పేదవాడి నిజమైన సమస్యను చర్చించిన ʹకాలాʹ..!
నేడు సినిమా అతి పెద్ద వ్యాపారం. ప్రజలకేదో సందేశం ఇస్తున్నాం అని చెబుతారు కాని అంతిమంగా వారు ఆశించేది గల్లాపెట్టెలు నిండటమే. మూడు ఫైట్లు ఆరు పాటలు అనే రొటీన్ ఫార్ములాతో సినిమాలు తీసి జనాల మీదకు వదలడమే కాని దేశంలోని ప్రజలు ఎదుర్కునే సమస్యలను చర్చించే సినిమాలు రావడం కష్టమే. దేశ జనాభాలో 60 శాతం ప్రజలు సొంత ఇల్లు, భూమి అనేదే లేకుండా బతుకుతున్నారు. రాజకీయ నాయకులు ఓట్ల కోసం దళితులకు భూములిస్తాం, పేదలకు పట్టాలిస్తాం అని చెప్పడమే కాని ఆచరణలో ఏనాడూ జరగలేదు. అసలు పేదవాడికి కాస్తంత భూమి ఎంత అవసరమో చక్కగా వివరించిన సినిమా ʹకాలాʹ. అసలు ఆ సినిమా గురించి గుర్రం సీతారాములు అనే పీహెచ్‌డీ విద్యార్థి రాసుకున్న ఫేస్‌బుక్ పోస్టు చూస్తే.. కాలా సినిమా చర్చించిన విషయం ఎంత ముఖ్యమైనదో అర్థమవుతుంది. ఆ వాల్ పోస్ట్ యధాతథంగా..
---------------------------------------------------------------------------
కళ కేవలం కల కాదనీ ఒక స్వతంత్ర భావన అని అది సర్వ స్వతంత్రంగా ఉంటేనే దానికి సార్ధకత,స్వచ్ఛత అని నమ్మే బుద్ధిజీవులు ఉన్నారు ఈ లోకంలో. అది సంగీతానికి, సాహిత్యానికి, సినిమాకూ పూసారు. సకల కళలూ స్వతంత్రంగా ఉండాలి అని ఉద్యమాలు చేసిన కవులు ఉన్నారు. వాళ్ళు కోరుకున్నది సాహిత్యం స్వతంత్రంగా ఉండడం కన్నా ఒక లక్ష్యం కోసం సమాజ హితం కోరే క్రమం లో ప్రాణ త్యాగానికి సిద్దపడ్డ వ్యక్తుల శక్తుల మీదనే వాళ్ళ దాడి. పాపం వాళ్ళ అజ్ఞానానికి తెలుగు సమాజం ఎప్పుడో నివాళి ఇచ్చింది. ఈ ప్రపంచంలో ఏ కళకయినా స్థలం, కాలం, కులం, వర్గం ఉంటాయి అని చరిత్ర నిరూపించింది. సినిమా దానికి అతీతం కాదు. సినిమా ఎంత ʹసినాలిదిʹ అంటే ఇద్దరు ప్రజాదారణ పొందిన నటీమణుల జీవితాలు ఒకటి డర్టీ గా మరొకటి ʹమహానటిʹ గా మార్చగలవు విలువలను తలకిందులు చేయగల సినాలిది సినిమా. ఇది రాజకీయం అంటే ఎవరూ వొప్పుకోరు. ʹమహానటిʹ కావాల అన్నా ʹడర్టీ పిక్చర్ʹ కావాలి అన్నా దానెనక కులం ప్రాంతం వర్గం ఉంటాయి. ఉండి తీరాలి కూడా.
అసలు వందేళ్ళ సినిమా తన ప్రాంతాన్ని, కులాన్ని, మతాన్ని, శీలాన్ని పెట్టుబడి పెట్టకుండా, రాజకీయం చేయకుండా ఎప్పుడు ఉంది? సినిమా పేరుతో వేలాది ఎకరాలు పచ్చని పొలాలు, కుంటలు, చెరువులు ఆక్రమించుకోవచ్చు. సినిమా పేరుచెప్పి వందేళ్ళు ఎకరానికి రూపాయ పెట్టి ఆక్రమించుకొని మాల్స్ కట్టుకోవచ్చు. తెరమీద రాజకీయాల్లోనూ హీరోలు కావచ్చు. ఇవేవీ రాజకీయాలు కావు కేవలం కళ ద్వారా మాత్రమె ప్రాప్తించిన వరం అని అనొచ్చు అందరూ చేసారా అది కేవలం అవతార పురుషులకు మాత్రమె లభించే ప్రాప్తం.అని కూడా అనొచ్చు. ఇంత అజ్ఞాన పూరిత విషాద కాలంలో పా.రంజిత్ ʹకాలాʹ సినిమా తీసాడు. త్రిబిల్ యెక్ష్ XXX అంత సంస్కారమైన సబ్బు నురగ అంత స్వచ్చమైన సినిమా తెర మీద రంగుల హోళీ చేసాడు. కొందరికి ఇంత అసహ్యమైన కంపు నచ్చక పోవచ్చు. జూబ్లి, బంజారా హిల్స్ ఎంత అందమైనవో ఆ పక్కనే ఉన్న అద్దం లాంటి మురికి వాడల్లో, కృష్ణా నగర్ ఐశ్వర్యం లో చూడొచ్చు. పాపం పెద్ద మనిషి పడితే లేస్తే హిమాలయాల చుట్టూ తిరిగే వాణ్ని ʹడర్టీʹ నీలి రంగులో ముంచి వెండితెరను బద్నాం చేసాడు రంజిత్.అది ముమ్మాటికీ తప్పే. అదనా బస్ లో టిక్కెట్లు అమ్ముకునే వాడు తలైవా అవుతాడా ఎంత ఘోరం ?
రజనీ కాషాయం వదిలి నలుపు నీలి రంగుల్లో మునగడం ఆయన ఎంచుకున్న రాజకీయాలు తెర ముందు తెరవెనక ఒకటే అని చెప్పకనే చెప్పినట్టు. ఆ పని రంజిత్ చేసాడు. ఇంత కాలం హిమాలయాల ʹస్వచ్ఛమైనʹ తెలుపును మాత్రమె చూసిన ఆయన ఆకాశం నీలం వర్ణంలో కూడా ఉంది అని తెలుసుకున్నాడు. కాలా లేదా కరికాలుడు ముంబై మురికివాడల్లో పెరిగిన ఒక నిరసన.దారవి లోస్తిరపడిన వలసజీవుల మీద ఆధిపత్యం చేయాలను కున్న హరి దాదా మీద సూటిగా చెప్పాలి అంటే ముంబై శివసేన హిందుత్వ రాజకీయాల మీద ఒక పొలిటికల్ సటైర్.
మద్రాస్ నుండి రెండు తరాల కింద వలస వచ్చిన ఈరయ్య కొడుకే కాల. నలుగురిని బ్రతికించదానికి సమాజం అంటున్న ʹతప్పుʹ చేసినా తప్పు కాదు అన్నాడు ఇరవై ఎనిమిది ఏళ్ళ కింద ఈరయ్య అలియాస్ ఈరినాయుడు. నాటి బొంబాయి నగరాన్ని ఉచ్చ పోయించినవాడు ఈరినాయుడు. ముంబై నగరాన్ని నవనిర్మాన సేన పేరుతో ఉన్మాదపు అడ్డాగా మార్చింది రాజకీయం. ఇప్పుడు ముంబై నగరంలో ఈరినాయుడు కరికాలునిగా మారాడు. ముంబై చీకటి విక్రుతాన్ని దాదాగిరిని శాసించిన ఉదంతాలు కొత్త కాకున్నా ఈరినాయుడి తర్వాతి తరం తాము చేసే ఏపనిలో అయినా రాజాకీయాలు ఉంటాయి అని చూపించారు. కరికాలుడు ఆయన కుటుంభం తండ్రి పెరియార్ వారసుడు కొడుకు లెనిన్ వారసుడు. నలుపు నీలం రంగుమధ్య వైరుధ్యం ముఖ్యంగా భూమి ఇరుసుగా జరిగిన అనేక పోరాటాలకు ఒక ఆకృతి ఇస్తే అది ʹకాలʹ సినిమా అవుతాది. తన కాళ్ళకింద కదులుతున్న నేల కాపాడుకోవడం కోసం ఒక మట్టి మనుషుల ఆక్రందన. ఉమ్మడి కుటుంబాల మధ్య సంపద తెస్తోన్న వికృతం, వ్యవస్థీకృత మైన ఆహార హింస, తిండీ బట్ట,ఆహార్యం మీద పెత్తనం చెలాయించే సంక్షుభిత కాలం లో దాని విరుగుడు ప్రత్యామ్నాయ రాజకీయాలలో ఉన్నాయి అని చెప్పగల దమ్మున్న పా.రంజిత్ కు మాత్రమె ఇది సాధ్యం.
నేటి ముంబై నగరాన్ని ʹనేల నీకు అధికారం నేల నాకు జీవితంʹ ʹడబ్బూ అధికారం వచ్చాక ప్రతి రౌడీ దాతేʹ అన్న మాట అనడానికి నీకు ధైర్యం కావాలి, చావు నిన్ను తరుముకొని వచ్చినా ఈ కట్టే ఇక్కడే కాలి ఈ మట్టిలో నే కలిసిపోవాలి అని ఈ భూమి పుత్రుడు మాత్రమె అనగలడు. వీరినాయుడు వారసుడు ʹకాలʹ వాడికేమి కావాలో స్పష్టత ఉంది దానెనక ద్రావిడ రాజకీయాలు తెచ్చిన స్ఫూర్తి ఉంది. పెరియార్ ప్రోది చేసిన ఒక పరంపర, ఒక కొనసాగింపు ఉంది. ఇది దుష్ట శిక్షణ శిష్ట పరిరక్షణ పేరుతో జరిగిన హింస మీద జరిగిన తిరుగుబాటు. రామ - రావణ రాజకీయాల మధ్య జరిగిన వైరుధ్యాల ప్రతిఫలన. ఇది శుచి శుభ్రత పేరుతో వచ్చిన అసమ విలువల మీద తిరుగుబాటు. ఈ కాలానికి ఏది అవసరమో అదే తెరమీద చూపించిన ʹకాలʹ అలియాస్ కరికాలుడు ఈ కాలపు రాబిన్ హుడ్. సినిమా ఎలా తీయాలో ఎందుకు చూడాలో చెప్పగలిగిన ఈ కాలపు నిజమైన హీరో పా.రంజిత్
Keywords : pa ranjith, kaala, rajnikanth, review, land,poor, పా రంజిత్, భూమి, పేదలు, రజనీకాంత్, కాలా
(2021-04-16 19:45:22)
No. of visitors : 1695
Suggested Posts
0 results
| వ్యాక్సిన్ రెండో డోస్ వేసుకున్నాక కూడా... కరోనాతో చత్తీస్ గడ్ హెల్త్ జాయింట్ డైరెక్టర్ మృతి |
| వైరల్ అయిన మెడికోల డాన్స్ వీడియో: మతం రంగు పూసేందుకు ఉన్మాదుల ప్రయత్నం - తిప్పికొట్టిన నెటిజనులు |
| దారుణం... చెత్త లారీల్లో కోవిడ్ పేషెంట్ల మృతదేహాలు తరలింపు... |
| ఉమర్ ఖలీద్ కు బెయిల్ మంజూరు |
| కరోనా మరణాలపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు |
| ఏప్రిల్ 26 భారత్ బంద్ ను జయప్రదం చేయండి - మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి సభలను సమరొత్సాహంతో జరుపుకుందాం - మావోయిస్టు పార్టీ పిలుపు |
| తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు |
| Chattisghar Encounter: Maoist Party released a Letter |
| చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘనే - కే.కేశవరావు |
| అమ్మను కూడా కలవనివ్వరా ? - షోమాసేన్ కూతురు లేఖ |
| లొంగి పోయిన ʹమావోయిస్టుʹలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి |
| సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన ప్రముఖ రచయిత
|
| ఆదివాసీ హక్కుల కార్యకర్త అక్రమ అరెస్ట్ - విడుదల చేయాలని జర్నలిస్టులు, ప్రజా సంఘాల డిమాండ్
|
| Fact-finding team alleges CRPF brutality in Jharkhand villages |
| శ్రామిక మహిళా దినోత్సవ కార్యక్రమంపై ఏబీవీపీ దాడి - చూస్తూ నిల్చున్న పోలీసులు |
| జార్ఖండ్ లో ఆదివాసులపై సి ఆర్ పి ఎఫ్ దుర్మార్గాలు -నిజనిర్దారణ రిపోర్ట్ |
| విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుద్దాం - మావోయిస్టు నేత జగన్ ప్రకటన
|
| విప్లవ స్వాప్నికుడు ఉప్పు కృష్ణ అమర్ రహే !
|
| టైమ్ మాగజైన్ కవర్ స్టోరీ: రైతాంగంపోరాటం - మహిళల నాయకత్వం
|
| సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డే రాజీనామా చేయాలని 4వేల మంది ప్రముఖుల డిమాండ్ |
| రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు
|
| Supreme Court Chief Justice Bobde should resign immediately - Letter from 4,000 women and rights activists |
more..