మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌


మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

మార్చ్13


న్యాయమైన, ప్రజాస్వామికమైన ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వండి.

ఎంఆర్‌పిఎస్‌పై, ఆదివాసులపై, ప్రజలపై అమలవుతున్న రాజ్యహింసను ప్రతిఘటించండి

తెలంగాణ ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు మావోయిస్టు పార్టీ పిలుపు

- - -

ప్రజలారా, ప్రజాస్వామ్యవాదులారా!

రాజ్యాంగంలో షెడ్యూల్‌ కులాలకు (బ్రాహ్మణీయ హిందూ వ్యవస్థ అంటరానివారుగా చూస్తున్న దళితులకు) విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన హక్కులను మాల, మాదిగలకే కాకుండా ఎస్సీ ఉప కులాలవారందరికీ జనాభా ప్రాతిపదికపై దామాషా నిష్పత్తిలో సమన్యాయంతో అమలు చేయాలని 1994లో ʹమాదిగ దండోరాʹ ఉద్యమం ప్రారంభమైంది. దానికి మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎంఆర్‌పిఎస్‌) నాయకత్వం వహించింది. దానినెంతో న్యాయమైన ప్రజాస్వామిక పోరాటంగా గుర్తిస్తూ అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ కాలం నుంచి కూడా సిపిఐ మావోయిస్టు బలపరడమేకాదు ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ సంఘీభావ కమిటీని ఏభై ఆరు ప్రజా సంఘాలతో ఏర్పాటు చేసి క్రియాశీల మద్దతునిచ్చింది. ఇస్తున్నది. ప్రజలను ఎంఆర్‌పిఎస్‌కు అండగా సమీకరిస్తున్నది.

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు. ఈ అన్ని సందర్భాల్లోనూ రాజ్యహింసలో అమరులైన తమ కార్యకర్తల స్మృతిలో ప్రభుత్వ, పాలకవర్గాల ఆస్తులపై దాడి చేసారేమో కానీ ఒక్క ప్రాణ నష్టాన్ని కూడ కలిగించలేదు. పోరాటంలో భారతీ మాదిగవంటి యువతీ యువకులు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర నిర్బంధాలకు, రాజ్యహింసకు గురయ్యారు.

న్యాయాన్ని సమంగా పంచుకుందామన్న ఒక రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన డిమాండు కోసం ఇంత సుదీర్ఘకాలపు పోరాటం చేపట్ట వలసి రావడమే ఆయా కాలాల్లో అధికారంలో కేంద్రంలోను, రాష్ట్రాల్లోనూ ఉన్న రాజకీయ పార్టీల అప్రజాస్వామిక వైఖరికి నిదర్శనం.

రాజ్యాంగం ఇచ్చిన ఎస్సీ రిజర్వేషను హక్కు వర్గీకరించవచ్చునని జస్టిస్‌ లోకూరు కమీషన్‌ మొదలు, రాష్ట్రంలో రామచంద్రరాజు కమీషన్‌, ఉషా మెహ్రా కమీషన్‌ వరకు సిఫారసు చేసాయి. ఉషామెహ్రా కమీషన్‌ సిఫారసు ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీర్మానం చేసి భారత రాష్ట్రపతి కెఆర్‌ నారాయణన్‌ ఆమోదించిన చట్టం ద్వారా ఐదేళ్లపాటు మాదిగలు, ఉపకులాలు విద్యా, ఉద్యోగాల్లో వేల సంఖ్యలో న్యాయమైన ప్రయోజనాలు పొందారు. సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని కొట్టివేయడంతో మళ్లీ గత 14 సంవత్సరాలుగా మాదిగలకు, ఉపకులాలకు అన్ని రంగాల్లో తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది.

అయినా అలసిపోకుండా చేస్తున్న న్యాయమైన, ప్రజాస్వామికమైన ఎంఆర్‌పిఎస్‌ పోరాటానికి ప్రజల నుంచి, ప్రజాస్వామ్యవాదుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుండడంతో, అధికారాల్లో లేని రాజకీయ పార్టీల నుంచి కూడా స్పష్టమైన సమర్థన లభించింది. మావోయిస్టు పార్టీ తదితర విప్లవ పార్టీలు కూడా మొదటి నుంచి ఇందులోని న్యాయబద్ధమైన, ప్రజాస్వామికమైన డిమాండుకు అండగా నిలిచినవి. కనుక ఇష్టంగానో, కష్టంగానో దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న, లేని రాజకీయ పార్టీలన్నీ సూత్రప్రాయంగా ఎస్సీ వర్గీకరణను బలపరుస్తున్నాయి.

మాలల్లోని కొద్దిమంది స్వార్థపర నాయకులు, కీలక స్థానాల్లో ఉన్న కొద్దిమంది స్వార్థపర అధికారులు తప్ప మొదటి నుంచీ ప్రజాస్వామిక చైతన్యం గల మాలలు, సాధారణ మాల ప్రజానీకం తమ తోటి మాదిగ అణగారిన దళితుల పట్ల సానుభూతితోనే ఉన్నారు. మాలలకు, మాదిగ తదితర ఉపకులాలకు మధ్యనున్నది మిత్ర వైరుధ్యమేనని, ఈ అంటరాని దళిత సమాజమే ఆదివాసీలతో పాటు సామాజిక సమూల మార్పుకు కీలకమైన పాత్ర వహిస్తాయని విప్లవోద్యమం వారికి మొదటి నుంచీ ఎరుక పరుస్తున్నది.

ఏభై ఏళ్ల నక్సల్బరీ విప్లవోద్యమంలో తెలుగు నేల మీద తీవ్ర నిర్బంధానికి, రాజ్యహింసకు గురయిన లక్షలాది మందిలో, అమరులైన వేలాదిమందిలో విప్లవ చైతన్యాన్ని పొంది ప్రాణాలర్పించిన సామాజిక వర్గాల్లో ఆదివాసుల తర్వాత గణనీయ సంఖ్యలో ఉన్నవాళ్లు దళితులే. తెలంగాణలో మాదిగ, ఇతర ఉపకులాల నుంచి వచ్చిన వాళ్లే.

ఆ పేగు బంధం వలననే ఎంఆర్‌పిఎస్‌ సంస్థాపక అధ్యక్షుడు కృష్ణ మాదిగ మొదటి నుంచీ కూడ ప్రతి ఎన్‌కౌంటర్‌ హత్యను ఖండించడమే కాకుండా ఎన్‌కౌంటర్‌ అమరుల అంత్యక్రియల్లో పాల్గొనడం, అమరుల కుటుంబాలను పరామర్శించడం చేస్తున్నాడు.

విప్లవకారులపై, ముస్లిం, క్రైస్తవ మైనారిటీ వర్గాలపై దాడులను, పోలీసు కాల్పులను, ఎన్‌కౌంటర్లను ఖండించడమనే ప్రజాస్వామిక కర్తవ్యంతో పాటు ఎంఆర్‌పిఎస్‌ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కూడ మొదటి నుంచీ క్రియాశీలంగా బలపరచింది. ఆ క్రమంలో 2009 నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 9 దాకా కెసిఆర్‌ నిరాహార దీక్ష సందర్భంగా ఆయనకు తోడునీడగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే దళిత ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన కెసిఆర్‌ మొదటి వాగ్దాన భంగం కూడ అక్కడే ప్రారంభమైంది. శాసన సభలో ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేసి, భారతీ మాదిగ పోలీసు దాడిలో అమరురాలైతే శాసనసభలో ఇరువై ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి పది రోజుల లోపల అఖిల పక్షాన్ని ఢిల్లీకి ప్రధాని దగ్గరికి తీసుపోతానన్నవాడు నాలుగు నెలలు గడిచినా మాట నిలబెట్టుకోక పోవడమే కాకుండా మందకృష్ణ మాదిగతో పాటు వేలాది మంది ఎంఆర్‌పిఎస్‌ కార్యకర్తలను అరెస్టు చేసి, తప్పుడు కేసులు పెట్టి నెలల తరబడి బెయిలు రాకుండా అడ్డుపడి ఎంత వేధించాడో అదంతా ఇటీవలి చరిత్ర.

ఎంఆర్‌పిఎస్‌ ఆఫీసు గదిలో నిరాహార దీక్షకు కూర్చున్న కృష్ణ మాదిగను ఆఫీసు తలుపులు పగులగొట్టి కిడ్నాప్‌ చేసి పోలీసు స్టేషన్లో పెట్టి, ఆయుధాలు కలిగి ఉన్నాడు, విచారణకు అడ్డుపడతాడు, దౌర్జన్యాన్ని ప్రేరేపిస్తాడనే ఆరోపణలతో నెలల తరబడి బెయిలుకు అడ్డుపడి ప్రజా ఉద్యమ ఫలితంగా వదిలిపెట్టక తప్పని ప్రభుత్వం ఇప్పుడు ఆయనకు, ఆయన తోడు నీడగా ఉన్న కార్యకర్తలకు ప్రాణహాని కోసం పథకాలు వేస్తున్నదని కథనాలు వస్తున్నాయి.

అనుకూలంగా తీర్మానం చేసిన దగ్గర్నించీ అణచివేస్తున్నంతవరకు కెసిఆర్‌ ప్రభుత్వం అనుసరించిన రాజనీతి. యే గతంలోనూ, ప్రస్తుతమూ చంద్రబాబు అనుసరిస్తున్న రాజనీతి కూడా తన పాదయాత్రకు ఎంఆర్‌పిఎస్‌ నుంచి తెలంగాణలో, ఎంతో సహకారం పొందిన చంద్రబాబు అమరావతిలో ఎంఆర్‌పిఎస్‌ అడుగుపెట్టడానికి వీలు లేదని ఆంక్షలు విధించాడు.

మొదటి నుంచీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నట్లు ప్రవర్తిస్తున్న బిజెపి తాను కేంద్రంలో అధికారానికి వచ్చిన వంద రోజుల్లో పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి వర్గీకరణ చట్టం చేస్తానన్నది. కేంద్ర మంత్రిగా ఢిల్లీ ధర్నాలో, రాజ్యసభ చైర్మన్‌గా, ఉపరాష్ట్రపతిగా మందకృష్ణమాదిగ కూతురు వివాహ సందర్భంలో ప్రకటించిన వెంకయ్య నాయుడు కనీసం రాజ్యసభలో వర్గీకరణ తీర్మానం ప్రతిపాదించే వెసులుబాటు కూడ కలిగించలేకపోయాడు. పార్లమెంటరీ పార్టీల ద్వంద్వ వైఖరిని, నోటితో స్వాగతించి నొసలుతో వెక్కిరించడానికి, అధికారంలో ఉన్నప్పుడు అనుకూలమైన మాట, అధికారంలోకి వచ్చినాక అణచివేతకు ఎస్సీ వర్గీకరణ పట్ల వారి వైఖరికన్న మరొక దాఖలా అక్కర్లేదు.

వర్గీకరణ యే లక్ష్యంగా ఒక ఎత్తుగడగా ఆయా కాలాల్లో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌, బిజెపి, టిడిపి, టిఆర్‌ఎస్‌లతో సహా ఎన్నికల పార్టీల పట్ల మందకృష్ణ మాదిగ, ఎంఆర్‌పిఎస్‌ పెట్టుకున్న సంబంధాలు, ఆశలు ఎంత నిరర్థకమో ఎంత భ్రమపూర్వకమో కూడ కనువిప్పు అయిందనుకుంటాను.

అందుకే ఇప్పుడు కేంద్రంలో బిజెపి అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరికి నిరసనగా, ఈ పార్లమెంటు బడ్జెట్‌ సెషన్‌లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని ఎంఆర్‌పిఎస్‌ మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర బంద్‌ పిలుపునిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి శాసనసభలో తీర్మానం చేసి ఉన్నారు గనుక అఖిల పక్షానికి నాయకత్వం వహించి ఢిల్లీకి ఒక ప్రతినిధి వర్గాన్ని తీసుకపోవాలని కూడ డిమాండు చేస్తున్నది.

ఎంఆర్‌పిఎస్‌ మీద, దళితుల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలతో పాటు, అంతకన్నా తీవ్రంగానే ఆదివాసులపై వివక్ష, దాడులు, లైంగిక అత్యాచారాలు, గృహ దహనాలు, బహిష్కరణలు, ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయనడానికి తాజా ఉదాహరణ, నెత్తుటి తడి ఇంకా ఆరని చేదు నిజం, ఒక మావోయిస్టు నాయకుడు ప్రభాకర్‌ (దడబోయిన స్వామి)తో సహా తొమ్మిది మంది మావోయిస్టు ఆదివాసుల హత్య. వారిలో ఏడుగురు అమరులు ఆదివాసీ మహిళలు. తెలంగాణ గడ్డ మీద టేకులపల్లి ఎన్‌కౌంటర్‌ దళిత, ఆదివాసుల అమరత్వం తర్వాత ఇది అంతకన్నా పెద్దది. చరిత్ర నిండా ఇటువంటి ఉదాహరణలెన్నో.

కనుక ఎంఆర్‌పిఎస్‌ వర్గీకరణ కోసం, కేంద్రంలో ఉన్న బిజెపి సంకీర్ణ ప్రభుత్వ వ్యతిరేక వైఖరికి నిరసనగా, పార్లమెంటు బడ్జెట్‌ సెషన్‌లో బిల్లు పెట్టాలనే డిమాండ్‌తో ఎంఆర్‌పిఎస్‌ మార్చి 13 బుధవారం ఇరవై నాలుగు గంటల పాటు ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర బంద్‌ పిలుపుకు సిపిఐ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. పార్టీశ్రేణులు, ప్రజలు, ప్రజాసంఘాలు క్రియాశీలంగా పాల్గొనాలని పిలుపునిస్తున్నది. ప్రజాస్వామ్యవాదులు ఈ బంద్‌ను హృదయపూర్వకంగా బలపరచాలని విజ్ఞప్తి చేస్తున్నది.

తొమ్మిది మంది ఆదివాసులను, తెలంగాణ నుంచి ఒక మావోయిస్టు నాయకుడు ప్రభాకర్‌ (దడబోయిన స్వామి)ను మొత్తం పది మంది విప్లవ కారులను ఏకపక్ష ఎన్‌కౌంటర్‌ దాడిలో బలిగొన్న తెలంగాణ ప్రభుత్వ రక్త దాహాన్ని ఖండించవలసిందిగా ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు విజ్ఞప్తి చేస్తున్నది.

ఈ బంద్‌ సందర్భంగా ఎంఆర్‌పిఎస్‌పై, ఆదివాసులపై, వర్గ పోరాటాలపై, ప్రజా ఉద్యమాలపై, ప్రజలపై జరుగుతున్న నిర్బంధాన్ని, రాజ్య హింసను ఖండిచాలని విజ్ఞప్తి చేస్తున్నది.

- జగన్‌

సిపిఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధి,

తెలంగాణ రాష్ట్ర కమిటీ

Keywords : mrps, krishna madiga, telangana, bandh, maoist party
(2018-03-22 22:55:07)No. of visitors : 3432

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

మహాజనాద్భుత సాగరహారానికి నాలుగేళ్ళు

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది....

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

తెలంగాణ ఉద్యమకారుడి కిడ్నాప్ !

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా లోంచి ఎగిసిన విద్యార్థి నాయకుడు... తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడుగా ఉద్యమంలో అనేక సార్లు లాఠీ దెబ్బలు తిన్నవాడు. జైలుకు పోయినవాడు. సమైక్యాంధ్ర పోలీసులను ఎధిరించి, బరిగీసి నిలబడ్దవాడు....

Search Engine

నగ్నంగా 2 కిమీ నడిపించి..పసివాళ్ళపై అమానుషం !
Atrocities against Dalits at 17-year high in Gujarat
Baiga Adivasis March Against Displacement Due to Tiger Corridor, Demand Forest Rights
సోవియట్ రష్యాలో ఏం జరిగింది ?
Hindu Mahasabhaʹs calendar refers to Mecca as Macceshwar Mahadev temple
కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం - విరసం
Why it is important to support the Spring Thunder Tour?- International Committee to Support the Peopleʹs War in India
చందమామని చూడని వెన్నెల -బి.అనూరాధ
సారూ.... అమ్మాయిలంటే ఎందుకంత వివ‌క్ష? ‍ ప్రిన్సిప‌ల్ కు ఓయూ విద్యార్థినిల లేఖ
నిర్బంధాల నడుమ మావోయిస్టుల భారీ భహిరంగ సభ‌
న్యాయం గుడ్డిదని తెలుసు కానీ మరీ ఇంత గుడ్డిదా ?
మహా రాష్ట్రలో రైతుల లాంగ్ మార్చ్ లు..కేరళలో రైతులపై దాడులు..ఇవేనా సీపీఎం రాజకీయాలు ?
జన హృదయాల్లో విప్లవ ప్రభాకరుడు - వరవరరావు
శ్రీ చైత‌న్య, నారాయ‌ణ కాలేజీల‌ను బ‌హిష్క‌రించండి : టీవీవీ
పేదలకు అంబులెన్స్ లూ కరువే...తోపుడు బండిపై భార్య శవంతో...
Dalit girl ends life in T.N. village after boys tear up her Class XII exams hall ticket
Bhima-Koregaon violence: Hindutva leader Milind Ekbote held
UP: Two Dalit youths brutally thrashed, one lost his thumb
ప్ర‌జ‌ల‌పై యుద్ధం : పాఠ‌శాలలను ధ్వంసం చేస్తున్న పోలీసులు !
ముంబై కదిలింది.. అన్నదాతకు అన్నం పెట్టింది..
రైతుల పోరాటానికి దిగి వచ్చిన ఫడ్నవీస్ సర్కార్ !
మిలియన్ మార్చ్ స్పెషల్ -బమ్మిడి జగదీశ్వరరావు
రైతులపై బీజేపీ నేత‌ దాడి !
లెనిన్‌ ఎవరూ..!?
more..


మార్చ్13