ఐసిస్ చేరాలంటూ బ్యానర్లు కట్టిన బీజేపీ కార్యకర్తల అరెస్టు !


ఐసిస్ చేరాలంటూ బ్యానర్లు కట్టిన బీజేపీ కార్యకర్తల అరెస్టు !

ఐసిస్

దేశంలో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి పబ్బంగడుపుకుంటున్న‌ చెడ్డీ గ్యాంగ్ తమ మతోన్మాద ఎజెండా అమలు చేయడం కోసం ఎంతకైనా తెగిస్తోంది. ఐసిస్ లో చేరాలంటూ పోస్టర్లు, బ్యానర్లు వేసి హిందువులను రెచ్చగొట్టేందుకు ఆగ్యాంగ్ వేసిన ఎత్తుగడలు బహిర్గతమయ్యాయి.
అస్సాంలో అధికార బీజేపీ నేతలు ప్రజల్లో అలజడి సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఐఎస్‌ఐఎస్‌లో చేరాలంటూ తెలుపుతున్న ఓ జెండాను చెట్టుకు కట్టిన‌ బీజేపీ కార్యకర్తలు ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈనెల 3న రాష్ట్రంలోని నల్బరి జిల్లా కోయిహటాలో చెట్టుకు ఒక జెండా కట్టి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులు సమాచారమందించారు. ఐఎస్‌ఐఎస్‌లో చేరాలని జెండాపై అరబిక్‌లో రాసి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. జెండాను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా.. ప్రజల్లో అభద్రతా భావం నెలకొల్పడానికి బీజేపీ కార్యకర్తలే జెండాను అంటించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. రాష్ట్రంలో జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడటం బీజేపీ నాయకులు, ఆఫీస్‌ బేరర్లకు ఇది తొలిసారేం కాదు. పాక్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ఐఎస్‌ఐకి గూఢచర్యం చేస్తున్నాడన్న కారణంతో బీజేపీ ఐటీ సెల్‌ సభ్యుడు ధ్రువ్‌ సక్సేనాను పోలీసులు గతేడాది అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

(Source: https://thewire.in/politics/bjp-members-detained-in-assam-after-recovery-of-flag-asking-people-to-join-isis)

Keywords : bjp, rss, isis, assom, police, arrest
(2018-09-16 11:04:06)No. of visitors : 420

Suggested Posts


0 results

Search Engine

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది-ఒడిషాలో బలపడ్డాం..విస్తరిస్తున్నాం: మావోయిస్టు పార్టీ
నన్నో దేశద్రోహిగా చిత్రీకరించాలని పోలీసులు ప్రయత్నించారు..!
ఓటమిని అంగీకరించలేక బీభత్సం సృష్టించిన ఏబీవీపీ.. గూండాలతో లెఫ్ట్ విద్యార్థులపై దాడి
హక్కుల కార్యకర్తల అక్రమ అరెస్టుల కేసులో పిటిషనర్ల లాయర్ సుప్రీంకు చెప్పిన నిజాలు ఇవే
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
ఆంటీ! చంపేసారాంటీ..నా ప్రణయ్‌ను చంపేసారు
జేఎన్‌యూపై ఎర్రజెండా రెపరెపలు.. మతోన్మాదులను మట్టి కరిపించి లెఫ్ట్‌ను మళ్లీ గెలిపించిన విద్యార్థులు
నీ కోసం వేలాది మంది వచ్చారు.. ఒక్కసారి లే ప్రణయ్..
ప్రొఫెసర్ సాయిబాబకు చిన్నారి సాహస్ లేఖ.. ప్రశ్నించడమే నువ్వు చేసిన తప్పా..?
ఇవి పరువు హత్యలు కావు.. దేశం పరువు తీసే హత్యలు
అమృత తండ్రి దుర్మార్గపు చరిత్ర.. కూతురు కంటే పరువే ముఖ్యమంటున్న కులోన్మాది
ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదే.. పెద్దలను కూడా ఈడ్చిపడేయటమే
ప్ర‌శ్నించ‌డ‌మే నేర‌మైన‌ప్పుడు : క్రాంతి
తలపాగా ధరించాడని ఎస్సీ వర్గీయుడి తల ఒలిచేసిన అగ్రకుల ఉన్మాదులు
ʹక్రాంతి కోస‌మే ఈ ప్ర‌యాణంʹ
SUSPEND AGREEMENTS WITH INDIA UNTIL THE HUMAN RIGHT ACTIVISTS ARE RELEASED : MEP TO EUROPEAN COMMISSION
స్వచ్చమైన హిందీ, సంస్కృత భాషలో ఉన్న ఉత్తరం వరవరరావు రాసిందేనా.?
మొదటి అర్బన్ నక్సల్ భగత్ సింగ్
ʹజీవితాన్ని ధారపోయడమే నక్సలిజం అయితే, నక్సలైట్లు చాలా మంచి వాళ్లుʹ
70 ఏండ్ల చరిత్రను తిరగరాసిన విద్యార్థిని.. మతోన్మాద శక్తులపై లెఫ్ట్ విజయం
ప్రజల సభంటే.. ఇట్లుంటది
Punjab:Dalit bodies protest arrest of 5 human rights activists
Why are the Indian authorities afraid of a ʹhalf-Maoistʹ?
ʹప్రధాని హత్యకు కుట్రʹ కేసు ఓ కుట్ర..మేదావుల అరెస్టు దుర్మార్గం..మావోయిస్టు పార్టీ ప్రకటన‌
హిందూత్వ తీవ్రవాదుల హిట్‌ లిస్టులో దభోల్కర్‌ కుమార్తె
more..


ఐసిస్