రాపూర్ దళితులపై దుర్మార్గమైన దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి - విరసం

రాపూర్

ఆంధ్రప్రదేశ్ లోని రాపూరు దళితవాడపై పోలీసు దమనకాండను నిరసిస్తూ విప్లవ రచయితల సంఘం ప్రకటన పూర్తి పాఠం

ఆగస్టు 1న నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్ పై ఆ ఊరీ దళితవాడ జనం కొంత మంది దాడి చేసి ఎస్. ఇని, ముగ్గురు కానిస్టేబుళ్లను కొట్టారన్న వార్త సంచలనం అయ్యి మెత్తం దళితవాడంతా పోలీసు దమనకాండకు బలవుతోంది, ఒక కేసు విషయమై విచారణకు పిలిపించిన పిలిచిన వ్యక్తులను ఎస్.ఐ కొట్టాడని, దాన్ని ప్రశ్నించినందుకు మహిళ మీద కూడా దాడి చేసి స్పృహ తప్పేలా కొట్టాడని, ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందనే వార్త బైటికి వ్యాపించడంతో వారికి సంబంధించిన వాళ్లు ఆవేశంతో దాడి చేశారు. రాళ్లు విసిరారు. ఇదంతా స్థానికులు, విలేకర్లు వీడియోల్లో రికార్డు చేశారు. 15 మంది దాకా జనం ఆవేశంతో పోలీసుల్ని కొట్టడం మీడియాలో కూడా వచ్చింది. ఎప్పుడూ జనాన్ని అదుపాజ్ఞల్లో పెట్టే పోలీసులకు ఇది అవమానంగా తోచింది. ప్రతీకారంతో ఏకంగా మాల కులానికి చెందిన అందరి మీదా దాడి చేశారు.
150 కుటుంబాలున్న రాపూరు దళిత కాలనీలోకి 300 మంది పోలీసులు దిగారు. మొత్తం కాలనీని చుట్టుముట్టి కనిపించిన వారినందరినీ విపరీతంగా కొట్టారు. అనారోగ్యంతో ఉన్న వాళ్లనీ, వృద్ధులను కూడా వదిలిపెట్టలేదు. ఇళ్లన్నీ గాలించి ఆధార్ కార్డులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. యాభై మందిని పైగా కేసుల్లో ఇరికించారు. హత్యాయత్నం దగ్గరి నుండి పదుల కొద్దీ కేసులు నమోదు చేశారు. 33 మంది రిమాండులో ఉండగా కనిపించకుండాపోయిన వాళ్లు పోలీసుల అక్రమ నిర్బంధంలో ఉన్నారన్న అనుమానాలు బంధువులు, స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఊరి నుండి బలగాలు వెళ్లిపోయినా పోలీసు టెర్రర్ ఇంకా అట్లాగే ఉంది.
పోలీసులు, చట్టం ఉన్నది ప్రతీకారం తీర్చుకోడానికి కాదు. జనాన్ని భయభక్తుల్లో, అదుపాజ్ఞల్లో ఉంచడానికి కాదు. ప్రజలకు రక్షణ కల్పించడానికి. చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే చట్టప్రకారమే వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. పోలీసులే చట్టాన్ని అతిక్రమించినా సరే, వారినీ న్యాయవ్యవస్థ పరిధిలో విచారించాల్సిన బాధ్యత చట్టానికి ఉంటుంది. ఈ విషయాన్ని ఎన్నడూ మన రక్షణ వ్యవస్థ గుర్తించలేదు. దీనికి తాజా నిదర్శనం రాపూరు ఘటనే. పైగా దాడి చేసింది దళితులు కాబట్టి మొత్తం దళితవాడ జనమందరి మీదా ప్రతీకారం తీర్చుకునేలా పోలీసు చర్యలుండటం మరింత దుర్మార్గం. రాజ్యం కుల ఆధిపత్య వైఖరికి నిదర్శనం. దీనిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆగస్టు 1నాటి ఘటన పూర్వాపరాల మీద సమగ్ర దర్యాప్తు జరపాలి. అక్రమ కేసులు ఎత్తివేయాలి. దళితవాడ మీద దాడి చేసి విచక్షణారహితంగా జనాన్ని కొట్టి అరెస్టులు చేసిన పోలీసు చర్యలపై కూడా విచారణ జరిపి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి.
-పాణి, కార్యదర్శి
విరసం

Keywords : andhrapradesh, rapuru, police, dalit, attack
(2024-04-24 20:08:03)



No. of visitors : 1773

Suggested Posts


Shocking video of two naked ‘Dalit women’ being thrashed by ‘upper caste’ women

A shocking video of two ʹDalit womenʹ being subjected to merciless thrashing and public humiliation allegedly women from upper caste has gone viral on social media platforms....

ముస్లింల రక్షణ కోసం కత్తులు దూసిన సిక్కులు,చేతులు కలిపిన దళితులు ‍- పరారైన శివసేన మూక

పంజాబ్ లోని పగ్వారా పట్టణంలో ముస్లింల మీద దాడి చేయడానికి ప్రయత్నించిన శివసేన గుంపును సిక్కులు, దళితులు, ముస్లింలు ఐక్యంగా ఎదుర్కొన్నారు. కాశ్మీర్ కు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు బుధవారంనాడు ర్యాలీ నిర్వహించారు ఈ సంధర్భంగా...

గోముసుగు దౌర్జన్యాలపై దళితుల యుద్దభేరి - భగ్గుమంటున్న గుజరాత్

దళితులు భగ్గుమంటున్నారు... తమపై హిందుత్వ శక్తులు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా కదం తొక్కుతున్నారు. గుజరాత్ లో గోరక్షకులు చేస్తున్న అమానుష అరాచకలాను ఎదిరిస్తూ ఆందోళనలకు దిగారు. గిరి సోమనాథ్ జిల్లాలోని ఊనాలో చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచిన...

గోరక్షకుల రాజ్యంలో.. ఆకలితో 500 ఆవులు మృత్యువాత !

బీజేపీ పాలిత రాజస్తాన్ లోని గోసంరక్షణ శాలలో పట్టించుకునే వారు కరువై ఆకలి, అపరిశుభ్రంతో రెండు వారాల్లో దాదాపు 500 ఆవులు మృత్యువాతపడ్డాయి. జైపూర్‌లోని హింగోనియా గోశాలలో దాదాపు 250 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.

చెట్టుకు కట్టేసి మత్తు సూదులేసి.. పెట్రోల్ పోసి.. దళిత బాలుడి పై అగ్రకుల అమానుషం !

కొంతమంది అగ్రకులస్థులు ఓ దళిత బాలుడికి నరకం చూపించారు. చెట్టుకుకట్టేసి బట్టలూడదీసి దారుణంగా కొట్టారు. అతడి మర్మాంగాలపై పెట్రోల్ పోసి హింసించారు. ఈ ఘటన ఆగ్రా జిల్లాలోని బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బాస్ కేసీ....

నీళ్ళు తాగనివ్వని అగ్రకుల అహంకారం - బావిలో పడి దళిత బాలుడి మృతి

మధ్యప్రదేశ్ దమోహ్ జిల్లా ఖమరియా కలాన్ గ్రామంలో మూడవతరగతి చదువుతున్న వీరన్ అనే దళిత బాలుడు మధ్యాహ్న భోజనం తర్వాత నీళ్ళు తాగడానికి....

ఢిల్లీ లో దళితులపై హిందుత్వ సంస్థల దాడి !

ఢిల్లీలో శాంతి యుత ప్రదర్శన నిర్వహిస్తున్న దళితులపై హిందుత్వ శక్తులు దాడి చేశాయి. గుజరాత్ లో దళితులపై దాడికి నిరసనగా ఆదివారంనాడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యూత్ ఫర్ బుద్దిస్ట్ ఇండియా అనే సంస్థ అద్వర్యంలో దళితులు ధర్నా.....

వాళ్ళకు కమ్మోళ్ళ రక్తమే కావాలట !

హైదరాబాద్ మాక్స్ క్యూర్ హాస్పటల్ లో చికిత్సపొందుతున్న ఓ మూడేళ్ళ చిన్నారికి రక్తం అవసరం వచ్చింది. బ్లడ్ డోనర్స్ ఇండియా అనే ట్విట్టర్ లో ఓ కుల గజ్జి మహానువుడు కమ్మోళ్ళ రక్తం కావాలని ట్వీట్ చేశాడు....

ముందుకు సాగుతున్న ʹఛలో ఉనాʹ - కదం తొక్కుతున్న గుజరాత్ దళితులు

గుజరాత్ దళితులు కదం తొక్కుతున్నారు. వారితో ముస్లింలు చేతులు కలుపుతున్నారు. అన్ని వర్గాల ప్రజాస్వామికవాదులు, విప్లవ, ప్రజా సంఘాలు ఒక్కటై కదులుతున్నారు. ఆగస్టు 5 న అహ్మదాబాద్ లో బయలు దేరిన ఛలో ఉనా ర్యాలీ అనేక పల్లెలు, పట్టణాలు....

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి దళిత విద్యార్థుల గెంటివేత

వాళ్ళు దళితులు.... రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంభాల నుండి వచ్చిన నిరుపేద విద్యార్థులు... ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు వాళ్ళు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చ‌దువుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు చ‌దువు రావడం లేదని పదో తరగతికి ప్రమోట్ చేయకుండా 34మంది విద్యార్థులను స్కూల్ నుండి గెంటేశారు....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


రాపూర్