మెకనాస్ గోల్డ్ కోసం మనుషుల వేట - వరవరరావు


మెకనాస్ గోల్డ్ కోసం మనుషుల వేట - వరవరరావు

మెకనాస్

(విప్లవ రచయిత వరవరరావు రాసిన‌ ఈ వ్యాసం వీక్షణం ఏప్రెల్ 2018 సంచికలో ప్రచురించబడినది)

ఈసారి ఎండలు శివరాత్రి దాకా కూడా ఎదురు చూడలేదు. ఉగాది వసంతం కన్నా ముందే ఉగ్రగ్రీష్మం అడవిలో నిప్పులవాన కురిసింది. అది దక్కన్‌ పీఠభూమి నదుల్లోకి నీళ్లు తెచ్చేది కాదు. కన్నీళ్లు తెచ్చేది. నెత్తుర్లు పారించేది. నెత్తుర్లను సలసల రగిలించేది. గుండెలవిసి పోయే సంఘటనలు. గుండెలు ఇంద్రావతి, శబరి, గోదావరి పరీవాహ ప్రాంతంలో నెర్రెలు వారిన రేగడి నేలల్లో వెర్యుు ముక్కలై పరచుకొని వేనోళ్ల నినదించిన కాలం.

మార్చ్‌ 2 తెలంగాణ ఛత్తీస్‌ఘడ్‌ సరిహద్దుల్లో చర్ల-బీజాపూర్‌లో పదిమంది అమరులయ్యారు. వాళ్లలో స్వామి (ప్రభాకర్‌ - వరంగల్‌) తప్ప అందరూ ఆదివాసులు. ఏడుగురు మహిళలు. ఏబై వసంతాలు పూర్తి చేసుకున్న నక్సల్బరీ నేపథ్యంలో, చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం ఇచ్చిన స్ఫూర్తితో మహత్తర చర్చ (గ్రేట్‌ డిబేట్‌) ముగిసి మెన్షివిజాన్ని మట్టికరిపించిన బోల్షివిక్‌ పార్టీ నిర్మాత లెనిన్‌ నూరేళ్ల పుట్టినరోజు (ఏప్రిల్‌ 22న) ఎనభై దేశాల్లో ఏర్పడిన సిపిఐ (ఎంఎల్‌) ఏభయ్యవ ఆవిర్భావ దినం ప్రారంభమైన రోజు గడ్చిరోలి జిల్లా బోరియా అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగి ఇప్పటికే 16 మంది మావోరుుస్టులు చనిపోయారు. ఈ సంఖ్య ఇంకా పెరుగొచ్చని, మావోరుుస్టులు ప్రతిదాడులకు పాల్పడే అవకాశం ఉన్నందున గాలింపు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంటే ఇది ఏకపక్ష దాడి అని. భామ్రాగడ్‌ తాలూకాలోని తాడ్‌గడ్‌కు సమీపంలోని అడవుల్లో పెరిమిలి దళం సమావేశం అరుుందనే పక్కా సమాచారంతో మహారాష్ట్ర నక్సల్స్‌ కార్యకలాపాల వ్యతిరేక పోలీసు బృందం సి-60 కమాండోలు ఈ దాడి చేశారు. ఈ సమాచారం ద్రోహి ఇచ్చిందే కావచ్చు. మీడియాలో వస్తున్నట్లు సెటిలైట్‌ సహాయంతో మావోరుుస్టుల కదలికలను కనిపెట్టినందు వల్ల కావచ్చు.

ఇప్పటికే కేంద్ర అర్ధసైనిక బలగాలు (సిఆర్‌పిఎఫ్‌, బిఎస్‌ఎఫ్‌ మొదలైనవి) ఆయా రాష్ట్రాలు ఏర్పాటు చేసిన సి-60, గ్రేహౌండ్స్‌ వంటివి మానవరహిత ఇజ్రారుుల్‌ యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను, డ్రోన్‌ కెమెరాలను, జార్ఖండ్‌ వంటి అటవీ ప్రాంతంలో కార్గిల్‌ యుద్ధంలో వాడిన రాకెట్‌ లాంచర్‌లను కూడా మావోరుుస్టుల పేరుతో మావోరుుస్టులనే కాదు ఆదివాసులను కూడా వందల సంఖ్యలో గాలింపు చర్యలు, ఎన్‌కౌంటర్‌ల పేరుతో చంపడానికి ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు తాజాగా శాటిలైట్‌ (ఉపగ్రహం) తీసిన ఫొటోల సహాయంతో ఇంద్రావతి నది ఒడ్డున మావోరుుస్టుల కదలికలను పోల్చుకొని మరి రెండు సి-60 బలగాలను రప్పించుకొని దాడిచేశారని మీడియా కథనాలు. గతంలో నల్లమల అడవుల్లో అప్పటి అవిభక్త ఎపి కమిటీ కార్యదర్శి మాధవ్‌, అతని ఎనిమిది మంది సహచరులను కూడా నిమ్మిచెట్టు లోయలో నడుస్తుండగా ఇట్లాగే శాటిలైట్‌ ఫొటోలతో కనిపెట్టి చంపారని వార్తలు వచ్చారుు. అరుుతే ఇటువంటి ప్రచారాలు - ద్రోహులు, కోవర్టులు ఇచ్చిన సమాచారంతో కాదని చెప్పడానికి - మంద్రస్థారుు యుద్ధంలో భాగంగా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఏకకాలంలో భౌతిక స్థారుులోనే కాకుండా మానసిక స్థారుులో కూడా నిర్వహించే సైకలాజికల్‌ వార్‌.

అంతకన్నా ముఖ్యంగా ఈ మూడు నదుల పరీవాహ ప్రాంతంలోనే కాదు, తూర్పు, మధ్య భారతాల్లో - ముఖ్యంగా జార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర, ఎఒబి, తెలంగాణ, ఆంధ్రల అటవీ సరిహద్దుల్లో జరుగుతున్న అన్ని ఎన్‌కౌంటర్లలో కూడా నూటికి తొంబై మంది ఆదివాసులే. వాళ్లు మావోరుుస్టు పార్టీ సభ్యులు, దళ సభ్యులు, మిలిషియా, గ్రామ రక్షక దళాలు, దండకారణ్య ఆదివాసీ క్రాంతికారీ మహిళా సంఘటన్‌కు చెందిన వాళ్లు కావచ్చు. జనతన సర్కార్‌ ఏరియాలలో నివసించే ఆదివాసులు కావచ్చు. బహుళజాతి కంపెనీలు భారీ ఎత్తున తలపెట్టిన మైనింగ్‌, రైల్వే లైన్లు, భారీ నీటి ప్రాజెక్టులు, ఉక్కు ఫ్యాక్టరీల నిర్మాణాలు, బేస్‌ క్యాంపులు, అడుగడుగునా ఉన్న పోలీసు క్యాంపుల దగ్గర నివసించే సాధారణ ఆదివాసులు కావచ్చు. కనుకనే మనకు చాలా సందర్భాల్లో డివిజన్‌ స్థారుు నుంచి జిల్లా పైస్థారుు నాయకుల పేర్లు, అందులోనూ ఆదివాసేతరుల పేర్లే తప్ప ఆదివాసుల పేర్లు కూడా పూజారి కాంకేడ్‌ ఎన్‌కౌంటర్‌ సంఘటనలో వలె మావోరుుస్టు పార్టీ ప్రకటిస్తే తప్ప తెలియవు. మావోరుుస్టు పార్టీ స్థానిక ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి పెడితే తప్ప, స్థానిక ఆదివాసీ ప్రజలు వందల సంఖ్యలో పోలీసు స్టేషన్ల ముందు ధర్మాలు చేస్తే తప్ప వాళ్ల మృతదేహాలు కూడా అప్పగించరు.

వూజారి కాంకేడ్‌ ఎన్‌కౌంటర్‌లో స్వామి (ప్రభాకర్‌) మృతదేహాన్ని ప్రజాసంఘాల, అమరుల బంధుమిత్రుల సంఘం సహాయంతో ఆయన కుటుంబ సభ్యులు తెచ్చుకున్నా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి శవాగారంలో మిగిలిన ఆదివాసుల మృతదేహాలను బీజాపూర్‌, సుకుమా జిల్లాలలో ఆ అమరుల గ్రామాల ప్రజల ఆందోళన వల్లనే చర్లకు అటు ఇటు ఉండే ప్రజాప్రతినిధులు కదిలి వాళ్ల కుటుంబ సభ్యులకు అప్పగించక తప్పలేదు. అవన్నీ జనతన సర్కార్‌ గ్రామాలు కావడం వల్ల అమరుల ప్రతి గ్రామంలో అంతిమ యాత్రలు సంస్మరణ సభలు జరిగారుు.

కాని ప్రకృతి సంపదను బహుళజాతి కంపెనీలకు దోచిపెట్టడానికే దళారీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, భీకరమైన ఆయుధాలతో, విస్తృతమైన సమాచార నెట్‌వర్క్‌తోనైనా సరే చేస్తున్న నిర్విచక్ష దాడుల్లో అమరులవుతున్న ఆదివాసుల పేరు, ఊరు తెలియడం కూడా కష్టం. ఈ ఎండలకు అడవిలో అమానుష నిర్లక్ష్యానికి గురరుున మృతదేహాలు కూడా మాంసపు ముద్దలుగా చూసినపుడు కన్నపేగులరుునా, కట్టుకున్న వారరుునా, కన్నబిడ్డలైనా పోల్చుకోవడం కష్టం.

భామ్రాగడ్‌లో గాలింపు చర్యలకు పొరుగున ఉన్న తెలంగాణ, ఛత్తీస్‌గడ్‌ పోలీసు బలగాలను రప్పించినట్లు, ఎన్‌కౌంటర్‌ కూడా కొనసాగుతున్నట్లు, మృతుల సంఖ్య 25కు పెరుగవచ్చునని కూడా మహారాష్ట్ర పోలీసు అధికారి చెప్పాడు.

23వ తేదీ సోమవారం మధ్యాహ్నం గడ్చిరోలీ చేరుకున్న ఒక ఛానెల్‌ రిపోర్టర్‌ను తాజా సమాచారం కోసం అడిగితే పదహారు మృతదేహాలను మండుతున్న ఎండల్లో మీడియా ప్రతినిధులు చూడడానికి పడేసారని, అందులో ఇప్పటికైతే చల్లగరిగె విజేందర్‌ను మాత్రమే పోల్చుకున్నారని చెప్పాడు. అతని మృతదేహాన్ని రక్తబంధువులకు, స్థానిక ప్రజలకు అప్పగిస్తే ఈ సాయంత్రానికే వాళ్లు తిరిగి రావచ్చు. పోలీసులు ఇచ్చే సమాచారం ప్రకారమే మిగతా పదిహేను మందిలో ముగ్గురు మహిళలతో సహా అందరూ ఆదివాసులే. వారిలో సాయినాథ్‌ (34) అనే ఆదివాసీ కూడా డివిజన్‌ స్థారుుకి ఎదిగిన వాడని కూడా పోలీసులే చెప్పారు. మరొక ఆదివాసీ మావోయిస్టు రాజేశ్‌ను కూడా గుర్తించినట్లు చెప్పారు.

సంఘటనా స్థలంలో మూడు ఎకె-47లు, భారీ ఎత్తున పేలుడు సామగ్రి, విప్లవ సాహిత్యం పోలీసులకు దొరికిందన్న దానిని బట్టే అక్కడ నాయకత్వ స్థాయి వాళ్లు ఉన్నారని చెప్పడం తప్ప పోలీసులు రెండు రోజులు గడిచినా వారి పేరు, ఊరు వంటి గుర్తింపులే ప్రకటించలేక పోతున్నారు. ఇది ఉద్దేశపూర్వకమూ కావచ్చు. లేదా ఇద్దరు డివిజన్‌ స్థాయి నాయకులు, మరొకరు మినహా మిగిలిన వారంతా పార్టీ పిలుపుపై గానీ, పార్టీని కలవడానికి గానీ వచ్చిన సాధారణ ప్రజలు కావచ్చు. సి-60 కమాండోలు అక్కడ సంచరిస్తున్న సాధారణ ప్రజలపై అనుమానంతో కాల్పులు జరిపి ఎన్‌కౌంటర్‌ ప్రకటించడమూ కావచ్చు.

ఎన్‌కౌంటర్‌ ప్రకటించిన రెండవ రోజు ఏప్రిల్‌ 23న కూడా మృతదేహాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు ఇంకా జరుగు తున్నాయని, భారీ వర్షాలు వాటికి అడ్డంకిగా ఉన్నాయంటున్నారు. అడవిలో వర్షాలు - బయట బండలు పగిలే ఎండలు!

ఏభై రోజుల్లో రెండో అతిపెద్ద ఎన్‌కౌంటర్‌ గురించి ప్రజలు ఆందోళన చెందుతూ వివరాల కోసం, గుర్తింపు కోసం, మృతదేహాలను రక్త బంధువులకు అప్పగించడం కోసం తీవ్ర ఆందోళనకు, నిరీక్షణకు గురవుతుండగానే గడ్చిరోలి జిల్లాలోనే రాజారాం ఖాండ్లా అడవిలోని జిమాల్‌ గుట్ట ప్రాంతంలో సోమవారం ఏప్రిల్‌ 23న మరో ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు, అందులో ఎంత మంది మరణించారో కచ్చితంగా చెప్పలేకపోరుునా కనీసం నలుగురు మరణించారని ఐజి చెప్పాడు.

ఛత్తీస్‌ఘడ్‌ సుకుమా జిల్లాలో పూస్‌పాల్‌ సమీపంలో ఏప్రిల్‌ 22 ఆదివారం రాత్రి మరో ఎన్‌కౌంటర్‌ జరిగిందని అందులో ఐదుగురు మావోయిస్టులు మరణించారని మరో వార్త.

ఎన్‌కౌంటర్లు ఎన్నయినవి? ఆది, సోమవారాల్లో, ఏప్రిల్‌ 22, 23 తేదీల్లోనే ఒకటి, రెండు, మూడు.

ఎందరు మరణించారు? 16+4+5=25

ఎందర్ని గుర్తించారు? పోలీసులైతే ముగ్గుర్ని - మృతుల కుటుంబా లలో ఒక్క విజేందర్‌ కుటుంబం మాత్రమే అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లగలిగింది.

విజేందర్‌ పేద దళిత కుటుంబం నుంచి ఆర్‌వైఎల్‌లోకి వచ్చి గాజర్ల సోదరుల ప్రభావంతో విప్లవోద్యమంలోకి ఇరవై ఏళ్ల క్రితం వెళ్లి డివిజన్‌ స్థారుు నాయకుడయ్యాడు. రెండో డివిజన్‌ కమిటీ నాయకుడు సారుునాథ్‌ ఆదివాసీ. అతనితోపాటు రాజేశ్‌ పేరు మాత్రమే పోలీసులు ప్రకటించారు. మిగతా ఇరవై ముగ్గురు ఆదివాసులు కేవలం సంఖ్య. ఊరు, పేరు ఇప్పటికైతే తెలియదు. మనుషులకు, ఆదీవాసీ మానవులకు ఎంత గుర్తింపు? బహుశా వీళ్లు ఓటర్ల జాబితాలో కూడా ఉండరు. ఆధార్‌ కార్డులూ ఉండవు.

కశ్మీర్‌లో ఇటువంటి స్థితినే అభివర్ణిస్తూ ఇన్షా మాలిక్‌ అనే కవరుుత్రి ʹబాధితులుʹ అనే గుర్తింపు సభ్య సమాజం నుంచి నిరాకరిస్తూ ఒక కఠోర వాస్తవాన్ని కవితా రూపంలో వ్యక్తపరుస్తుంది. కశ్మీరులో అనునిత్యం, ప్రతిక్షణం అమలవుతూ అతి సాధారణమని భావించబడుతున్న హింస గురించి టివి స్టూడియోలో విశ్లేషణలు, రాజ్య ఆమోదిత చర్చలు, నిషేధిత ప్రసంగాలు ఏవీ ప్రజల నైసర్గిక హృదయ స్పందనలను, ఆక్రోశ, ఆగ్రహాలను పట్టుకోలేక పోతున్నాయని, భావోద్వేగ వాహిక అరుున కవిత్వమైనా పట్టుకోగలదేమో ప్రయత్నించాలి అంటుంది.

(నాట్యానికి) ఇద్దరు చాలా ఇద్దరు చాలా?

త్వరలో నువ్వు గ్రహిస్తావు ముగ్గురు కావాలని

కనురెప్పలు కొట్టే ఇంతలోనే

అది నెత్తురోడుతున్న

బీభత్స శరీరాల గుట్ట అవుతుంది

వర్తులాకారంగా తిరుగుతున్న

కెమెరాల ముందు

పూర్తి నగ్నంగా

మామూలు కన్ను చూడలేనంతగా

ప్రపంచం

రాజ్యానంద నృత్యాలకు

మౌనసాక్షిగా మిగులుతుంది

ఇక్కడ, ఇక్కడే

జాతి

తన నిధులను వెతుక్కోవడానికి

వస్తుంది

ఈ కవితకు ఒక తాజా కలం ఉంది. ʹఖాజీ గుండ్‌ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మరణించారు అని విన్నప్పుడు మృతుల సంఖ్య 46. ముగ్గురని విన్నప్పుడు...

ఇది బుర్హాన్‌ వనీని ఎన్‌కౌంటర్‌ పేరుతో భారత సైన్యం కాల్చినప్పుడు రాసిన కవిత. ఇక్కడి నుంచీ వరుసగా ఆమె ʹమృత్యువు గురించి ఒక కవితʹ అని రాస్తూ అన్నిటికీ తాజాకాలం రాస్తూ వచ్చింది. ఎందుకంటే కవిత తడి ఆరక ముందే భారత మీడియాలో సైన్యం కాలుస్తున్న కశ్మీరీల మరణాల వార్తలు - హృదయం లేని వార్తలు తాజాకలాలను కూడా కాలం చెల్లినవిగా మార్చినవి.

నేనూ ఈ కథనాన్ని ఈ కశ్మీరీ కవితతో ముగించాలనుకుంటున్నాను. ముగించాను కూడా.

కశ్మీరయినా, దండకారణ్యమైనా రాజ్య మృత్యుహేల ఇంతే. మృత్యు పదఘట్టనల కింద ప్రాణాలు కోల్పోయే మనుషుల సంఖ్య పెరుగుతూ పోవడం తప్ప మార్పేమి ఉంటుంది... అని.

ఎన్‌డిటివి నుంచి ఫోన్‌ - మృతుల సంఖ్య 33 అని. మూడు చోట్ల ఎన్‌కౌంటర్ల మృతుల సంఖ్య కలసినా - అంత కాదు. ఉదయమే ఫోన్‌లో అమెరికా నుంచి ఒక మిత్రుడు అంతే ఆవేదనతో ఈ మూడు ఎన్‌కౌంటర్ల గురించి తాను అన్ని తెలుగు పత్రికలు చదివి కలిపి లెక్కేసి చెప్పిన సంఖ్య కన్నా ఇది ఎక్కువ. అది 25, అంటే ఇంకా ఎనిమిది ఎక్కువ. ఆ సంఖ్య అక్కడ కూడా ఆగలేదు. మధ్యాహ్నం 3.30 గంటలకు అది నలభై (40)కి చేరుకున్నది. గాలింపు చర్యలు, ఎన్‌కౌంటర్లు కొనసాగుతూ ఉన్నారుు గనుక పెరుగనూవచ్చు.

ఎంతయితే ఏమిటి? సంఖ్యనే కదా. మావోయిస్టులైనా ఆదివాసులే కదా. ఆదివాసులైనా మావోయిస్టులే కదా. అడవి మనుషులకు, దేశద్రోహులకు దేశపటంలో చోటుందా? దేశభక్తుల పటంలో చోటుందా?

విలువరుున ప్రకృతి సంపదకు తప్ప, విలువలేని మానవ శ్రమకు తప్ప పాలకులకు, రాజ్యానికి, కంపెనీలకు మనుషుల, ఆదివాసీ మనుషుల ప్రాణాల పట్ల విలువ ఉందా? జాతి ఇక్కడికి మెకనాస్‌ గోల్డ్‌ అన్వేషణలో వస్తుంది. మనుషుల్ని చంపి అరుునా అడ్డు తొలగించుకోవడానికి.
-వరవరరావు
(రచయిత విరసం వ్యవస్థాపక సభ్యులు)

Keywords : maoists, varavararao, gadchiroli, fake encounter
(2018-08-16 03:35:30)No. of visitors : 1432

Suggested Posts


తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

మందుపాతరలతో దాడి చేశాం అని ఒప్పుకున్నారు కదా..ఇది యుద్దం అని ప్రకటించండి - పాలకుల‌కు వరవరరావు సవాల్

మందుపాతరలు ఉపయోగించాం అని పోలీసు అధికారులే చెప్పారు కాబట్టియుద్దం చేస్తున్నామని ప్రకటించండి. ఇది యుద్దక్షేత్రమని మీరు ఒప్పుకోండి మరో దేశం మీద యుద్దంజరిగితే ఏం జరగాలో అదే ఇక్కడా జరగాలి. రెడ్ క్రాస్ రావాలల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ ఆమ్నెస్టీ రావాల్సి ఉంటుంది. జెనీవా సూత్రాలను అంగీకరించాల్సి ఉంటుంది.

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

తూత్తుకుడి... గడ్చిరోలీ - వరవరరావు

రాగి కంపెనీ మూతపడకుండా నా బిడ్డ అంత్యక్రియలు చేయనని ఒక తల్లి ప్రతిఙ చేసింది. పదమూడు కుటుంభాలు పట్టుబట్టాయి. ప్రజలు వాళ్ళకు అండగా ఉన్నారు. నీ పక్క గదిలో శవం కుళ్ళుతూ ఉంటే వచ్చే దుర్వాసన ఇంకెంత మాత్రం ప్రైవేటు వ్యవహారం కాదంటాడు సర్వేశ్వర్ దయాల్ సక్సేనా అనే హిందీ కవి.

కూతురుకు... జి.ఎన్‌.సాయిబాబా జైలు లేఖ

ప్రియమైన మంజీర మనకిప్పుడు మరింత స్వేచ్ఛ లభించింది ఆ రోజు రోహిత్‌ వేముల తనకు తాను ఉరి వేసుకొని ʹనేను నా గుర్తింపుకు కుదించబడకూడదʹని ప్రకటించిన నాడు...

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

News from the revolutionary movement in Manipur
మేం ప్రశ్నిస్తాం, తర్కిస్తాం, వాదిస్తాం, విభేదిస్తాం..ఇదే జేఎన్‌యూ ప్రత్యేకత ‍- ఉమర్ ఖలీద్
Maoist leader Shyna released on bail
జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ పై ఢిల్లీ లోహత్యా యత్నం...ఇది సంఘ్ పరివార్ పనేనన్న ప్రజా సంఘాలు
ఓ అమ్మాయికి రక్షణగా నిల్చినందుకు దళిత యువకుడిని కొట్టి చంపిన ఉగ్రకుల మూక‌ !
IIT Bombay Students Question Decision to Invite Modi to Convocation Ceremony
అగ్రకులోన్మాదం:దళితుడిని పెళ్ళి చేసుకున్నందుకు కూతురును హత్య చేసిన తండ్రి!
అది ఎన్ కౌంట‌ర్ కాదు, మావాళ్ల‌ను వెంటాడి చంపేశారు‍: బోరుమ‌న్న ఆదివాసీలు
మరణశిక్ష - రాజ్యాంగమే ఆమోదించినపుడు రాజ్యం ఊరుకుంటుందా? - వరవరరావు
రాపూర్ దళితులపై దుర్మార్గమైన దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి - విరసం
ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ
మోడీ రాజ్యం: మోసాన్ని బహిర్గతం చేసినందుకు ఉద్యోగాలు పోగొట్టుకున్న‌జర్నలిస్టులు !
people organise rally in national capital in protest against the state high handedness on rights activists
Martyrs Week: Maoists organise Huge meeting in Malkangiri
తెలంగాణొస్తే ఏమొచ్చింది ? - ‍ ఎన్.వేణు గోపాల్
అమరుల సంస్మరణ సభను జరుపుకున్న వేలాది మంది ఆదివాసులు
Historic Eight Documents of Charu Majumdar (8th Document)
Historic Eight Documents of Charu Majumdar (7th Document)
Historic Eight Documents of Charu Majumdar (6th Document)
Historic Eight Documents of Charu Majumdar (5th Document)
Historic Eight Documents of Charu Majumdar (4thDocument)
Historic Eight Documents of Charu Majumdar (3rd Document)
Historic Eight Documents of Charu Majumdar(2nd Document)
Historic Eight Documents of Charu Majumdar (1st Document)
చేపలమ్ముకుంటూ చదువుకోవడమే నేరమయ్యింది !
more..


మెకనాస్