సారూ.... అమ్మాయిలంటే ఎందుకంత వివ‌క్ష? ‍ ప్రిన్సిప‌ల్ కు ఓయూ విద్యార్థినిల లేఖ


సారూ.... అమ్మాయిలంటే ఎందుకంత వివ‌క్ష? ‍ ప్రిన్సిప‌ల్ కు ఓయూ విద్యార్థినిల లేఖ

సారూ....


విద్య జ్ఞానాన్ని ఇవ్వాలి. విద్య స‌మాన‌త్వాన్ని బోధించాలి. విద్య స‌మాజ పురోగ‌తికి దోహ‌ద‌ప‌డాలి. కానీ, విశ్వ‌విద్యాల‌యాలు వివ‌క్ష‌కు నిల‌యాలుగా మారుతున్నాయి. స‌మ‌స్య‌ల‌కు కేంద్రాలు మారుతున్నాయి. అందుకు ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఓ ఉదాహ‌ర‌ణ‌. అట్ట‌హాసంగా వందేళ్ల ఉత్స‌వాల్ని జ‌రుపుకుంటున్న ఉస్మానియాలో విద్యార్థినులు వివ‌క్ష‌ను ఎదుర్కొంటున్నారు. క‌డుపునిండా తిండి కూడా దొర‌క‌ట్లేదు. లేడీస్ హాస్ట‌ల్‌లో నెల‌కొన్న స‌మ‌స్య‌లే అందుకు నిద‌ర్శ‌నం. అర‌కొర వ‌స‌తులు, అప‌రిశుభ్ర వాతావ‌ర‌ణానికి తోడు స‌రిప‌డ ఆహారం కూడా అందడం లేదు విద్యార్థినుల‌కు.

త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఎన్ని విన్న‌వించుకున్నా అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో విద్యార్థినులు త‌మ స‌మ‌స్య‌ల‌ను యూనివ‌ర్సిటీ వీసీ రిజిస్టార్‌, వీసీ, క‌ళాశాల ప్రిన్సిప‌ల్ దృష్టికి తీసుకెళ్లారు. అబ్బాయిల‌కు అన్‌లిమిటెడ్ ఫుడ్ అందిస్తూ... త‌మ‌కు లిమిటెడ్ ఫుడ్‌ని అందిస్తున్నారంటూ విద్యార్థినులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. హాస్ట‌ల్ స‌మ‌స్య‌ల‌కు తోడు.... యూనివ‌ర్సిటీలో అధ్యాప‌కుల కొర‌త వ‌ల్ల త‌ర‌గ‌తులు కూడా జ‌ర‌గ‌ట్లేద‌ని, ఫ‌లితంగా ఎందుకు ఇక్క‌డికి వ‌చ్చామో అర్థంకాని స్థితి నెలకొంద‌ని ఉస్మానియా యూనివ‌ర్సిటీ తెలంగాణ విద్యార్థి వేదిక స‌భ్యురాలు జ్యోతి తెలిపారు. త‌మ స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని ప్రిన్సిప‌ల్‌ని కోరామ‌ని తెలిపారు.

ఇదే అంశంపై ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిప‌ల్‌కి విద్యార్థినిలు ఉమ్మ‌డిగా రాసిన లేఖ పూర్తి పాఠం...

టు,
ప్రిన్సిప‌ల్‌, ఆర్ట్స్ కాలేజ్‌,
ఉస్మానియా యూనివ‌ర్సిటీ

విష‌యం : లేడీస్ హాస్ట‌ల్, క‌ళాశాల‌ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం గురించి

ప్రియ‌మైన ప్రిన్సిప‌ల్ గారికి న‌మ‌స్క‌రించి వ్రాయున‌ది...

స‌ర్‌, మేము చెప్పే విష‌యాలు మీకు చిన్న విష‌యాలుగా అనిపించ‌వ‌చ్చు. కానీ, మా దృష్టితో చూడండి. ఈ విశ్వ‌విద్యాల‌య విద్యార్థినులుగా ఉన్నందుకు సంతోషించాలో, భాద‌ప‌డాలో అర్థంకాని ప‌రిస్థితిలో ఉన్నాము. ఈ యూనివ‌ర్సిటీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేరుకు, ఇక్క‌డి వాస్త‌వ ప‌రిస్థితుల‌కు ఎక్క‌డా పొంత‌న‌లేద‌నిపిస్తోంది. ముఖ్యంగా, మేము రెండు ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను మీ ముందుకు తీసుకురావాల‌నుకుంటున్నాము.
1) లేడీస్ హాస్ట‌ల్‌లో స‌మ‌స్య‌లు
2) కాలేజ్‌లో ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌లు

హాస్ట‌ల్ స‌మ‌స్య‌ల్లో చాలా అశాంలున్నాయి. మేము ప్రాణ‌హిత హాస్ట‌ల్ బ్లాక్ 2లో ఉంటున్నాం. బ్లాక్ 2లో దాదాపు 650 మంది విద్యార్థినిలున్నారు. కానీ, అంత‌మందికి స‌రిప‌డ సౌక‌ర్యాలు లేవు. పొద్దున లేవ‌గానే మొద‌ల‌వుతుంది లైన్‌లో నిల‌బ‌డ‌డం. తెల్ల‌వారు జాము 5గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు కూడా స్నానాలు అవ‌డం క‌ష్టంగానే ఉంటుంది. ఇందుకు కార‌ణం స‌రైన బాత్‌రూంలు లేక‌పోవ‌డం. ఉన్న‌వాటికి కొన్నిటికి లోప‌ల గ‌డియ‌లుండ‌వు. ఉన్న బాత్‌రూంలు కూడా ఎప్పుడో క‌ట్టిన‌వి. వాటిలో స‌రిగ్గా వాట‌ర్ పోక‌పోవ‌డం, శుభ్రంగా లేక‌పోవ‌డం లాంటి స‌మ‌స్య‌ల‌నేకం. బ‌య‌ట చాలా ఖాళీ స్థ‌లం ఉంది క‌దా.. అక్క‌డ కొన్ని వాష్‌రూమ్స్ క‌ట్టిస్తే బావుంటుంద‌ని మేము చాలా సార్లు వార్డెన్‌, డైరెక్ట‌ర్ దృష్టికి తీసుకెళ్లాం. కానీ ఎటువంటి చ‌ర్య‌లూ తీసుకోక‌పోవ‌డం విషాదం.

హాస్ట‌ల్‌లో క‌నీసం మిన‌ర‌ల్ వాట‌ర్ కూడా అందించ‌డం లేదు. ఎక్క‌డో పీహెచ్‌డీ బ్లాక్‌లో ఒక ట్యాప్‌లో మిన‌ర‌ల్ వాట‌ర్ వ‌స్తుంది. కానీ, అక్క‌డి నుంచి తెచ్చుకోవ‌డం ప‌ట్ల పీహెచ్‌డీ విద్యార్థులు అభ్యంత‌రం చెబుతుంటారు. వార్టెన్‌తో మాట్లాడి ఏర్పాటు చేసుకోవాలి కానీ, ఇక్క‌డి వ‌స్తే ఎలా అంటుంటారు. మొత్తంగా మా బ్లాక్‌లో నీళ్ల‌కు ఒకే ఒక ట్యాప్ ఉంది. బ‌ట్ట‌లు ఉతుక్కునే ఉన్న ట్యాప్‌ల్లో వాట‌ర్ రాదు. వాటిని రిపేర్ చేయించ‌మ‌ని ఎన్నిసార్లు చెప్పినా ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఇక‌, ఫుడ్ విష‌యానికి వ‌స్తే.. అబ్బాయిల హాస్ట‌ల్లో వాళ్ల‌కు కూర్చున్న చోటుకే వ‌చ్చి వ‌డ్డిస్తారు. ఫుడ్ క్వాలిటీ బావుంటుంది. అన్ లిమిటెడ్ ఫుడ్ పెడ‌తారు. వాళ్లు తినే ప్లేట్లు కూడా యూనివ‌ర్సిటీ ప్లేట్లు. వాటిని కూడా వాళ్లు క‌డ‌గ‌రు. మా విష‌యానికి వ‌స్తే.. ప్లేట్స్ మావే. అన్నం, సాంబార్ త‌ప్ప ఏవైనా వాళ్ల ద‌గ్గ‌రికి వెళ్లి అడ‌గాలి. వాళ్లు పెట్టిన దానితో స‌రిపుచ్చుకోవాలి. మాకెందుకు లిమిటెడ్ ఫుడ్ పెడుతున్నార‌ని వార్డెన్ మేడంను అడిగితే.. అంతే, ఇప్ప‌టి వ‌ర‌కు ఎప్పుడూ అన్ లిమిటెడ్ ఫుడ్ పెట్ట‌లేద‌ని స‌మాధానం చెబుతున్నారు.

స‌ర్‌,
అమ్మాయిలం కూడా అబ్బాయిల‌తో పాటు పోటీ ప‌డి ర్యాంక్స్ తెచ్చుకున్న‌వాళ్ల‌మే క‌దా? మ‌నం... అమ్మాయిల ప‌ట్ల చాలా వివ‌క్ష ఉంది, అస‌మాన‌త ఉంది అనుకుంటుంటాం క‌దా! అమ్మాయిల‌కు లిమిటెడ్ ఫుడ్ అంటే యూనివ‌ర్సిటీ అలాంటి అస‌మానత‌ల‌ను ప్రోత్స‌హిస్తోంద‌ని మాక‌నిపిస్తోంది. వెంట‌నే ఈ విష‌యంలో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నాం. మేము ప్ర‌శ్నిస్తే... వాళ్ల మెస్ బిల్లు ఎక్కువ, మీ మెస్ బిల్లు త‌క్కువ క‌దా అని మీర‌న‌వ‌చ్చు. కానీ, పెద్ద తేడా ఏం లేద‌ని గుర్తించాల్సి ఉంది. రూ. 300 - రూ.400 తేడా ఉంటోంది. కానీ, మాకు వేసే బిల్‌లో స‌గం ఆహార‌మైనా క‌రెక్ట్‌గా అందివ్వ‌డం లేద‌ని మా భావ‌న‌.

అందుకు చిన్న ఉదాహ‌ర‌ణ - జ‌న‌వ‌రి నెల‌లో నేను (జ్యోతి) కేవ‌లం 13 రోజులు మాత్ర‌మే ఉన్నాను. కానీ, నాకు 27 రోజుల‌కు మెస్ బిల్ వ‌చ్చింది. ఇదేంట‌ని అడిగితే... వ‌చ్చే నెల తీసేస్తామ‌ని చెప్పారు. నిజంగానే తీసేస్తార‌న్న న‌మ్మ‌కం లేదు. నేను అడిగాను కాబ‌ట్టి అలా చెప్పారు. మ‌రి అడ‌గ‌ని వాళ్ల ప‌రిస్థితి ఏంటి? అన‌వ‌స‌రంగా తిన్నా, తిన‌క‌పోయినా బిల్ వేస్తున్నారు. నెల‌లో ఒక్క‌రోజు తిన్నా నెల మొత్తానికి బిల్ ప‌డుతుంద‌ని చెబుతున్నారు. ఇదెలా స‌రైందో మీరే చెప్పాలి. మేము ప‌ల్లెల నుంచి వ‌చ్చిన వాళ్లం. ఎలాంటి ప‌రిస్థితుల్లోనైనా ఉండ‌గ‌లం. కానీ, మాకు అందించాల్సినవి స‌రిగ్గా అందిస్తే.. స‌మ‌స్య‌లకు తావులేకుండా ఉంటుంది.

స‌ర్‌, ఇప్ప‌టి వ‌ర‌కు చెప్పుకుంటూ వ‌చ్చిన విష‌యాలు నాణానికి ఒక‌వైపు మాత్ర‌మే. మేము ఇక్క‌డికి వ‌చ్చిందీ.. చ‌దుకోవ‌డానికి. కానీ, మాకు స‌రైన విద్య అంద‌డం లేదు. మేము లైబ్ర‌రీ సైన్స్ చ‌దువుతున్నాం. ఈ విభాగంలో ఇద్ద‌రు ప్రొఫెస‌ర్లు మాత్ర‌మే ఉన్నారు. మాకు ఉన్న ఐదు స‌బ్జెక్ట్‌ల‌లో రెండు స‌బ్జెక్ట్‌లు ప్రొఫెస‌ర్లు బోధిస్తుండ‌గా, మిగిలిన స‌బ్జెక్ట్‌ల‌ను స్కాల‌ర్స్‌తో చెప్పిస్తున్నారు. వాళ్లు చెప్పేది స‌రిగ్గా అర్థం కావ‌డం లేదు. పిల్ల‌లు కూడా స‌రిగ్గా కాలేజ్‌కి రావ‌డం లేదు క‌దా అంటారేమో? కానీ, రాని వాళ్ల‌ను వ‌దిలేస్తే... వ‌చ్చేవాళ్ల‌కైనా చెప్ప‌డానికి ప్రొఫెసర్స్ ఉండాలి క‌దా? స‌ర్‌, మేము ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం నుంచి ఇది కోరుకోలేదు. ఇక్క‌డ సీట్ వ‌స్తే జీవితంలో ఏదైనా సాధించ‌గ‌లం అనుకున్నాం. కానీ, ఆ న‌మ్మ‌కం త‌ప్పుకావ‌చ్చ‌ని ఇప్పుడు అనిపిస్తోంది. బ‌య‌టి ప్ర‌భుత్వ కాలేజీ మ‌న కాలేజీకి పెద్ద తేడా లేద‌నిపిస్తోంది. మేమేదో మ‌న యూనివ‌ర్సిటీని విమ‌ర్శిస్తున్నామ‌నుకోకండి. ఇది యూనివ‌ర్సిటీ విద్యార్థినులుగా మా ఆవేద‌న‌.

మ‌రో విష‌యం, నేను (జ్యోతి) మార్చి 14న ఉమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్ సెల్‌కి కంప్లైంట్ బాక్స్ ఉందా అని తెలుసుకోవ‌డానికి వెళ్లాను. అక్క‌డి ఉన్న మేడంతో మాట్లాడాను. అప్పుడు... ఒక స‌ర్‌, నా పేరు అడిగి, మీకు ఏ పార్టీ స‌పోర్టు ఇస్తుంది అని అడిగారు. అంటే, మామూలు విద్యార్థినిగా ఎవ‌రైనా త‌మ స‌మ‌స్య‌ను చెప్పుకోవ‌డానికి వ‌స్తే వాళ్ల‌కు ఏదైనా రాజ‌కీయ పార్టీతోనో, విద్యార్థి సంఘంతోనో సంబంధం ఉంద‌నే అభిప్రాయాన్ని ఏర్ప‌ర్చుకుంటారా? స‌ర్‌, సాధార‌ణ విద్యార్థిని కూడా క‌ళాశాల‌లోని స‌మ‌స్య‌ల‌ను గురించి మాట్లాడే, ప్ర‌శ్నించే స్వేచ్ఛ ఉంద‌ని భావిస్తూ.... ఈ విష‌యాల‌ను మీ ముందుచుతున్నాము. ఈ క్ర‌మంలో ఏదైనా త‌ప్పుగా అనిపిస్తే మ‌న్నించండి. మేము ప్ర‌స్థావించిన విష‌యాల ప‌ట్ల సానుకూలంగా స్పందిస్తార‌ని ఆశిస్తూ, యూనివ‌ర్సిటీని నిర్ల‌క్ష్య‌పు అంద‌కారం నుంచి కాపాడాల‌ని కోరుతున్నాం.

స‌మ‌స్య‌ల‌పై ఓయూ వీసీకి విద్యార్థినుల లేఖ‌

ఇట్లు,
1) వి. జ్యోతి , (ఎంఏ లైబ్ర‌రీ సైన్స్‌)
2) జె. ఇందిర‌, (ఎంఏ లైబ్ర‌రీ సైన్స్‌)
3) జె. శిల్ప (ఎంఏ, ఇంగ్లీష్‌)
4) యు. సౌమ్య కృష్ణ (ఎం.ఏ ఇంగ్లీష్‌)
5) ఎల్. సంధ్య ( ఎం.ఏ హిందీ)
6) ఎ. అన్న‌పూర్ణ (ఎంఏ హిస్ట‌రీ)
7) ఎ. ప‌ద్మాదేవి (ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్‌)
8) పి. మ‌మ‌త (పొలిటిక‌ల్ సైన్స్‌)
9) సి.హెచ్. నీర‌జ ( ఫిలాస‌ఫీ)
10) కె. భార‌తి (పొలిటిక‌ల్ సైన్స్‌)
11) జి. స్ర‌వంతి (ఎంఏ తెలుగు)
12) శ‌ర‌ణ్య (ఎంసీజే)
13) డి. క‌న‌క‌ల‌క్ష్మి (పొలిటిక‌ల్ సైన్స్‌)
14) సీహెచ్. పుష్ప (పొలిటిక‌ల్ సైన్స్‌)
15) వి. అలివేల (ఎంఏ హిస్ట‌రీ)
16) బి. జాస్మిన్ (ఎంఏ సంస్కృతం)
17) ర‌వ‌ళి (ఎంఏ సంస్కృతం)
18) కె. శృతి (ఎంఏ సోషియాల‌జీ)
19) ఎన్‌. స్వ‌ప్న (ఎంఏ సోషియాల‌జీ)
20) బి. సంధ్య (ఎంఏ హిస్ట‌రీ)
21) ఇ. శ్రీల‌త (ఎంఏ సోషియాల‌జీ)
22) ఎం. వెంక‌ట ల‌క్ష్మి (ఎంఏ లింగ్విస్టిక్స్‌)
23) క‌విత ( ఎంఏ తెలుగు)
24) కావ్య (ఎంఏ తెలుగు)
25) వ‌సుంద‌ర (ఎంఏ తెలుగు)
26) ఏ నీలిమ (ఎంఏ సోషియాల‌జీ)
27) రేష్మ (ఇస్లామిక్ స్ట‌డీస్‌)
28) జి. మ‌మ‌త (ఎంఏ తెలుగు)
29) ష‌కీర (ఉర్దూ)
30) కె. నాగ‌మ‌ణి ( ఎంఏ ఫిలాస‌ఫీ)
31) జి. శ్రీల‌త ( ఎంఏ ఇంగ్లీష్‌)
32) జి. ల‌క్ష్మి ప్ర‌స‌న్న ( లింగ్విస్టిక్స్‌)
32) బి. జ్యోతి (ఎంఏ తెలుగు)
33) ఎల్‌. క‌విత ( సైన్స్‌)
34) విజ‌య‌ల‌క్ష్మి (సైన్స్‌)
35) స్ఫూర్తి (సైన్స్‌)
36) ఎం. వ‌ర‌ల‌క్ష్మి (జియాల‌జీ)
37) ప్ర‌మీల (మాథ‌మెటిక్స్‌)
38) అనిత ( పొలిటిక‌ల్ సైన్స్‌)
39) భ‌వాని (హిందీ)
40) లావ‌ణ్య ( కామ‌ర్స్‌)
41) మ‌నీష (కామ‌ర్స్‌)
42)సుచ‌రిత (జియాల‌జీ)
43) భ‌వాని (కామ‌ర్స్‌)
44) శ్వేత (కామ‌ర్స్‌)
45) సోనియ (కామ‌ర్స్‌)
46) శ్రావ్య (కామ‌ర్స్‌)
47)స్వాతి (కామ‌ర్స్‌)
48 ) ర‌ష్మిత (కామ‌ర్స్‌)

Keywords : ou, students, women, telangana
(2019-01-14 22:56:52)No. of visitors : 919

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

మహాజనాద్భుత సాగరహారానికి నాలుగేళ్ళు

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది....

Search Engine

A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ను తొలిగించడమే ఆరెస్సెస్‌-బీజేపీ అసలు లక్ష్యం...జిగ్నేష్ మెవాని
కన్నయ్య, ఉమర్‌, అనీర్బన్‌ లపై మూడేళ్ళ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు
కాగితం మీద అక్షరానికి కట్టుబడ్డ కవి
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకం
మానవత్వం మరచి ఆంబులెన్సును అడ్డుకున్న పోలీసులు.. క్షతగాత్రులపై దాడి
కలాల్లో ఇంకిపోని సిరా, టకటకలు మానని కీబోర్డులు...
కలాల్లో ఇంకిపోని సిరా.. అరుంధతీ రాయ్‌కి జైలు జీవితం అనుభవించిన సామాజిక కార్యకర్త రాసిన ఉత్తరం
A ten year Sahas from US written a reply to Professor Saibabaʹs letter.
Varavara Rao written a letter about Nomula Satyanarayana from Pune jail
అగ్రకులాలకు రిజర్వేషన్లు సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం, రాజ్యంగ విరుద్ధం
దళిత నటి విషాద గాథ‌ !
కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మారణహోమాన్ని చూడలేక రాజీనామా చేసిన ఐఏఎస్
ప్ర‌మాదంలో ప్రైవ‌సీ
తొలగించబడిన చట్టం కింద‌ 22 మంది అరెస్టు...సుప్రీం సీరియస్
నాలుగున్నర దశాబ్దాల నిత్య నిర్బధం - ఎన్.వేణుగోపాల్
శ్రీకాకుళం జిల్లా జైలు - వెట్టిచాకిరీకి నిలయం
గెలిచినమంటే చేసిందంతా మంచిదని కాదు!
దాడిచేస్తున్నా.. ఎత్తిన కెమెరా దించలేదు..
ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌
సాయిబాబా లాంటి వాళ్ల కష్టాల ముందు నాదెంత : వరవరరావు
కలలకు సంకెళ్లు వేసిన రాజ్యం
మైనింగ్ పేరుతో ప్రకృతి విధ్వంసం.. ʹఆపరేషన్ అనకొండʹతో రంగంలోకి ప్రభుత్వం
మానవ హక్కుల హననానికి పాల్పడిన అధికారికే ప్రమోషన్.. చత్తీస్‌గడ్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం
రామ మందిరం గురించి రాసిన రచయితకు హిందుత్వ సంస్థల బెదిరింపులు
more..


సారూ....