ముస్లిం ఇంజనీర్ మాట్లాడాడని.. మతోన్మాదంతో రెచ్చిపోయిన మహిళ

ముస్లిం

మత సహనానికి మారు పేరు మా భారత దేశం. ఇక్కడ అన్ని మతాలవాళ్లు భాయీ భాయీ అనుకుంటాం అంటూ రోజూ ఒకరి భుజాలు ఒకరు చరుచుకుంటుంటారు. కాని వాస్తవ పరిస్థితుల్లోకి వస్తే.. నువ్వెంత నీ మతమెంతా.. ఈ దేశంలో ఉండే హక్కు మాదేనంటూ హూంకరిస్తారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీలు, దళితులపై దాడులు పెరిగిపోయాయి. మత సహనం చచ్చి.. మతోన్మాదంతో రెచ్చిపోయే వాళ్లే కనిపిస్తున్నారు. ఇన్నాళ్లూ ఈ మతోన్మాదం చెడ్డీ గ్యాంగ్, వారి అనుచరులకే పరిమితంమైందనుకుంటే.. ఇప్పుడు ఏకంగా నట్టింట్లోకి వచ్చేసింది. సహనానికి మారుపేరుగా నిలిచే స్త్రీలు కూడా మతోన్మాదంతో మానవత్వాన్ని మరుస్తున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది ఒక సంఘటన..

.పూజా సింగ్‌ అనే మహిళా కస్టమర్‌ తన ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌ కనెక్షన్‌లో సమస్య ఉంది, దాన్ని పరిష్కరించమని ఎయిర్‌టెల్‌ కస్టమర్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసింది. అయితే ఎలాంటి స్పందన లేకపోవడంతో కొద్ది సేపటి తరువాత కంపెనీ ట్విట్టర్‌కు మెసేజ్ చేసింది. అయితే ఎయిర్‌టెల్ కస్టమర్‌ కేర్ నుంచి షోయబ్‌ అనే సర్వీస్‌ ఇంజనీర్‌ స్పందించాడు. దీంతో ఆ మహిళ ఆవేశంతో ఊగిపోయింది. ʹతాను ఇండియన్‌ హిందువునని..తనకు ముస్లింల సర్వీస్‌ మీద నమ్మకం లేదని..వెంటనే షొయబ్‌ స్థానంలో మరో హిందూ సర్వీస్‌ ఇంజనీర్‌ స్పందించాలనిʹ కంపెనీకి ట్విటర్‌లో పోస్టు చేసింది.

అయితే కోట్లాది మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్న ఒక మల్టీనేషనల్ కంపెనీ.. ఆమె మత దురభిమానానికి దాసోహం అయిపోయింది. షోయబ్ స్థానంలో వెంటనే మరో హిందూ కస్టమర్ సర్వీస్ ఇంజనీర్‌‌తో మాట్లాడించింది. ఈ తతంగం అంతా ఆ మహిళనే తిరిగి ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహంతో ఆమెను, ఎయిర్‌టెల్‌ను తిట్టిపోశారు. ఎయిర్‌టెల్ కస్టమర్లలో కేవలం హిందువులే ఉంటారా..? అన్ని మతస్థులు ఉంటారు కదా.. అలాంటప్పుడు మీ కంపెనీ ఉద్యోగికి మద్దతు తెలపకుండా మత దురభిమానం, అహంకారంతో ఉన్న వారిని ఎలా ప్రోత్సహిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.

ఇలా మతసహనం నశించడానిని దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులే కారణమని.. బీజేపీ ప్రభుత్వంలోని మంత్రులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఇక సామాన్యులు మాత్రం ఎందుకు చేయరనే ఆరోపణలు వస్తున్నాయి.

Keywords : ఎయిర్‌టెల్, కస్టమర్ కేర్, ముస్లిం యువకుడు, మతోన్మాదం, పూజా సింగ్, షోయబ్, airtel, customer care, muslim engineer,
(2024-04-24 20:21:23)



No. of visitors : 2069

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ముస్లిం