోసం తెలంగాణ‌ విద్యార్ధి వేదిక (TVV) పల్లె బాట
Gadchiroli Encounter, a Fake and Cold-blooded Mass Murder, Says Fact-finding Teamʹs Report
దళితుడు ప్రేమించడం నేరమా? కూతురు ప్రేమించిన‌ దళిత యువకుణ్ణి కాల్చి చంపిన తండ్రి !
రాణా ప్రతాప్ జయంతి ఉత్సవాల సందర్భంగా..భీమ్ ఆర్మీ నాయకుడి సోదరుణ్ణి కాల్చి చంపిన దుర్మార్గులు
అవును... మేమిద్దరం కలిసే పోటీ చేస్తాం - సీపీఎం, బీజేపీ నేతల ప్రకటన‌
కథువా చిన్నారి కేసు పంజాబ్ కు బదిలీ..సిబీఐ విచారణకు నో..సుప్రీంతీర్పు
ఆ దుర్మార్గులు బైటికొస్తే మమ్మల్నీ చంపేస్తారు...కథువా చిన్నారి తల్లి ఆందోళన‌
వైజాగ్ లో ఇండస్ట్రియల్ కోస్టల్ కారిడార్ నిర్మాణ వ్యతిరేక సదస్సు
మార్క్స్‌ శాస్త్రీయ సిద్ధాంత వారసత్వానికి పదునుపెడదాం
more..


ʹపరుష