ఓ అమ్మాయికి రక్షణగా నిల్చినందుకు దళిత యువకుడిని కొట్టి చంపిన ఉగ్రకుల మూక‌ !


ఓ అమ్మాయికి రక్షణగా నిల్చినందుకు దళిత యువకుడిని కొట్టి చంపిన ఉగ్రకుల మూక‌ !

ఓ

ఉగ్రకుల ఉన్మాదులు ఓ దళిత యువకుడిని రాళ్లతో కొట్టి చంపారు. ఉగ్రకుల మూక ఓ అమ్మాయిని ఏడిపిస్తుండగా అడ్డుపడిన రోహిత్ తొడివాన్ అనే దళిత యువకుడిని అగ్రవర్ణ మూక‌ రాళ్లతో కొట్టి చంపింది.
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలోని ఉల్లేద్ పూర్ గ్రామంలో బుధవారం కావడీ యాత్ర జరిగింది. ఆ సందర్భంగా కొంత మంది అగ్రకుల యువకుల మూక ఓ దళిత‌ అమ్మాయిని ఏడిపిస్తుండగా రోహిత్ తొడివాన్ అడ్డుకున్నాడు. ఈ సందర్భంగా వారి మధ్య గొడవ జరిగింది. గ్రామపెద్దలు జోక్యం చేసుకొని గొడవని ఆపారు. గురువారంనాడు అదే విశయంపై మళ్ళీ గొడవ జరిగింది. అప్పటికే భారీ సంఖ్యలో పోగైన ఉగ్రకుల మూక దళితులపై రాళ్ళ దాడికి దిగారు. దళితులు కూడా ప్రతి దాడి జరిపినప్పటికీ లాభం లేక పోయింది. ముందు రోజు తమ చేతుల్లో నుండి అమ్మాయిని రక్షించాడని రోహిత్ పై ఆగ్రహంగా ఉన్న ఉగ్రకుల మూక అతన్ని చుట్టుముట్టి రాళ్ళతో, లాఠీలు, ఇనుపకడ్డీలతో తీవ్రంగా కొట్టారు. దాంతో రోహిత్
నెత్తురోడుతూ కిందపడి పోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. అగ్రకుల మూక దౌష్ట్యానికి రోహిత్ బలై పోయాడు.
యథావిధిగా అంతా అయిపోయిన తర్వాత వచ్చిన పోలీసులు పది మందిపై కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు. రేపో మాపో వాళ్ళు బెయిల్ పై బైటికి వచ్చి మళ్ళీ దళితుల అమ్మాయిలను చెరబడుతూనే ఉంటారు. అడ్డుపడిన వారిని హత్యలు చేస్తూనే ఉంటారు. ఇది కారంచేడు నుండి ఇప్పటి వరకు జరుగుతున్నదే కదా. ఏ పార్టీలు అధికారంలో ఉన్నా అసలు అధికారం ఈ ఉగ్రకుల మూకలదైనంత కాలం...మళ్ళీ మళ్ళీ ఇది జరుగుతూనే ఉంటుంది.
ఈ వార్త సోషల్ మీడియాలో ఒక మిత్రుడు పోస్ట్ చేసినప్పుడు జరిగిన చర్చ దేశ దౌర్బాగ్యానికి అద్దంపట్టింది. అక్కడ చంపింది అగ్రకులాలు, చనిపోయింది దళితుడు అని చూడొద్దట. అది కులానికి సంబంధం లేదట. రౌడీలు , గూండాలు అన్ని కులాలలో ఉంటారట. ఈ వాదన నిజమే కానీ ఎందుకో అన్ని చోట్ల దళితులే హత్యచేయబడుతుంటారు? దళిత యువతులే అత్యాచారాలకు గురౌతుంటారు? కారంచేడు, చుండూరు, పదిరికుప్పం, నేరెళ్ళ, మంథని, రాపూరు, గుజరాత్, రాజస్తాన్, మహారాష్ట్ర...ఇలా రాసుకుంటూ పోతే..అసలు ఈ దేశంలో దళితులపై వివక్షలేని, అణిచివేత లేని హత్యలు జరగని, అత్యాచారాలు జరగని రాష్ట్రమేదైనా ఉన్నదా ? గ్రామమేదైనా ఉన్నదా?
దాడులు చేసేవారు చేస్తూనే ఉంటారు...హత్యలు జరుగుతూనే ఉంటాయి...అత్యాచారాలు ఆపడానికి పాలకులు ఎప్పుడూప్రయత్నించరు.. దళితులు, ఇతర అణగారిని వర్గాలు, నిజాయీతీగా వాళ్ళకు మద్దతిచ్చేవాళ్ళు ఉగ్రకులమూకల, చెడ్డీ గ్యాంగుల దుర్మార్గాలను ఎదిరిస్తూనే ఉంటారు. ఇది తరతరాలుగా ఈ దేశంలో జరుగుతున్న యుద్దం. మనం ఏ వైపు ఉండాలో నిర్ణయించుకోవాల్సింది మనమే. కానీ అసలు సమస్యంతా... ʹʹఅసలు ఈ దేశంలో కుల వివక్షనే లేదు. అసలు కులమనేదే లేదుʹʹ. ʹʹదళితులను మేము సోదరుల్లా చూస్తాము..ʹʹ ʹʹ అసలు నాకు కులమంటే నచ్చదు ʹʹ ʹʹనాకు చాలా మంది దళిత మిత్రులున్నారు తెలుసా! వాళ్ళు మా ఇంట్లో అన్నం కూడా తింటారుʹʹ ʹʹదాడులు, హత్యలు, అత్యాచారాల్లో కులాన్నెందుకు తీసుకవస్తారు ? ʹʹ అనే వాదనలు చేసేవాళ్ళతోనే అసలు సమస్య. మేదావులుగా, గొప్ప ఆదర్శవాదులుగా ఫోజులు కొడుతూ సమాజంలోమనచూట్టూ తిరిగే, సోషల్ మీడియాలో సెకనుకో పోస్టు పెట్టే మేకవన్నె పులులతోనే అసలు సమస్య. ఈ దేశంలో ఒక దళితుడి జీవిత వేదన... దుఖం... మనసుకు, శరీరానికి అయ్యే గాయాలు అర్దం కావాలంటే దళితుడిగా పుట్టడం తప్ప మరో మార్గం లేదు. అనుభవిస్తే కదా ఏ బాదైనా తెలిసేది ! అయినా సరే దళితుణ్ణి ఆవాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. కష్టాల్లొ, కన్నీళ్ళలో అండగా ఉందాం...ఈ దేశపు బ్రాహ్మణీయ హిందుత్వంపై, మనువాదులపై పోరాటానికి అణగారిన కులాలు, వర్గాలు ఏకమవుదాం... కుల రహిత, మత రహిత, వర్గ రహిత సమాజ నిర్మాణం కోసం ఆయుధమవుదాం.

Keywords : dalit, murder, uttarapradesh, upper cast, hindutva
(2018-09-23 09:01:43)No. of visitors : 434

Suggested Posts


Shocking video of two naked ‘Dalit women’ being thrashed by ‘upper caste’ women

A shocking video of two ʹDalit womenʹ being subjected to merciless thrashing and public humiliation allegedly women from upper caste has gone viral on social media platforms....

ముస్లింల రక్షణ కోసం కత్తులు దూసిన సిక్కులు,చేతులు కలిపిన దళితులు ‍- పరారైన శివసేన మూక

పంజాబ్ లోని పగ్వారా పట్టణంలో ముస్లింల మీద దాడి చేయడానికి ప్రయత్నించిన శివసేన గుంపును సిక్కులు, దళితులు, ముస్లింలు ఐక్యంగా ఎదుర్కొన్నారు. కాశ్మీర్ కు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు బుధవారంనాడు ర్యాలీ నిర్వహించారు ఈ సంధర్భంగా...

గోముసుగు దౌర్జన్యాలపై దళితుల యుద్దభేరి - భగ్గుమంటున్న గుజరాత్

దళితులు భగ్గుమంటున్నారు... తమపై హిందుత్వ శక్తులు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా కదం తొక్కుతున్నారు. గుజరాత్ లో గోరక్షకులు చేస్తున్న అమానుష అరాచకలాను ఎదిరిస్తూ ఆందోళనలకు దిగారు. గిరి సోమనాథ్ జిల్లాలోని ఊనాలో చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచిన...

గోరక్షకుల రాజ్యంలో.. ఆకలితో 500 ఆవులు మృత్యువాత !

బీజేపీ పాలిత రాజస్తాన్ లోని గోసంరక్షణ శాలలో పట్టించుకునే వారు కరువై ఆకలి, అపరిశుభ్రంతో రెండు వారాల్లో దాదాపు 500 ఆవులు మృత్యువాతపడ్డాయి. జైపూర్‌లోని హింగోనియా గోశాలలో దాదాపు 250 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.

చెట్టుకు కట్టేసి మత్తు సూదులేసి.. పెట్రోల్ పోసి.. దళిత బాలుడి పై అగ్రకుల అమానుషం !

కొంతమంది అగ్రకులస్థులు ఓ దళిత బాలుడికి నరకం చూపించారు. చెట్టుకుకట్టేసి బట్టలూడదీసి దారుణంగా కొట్టారు. అతడి మర్మాంగాలపై పెట్రోల్ పోసి హింసించారు. ఈ ఘటన ఆగ్రా జిల్లాలోని బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బాస్ కేసీ....

నీళ్ళు తాగనివ్వని అగ్రకుల అహంకారం - బావిలో పడి దళిత బాలుడి మృతి

మధ్యప్రదేశ్ దమోహ్ జిల్లా ఖమరియా కలాన్ గ్రామంలో మూడవతరగతి చదువుతున్న వీరన్ అనే దళిత బాలుడు మధ్యాహ్న భోజనం తర్వాత నీళ్ళు తాగడానికి....

ఢిల్లీ లో దళితులపై హిందుత్వ సంస్థల దాడి !

ఢిల్లీలో శాంతి యుత ప్రదర్శన నిర్వహిస్తున్న దళితులపై హిందుత్వ శక్తులు దాడి చేశాయి. గుజరాత్ లో దళితులపై దాడికి నిరసనగా ఆదివారంనాడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యూత్ ఫర్ బుద్దిస్ట్ ఇండియా అనే సంస్థ అద్వర్యంలో దళితులు ధర్నా.....

వాళ్ళకు కమ్మోళ్ళ రక్తమే కావాలట !

హైదరాబాద్ మాక్స్ క్యూర్ హాస్పటల్ లో చికిత్సపొందుతున్న ఓ మూడేళ్ళ చిన్నారికి రక్తం అవసరం వచ్చింది. బ్లడ్ డోనర్స్ ఇండియా అనే ట్విట్టర్ లో ఓ కుల గజ్జి మహానువుడు కమ్మోళ్ళ రక్తం కావాలని ట్వీట్ చేశాడు....

ముందుకు సాగుతున్న ʹఛలో ఉనాʹ - కదం తొక్కుతున్న గుజరాత్ దళితులు

గుజరాత్ దళితులు కదం తొక్కుతున్నారు. వారితో ముస్లింలు చేతులు కలుపుతున్నారు. అన్ని వర్గాల ప్రజాస్వామికవాదులు, విప్లవ, ప్రజా సంఘాలు ఒక్కటై కదులుతున్నారు. ఆగస్టు 5 న అహ్మదాబాద్ లో బయలు దేరిన ఛలో ఉనా ర్యాలీ అనేక పల్లెలు, పట్టణాలు....

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి దళిత విద్యార్థుల గెంటివేత

వాళ్ళు దళితులు.... రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంభాల నుండి వచ్చిన నిరుపేద విద్యార్థులు... ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు వాళ్ళు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చ‌దువుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు చ‌దువు రావడం లేదని పదో తరగతికి ప్రమోట్ చేయకుండా 34మంది విద్యార్థులను స్కూల్ నుండి గెంటేశారు....

Search Engine

అంటరాని ప్రేమ
వీవీ ఇంటిని చుట్టుముట్టిన ఏబీవీపీ.. అడ్డుకున్న స్థానికులు
ప్రజా కోర్టులో తేలిన నిజం.. బాక్సైట్ తవ్వకాలు, భూకబ్జాలే ఎమ్మెల్యే హత్యకు కారణం
అమృతకు క్షమాపణలతో..
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది-ఒడిషాలో బలపడ్డాం..విస్తరిస్తున్నాం: మావోయిస్టు పార్టీ
నన్నో దేశద్రోహిగా చిత్రీకరించాలని పోలీసులు ప్రయత్నించారు..!
ఓటమిని అంగీకరించలేక బీభత్సం సృష్టించిన ఏబీవీపీ.. గూండాలతో లెఫ్ట్ విద్యార్థులపై దాడి
హక్కుల కార్యకర్తల అక్రమ అరెస్టుల కేసులో పిటిషనర్ల లాయర్ సుప్రీంకు చెప్పిన నిజాలు ఇవే
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
ఆంటీ! చంపేసారాంటీ..నా ప్రణయ్‌ను చంపేసారు
జేఎన్‌యూపై ఎర్రజెండా రెపరెపలు.. మతోన్మాదులను మట్టి కరిపించి లెఫ్ట్‌ను మళ్లీ గెలిపించిన విద్యార్థులు
నీ కోసం వేలాది మంది వచ్చారు.. ఒక్కసారి లే ప్రణయ్..
ప్రొఫెసర్ సాయిబాబకు చిన్నారి సాహస్ లేఖ.. ప్రశ్నించడమే నువ్వు చేసిన తప్పా..?
ఇవి పరువు హత్యలు కావు.. దేశం పరువు తీసే హత్యలు
అమృత తండ్రి దుర్మార్గపు చరిత్ర.. కూతురు కంటే పరువే ముఖ్యమంటున్న కులోన్మాది
ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదే.. పెద్దలను కూడా ఈడ్చిపడేయటమే
ప్ర‌శ్నించ‌డ‌మే నేర‌మైన‌ప్పుడు : క్రాంతి
తలపాగా ధరించాడని ఎస్సీ వర్గీయుడి తల ఒలిచేసిన అగ్రకుల ఉన్మాదులు
ʹక్రాంతి కోస‌మే ఈ ప్ర‌యాణంʹ
SUSPEND AGREEMENTS WITH INDIA UNTIL THE HUMAN RIGHT ACTIVISTS ARE RELEASED : MEP TO EUROPEAN COMMISSION
స్వచ్చమైన హిందీ, సంస్కృత భాషలో ఉన్న ఉత్తరం వరవరరావు రాసిందేనా.?
మొదటి అర్బన్ నక్సల్ భగత్ సింగ్
ʹజీవితాన్ని ధారపోయడమే నక్సలిజం అయితే, నక్సలైట్లు చాలా మంచి వాళ్లుʹ
70 ఏండ్ల చరిత్రను తిరగరాసిన విద్యార్థిని.. మతోన్మాద శక్తులపై లెఫ్ట్ విజయం
ప్రజల సభంటే.. ఇట్లుంటది
more..


ఓ