గూగీ వా థియాంగో...జి.ఎన్‌. సాయిబాబా...యుద్దకాలంలో స్వప్నాలు


గూగీ వా థియాంగో...జి.ఎన్‌. సాయిబాబా...యుద్దకాలంలో స్వప్నాలు

గూగీ

ప్రసిద్ధ కెన్యన్‌ రచయిత గూగీ వా థియాంగో రచన ʹడ్రీమ్స్‌ ఇన్‌ ఎ టైమ్‌ ఆఫ్‌ వార్‌ʹకు జి.ఎన్‌. సాయిబాబా చేసిన అనువాదాన్ని ʹమలుపుʹ ప్రచురణలు ప్రచురించింది. ఈ పుస్తక ఆవిష్కరణ ఫిబ్రవరి 18 సా.5గం. లకు నందమూరి తారక రామారావు ఆడిటోరియం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ నందు జరుగుతుంది. ముఖ్య అతిథి గుగి వా థియాంగో, అధ్యక్షత ఎన్‌. వేణుగోపాల్, పుస్తక ఆవిష్కరణ సుజి తారు, వక్తలు కె. శ్రీనివాస్‌, ఎ.కె. ప్రభాకర్‌.
ఈ అనువాదానికి గుగి వా థియాంగో రాసిన ముందు మాట పూర్తిగా పాఠం...

డ్రీమ్స్‌ ఇన్‌ ఎ టైమ్‌ ఆఫ్‌ వార్‌ అనే నా ఆత్మకథ మొదటి భాగానికి తెలుగు అనువాదానికి హృదయపూర్వక స్వాగతం. ఈ పుస్తకం 1895 నుంచి బ్రిటిష్‌ వలసవాదులు ఆక్రమించుకున్న దేశంగా ఉండిన కెన్యాలో నా జీవితపు తొలిరోజుల జ్ఞాపకాలను అక్షరీకరించింది. నేను 1938లో పుట్టాను. అంటే హింసాకాండ దృశ్యాలూ శబ్దాలూ నా బాల్యం మీద నీడలా పరుచుకున్నాయి. మొట్టమొదటి హింసాకాండ దృశ్యాలూ శబ్దాలూ 1945లో అంతమైన రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించినవి. ఆ తర్వాతవి మౌ మౌ పోరాటంగా ప్రచారంలోకి వచ్చిన కెన్యా భూమి, స్వేచ్ఛా సైన్యం (కెన్యా లాండ్‌ అండ్‌ ఫ్రీడం ఆర్మీ) నాయకత్వంలో జరిగిన వలసవాద వ్యతిరేక విముక్తి పోరాటానివి. అప్పుడప్పుడే హిట్లర్‌ ను ఓడించిన బ్రిటిష్‌ సామ్రాజ్యపు మహాశక్తికి ఎదురునిలిచి పోరాడడానికి అడవుల్లోకి, కొండల్లోకి వెళ్లిన వేలాది మంది కెన్యన్లను ఆ పోరాటానికి ఉద్యుక్తుల్ని చేసిన సామూహిక స్వప్నం గురించి ఈ జ్ఞాపకాల్లో రాశాను. వడ్రంగం వృత్తిలో ఉండిన నా సొంత అన్న ఈ స్వాప్నికుల విముక్తి సైన్యంలో భాగం. కాని నేను ఒక శిశువుగా విద్య గురించి స్వప్నాల్లో మునిగితేలాను. ఆ స్వప్నానికి అర్థం ప్రతిరోజూ చెప్పులు లేని కాళ్లతో పది మైళ్లు నడిచి బడికి వెళ్లడం, అదే దారి మీద సాయంకాలం ఇంటికి తిరిగి రావడం. కాని ఆ ఇబ్బందులన్నిటినీ అధిగమింపజేసినవి రేపు ఒక మంచి భవిష్యత్తు ఉంటుందనే స్వప్నాలు. అంటే ఈ జ్ఞాపకాలు ఒక నూతన ప్రపంచపు ఆశల గురించినవి కూడ.

ఈ పుస్తక అనువాదకుడు ప్రొ. సాయిబాబా కావడం నాకు మరొక సంతోషం. కష్టజీవి అయిన సాయిబాబా గురించి నాకు మరచిపోలేని జ్ఞాపకాలున్నాయి. జాతుల సమస్యపై ఢిల్లీలో 1996 ఫిబ్రవరిలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో మా కలయిక జరిగింది. హైదరాబాదులో ఒక పుస్తకాల దుకాణంలో తనకు అనుకోకుండా నా నవల డెవిల్‌ ఆన్‌ ది క్రాస్‌ దొరికిందనీ, అది చదవడం తన జీవితం మీద గాఢమైన ప్రభావం వేసిందనీ ఆయన చెప్పడం అప్పటి కలబోతల జ్ఞాపకాలలో ఒకటి. నేను ఆ నవలను కెన్యాలో కామిటి అత్యంత భద్రతా కారాగారంలో 1978లో టాయిలెట్‌ పేపర్‌ మీద రాశాను. నా సాంస్కృతిక క్రియాశీల ఆచరణ కోసం, ప్రత్యేకించి కామిరితు గ్రామంలో రైతులతో కార్మికులతో కలిసి వారి సొంత భాషలో వారి పోరాటాల గురించి చెప్పే నాటకాన్ని తయారు చేయడంలో భాగం పంచుకున్నందుకు నన్ను అప్పుడు ఆ జైలులో పెట్టారు. ఇప్పుడు సాయిబాబా మరొక జైలులో, భారతదేశంలో మహారాష్టలో నాగపూర్‌ అత్యంత భద్రతా కారాగారంలో ఒక ఒంటరి కొట్టులో ఉండి నా మరొక పుస్తకాన్ని అనువాదం చేయడం ఎంత చారిత్రక వైచిత్రి?! జైలు నిర్బంధ పరిస్థితుల మధ్య అనువాద కృషి కొనసాగించడం! అందువల్ల నేను ఆయనతో ఒక ప్రత్యేక అనుబంధాన్ని అనుభవిస్తున్నాను. ఇప్పుడు, మరొకసారి ఆయన తన సాహిత్య, రాజకీయ కార్యాచరణ కోసం జైలు జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

ఆశను సజీవంగా నిలిపి ఉంచడానికి పోరాడుతున్న వేళ సాయిబాబా అటువంటి వేలాది మంది బందీలలో ఒకరుగా ఉన్నారు. గుయానా కవి మార్టిన్‌ కార్టర్‌ అన్నట్టు ఆయన కలలు కనడానికి నిద్రపోవడం లేదు. ప్రపంచాన్ని మార్చడానికి కలలు కంటున్నాడు. భవిష్యత్తును సృష్టించే స్వప్నాన్ని మించినదేమీ లేదు అని విక్టర్‌ హ్యూగో అన్నమాట ఆయన తప్పకుండా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు.

డ్రీమ్స్‌ ఇన్‌ ఎ టైమ్‌ ఆఫ్‌ వార్‌ - యుద్ధకాలపు స్వప్నాలు అనే ఈ జ్ఞాపకాల గుచ్ఛాన్ని కలిపి కుట్టినది అటువంటి భావనలే. తెలుగు పాఠకులు ఈ అనువాదాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

గుగి వా థియాంగో

అర్వైన్‌, కాలిఫోర్నియా, ఏప్రిల్‌ 2017

Keywords : ngugi wa thiong o, professor saibaba, kenya, india, nagpur jail, maists
(2018-02-23 09:31:52)No. of visitors : 431

Suggested Posts


బుధవారం సాయంత్రం సాయిబాబాతో....

ఆయనకు రెండు కాళ్ళు లేవు... నడవలేడు...ఎక్కడికి వెళ్ళాలన్నా చక్రాల కుర్చీనే.. జైల్లో మరింత అనారోగ్యం పాలయ్యాడు... పాలకుల కర్కషత్వంతో ఒక చేయి కూడా పనికి రాకుండా పోయింది. అతని పేరు సాయిబాబా. ప్రొఫెసర్ సాయిబాబా. ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ బోధిస్తాడు... పాలకు దృష్టిలో మావోయిస్టు...

Condemn the irrational and illegal conviction of Prof GN Saibaba and others

The judgment is illegal, irrational, atrocious and highly motivated, to say the least. None of the charges framed against the accused stand a real test of judicial inquiry as all of them are fabricated and the evidences are concocted or drawn out of context....

DU refuses to reinstate Saibaba despite VP push

Delhi Universityʹs Ram Lal Anand College has decided not to reinstate Professor GN Saibaba, who was granted bail by the Supreme Court in April in a case...

Search Engine

జైలు కథలు...ఏక్ చాదర్ మైలీసీ -బి. అనూరాధ
Condemn arrest of Damodar Turi by Jharkhand Police - PPSC
RELEASE ANTI-DISPLACEMENT ACTIVIST DAMODAR TURI
మార్చ్8: దండకారణ్యం క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంగఠన్ పిలుపు !
ఆజాద్ ఎన్ కౌంటర్ కేసు తీర్పు – న్యాయ పర్యావసనాలు
In Himachal Pradesh School, Dalit Students Told To Sit Outside And Watch PM Modiʹs ʹPariksha Par Charchaʹ
demanding the immediate release of Damodar Turi
ఆజాద్, హేమచంద్రపాండేల ఎన్కౌంటర్లో పాల్గొన్న 29 మంది పోలీసుల లిస్ట్
Azad encounter: Adilabad Lower courtʹs order set aside
ఆజాద్ ఎన్కౌంటర్ లో పాల్గొన్న‌ 29 మంది పోలీసులపై కేసు నమోదు చేసి విచారించాలి - ఆదిలాబాద్ కోర్టు తీర్పు
20 ఏళ్ల వరంగ‌ల్ డిక్ల‌రేష‌న్ స‌భ‌పై పోలీసుల ద‌మ‌న‌కాండ - ప్రొ. ల‌క్ష్మ‌ణ్
నరహంతక పాలన.. మహిళా గెరిల్లాల మర్మాంగాల్లో కాల్చండని ఆర్మీకి ఆదేశం !
Honduras protests continue as U.S. puppet sworn in
Widespread violence after killing of Dalit student, bus torched; Opposition hits out at BJP govt
UP: Dalit Student beaten up with hockey sticks and bricks dies in Allahabad
ముస్లిం మహిళలపై ప్రభుత్వం కపట ప్రేమ‌ - డానీ
జైలు కథలు...ఏది జైలు? -బి. అనూరాధ
నయీంతో సంబంధాలున్న టీఆరెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలి !
రోహిత్‌ వేముల.. విలాస్‌ గోఘ్రే..ప్రభాకర్‌ మచ్చ...పాలకుల హత్యలు -వరవరరావు
తెలంగాణలో పౌర హక్కులు - బహిరంగ లేఖ‌
జైలు కథలు..వంటే నేరమైన చోట -బి.అనూరాధ
7 Policemen Given Life Sentence In Dehradun Fake Encounter Case
International Solidarity with the political prisoners in India - young revolutionaries, Brazil
జైలు కథలు...బలి -బి.అనూరాధ
ʹపరుష పదజాలంʹ జీవోపై వెనక్కి తగ్గిన కేసీఆర్ !
more..


గూగీ