ఎగిసిన దళితాగ్రహం..బంద్ విజయవంతం...నిరసనపై పోలీసు తూటా.. 9 మంది బలి !


ఎగిసిన దళితాగ్రహం..బంద్ విజయవంతం...నిరసనపై పోలీసు తూటా.. 9 మంది బలి !

ఎగిసిన

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని నీరు గార్చే ప్రయత్నానికి నిరసనగా ఇవ్వాళ్ళ పలు దళిత సంఘాలు నిర్వహించిన‌ భారత్ బంద్ సందర్భంగా జరిగిన పోలీసు కాల్పుల్లో దాదాపు తొమ్మిది మంది ఉద్యమకారులు చనిపోయినట్టు సమాచారం. మధ్యప్రదేశ్ , ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లలో పది మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో నలుగురు, బింద్ లో ఒకరు, మొరేనాలో ఒకరు, ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ లో ఇద్దరు రాజస్థాన్‌లోని అల్వార్‌లలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు.

మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, జార్ఖండ్, బీహార్, ఒడిశాలలో బంద్ సందర్భంగా ఆందోళనలు తీవ్రంగా సాగాయి. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్, రాజస్థాన్‌లోని బర్మార్ ప్రాంతాల్లో నిరసనకారులపై పోలీసులు తీవ్రమైన దాడి చేయడంతో ఉద్యమకారులు ప్రభుత్వ ఆస్తులు, వాహనాలకు నిప్పు పెట్టారు. ఢిల్లీలోని మండి హౌస్ ప్రాంతంలో కూడా బంద్ ప్రభావం కనిపించింది. పంజాబ్‌లో ముందు జాగ్రత్తగా రవాణా, మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. విద్యాసంస్థలను కూడా మూసివేశారు. బీహార్‌లోని ఫోర్బెస్‌గంజ్ జంక్షన్ వద్ద ఆందోళనకారులు రైలు పట్టాలపై నిరసనకు దిగడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రాజస్థాన్‌లోని ఆగ్రాలో దళితులు పలు సంఘాల నేతృత్వంలో పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు.

ఉతర్త ప్రదేశ్‌లోని మీరట్లో బంద్ సందర్భంగా ఉద్యమకారులపై పోలీసు దాడికి నిరసనగా పోలీస్‌ ఔట్‌ పోస్ట్‌కు ఉద్యమకారులు నిప్పంటించారు. మోటార్‌ సైకిళ్ళకు కూడా నిప్పంటించారు. రాజస్థాన్‌లో నిరసన కారులు బస్సుల్ని ధ్యంసం చేయడంతో 25 మంది నిరసనకారుల్ని అరెస్టు చేశారు. నాగ్‌పూర్‌లో పోలీసుల తనిఖీ కేంద్రంపై దాడి చేశారు. కర్ణిసేన, దళిత కార్యకర్తల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా గాయపడ్డారు. అలాగే ముంబయి - జైపూర్‌ల మధ్య రైళ్ళను నిలిపేశారు. గుజరాత్‌లో దళిత సంఘాల నిరసనకు కాంగ్రెస్‌ మద్దతు తెలిపింది. ఈ ప్రాంతంలో కూడా రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సుల్ని నిలిపేశారు.

మధ్యప్రదేశ్‌లో దళిత సంఘాలు ఇచ్చిన బంద్ పోలీసుల దాడితో హింసాత్మకంగా మారింది. పోలీసూ కళ్పూళ్ళొ వల్ల మురెనాలో ఒకరు మృతిచెందారు. దీంతో అక్కడ కర్ఫ్యూ విధించారు. ఆందోళనకారులు రైల్వే ట్రాక్‌ను బ్లాక్ చేశారు. గ్వాలియర్‌లో కూడా బంద్ సంపూర్ణంగా జరిగింది. అక్కడ కూడా కర్ఫ్యూ విధించారు. సెక్షన్ 144ను కూడా విధిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని ఓ ప్రాంతంలో ఓ వ్యక్తి ఆందోళనకారులపై పిస్తోల్‌తో ఫైరింగ్ జరిపాడు. దానికి సంబంధించిన వీడియో రిలీజైంది. బింద్ పట్టణంలోనూ ఆందోళనకారులు రాళ్లు రువ్వారు.

పంజాబ్‌లోని లుథియానా, జిరాక్‌పూర్‌లో దళిత సంఘాలు రోడ్డెక్కాయి. భారత్‌ బంద్‌లో భాగంగా నిరసనకారులు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. పట్టాలపై కూర్చొని నిరసన తెలిపారు. దీంతో బిహార్‌, ఒడిశా, పంజాబ్‌లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బిహార్‌లోని పట్నా, ఫోర్బెస్‌గంజ్‌, ఆర్హా ప్రాంతాల్‌ భీమ్‌ ఆర్మీ, దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసనకారులు రైళ్లను అడ్డుకున్నారు. ప్రధాన రహదారులపై బైఠాయించి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు.

మొరేనాలో బాల్కనీలో నిలుచున్న రాహుల్ పాఠక్ అనే వ్యక్తికి పోలీసు కాల్పుల్లో బుల్లెట్ తగలడంతో అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే కన్నుమూశాడు. భింద్‌కు చెందిన మహావీర్ రావత్ అనే మరో వ్యక్తి శరీరంలో తూటా దూసుకుపోయి కన్నుమూశాడు. గ్వాలియర్‌లోనూ మరో వ్యక్తి కాల్పుల్లో మృతిచెందాడు. ఆగ్రాలో రాళ్లురువ్వడం, మీరట్‌లో ప్రభత్వ వాహనాలకు నిప్పుపెట్టడం, హపూర్‌లో దుకాణాలు ధ్వంసం చేయడం, బీహార్‌లో దూర ప్రాంతాలకు వెళ్తున్న వాహనాలను నిలిపివేడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

బంద్ సందర్భంగా అనేక చోట్ల‌ పోలీసులు, కొన్ని చోట్ల సంఘ్ పరివార్ శక్తులు దళిత ఉద్యమకారులపై దాడులకు తెగబడ్డరు. అయితే ఉద్యమకారులు వారి దాడిని తిప్పికొట్టి బంద్ ను విజయవంత చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుండి దళితులపై దుర్మార్గపు దాడులు జరుగుతున్న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో బంద్ ప్రభావం తీవ్రంగా కనిపించింది.

Keywords : bharat bandh, dalit, 9 Dead, MP, UP, Rajasthan, Violent Dalit Stir
(2019-03-17 20:56:32)No. of visitors : 610

Suggested Posts


Shocking video of two naked ‘Dalit women’ being thrashed by ‘upper caste’ women

A shocking video of two ʹDalit womenʹ being subjected to merciless thrashing and public humiliation allegedly women from upper caste has gone viral on social media platforms....

ముస్లింల రక్షణ కోసం కత్తులు దూసిన సిక్కులు,చేతులు కలిపిన దళితులు ‍- పరారైన శివసేన మూక

పంజాబ్ లోని పగ్వారా పట్టణంలో ముస్లింల మీద దాడి చేయడానికి ప్రయత్నించిన శివసేన గుంపును సిక్కులు, దళితులు, ముస్లింలు ఐక్యంగా ఎదుర్కొన్నారు. కాశ్మీర్ కు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు బుధవారంనాడు ర్యాలీ నిర్వహించారు ఈ సంధర్భంగా...

గోముసుగు దౌర్జన్యాలపై దళితుల యుద్దభేరి - భగ్గుమంటున్న గుజరాత్

దళితులు భగ్గుమంటున్నారు... తమపై హిందుత్వ శక్తులు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా కదం తొక్కుతున్నారు. గుజరాత్ లో గోరక్షకులు చేస్తున్న అమానుష అరాచకలాను ఎదిరిస్తూ ఆందోళనలకు దిగారు. గిరి సోమనాథ్ జిల్లాలోని ఊనాలో చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచిన...

గోరక్షకుల రాజ్యంలో.. ఆకలితో 500 ఆవులు మృత్యువాత !

బీజేపీ పాలిత రాజస్తాన్ లోని గోసంరక్షణ శాలలో పట్టించుకునే వారు కరువై ఆకలి, అపరిశుభ్రంతో రెండు వారాల్లో దాదాపు 500 ఆవులు మృత్యువాతపడ్డాయి. జైపూర్‌లోని హింగోనియా గోశాలలో దాదాపు 250 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.

చెట్టుకు కట్టేసి మత్తు సూదులేసి.. పెట్రోల్ పోసి.. దళిత బాలుడి పై అగ్రకుల అమానుషం !

కొంతమంది అగ్రకులస్థులు ఓ దళిత బాలుడికి నరకం చూపించారు. చెట్టుకుకట్టేసి బట్టలూడదీసి దారుణంగా కొట్టారు. అతడి మర్మాంగాలపై పెట్రోల్ పోసి హింసించారు. ఈ ఘటన ఆగ్రా జిల్లాలోని బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బాస్ కేసీ....

నీళ్ళు తాగనివ్వని అగ్రకుల అహంకారం - బావిలో పడి దళిత బాలుడి మృతి

మధ్యప్రదేశ్ దమోహ్ జిల్లా ఖమరియా కలాన్ గ్రామంలో మూడవతరగతి చదువుతున్న వీరన్ అనే దళిత బాలుడు మధ్యాహ్న భోజనం తర్వాత నీళ్ళు తాగడానికి....

ఢిల్లీ లో దళితులపై హిందుత్వ సంస్థల దాడి !

ఢిల్లీలో శాంతి యుత ప్రదర్శన నిర్వహిస్తున్న దళితులపై హిందుత్వ శక్తులు దాడి చేశాయి. గుజరాత్ లో దళితులపై దాడికి నిరసనగా ఆదివారంనాడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యూత్ ఫర్ బుద్దిస్ట్ ఇండియా అనే సంస్థ అద్వర్యంలో దళితులు ధర్నా.....

వాళ్ళకు కమ్మోళ్ళ రక్తమే కావాలట !

హైదరాబాద్ మాక్స్ క్యూర్ హాస్పటల్ లో చికిత్సపొందుతున్న ఓ మూడేళ్ళ చిన్నారికి రక్తం అవసరం వచ్చింది. బ్లడ్ డోనర్స్ ఇండియా అనే ట్విట్టర్ లో ఓ కుల గజ్జి మహానువుడు కమ్మోళ్ళ రక్తం కావాలని ట్వీట్ చేశాడు....

ముందుకు సాగుతున్న ʹఛలో ఉనాʹ - కదం తొక్కుతున్న గుజరాత్ దళితులు

గుజరాత్ దళితులు కదం తొక్కుతున్నారు. వారితో ముస్లింలు చేతులు కలుపుతున్నారు. అన్ని వర్గాల ప్రజాస్వామికవాదులు, విప్లవ, ప్రజా సంఘాలు ఒక్కటై కదులుతున్నారు. ఆగస్టు 5 న అహ్మదాబాద్ లో బయలు దేరిన ఛలో ఉనా ర్యాలీ అనేక పల్లెలు, పట్టణాలు....

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి దళిత విద్యార్థుల గెంటివేత

వాళ్ళు దళితులు.... రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంభాల నుండి వచ్చిన నిరుపేద విద్యార్థులు... ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు వాళ్ళు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చ‌దువుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు చ‌దువు రావడం లేదని పదో తరగతికి ప్రమోట్ చేయకుండా 34మంది విద్యార్థులను స్కూల్ నుండి గెంటేశారు....

Search Engine

జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
more..


ఎగిసిన