ఇంద్రవెల్లి ఇంగలం - వరవరరావు


ఇంద్రవెల్లి ఇంగలం - వరవరరావు

ఇంద్రవెల్లి

(2013 ఏప్రెల్ 20 న వరవరరావు రాసిన వ్యాసం)
ʹఒక నిప్పురవ్వ దావానలమవుతుందిʹ అనేమాట సామాన్యంగా ఒకచోట రగుల్కొన్న విప్లవం నలువైపులా విస్తరించడానికి అన్వయిస్తుంటారు. వైనాడ్ (కేరళ) అడవుల్లో వర్గీస్ చిందిన రక్తంలో ఎగసిన నిప్పురవ్వ, తెలంగాణ రైతాంగ పోరాటం వేగుచుక్కగా ఏర్పడిన నక్సల్బరీ పాలపుంత ఆకాశమంతా విస్తరించి విప్లవాన్ని భూమార్గం పట్టించే వెలుగుదారి అయింది. ఆ పంథాయే ఈనాటికీ కొనసాగుతున్న విప్లవ మార్గం.
ఇవ్వాళ తెలంగాణ ఉద్యమానికి కూడా ఇంద్రవెల్లి ఒక పాఠం. తెలంగాణ ఉద్యమం రాజ్యాంగం ఆర్టికల్ 3 కింద తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేయాల ని అంటున్నది. 1950 ఫజల్ అలీ కమిషన్ మొదలు 2009 డిసెంబర్ 9 ప్రకటన వరకు దాదాపు 60 ఏళ్లుగా.. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు అనే ఒక చట్టబద్ధమైన ప్రజాస్వామికమై డిమాండు. 1969 మొదలు నేటి మలిదశ తెలంగాణ ఉద్యమం దాకా అన్ని చట్టబద్ధ పోరాటాలు, వెయ్యిమంది దాకా బలిదానాలు, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్,సాగరహారం మొదలు సబ్బండరాశుల ఆకాంక్ష నుంచి సడక్‌బంద్ దాకా రకరకాల ఉద్యమాలు, ప్రయోగాలు జరిగాయి.

ఒక న్యాయమైన ప్రజాస్వామిక పోరాటం కోసం కశ్మీర్ మొదలు ఈశాన్య రాష్ట్రాల వరకు ప్రజలు ఎటువంటి పోరాట రూపాలు తీసుకోవలసి వచ్చిందో కూడా మనం చూస్తున్నాం. ʹప్రతి న్యాయమైన పోరాటం ప్రజలు శాంతియుతంగా, చట్టబద్ధంగానే ప్రారంభిస్తారు. అది ఏ రూపాన్ని తీసుకుంటుందో చాలాసార్లు శత్రువు నిర్ణయిస్తాడంటాడుʹ రావిశాస్త్రి. అధికారంలో ఉన్నవాడు అడిగినంతనే దిగిపోతే మాకు ఆయుధాలు పట్టాల్సిన అవసరమేమిటి? అంటాడు లెనిన్. చరివూతంతా ఇటువంటి న్యాయ పోరాటాల చరిత్రే.

1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో ఏం జరిగింది? ఆదిలాబాదు జిల్లా గిరిజన రైతుకూలీ సంఘం మహాసభలను 81 ఏప్రిల్ 20న తలపెట్టింది. జిల్లా గిరిజన రైతుకూలీ సంఘం అధ్యక్షుడు హనుమంతరావుకు సభ జరుపుకోవడానికి పోలీసులు మొదట అనుమతిచ్చారు. ఆ రోజు ఇంద్ర సంత. జిల్లా అంతటా రాష్ట్రమంత టా ఈ సభ గురించి విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇంద్ర నాలుగువైపుల నుంచి అడవి నుంచి కొండలమీంచి, లోయల నుంచి జనం చీమలదండుగా రావ డం ప్రారంభమైంది. ఆఖరి క్షణాన సభకు అనుమతి నిరాకరించినట్లు 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించినట్లు ప్రకటించి, వందలాదిమంది పోలీసులను దించి పోలీసు వాహనాలకు స్పీకర్లమర్చి సభకు ఎవరూ రావద్దని ప్రచారం మొదలుపెట్టారు.

తుడుందెబ్బ సమాచారం, నోటిమాట ప్రచారం తప్ప 144 సెక్షన్, నిషేధాజ్ఞలు అంటే తెలియని ఆదివాసులు ఈ పోలీసు ప్రకటనలు అర్థంకాక కొంత, పోలీసులు ఆఖరిక్షణలో అనుమతించడం లేదని తెలియక కొంత దాన్ని ఖాతరు చేయకుండా ఇంద్ర వైపుకు సాగివచ్చారు. పోలీసులు రోడ్లకు అన్నివైపులా మోహరించి, బస్సులు వాహనాలు నిలిపివేసి, చెట్లమీద తుపాకులు పెట్టుకొని కూర్చున్నారు. బస్సులో వచ్చేవాళ్లను ఇంద్ర దిగకుండా వెళ్లిపొమ్మన్నారు. దిగినవారిని అరెస్టు చేసారు. ఆ విధంగా ఇంద్ర చేరుకున్న ఆర్‌ఎస్‌యు ఉపాధ్యక్షుడు లింగమూర్తి, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు బి.జనార్దనరావు, కె.సీతారామరావు, ఎన్.వేణుగోపాల్‌ను అరెస్టుచేసి లాకప్‌లో పెట్టారు. లింగమూర్తి అప్పటికే ఎం.ఎ గోల్డ్‌మెడలిస్ట్. రీసెర్చ్ స్కాలర్. అయితే పోలీసులు అతన్ని ఆర్‌ఎస్‌యు ఉపాధ్యక్షుడంటే నమ్మలేదు. జనార్దనరావు, సీతారామరావు అప్పుడు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు. వేణుగోపాల్ వరంగల్ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి. లాకప్‌లో ఉన్న వీళ్ల కళ్లముందే పోలీసులు జనంపై నిర్విచక్షణగా కాల్పులు ప్రారంభించారు. ఆ కాల్పుల్లో ఎంతమంది ఆదివాసులు హతమయ్యారో, ఎంతమంది గాయపడినారో ఇప్పటికీ ఇదమిద్థంగా లెక్కలు లేవు. దేశం నలుమూలల నుంచి వచ్చిన నిజనిర్థారణ కమిటీలు, ఏపీసీఎల్‌సీ కనీసం 60 మందైనా ఈ కాల్పుల్లో మరణించి ఉంటారని భావించాయి. ప్రతి ఒక్కరు దీనిని జలియన్ వాలాబాగ్ మారణకాండతో పోల్చారు. అయితే ఈ మారణకాండ ప్రభుత్వానికి ఒక మాయనిమచ్చలా మిగిలిందే తప్ప ప్రజల నైతిక పోరాటశక్తిని ఏమాత్రం హరించలేకపోయింది.

ఇంద్రవెల్లి ఘటనతో మొదటిసారిగా దేశవ్యాప్తంగా ఆదివాసుల సమస్యలు, హక్కులు, పోరాటాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా ఒకప్పుడు గోండ్వానా ప్రజల కు ఉన్న స్వతంవూత రాజ్యం గురించి, చంద్రవంక గుర్తు ఉన్న రగల్‌జెండా గురించి, రాంజీగోండు, కొమురంభీంల పోరాటం గురించి, త్యాగం గురించి చర్చకు వచ్చిం ది. దేశంలోని మైదానవూపాంతమంతా మహానగరాలతో సహా అడవివైపు తలతిప్పి చూసే ఒక కుదుపువలె ఇంద్ర ఒక దర్శనీయ స్థలమైంది. పోరాట సంకేత మయ్యింది. ఇందుకు కారణం యాదృచ్ఛిక ఘటన కాదు. ఇది సద్యో (స్పాం సంఘటన కాదు. ఇంద్ర ఒక నిర్మాణ వూకమం, ఒక పోరాట క్రమం, ఒక ప్రాసెస్ ఉన్నాయి.అందుకే శత్రువు ఈ సభను అంత సీరియస్‌గా తీసుకున్నాడు. చట్టబద్ధమైన డిమాండ్ల కోసం కదలివచ్చిన వేలాది ఆదివాసుల చైతన్యం వెనుక విప్లవోద్యమం కృషి ఉన్నది.

విప్లవోద్యమ కృషిలో భాగమైన రాడికల్ విద్యార్థులు ప్రజల్లో మమేకమై చేసిన ప్రచారం ఉన్నది. అప్పటికే సాయిని ప్రభాకర్, నల్లా ఆదిడ్డి, మల్లోజుల కోటేశ్వరరావు, ముప్పాళ్ల లక్ష్మణరావు మొదలైనవాళ్లు, జగిత్యాల, సిరిసిల్లా, పెద్దపెలి,్ల కరీంనగర్ జిల్లాలోని ప్రాంతాల్లో పూర్తికాలపు విప్లవకారులుగా విప్లవోద్యమ నిర్మాణంలో ఉన్నారు.1976లో నాగపూర్‌లో తెలంగాణ రీజినల్ కమిటీ రూపొందించిన ʹరోడ్ టు రెవల్యూషన్ʹ (విప్లవానికి దారి) ప్రజాపంథా కార్యవూకమానికి 81 ఏప్రిల్ ఇంద్ర మధ్యన ఐదు సంవత్సరాల కృషి ఇది.

ఇందులో ఒక గుణాత్మక పరిణామం 1980 ఏప్రిల్‌లో సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్ ఏర్పడడం. ఈ విప్లవపార్టీకి జగిత్యాల జైత్రయాత్ర కేవలం ఒక ఆర్థిక విజయమే. దీని నుంచి ఒక రాజకీయ భవిష్యత్ కార్యవూకమాన్ని రూపొందించుకోవాలని రచించుకున్న దండకారణ్య పర్‌స్పెక్టివ్‌ను అమలు చేయడానికి మహారాష్ర్ట సిరొంచ అడవులకు అమరుడు పెద్దిశంకర్ నాయకత్వంలో ఒక దళం, మరో ఏడు దళాలు బస్తర్‌కు వెళ్లాయి, పెద్దిశంకర్ 80 నవంబర్ 2న సిరొంచ అడవుల్లో ʹఎన్‌కౌంటర్ʹలో అమరుడయి ఈనాటి దండకారణ్య ఉద్యమానికి తన నవ యవ్వన కవోష్ణ రక్తధారలతో చాలుపెట్టాడు. ఇదే కాలంలో సింగరేణి కార్మిక సమాఖ్య అమరులు శ్యాం, కట్ల మల్లేశ్, రమాకాంత్‌ల నాయకత్వంలో ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా అమరుడు గంజి రామారావు నాయకత్వంలో రైతుకూలీ సంఘం ఏర్పడింది. ఆదిలాబాదు జిల్లా గిరిజన రైతుకూలీ సంఘం ఇంద్ర ఏర్పాటుచేసిన సభానంతర, విషాదానంతర పోరాటానికి బహిరంగంగా రైతుకూలీ సంఘం నాయకత్వం, విప్లవోద్య మ మార్గదర్శకత్వం లభించాయి. అందుకే ఇంద్ర మారణకాండ నిప్పురవ్వ దావానలమయ్యే ఒక చారివూతక సంఘటన అయింది.

రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంజి రామారావు ఇంద్ర తన నివాసంగా మార్చుకొని ఇంద్ర ఆదివాసీ అమరుల జ్ఞాపకార్థం దేశంలోనే అపూర్వమైన స్థూపనిర్మాణం చేపట్టాడు. ఇందుకోసం చైనాకు వెళ్లి అక్కడ తీన్‌మీన్‌స్క్వేర్‌లో ఉన్న స్థూపాన్ని చూసి, అధ్యయనం చేసి తాను స్వయంగా నిలబడి 83 అడుగుల ఎత్తైన స్థూపాన్ని నిర్మాణం చేయించాడు.

ఇవన్నీ ఒక ఎత్తు. కొమురంభీం పునరావిష్కరణ మరో ఎత్తు. అప్పటికే ఆదిలాబా దు జిల్లా కమిటీ శ్యాం, గజ్జెల గంగారామ్ ల నాయకత్వంలో ఆదివాసీ జీవిత, పోరాటాల అధ్యయనానికి పూనుకున్నది. గజ్జెల గంగారామ్, సాహులు అప్పుడు దండకారణ్యంలో భాగమైన ఆదిలాబాదు అడవు ల్లో గోండుల మధ్య వాళ్ల భాష కూడ నేర్చుకొని వాళ్ల మధ్యన నిర్మాణాన్ని చేపట్టారు. గజ్జెల గంగారామ్ బెల్లంపల్లి బొగ్గుగని కార్మికుని కొడుకు. వరంగల్ రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి. నల్లా ఆదిడ్డి జమ్మికుంట కాలేజీ విద్యార్థి. సాహు పేరుతో ప్రసిద్ధుడైన శనిగరం వెంక కూడా జమ్మికుంట కాలేజీ విద్యార్థి.సాహు, అల్లం రాజయ్యలు కొమురం భీం 1940లలో చేసిన పోరాట అధ్యయనానికి పూనుకొని కేవలం నైజాం కాలపు దస్తావేజులు, చారివూతక ఆధారాల అధ్యయనమే కాకుండా కొమురం భీం సమకాలీనులను ఇంటర్వ్యూలు చేసి, ఆదిలాబాదు అడవుల్లో ఆదివాసుల్లో ఉన్న పురాణగాథలు, పాటలు సేకరించి చెంఘీజ్‌ఖాన్‌ను తలపించేదే కాదు, మరిపించేదయిన ఒక ప్రామాణిక చారివూతక నవలను రాసారు. అదే ʹకొమురంభీముʹ. 1983 ఏప్రిల్‌లో ఇంద్ర స్థూపావిష్కరణతో పాటు అదే వేదిక మీద కొమురంభీము నవల కూడా ఆవిష్కరింపబడింది.
ఇప్పుడు ఇంద్ర అమరులైన ఆదివాసులు విడిగా సంస్మరించుకోబడరు. అంటే జోడేఘాట్ నుంచి ఇంద్ర దాకా అది ఒక పోరాట సంప్రదాయం.

అది బాబేఝరీ.ʹమావూళ్లో మా రాజ్యంʹ సాధించుకోవడానికి ఆదివాసులు తలపెట్టిన స్వీయగౌరవ పోరాటం. కొమురం భీము కాలంలో పన్నెండూళ్లపై అధికారం కోసం ʹమావూళ్లో మారాజ్యంʹ కోసం ప్రారంభమైన పోరాటం. ఇంద్ర నుంచి ఈనాటి వరకు సామ్రాజ్యవాద భూస్వామ్య దళారీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జల్‌జంగిల్ జమీన్‌లపై అధికారం కోసమే కాదు, దండకారణ్యంలో ప్రత్యామ్నాయ ప్రజా రాజ్యాధికార ʹజనతన సర్కార్లʹ నిర్మాణం వరకు పురోగమించాయి. ఈ క్రమంలో ఒకప్పటి స్వతంత్ర గోండ్వానా రాజ్యాలు, రాంజీగోండు వంటి నేటి విప్లవకారులు,రగల్‌జెండాలు పూర్తి విప్లవ సంప్రదాయంతో స్మరించుకోబడుతున్నాయి. బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఉరికంబం ఎక్కించిన రాంజీ పేరును దండకారణ్యంలో విప్లవోద్యమ నిర్మాణంలో కీలకభూమిక నిర్వహించిన మల్లోజుల కోటేశ్వరరావు స్వీకరించాడు. ఇప్పుడు దండకారణ్యంలో వందేళ్ల క్రితం గూండాదర్ నాయకత్వంలో జరిగిన బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక భూంకాల్ పోరాటాన్ని స్మరించుకోవడమే కాదు భూంకాల్ మిలీషియాను నిర్మించుకొని శత్రు శిబిరాలపై మెరుపుదాడులు చేసి చింతల్నార్‌లను సృష్టిస్తున్నారు.

చంద్రవంక గుర్తుగల రగల్‌జెండా ఇపుడు దండకారణ్యంలో దళిత ఆదివాసీ విప్లవకర వర్గాల రెండు నక్షవూతాల ఎర్రజెండాయై ఎగురుతున్నది. ఇంద్ర ఈ విధంగా గత వర్తమానాల సంభాషణగా చరిత్ర నిర్మాణంలో ఒక భవిష్యత్ దార్శనికతకు వెలుగుజాడ అయింది.

ఇంద్ర మారణకాండ జరిగి ఇప్పటికి ముఫ్పైరెండేళ్లు. ఇప్పటికీ ఇంద్ర శత్రువుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. ప్రతి ఏప్రిల్ 20న ఆప్రాంతాల్లో 144సెక్షన్ విధించి గుడిహత్నూర్ నుంచి లక్షెట్టిపేట దాకా రోడ్డు పోలీసు పహారాపెడతాడు. ఏప్రిల్ 20 కన్న ముందు ఉట్నూరు పరిసర ప్రాంతాలన్నీ గాలింపు చేస్తాడు. అయినా సరే ఇంద్ర మాత్రమే కాదు ఆరోజు జోడేఘాట్, ఉట్నూరు మొదలైన అన్ని అటవీ ప్రాంతాల్లో గూడాల్లో ఇంద్ర అమరులను జోడేఘాట్ అమరులతో సహా స్మరించుకుంటారు. ఇవ్వాళ కొమురం భీము ఆదివాసీ ఆత్మగౌరవానికే కాదు, తెలంగాణ ఆత్మగౌరవానికి, విప్లవస్ఫూర్తికి సంకేతమయ్యాడు. మావూళ్లో మారాజ్యానికి, మా తెలంగాణలో మా స్వపరిపాలనకు, మా విప్లవ ప్రాంతాల్లో మా జనతన సర్కార్లకు సంకేతమయ్యాడు. ఈ పునరావిష్కరణ చేసింది ఇంద్ర విప్లవోద్యమం. ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమం, ఆదివాసీ ఆత్మగౌరవ పోరాటాలు.

కనుక ఇంద్రవెల్లి గతం కాదు. ఇవ్వాళ ఆదిలాబాదు జిల్లాలో ఆదివాసుల పోరాటాలకు, పులుల అభయారణ్యం వ్యతిరేక పోరాటాలకు, ఓపెన్‌కాస్ట్ వ్యతిరేక పోరాటాలకు, ప్రత్యేక తెలంగాణ ప్రజాస్వామిక పోరాటానికి ఈ పోరాటాన్నీ అంతర్లీనం కావల్సిన విప్లవోద్యమానికి ఇంద్ర పాల ఇంద్ర స్మరించుకోవడమంటే ఏప్రిల్20న ఆదిలాబాదు అడవుల్లో చెట్లపైనుంచి ఎగిరే పాలపిట్టలను పలకరించడం. చెట్లతొపూరల్లో దాచిన ఆయుధాలను అందుకోవడం. ఇంద్ర మీదుగా పయనమైపోయిన దండును దండకారణ్యం నుంచి ఆవాహన చేసుకోవడం. అక్కడి క్రాంతికారీ జనతన సర్కార్ ఆదేశాలను, ఆదర్శాలను, ఆకాంక్షలను ఇక్కడి ప్రజాపోరాటాల్లోకి అనువదించుకోవడం. ముఖ్యంగా గోదావరీ, ప్రాణహిత, శబరి, ఇంద్రావతీ నదుల పొడుగునా మోహరించిన పారామిలిటరీ బలగాలు, పోలీసుక్యాంపులు, దాడులు, గృహదహనాలు, ఎన్‌కౌంటర్ల నుంచి ఆదివాసుల హననాన్ని, విధ్వంసాన్ని అడ్డుకునే విశాల ఐక్య వూపజా సంఘటనను నిర్మాణం చేయడం. ఇంద్ర నుంచి సాత్నాల వరకు ఆదివాసుల పోరాటాలకు బాసటగా నిలిచిన విశాల ప్రజారాశుల ప్రజాస్వామిక పోరాటాలను ఒక జ్వాజ్వల్యమైన కాగడాగా ఎత్తి ʹలే మషాలా లే చలేంగేʹ అని పాడుతూ వెలుగులవైపుగా ప్రస్థానం చేస్తామని ప్రతిజ్ఞ చేయడం. ఇంద్రవెల్లి ఇవ్వాల్టి ప్రాసంగికత ఇదే.
- వరవరరావు

Keywords : idravelli, telangana, maoists, varavararao, Revolution, adivasi, adilabad
(2018-08-13 12:39:55)



No. of visitors : 1257

Suggested Posts


తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

మందుపాతరలతో దాడి చేశాం అని ఒప్పుకున్నారు కదా..ఇది యుద్దం అని ప్రకటించండి - పాలకుల‌కు వరవరరావు సవాల్

మందుపాతరలు ఉపయోగించాం అని పోలీసు అధికారులే చెప్పారు కాబట్టియుద్దం చేస్తున్నామని ప్రకటించండి. ఇది యుద్దక్షేత్రమని మీరు ఒప్పుకోండి మరో దేశం మీద యుద్దంజరిగితే ఏం జరగాలో అదే ఇక్కడా జరగాలి. రెడ్ క్రాస్ రావాలల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ ఆమ్నెస్టీ రావాల్సి ఉంటుంది. జెనీవా సూత్రాలను అంగీకరించాల్సి ఉంటుంది.

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

తూత్తుకుడి... గడ్చిరోలీ - వరవరరావు

రాగి కంపెనీ మూతపడకుండా నా బిడ్డ అంత్యక్రియలు చేయనని ఒక తల్లి ప్రతిఙ చేసింది. పదమూడు కుటుంభాలు పట్టుబట్టాయి. ప్రజలు వాళ్ళకు అండగా ఉన్నారు. నీ పక్క గదిలో శవం కుళ్ళుతూ ఉంటే వచ్చే దుర్వాసన ఇంకెంత మాత్రం ప్రైవేటు వ్యవహారం కాదంటాడు సర్వేశ్వర్ దయాల్ సక్సేనా అనే హిందీ కవి.

కూతురుకు... జి.ఎన్‌.సాయిబాబా జైలు లేఖ

ప్రియమైన మంజీర మనకిప్పుడు మరింత స్వేచ్ఛ లభించింది ఆ రోజు రోహిత్‌ వేముల తనకు తాను ఉరి వేసుకొని ʹనేను నా గుర్తింపుకు కుదించబడకూడదʹని ప్రకటించిన నాడు...

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ పై ఢిల్లీ లోహత్యా యత్నం...ఇది సంఘ్ పరివార్ పనేనన్న ప్రజా సంఘాలు
ఓ అమ్మాయికి రక్షణగా నిల్చినందుకు దళిత యువకుడిని కొట్టి చంపిన ఉగ్రకుల మూక‌ !
IIT Bombay Students Question Decision to Invite Modi to Convocation Ceremony
అగ్రకులోన్మాదం:దళితుడిని పెళ్ళి చేసుకున్నందుకు కూతురును హత్య చేసిన తండ్రి!
అది ఎన్ కౌంట‌ర్ కాదు, మావాళ్ల‌ను వెంటాడి చంపేశారు‍: బోరుమ‌న్న ఆదివాసీలు
మరణశిక్ష - రాజ్యాంగమే ఆమోదించినపుడు రాజ్యం ఊరుకుంటుందా? - వరవరరావు
రాపూర్ దళితులపై దుర్మార్గమైన దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి - విరసం
ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ
మోడీ రాజ్యం: మోసాన్ని బహిర్గతం చేసినందుకు ఉద్యోగాలు పోగొట్టుకున్న‌జర్నలిస్టులు !
people organise rally in national capital in protest against the state high handedness on rights activists
Martyrs Week: Maoists organise Huge meeting in Malkangiri
తెలంగాణొస్తే ఏమొచ్చింది ? - ‍ ఎన్.వేణు గోపాల్
అమరుల సంస్మరణ సభను జరుపుకున్న వేలాది మంది ఆదివాసులు
Historic Eight Documents of Charu Majumdar (8th Document)
Historic Eight Documents of Charu Majumdar (7th Document)
Historic Eight Documents of Charu Majumdar (6th Document)
Historic Eight Documents of Charu Majumdar (5th Document)
Historic Eight Documents of Charu Majumdar (4thDocument)
Historic Eight Documents of Charu Majumdar (3rd Document)
Historic Eight Documents of Charu Majumdar(2nd Document)
Historic Eight Documents of Charu Majumdar (1st Document)
చేపలమ్ముకుంటూ చదువుకోవడమే నేరమయ్యింది !
ఎర్ర బారిన మన్యం... ర్యాలీలు, సభలతో అమరులకు నివాళులు అర్పించిన జనం
రేపటి నుండి అమరుల సంస్మరణ వారోత్సవాలు.. పల్లె పల్లెనా మోహరించిన పోలీసు బలగాలు
ఎక్కువమంది పిల్లలను కనాలన్న హిట్లర్ వారసుల పిలుపు ఎవరిపై దాడుల కోసం?
more..


ఇంద్రవెల్లి