మోడీ రాజ్యం: మోసాన్ని బహిర్గతం చేసినందుకు ఉద్యోగాలు పోగొట్టుకున్న‌జర్నలిస్టులు !

మోడీ

ఏబీపీ న్యూస్‌ నెట్‌వర్క్‌ మేనేజింగ్‌ ఎడిటర్ మిలిండ్‌ ఖండేకర్‌ తోటి జర్నలిస్ట్‌ పుణ్య ప్రసూన్‌ బాజ్‌పేయి ఏబీపీ టీవీ ఛానెల్‌లో రాత్రి 9 గంటలకు ʹమాస్టర్‌ స్ట్రోక్‌ʹ పేరిట షోను నిర్వహిస్తుంటారు. ఆయన సాధారణంగా ఈ షో ద్వారా ప్రభుత్వ విధానాల్లో ఉన్న తప్పొప్పుల గురించి సమీక్షింస్తుంటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్‌ 20వ తేదీన వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల తీరు తెన్నుల గురించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లభ్దిదారులతో ముచ్చటించారు. ఆ సమీక్షలో భాగంగా చత్తీస్‌గఢ్‌ నుంచి చంద్రమణి కౌషిక్‌ను మోదీ ఓ ప్రశ్న అడగ్గా, తాను వరి పంటకు బదులుగా సీతాఫలాల తోటను సాగు చేయడం వల్ల తన ఆదాయం రెట్టింపు అయిందని చెప్పారు. అది అబద్ధమని, ఆమెతోని అలా చెప్పించారని ʹమాస్టర్‌ స్ట్రోక్‌ʹ కార్యక్రమంలో విమర్శించారు.

ʹమోదీ గారు మీరు ఎప్పుడు మీ మనసులోని మాటను మాకు వినిపిస్తారు. ఓసారి మా మనసులోని మాటను కూడా మీరు వినండిʹ అంటూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఏబీపీ మాస్టర్‌ స్ట్రోక్‌ కార్యక్రమం వీడియో క్లిప్‌ను ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ కాస్త వైరల్‌ అవడంతో బీజేపీ నాయకులకు కోపం వచ్చింది. కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి, రాజవర్ధన్‌ రాథోడ్, కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ లాంటి ప్రముఖులు సహా పలువురు నాయకులు అది ʹఫేక్‌ న్యూస్‌ʹ అంటూ గొడవ చేశారు. నరేంద్ర మోదీ వ్యతిరేక ఎజెండా ప్రకారం జర్నలిస్టులు పనిచేస్తున్నారంటూ వారంతా విమర్శించారు. దాంతో ఏబీపీ నెట్‌వర్క్‌ తన రిపోర్టర్‌ను చత్తీస్‌గఢ్‌లోని చంద్రమణి వద్దకు పంపించింది. ఆ రిపోర్టర్‌ ఆమెను ఇంటర్వ్యూను చేశారు. ఇందులో తన తప్పేమి లేదని, అధికారులు ఎలా చెప్పమంటే అలా చెప్పానని చంద్రమణి చెప్పారు.

ʹఇదిగో పూజ్యనీయులైన మంత్రులారా! నకిలీ వార్తంటూ మాపై అభాండం వేసిన మీకు ఇదే మా సరైన సమాధానం అంటూ చంద్రమణి ఇంటర్వ్యూనుʹ ఏబీపీ ఛానల్‌ ప్రసారం చేసింది. అంతే ఆ రోజు నుంచి ఆ చానెల్‌ను బీజేపీ నాయకులు బహిష్కరించడమే కాకుండా ʹమాస్టర్‌ స్ట్రోక్‌ʹ కార్యక్రమం ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నారు. ఈవిషయమై ఛానెల్‌ నిర్వాహకులు ʹటాటా స్కైʹని సంప్రతించగా, బ్రాడ్‌ క్యాస్టరే నిలిపివేస్తున్నట్లు తెల్సింది.

అయితే ఇక్కడితో కథ అయిపోలేదు. బుధవారం నాడు ఏబీపీ న్యూస్‌ నెట్‌వర్క్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌ మిలిండ్‌ ఖండేకర్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆ మరుసటి రోజు అంటే, గురువారం నాడు ఆయన తోటి జర్నలిస్ట్‌ పుణ్య ప్రసూన్‌ బాజ్‌పేయి కూడా రాజీనామా చేశారు. మరో జర్నలిస్ట్‌ అభిసర్‌ శర్మ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు.

వాళ్ళు రాజినామాలు ఎందుకు చేశారో ఆ రాజినామాల వెనక ఏం జరిగి ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఈ దేశంలో కొత్త కాదు. మన రాష్ట్రంలోనూ కొత్తకాదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అతనికి నచ్చని విషయాలు రాసిన కొందరి జర్నలిస్టుల ఉద్యోగాలు ఊడిపోవడం కొందరికైనా తెలిసే ఉంటుంది. అది ఒక్క చంద్రబాబు ఒక్కడే చేశాడని కూడా కాదు. అంతకు ముందు ఆతర్వాత ఎందరో ముఖ్యమంత్రులు, మంత్రులు, చివరకు అధికారులు కూడా ఎందరో జర్నలిస్టుల ఉద్యోగాలు ఊడబెరికించిన సందర్భాలున్నాయి. ఇక బీజేపీ ఇందులో ఆరితేరింది.నచ్చని కార్యక్రమాలను అడ్డుకోవడం బీజేపీ, ఆరెస్సెస్‌కు కొత్తేమి కాదు. అధికారంలో లేకుండా కూడా వాళ్ళు బెదిరింపులతో, దాడులతో తమకు నచ్చని కార్యక్రమాలను బలవంతంగా ఆపేసేందుకు ప్రయత్నించారు. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు గోవింద్‌ నిహ్లాని తీసిన సంచలన టెలివిజన్‌ సీరియల్‌ ʹతమస్‌ʹ దూరదర్శన్‌లో ప్రసారం అవుతున్నప్పుడు వివిధ పద్ధతుల్లో దాన్ని అడ్డుకునేందుకు ఆరెస్సెస్‌ కార్యకర్తలు ప్రయత్నించారు. కేబుల్‌ ఆపరేటర్లను బెదిరించి ఆ సీరియల్‌ ప్రసారానికి అడ్డు పడేవారు. కొన్ని కాలనీల్లో ఫీజులు తీసి కరెంట్‌ సరఫరా నిలిపేసేవారు.
ఇప్పుడిక అధికారంలో ఉన్నారు వాళ్ళకు అడ్డేముంటుంది ? జర్నలిజం పట్ల నిబద్ధతతో నిజం చెప్పినందుకు, రాసినందుకు ఉద్యోగాలు పోవడమే కాదు ప్రాణాలే పోయే కాలం ఇది.

సాక్షి పత్రిక సౌజన్యంతో...
(https://www.sakshi.com/news/national/resignations-two-journalists-abp-news-cause-disquiet-newsrooms-1103947)

Keywords : abp news, bjp, narendra modi,
(2024-04-24 20:08:25)



No. of visitors : 1493

Suggested Posts


ఫోటోకు ఫోజు కోసం జుకర్ బర్గ్ ను లాగేసిన మోడీ !

అమెరికా పర్యటనలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కెమెరాలో కనిపించడం కోసం చేసిన ఓ పని ... ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో హల్ చల్ చేస్తోంది....

నరేంద్రమోడీ విదేశీ పర్యటనల ఖర్చెంత ?

భారతదేశపు ప్రధానమంత్రి భారతదేశంలో ఉండి పాలించాలని, పాలిస్తారని ఎవరైనా అనుకుంటారు. కాని నరేంద్ర మోడీ భారతదేశానికి అప్పుడప్పుడు వచ్చిపోతూ పాలిస్తున్నారని ఆయన మీద పరిహాసాలు వస్తున్నాయి. ఈ పరిహాసాలకు పరాకాష్టగా....

ఈ అనంతపు గగ్గోలు ఎవరికోసం?

దారుణాన్ని దారుణం అన్నవాడిపైననే అన్యాయాన్ని అన్యాయం అన్నవాడిపైనన ఈయనగారి వ్యంగం. పావులాకు, బేడాకు ఆడవాళ్ల శరీరాలపై పచ్చబొట్ల పాటలు రాసేవారి నుండి శాంతిని, మానవతావాద స్పందనను ఆశించడం మన బుద్దితక్కువతనమే అవుతుందనకుంటా

ప్రధాని మోడీ పీజీ చదువు అబద్దమేనా ?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎమ్.ఏ డిగ్రీ చేశాడన్నది అబద్దమేనా ? మోడీ అఫీషియల్ వెబ్ సైట్ లో ఈ సంవత్సరం మే వరకు ఉన్న డిగ్రీ వివరాలు జూన్ నెలలో ఎందుకు లేవు ? ఢిల్లీ లా మంత్రి జితేందర్ సింగ్ తోమర్ నకిలీ డిగ్రీ కేసులో.....

బాలికా విద్య పై గుజ‌రాత్‌ గొప్పలన్నీ ట్రాష్

బాలిక‌ల సంక్షేమం, బాలిక‌ల విద్యపై గుజ‌రాత్ ప్ర‌భుత్వం గొప్ప‌లు చెప్పుకుంటున్న‌ది. వాస్త‌వంగా వారి విద్య విష‌యంలో ఆ రాష్ట్రం అట్ట‌డుగున నిలిచింది.బాలిక‌ల బంగారు భ‌విష్య‌త్తు కోసం అంటూ *క‌న్యా కెల‌వ‌నీ* ప‌థ‌కం అమ‌లు చేస్తున్నామ‌ని....

కేంధ్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా రచయిత్రి సంచలన నిర్ణయం

ప్రముఖ రచయిత్రి కేంధ్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి వెనక్కి పంపింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామిక వాతావరణం చెడగొడుతూ, సాంస్కృతిక వైవిధ్యానికి తూట్లుపొడిచేవిధంగా పరిపాలిస్తోందని ఆరోపిస్తూ....

జైశ్రీరాం పదం కొందరు నేరస్థులకు ఆయుధమైంది...ఇకనైనా మూక దాడులు ఆపండి...మోడీకి లేఖ రాసిన 49 మంది ప్రముఖులు

మీరు పార్లమెంట్‌లో మూకదాడుల్ని ఖండించారు. కానీ అవి ఆగిపోలేదు. అయితే మీరు వాటిపై తీసుకున్న చర్యలేంటి? ఈ దేశంలో ఒక్క పౌరుడు కూడా భయంతో బతకాడినికి వీళ్లేదు. ʹజై శ్రీరామ్ʹ అనే పదం వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పుడది కొందరు ఆకతాయిలు, నేరస్థులకు ఆయుధమైంది.

రిజర్వు బ్యాంకు తేల్చిన సత్యం...నోట్ల రద్దుతో బ్లాక్ మనీ పోలేదు... వైటై పోయింది !

గతేడాది నవంబర్ 8వ తేదీ నుండి రిజర్వ్ బ్యాంకుకు తిరిగి వచ్చిన 1000, 500 రూపాయలు ఎన్ని అనేది ఇప్పటికి లెక్కలు తేల్చింది రిజర్వ్ బ్యాంక్. ఇప్పటి వరకు ఎవ్వరు ఎన్ని సార్లు అడిగినా నోరుమెదపని రిజర్వ్ బ్యాంక్ ఎట్టకేలకు బుధవారం విడుదల చేసిన వార్షిక రిపోర్టులో ఆ వివరాలు బయటపెట్టింది. 99 శాతం పెద్ద నోట్లు తమ వద్ద డిపాజిట్‌ ....

ʹప్రతిపక్షాల చేతబడి వల్లే బీజేపీ నేతలు చనిపోతున్నారుʹ

బీజేపీ నేతలపై ప్రతిపక్షాలు చేతబడి చేస్తున్నాయని బీజేపీ ఎంపీ సాధ్వి ప్రఙ్ఞాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీనియర్ నేతలు బాబూలాల్ గౌర్, అరుణ్ జైట్లీలకు నివాళులర్పించేందుకు ఏర్పాటు చేసిన సంతాప సభలో ప్రఙ్ఞా ఈ విధమైన‌ వ్యాఖ్యలు చేశారు.

Is the Real Reason why Narendra Modiʹs Helicopter did not Land at Bahraich, the Absentee Crowd ?

Was this, the poor response from his party and the people, then, the real reason why Modiʹs chopper did not land, not the weather but the absence of an enthusiastic cheering crowd?....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మోడీ