పంటలు పండటానికి నాలుగు మంత్రాలు చాలు.. గోవా ప్రభుత్వం కొత్త స్కీం

పంటలు

మత పిచ్చి మూర్ఖులు అధికారంలో ఉంటే ఆ దేశం పరిస్థితి ఎలా ఉంటుందో మన దేశాన్ని చూస్తుంటే అర్దమవుతుంది. మత పిచ్చి పీక్స్ కు వెళ్ళిన ఈ మూర్ఖులు వాళ్ళ అఙానాన్ని ఙానంగా ప్రచారం చేస్తూ ప్రజలపై వాళ్ళ పైత్యాన్ని రుద్దుతూ దేశాన్ని మధ్యయుగాల అరాచకంలోకి తీసుకెళ్ళే ప్రయత్నం ముమ్మరం చేశారు. మహా భారతత, రామాయణ కాలంలోనే టెస్ట్ ట్యూబ్ బేబీలున్నారని ఒకరంటే మనం వేల ఏళ్ళ‌ కిందనే విమానాలు తయారు చేశామని మరొకరు అఙాన ప్రదర్శన‌ చేస్తారు. ఇప్పుడు మరో దేశ్ కీ నేత తన మూర్ఖపు నమ్మకాన్ని ఙానంగా దేశానికి పంచేందుకు బయలు దేరాడు. ఈ యన గారి ఙానం ఏం చెబుతున్నదంటే ఇక పంటలు పండించడానికి రైతులు ఏ కష్టంపడనక్కర్లేదట. నాలుగు మంత్రాలు చదివితే పంట ఏపుగా పండి రైతుకు లాభాలే లాభాలట. ఆయనేదో నమ్మి ప్రచారం చేశాడు ఆయనపిచ్చి ఆయనిష్టం అని కొట్టి పడేయడానికి లేకుండా ప్రభుత్వం తరపున‌ ఏకంగా ఓ మంత్రాల స్కీం ప్రకటించేశాడు.

గోవాలోని బీజేపీ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా పనిచేస్తున్న విజయ్‌ సర్దేశాయ్‌ మంగళవారం నాడు అధికారికంగా ఓ స్కీమ్‌నే ప్రారంభించారు. దీనికి ʹశివ్‌ యోగ్‌ కాస్మిక్‌ ఫార్మింగ్‌ʹ అని కూడా నామకరణం చేశారు. రైతులు ప్రతిరోజు పంట పొలాల ముందు ధ్యాన ముద్రలో (మెడిటేషన్‌) కూర్చొని ʹఓం రమ్‌ జమ్‌ సాహ్‌ʹ అంటూ 20 సార్లు ఉచ్ఛరిస్తే చాలట.అలా చేయడం వల్ల రైతుల నోటి నుంచి వెలువడే శబ్దాల వెంట కాస్మిక్‌ కిరణాలు ప్రయాణించి ఎదురుగా ఉన్న పంట పైర్లకు తాకి వాటికి కొత్త శక్తినిస్తాయట. నేల లోపల క్రిమికీటకాదులను చంపేస్తాయట. అలా జవసత్వాలను సంతరించుకున్న పైరు ఏపుగా పెరుగుతందట. ఇందులో పైసా ఖర్చులేదు, ప్రయత్నించి చూడమని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం పంటల కోసం ఉపయోగిస్తున్న నీరు, ఎరువులను ఇక ముందు వాడాల్సిన అవసరం ఉందా, లేదా? అన్న విషయాన్ని మాత్రం ఆయన వివరించలేదు. దుక్కి దున్నీ నారుపోసి నీరుపోసి కష్టపడినా పంట చేతికొస్తదా, లేదా అన్న ఆందోళన పడే రైతుకు ఇవన్నీ లేకుండా పంట చేతి కొస్తదంటే రోజుకు 20 సార్లేం ఖర్మ 200 సార్లయినా వేదోక్తులను ఉచ్ఛరిస్తారు.

ఈ శివ్‌యోగ్‌ కాస్మిక్‌ ఫార్మింగ్‌ విధానాన్ని మాజీ రసాయనిక ఇంజనీరు, ప్రస్తుత ʹశివ్‌ యోగ్‌ ఫౌండేషన్‌ʹ యోగా గురువు అవదూత్‌ శివానంద్‌ కనిపెట్టారట! ఆయన దగ్గర శిష్యరికం చేస్తున్న మంత్రి సర్దేశాయ్‌ భార్య ఉష ఈ వ్యవసాయం గురించి చెప్పడంతో నమ్మిన మన మంత్రి సర్దేశాయ్‌ దాన్ని అమలు చేయడం కోసం ఏకంగా స్కీమ్‌నే ప్రారంభించారు. ఈ అంశంలో సరైన అధ్యయనం లేకుండా ఎలా కాస్మిక్‌ ఫార్మింగ్‌ విధానాన్ని ప్రారంభిస్తారని సదరు మంత్రిని మీడియా ప్రశ్నించగా, మధ్యప్రదేశ్‌లో ఈ విధానం మంచి ఫలితాలు ఇచ్చిందని తెలిసి ప్రారంభించానని చెప్పారు.

మంత్రాలు చదివి పంటలు పండించడం వాటిని మళ్ళీ అమ్ముకోవడం, వాటికి గిట్టుబాటు ధర రాక ఆత్మహత్యలు చేసుకోవడం, వాటిని కొనుక్కోవడానికి డబ్బులు లేనివాళ్ళు ఆకలికి మాడి చనిపోవడం ఇవన్నీ లేకుండా అసలు ఆకలే లేకుండా మంత్రాలేమీ లేవా విజయ్ సర్దేశాయ్ గారూ ?

Keywords : Goa minister, mantras, vedas, vijay sardeshay
(2024-04-24 20:16:18)



No. of visitors : 1454

Suggested Posts


బాలికలపై సామూహిక అత్యాచారం - బాధితులదే తప్పన్న గోవా ముఖ్యమంత్రి

గోవాలోని ఒక బీచ్‌లో ఇద్దరు బాలికలు సామూహిక అత్యాచారానికి గురైన సంఘటనపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ దుర్మార్గమైన కామెంట్లు చేశాడు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


పంటలు