మాఊర్లో మారాజ్యం... స్వతంత్రం ప్రకటించుకున్న 100 ఆదివాసీ గ్రామాలు

మాఊర్లో

మా ఊళ్లో మా రాజ్యం అంటూ ఆదివాసీలు స్వ‌యం పాల‌న‌ను ప్ర‌క‌టించుకుంటున్నారు. ఝార్ఖండ్‌లోని దాదాపు వంద‌ ఆదివాసీ గ్రామాలు ఇప్పుడీ ఉద్య‌మంలో భాగ‌మ‌య్యాయి. ʹఈ గ్రామం మాది. దీనిపై సర్వహక్కులూ మావి. ప్రభుత్వం ఇక్కడ అడుగుపెట్టడానికి వీల్లేదు. మా నిర్ణయాలను మేమే తీసుకుంటాం. జల్‌, జంగిల్‌, జమీన్ పై మాదే హ‌క్కు. ఎవరూ వాటిని దోచుకోడాన్ని అనుమతించంʹʹ అని ఆ రాతిపలకలపై చెక్కించి గ్రామ ప్ర‌వేశ మార్గం వ‌ద్ద‌ నెలకొల్పుతున్నారు. ముండా ఆదివాసీ తెగ‌లో చనిపోయిన వారి స్మృతిలో సమాధి వద్ద రాతి ప‌ల‌క‌ల్ని ఏర్పాటు చేస్తారు. దీన్ని ప‌థ‌ల్గ‌డి అంటారు. ఇప్పుడు... గ్రామ సభ అధికారాలు, రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ లో పొందుపరచిన నియమాలను రాతిప‌ల‌క‌ల‌పై చెక్కి ʹపథల్గ‌డిʹ సంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. రాతి ప‌ల‌క‌ల‌పై ʹగ్రామసభ అనుమతి లేనిదే బయటివాళ్లెవరూ గ్రా మంలోకి రాకూడదుʹ అని రాసిపెట్టారు.

పెసా చట్టం ప్ర‌కారం 5వ షెడ్యూల్డ్ ప్రాంతాలలో గ్రామ సభలే నిర్ణయాత్మక పాత్రపోషిస్తాయి. గ్రామ సభ నిర్ణయం ప్రకారమే స్థానిక పరిపాలన సాగాలి. కానీ ప్రభుత్వాలు ఈ చ‌ట్టాన్ని అమ‌లు చేయకపోగా ఈ చ‌ట్టాన్ని నిర్వీర్యం చేయ‌డంలో పాల‌కులు స‌ఫ‌ల‌మ‌య్యారు. మాజీ ఐఏఎస్ అధికారి బి. డి. శ‌ర్మ లాంటి వాళ్లు ఆదివాసీ హ‌క్కుల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో చైత‌న్యం క‌లిగించేందుకు విశేష కృషి చేశారు. రాతి ప‌ల‌క‌ల‌పై 5వ షెడ్యూల్‌లోని నియ‌మాల‌ను చెక్కించి గ్రామాల్లో నాటించారు. ఇప్పుడ‌దే స్ఫూర్తితో ప‌థ‌ల్గ‌డి ఉద్య‌మం న‌డుస్తోంది.

నిజానికి చ‌ట్ట‌ప్ర‌కారం... ఇక్క‌డి వ‌న‌రుల‌పై ఆదివాసీల‌కే హ‌క్కున్న‌ప్ప‌టికీ ఆచ‌ర‌ణ‌లో మాత్రం ఆదివాసేత‌రుల‌ గుప్పిట్లో ఉంటున్నాయి. బీహ‌ర్ ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉన్న‌ప్ప‌టి నుంచీ ఆదివాసీల‌కు ఎలాంటి హ‌క్కులూ ద‌క్క‌డం లేదు. చ‌ట్టాలు కేవ‌లం కాగితాల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నాయి. అధికారంలో ఉన్న ప్ర‌భుత్వాలేవీ ఆదివాసీల‌ను ప‌ట్టించుకోలేదు. పైగా కొత్త కొత్త చ‌ట్టాల పేరుతో అట‌వీ భూముల‌ను ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంటూ వ‌చ్చింది. అంతేకాదు... బ‌య‌టివాళ్లు వ‌చ్చి అట‌వీ ప్రాంతంలో భూమిని సొంతం చేసుకునేలా రిజిస్ట‌ర్ 2 చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చింది. దీంతో ఆదివాసీ ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం పెల్లుబికింది. అదే ఇప్పుడు ప‌థ‌ల్గ‌డి ఉద్య‌మ రూపం దాల్చింది.

ఝార్ఖండ్‌లోని ఖుంతి జిల్లాలో దాదాపు 100 గ్రామాల్లో ప‌థ‌ల్గ‌డి ఉద్యమం బలంగా సాగుతోంది. స్కూళ్లు, మార్కెట్లు, చిన్న చిన్న ఆఫీసులు, బ్యాంకులు ఏర్పాటు చేసుకోవ‌డంతో పాటు త‌మ‌దైన విద్యా విధానాన్ని సైతం రూపొందించుకున్నారు. రాజ్యానికి, ప్రజలకు మధ్య చట్టబద్ద లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. ముండా తెగ ప్ర‌జ‌లు న‌డుపుతున్న ప్ర‌జా ఉద్య‌మం ఇది. ఇప్పుడీ ఉద్య‌మాన్ని అణ‌చివేసేందుకు స్థానిక బీజేపీ స‌ర్కారు కుయుక్తులు ప‌న్నుతోంది. ప‌థ‌ల్గ‌డి ఉద్య‌మం వెన‌క మావోయిస్టులున్నారంటూ ప్ర‌చారాన్ని లంఘించిన ప్ర‌భుత్వం ప‌లువురు ప‌థ‌ల్గ‌డి ఉద్య‌మ‌కారుల‌ను జైళ్ల‌లో బంధించింది.

ప‌థ‌ల్గ‌డి ఉద్య‌మ‌కారులు ఝార్ఖండ్‌ మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండా ఇంటిపై దా డి చేసి ముగ్గురు సెక్యూరిటీ గార్డులను అపహరించి తీసుకెళ్ళడంతో ఉద్య‌మం మిలిటెంట్ ద‌శ‌కు చేరుకుంది. వారిని ప‌ది రోజుల పాటు త‌మ ఆధీనంలో ఉంచుకున్నారు. త‌మ స‌మ‌స్య‌ల‌పై గ‌వ‌ర్న‌ర్ స్పందించే వ‌ర‌కు వారిని వ‌దిలివేయ‌మంటూ ఉద్యమకారులు ప‌ట్టుబ‌ట్టారు. దీంతో ఆదివాసీ గ్రామాల‌పై వేలాది పోలీసు లను, పారా మిలటరీ బలగాలను మోహ‌రించిన ప్ర‌భుత్వం ప‌థ‌ల్గ‌డి ఉద్య‌మంపై ఉక్కుపాదం మోపేందుకు య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలో పోలీసుల జ‌రిపిన దాడిలో ఒక ఆదివాసీ మ‌ర‌ణించాడు. అయినా... ప్ర‌జ‌లు వెన‌క‌డుగు వేయ‌లేదు. స్వ‌యం నిర్ణ‌యాధికారాన్ని నిల‌బెట్టుకునేందుకు సాంప్ర‌దాయ ఆయుధాల‌తో రాజ్యానికి ఎదురునిలిచారు.

సాయుధబలగాలతో ఆదివాసుల ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తూనే ఆ ఉద్యమంపై దుష్ప్రచారానికి తెగించింది బీజేపీ సర్కార్.
జూన్‌ 19న ఖుంతి ప్రాంతంలో అమ్మాయిల అక్రమ వ్యాపారంపై నాటకం వేసేందుకు వెళ్లిన‌ ఐదుగురు గిరిజన మహిళలను కొంద‌రు అపహరించి సామూహిక అత్యాచారం జరిపారు. ఈ నేరాన్ని ప‌థ‌ల్గ‌డి ఉద్య‌మ‌కారుల‌పై నెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు పోలీసులు. తిరు అనే ప‌థ‌ల్గ‌డి నాయ‌కుడిపై అప‌హ‌ర‌ణ‌, అత్యాచార కేసును న‌మోదు చేసిన పోలీసులు అత‌డి కోసం ఆదివాసీ గ్రామాల‌ను జ‌ల్ల‌డ‌ప‌డుతున్నారు. ప‌థ‌ల్గ‌డి పోరాటాన్నిఅణ‌చివేసేందుకు బీజేపీ స‌ర్కారు ఇలాంటి దుష్ర్ఫ‌చారానికి తెర‌తీసింది. ఈ క‌ట్టుక‌థ‌ల‌కు ప్ర‌జ‌లే స‌మాధానం చెబుతారు. అణ‌చివేత‌ను ధిక్క‌రించి త‌మ‌దైన స్వ‌యంపాల‌న‌ను నిల‌బెట్టుకుంటారు. ప‌థ‌ల్గ‌డి తొవ్వ‌లో పోరాటాన్ని గెలిపిస్తున్న‌వాళ్లు... బిర్సాముండా, తిల్క‌మాంజల వార‌సులు.

Keywords : jarkhand, pathalghadi movement, adivasi, police
(2024-04-24 20:17:19)



No. of visitors : 5220

Suggested Posts


78 ఏళ్ళ స్వామి అగ్నివేష్ పై చెడ్డీ గ్యాంగ్ దాడి

సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌పై జార్ఖాండ్‌లోని పకూర్‌లో మంగళవారంనాడు చెడ్డీ గ్యాంగ్ మూక దాడి చేసింది. ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన వచ్చినప్పుడు బీజేపీ యువమోర్చా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)కి చెందిన కార్యకర్తలు జై శ్రీరాం నినాదాలు చేస్తూ ఆయనను తీవ్రంగా కొట్టడంతో పాటు దుస్తులు చించివేశారు.

Fact-finding team alleges CRPF brutality in Jharkhand villages

On 5-6 March 2021, a human rights fact-finding team of CDRO and HRLN visited three police station areas of the Giridih district - Madhuvan, Dumri and Pirtand, where the central government has decided to set up para – military camps. Following the decision there has been massive protests by the villagers. The team met these villagers and got complete info

బ్రహ్మదేవ్‌ను భద్రతా దళాలు హత్య చేశాయి - బహిర్గతం చేసిన‌ నిజనిర్దారణ కమిటీ నివేదిక

జార్ఖండ్ రాష్ట్రం, లాతేహర్ జిల్లాలోని, గారూ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుకు-పిరి అడవిలో 2021 జూన్ 12 న, భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో, ఒక నక్సలైట్ మరణించాడనీ, అనేక తుపాకులు స్వాధీనం చేసుకున్నారు అనీ అనేక వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి.

జార్ఖండ్ లో ఆదివాసులపై సి ఆర్ పి ఎఫ్ దుర్మార్గాలు -నిజనిర్దారణ రిపోర్ట్

జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడి జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నెలకొల్పుతున్న కొత్త సి ఆర్ పి ఎఫ్ క్యాంపులకు వ్యతిరేకంగా నిరసన తెలియచేస్తున్న ఆదివాసీ సంతాల్ గ్రామస్తులపై జరుగుతున్న దాడులు, అణిచివేతలకు సంబంధించి CDRO 2021 మార్చి 5, 6, & 7వ తేదీలలో జరిపిన నిజ నిర్ధారణ రిపోర్ట్

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మాఊర్లో