నేటి భారతదేశం : ఆడపిల్లలకే కాదు.. ఆడపిల్ల తండ్రికి కూడా రక్షణ లేదు..!

నేటి

ఏం గొప్ప.. మన సంస్కృతి , సాంప్రదాయం అంటూ చెప్పుకోవడమే. మహిళలకు భారత దేశంలోనే అత్యంత గౌరవం లభిస్తుందని రాసుకోవడమే. కాని వాస్తవం మరోలా ఉంటుంది. వయసుతో సంబంధం ఉండదు. ఆడపిల్లైతే చాలు.. మృగాల్లా రెచ్చిపోయే మగాళ్లు ఉన్న దేశమిది. ఎన్ని చట్టాలు వస్తే ఏం లాభం..? కామంతో కళ్లు మూసుకొనిపోయిన వాడికి చట్టాలు చెత్త కాగితాల్లా కనిపిస్తాయి. దేశంలో రోజురోజుకూ మహిళలపై అఘత్యాలు పెరిగిపోతున్నాయి. మహిళలకే రక్షణ లేదని బాధిస్తుంటే.. ఇప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులకు కూడా రక్షణ లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనను చూస్తుంటే అసలు ఆడపిల్లలను కనడమే నేరమా అనేలా ఉంది.

అగ్రదేశాల్లో కనపడే గన్ కల్చర్ మన దేశంలోని ఉత్తరప్రదేశ్‌లో కనపడటం శోచనీయం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో తన కుమార్తెను ఇద్దరు యువకులు వేధిస్తుండటంతో తండ్రి అడ్డుకొని వారిని హెచ్చరించాడు. ఏ తండ్రైనా చేసే పని అదే. కాని ఆ హెచ్చరింపుతో ఆ యువకులు కక్ష పెంచుకున్నారు. తప్పు చేసినందుకు పశ్చాత్తాపం చెందకుండా.. పగతో రగలిపోయారు. కృష్ణపాల్, విశాల్ అనే యువకులు పగతో ఆ యువతి తండ్రిని పిస్తోలుతో కాల్చి చంపారు. ఆ తర్వాత ఎవరికీ దొరకకుండా పారి పోయారు. దీంతో ముజఫర్‌నగర్‌లోని రామ్‌పురి ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. వాళ్లిద్దరినీ పట్టుకోవడానికి స్థానిక ఎస్పీ ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు.

యూపీలో ఇలా ఈవ్ టీజర్లు రెచ్చిపోవడం సాధారణంగా మారింది. పోలీసుల లెక్కల ప్రకారమే ప్రతీ నెల 8 నుంచి 10 వరకు కాల్పుల ఘటనలు నమోదవుతున్నాయి. ఈ కాల్పులకు తెగబడే వాళ్ల వయసు 15 నుంచి 17 ఏళ్ల లోపే ఉండటం అత్యంత బాధాకరమైన విషయం. సినిమాలు, ఇంటర్నెట్‌పై నియంత్రణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Keywords : muzafernagar, eve teasing, father shot dead, ముజఫర్‌నగర్, ఈవ్ టీజింగ్, అమ్మాయి తండ్రి, కాల్పులు
(2024-05-10 06:44:47)



No. of visitors : 846

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


నేటి