కాలా ఎందుకు చూడాలి..?
ఇది ఒక గొప్ప సినిమా అని కాదు. కథను ఉత్కంఠభరితంగా నడిపాడనీ కాదు. సెకండ్‌హాఫ్‌లో మామూలు మసాలానే. ʹకాలాʹ ʹʹఅదృశ్యంʹʹ నుండి దిగి కథను విజయవంతం చేయడం అంతా మామూలే. ʹనాయకన్ʹకి కాపీలాగా వున్నదని ఒక మాట కూడా అన్నారు.
అయినా ʹకాలాʹ చూడాలి. ఎందుకంటే తీసుకున్న సమస్య కొత్తదేమీ కాదు. గుడిసెవాసుల సమస్య. చాలా తెలుగు కథల్లో కూడా వుండి వుండవచ్చు. కాని ఆ గుడిసెవాసుల పోరాట సందర్భంగా దాన్ని భూమి సమస్యగా వ్యక్తీకరించడం ఈ సినిమాలోని విశేషం.
సినిమా టైటిల్స్‌లోనే తరతరాలుగా ʹభూమి కోసంʹ యుద్ధాలు జరిగాయని రేఖామాత్రంగా చరిత్రను వ్యాఖ్యానించడంతో సినిమా ప్రారంభమవుతుంది. అక్కడి నుండి ఆ పోరాట సందర్భంలో విలన్ కనిపించే ఒక దృశ్యంలో అమరుల స్తూపాల పోలికలున్నట్లుగా ఓ పక్కగా చూపించాడు. అక్కడే వెనకగా ʹదండకారణ్యʹ అనే టాగ్ కనిపిస్తుంది. ఇది జాగ్రత్తగా గమనిస్తేగాని కంటపడదు. అయితే దాని గురించి కాదుగాని - ʹభూమి మీకు అధికారంʹ ʹభూమి మాకు హక్కుʹ ʹభూమి మీకు సంపదʹ ʹభూమి మాకు జీవితంʹ వంటి సంభాషణలు - అది గుడిసెవాసుల పోరాటమే కావచ్చుగాని నేలకు సంబంధించిన సార్వజనీన పోరాట సంకేతంగా వినిపిస్తుంది.
అలాగే మరోక ముఖ్యమైన అంశం మతం రాజకీయం ఎంతగా కలిసిపోతాయో చూపించడం. నిజానికి ఆ విలన్ ఎవరూ నిర్దిష్టంగా చెప్పడు? కాని అతని ఓ పెట్టుబడిదారుడు. అనధికార గూండా లీడర్. రాజకీయ నాయకులను పురుగును తీసేసినట్లు మాట్లాడతాడు. మామూలుగానే అన్ని అఘాయిత్యాలు చేయిస్తూ వుంటాడు. అతనికి ప్రత్యక్షంగా పరోక్షంగా మతశక్తులు ఎలా ఉపయోగపడతాయో చూపిస్తాడు. ఆ పాత్రలు అవి చూస్తూంటే అంతా ఎవరో తెలిసిన మనుషుల్లాగే మనం రోజు తిట్టుకునే సంస్థ గూండాలే అక్కడ వున్నట్టు అర్థమవుతుంది. అట్లా మతం, రాజకీయాలు కలగలసి ఎవరి పక్షాన వున్నాయో స్పష్టంగా చూపిస్తాడు.
మూడోది తెలుపు నలుపు రంగు చర్చ ద్వారా అది ఆర్య ద్రావిడ చర్చ కావచ్చు, ఉత్తర దక్షిణ భారతదేశాలు చర్చ కావచ్చు లేదా దళిత బ్రాహ్మణీయ అగ్రకుల తారతమ్యమూ కావచ్చు. ఆ ʹకాలాʹ మనుషుల నలుపు కింద తెల్లరంగువాళ్లంతా నలిగిపోతారని చివరి సీనులో నలుపుని తెరంతా ఆక్రమింపచేసి ముగించటం దానికదే ఓ సంకేతం, ఓ సానుకూలాంశం.
అట్లా ఈ నేలమీదా, తెల్లతోలు దాష్టీకంమీదా, మత రాజకీయాలపట్ల నిరసనగా చూపించిన ఈ సినిమా సామాన్యజనానికి అవసరమైంది. సూపర్ స్టార్ వున్నాక దానికుండే పరిమితులు ఎన్నో వున్నప్పటికీ ʹకాలాʹ చూడదగినది. ఆలోచనలకు ప్రేరకమైందీనూ.
Sorce : Virasam.org
Keywords : kaala, rajnikanth, pa ranjith, virasam, కాలా, రజనీకాంత్, పా రంజిత్, విరసం,
(2021-01-20 00:14:44)
No. of visitors : 1283
Suggested Posts
0 results
| అదానీపై కథనానికి అరెస్టు వారెంట్ ! |
| వ్యవసాయ చట్టాలపై ప్రచారం చేస్తున్న రైతుల అరెస్ట్
|
| ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
|
| అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు |
| ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు |
| వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్ |
| సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి
|
| పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?
|
| సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం
|
| తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ? |
| యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు. |
| రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర |
| ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్యలు
|
| ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
|
| ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
|
| మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక |
| రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
|
| రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు
|
| రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ స్ట్రీట్ వెండర్స్ |
| హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు |
| రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్ |
| విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష
|
| అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం... కొద్ది సేపట్లోనే బీజేపీ ఎమ్మెల్యే యూ టర్న్
|
| షహీన్ భాగ్ లో కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి బీజేపీలో చేరిక - విమర్షలు రావడంతో బహిష్కరణ
|
| దొర మాటలు, చేతలు – అబ్బ ఎంత ఉల్టా పల్టా? -ఎన్ వేణు గోపాల్ |
more..