78 ఏళ్ళ స్వామి అగ్నివేష్ పై చెడ్డీ గ్యాంగ్ దాడి


78 ఏళ్ళ స్వామి అగ్నివేష్ పై చెడ్డీ గ్యాంగ్ దాడి

సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌పై జార్ఖాండ్‌లోని పకూర్‌లో మంగళవారంనాడు చెడ్డీ గ్యాంగ్ మూక దాడి చేసింది.. ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన వచ్చినప్పుడు బీజేపీ యువమోర్చా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)కి చెందిన కార్యకర్తలు జై శ్రీరాం నినాదాలు చేస్తూ 78 ఏళ్ళ వృద్దుడైన అగ్నివేష్ ను తీవ్రంగా కొట్టడంతో పాటు దుస్తులు చించివేశారు.
ʹసభా స్థలి నుంచి బయటకు రాగానే బీజేవైఎం, ఏబీవీపీ కార్యకర్తలు నాపై దాడి చేశారు. నేను హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడానంటూ వారు ఆరోపణలు చేశారుʹ అని స్వామి అగ్నివేష్ తెలిపారు. జార్ఖాండ్ ప్రశాంతమైన రాష్ట్రమని తాను అనుకున్నానని, ఈ ఘటన తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకుంటున్నానని ఆయన చెప్పారు. దాడికి సంబంధించిన వీడియోలో ఒక పెద్ద గుంపు అగ్నివేష్‌పైన, ఆయన అనుచరులపైన దాడి జరిపినట్టు ఉంది. నిరసనకారులు తొలుత నినాదాలు చేస్తూ, నల్లజెండాలు ప్రదర్శించారనీ, ఆ తర్వాత దాడికి తెగబడ్డారని అగ్నివేష్ తెలిపారు. ఈ దాడిలో తాను కిందపడిపోయినట్టు చెప్పారు. తన సహచరులు ఎంత ప్రయత్నించినా తనపై జరిగిన దాడిని అడ్డుకోలేకపోయారని వివరించారు. కాగా, ఈ దాడికి సంబంధించి 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నిందితులను వదిలిపెట్టేది లేదని పకూర్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అశోక్ కుమార్ సింగ్ తెలిపారు.

Keywords : jarkhand, swamy agnivesh, rss, abvp, bjp, attack
(2021-04-16 21:47:30)No. of visitors : 2851

Suggested Posts


మాఊర్లో మారాజ్యం... స్వతంత్రం ప్రకటించుకున్న 100 ఆదివాసీ గ్రామాలు

మా ఊళ్లో మా రాజ్యం అంటూ ఆదివాసీలు స్వ‌యం పాల‌న‌ను ప్ర‌క‌టించుకుంటున్నారు. ఝార్ఖండ్‌లోని దాదాపు వంద‌ ఆదివాసీ గ్రామాలు ఇప్పుడీ ఉద్య‌మంలో భాగ‌మ‌య్యాయి. ʹఈ గ్రామం మాది. దీనిపై సర్వహక్కులూ మావి.

Fact-finding team alleges CRPF brutality in Jharkhand villages

On 5-6 March 2021, a human rights fact-finding team of CDRO and HRLN visited three police station areas of the Giridih district - Madhuvan, Dumri and Pirtand, where the central government has decided to set up para – military camps. Following the decision there has been massive protests by the villagers. The team met these villagers and got complete info

జార్ఖండ్ లో ఆదివాసులపై సి ఆర్ పి ఎఫ్ దుర్మార్గాలు -నిజనిర్దారణ రిపోర్ట్

జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడి జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నెలకొల్పుతున్న కొత్త సి ఆర్ పి ఎఫ్ క్యాంపులకు వ్యతిరేకంగా నిరసన తెలియచేస్తున్న ఆదివాసీ సంతాల్ గ్రామస్తులపై జరుగుతున్న దాడులు, అణిచివేతలకు సంబంధించి CDRO 2021 మార్చి 5, 6, & 7వ తేదీలలో జరిపిన నిజ నిర్ధారణ రిపోర్ట్

Search Engine

వ్యాక్సిన్ రెండో డోస్ వేసుకున్నాక కూడా... కరోనాతో చత్తీస్ గడ్ హెల్త్‌ జాయింట్‌ డైరెక్టర్ మృతి
వైరల్ అయిన మెడికోల డాన్స్ వీడియో: మతం రంగు పూసేందుకు ఉన్మాదుల ప్రయత్నం - తిప్పికొట్టిన‌ నెటిజనులు
దారుణం... చెత్త లారీల్లో కోవిడ్ పేషెంట్ల మృతదేహాలు తరలింపు...
ఉమర్ ఖలీద్ కు బెయిల్ మంజూరు
కుంభమేళాలో కరోనా తాండవం
కరోనా మరణాలపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఏప్రిల్‌‌ 26 భారత్ బంద్ ను జ‌య‌ప్ర‌దం చేయండి - మావోయిస్టు పార్టీ పిలుపు
ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి సభలను సమరొత్సాహంతో జరుపుకుందాం ‍- మావోయిస్టు పార్టీ పిలుపు
తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు
Chattisghar Encounter: Maoist Party released a Letter
చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన
సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘనే ‍- కే.కేశవరావు
అమ్మను కూడా కలవనివ్వరా ? - షోమాసేన్ కూతురు లేఖ
లొంగి పోయిన ʹమావోయిస్టుʹలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి
సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన ప్రముఖ రచయిత‌
ఆదివాసీ హక్కుల కార్యకర్త అక్రమ అరెస్ట్ - విడుదల చేయాలని జర్నలిస్టులు, ప్రజా సంఘాల డిమాండ్
Fact-finding team alleges CRPF brutality in Jharkhand villages
శ్రామిక మహిళా దినోత్సవ కార్యక్రమంపై ఏబీవీపీ దాడి - చూస్తూ నిల్చున్న పోలీసులు
జార్ఖండ్ లో ఆదివాసులపై సి ఆర్ పి ఎఫ్ దుర్మార్గాలు -నిజనిర్దారణ రిపోర్ట్
విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుద్దాం - మావోయిస్టు నేత జగన్ ప్రకటన‌
విప్లవ స్వాప్నికుడు ఉప్పు కృష్ణ అమర్ రహే !
టైమ్ మాగజైన్ కవర్ స్టోరీ: రైతాంగంపోరాటం - మహిళల నాయకత్వం
సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డే రాజీనామా చేయాలని 4వేల మంది ప్రముఖుల డిమాండ్
రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు
Supreme Court Chief Justice Bobde should resign immediately - Letter from 4,000 women and rights activists
more..


78