వరవరరావు అక్రమ అరెస్టు.. జర్నలిస్టు ఇండ్లపై దాడులను ఖండించిన జర్నలిస్టు సంఘాలు

వరవరరావు

పూణే పోలీసులు మంగళవారం నాడు చేసిన వరవరరావు అక్రమ అరెస్టు, జర్నలిస్టు ఇండ్లలో సోదాలను తెలంగాణలోని పలు జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
మోడీ హత్యకు కుట్ర పేరుతో పూణే పోలీసులు విరసం నేత వరవరరావును అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా.. సీనియర్ జర్నలిస్ట్ కూర్మనాథ్, నమస్తే తెలంగాణ జర్నలిస్టు క్రాంతి టేకుల ఇండ్లల్లో అక్రమంగా సోదాలు చేయడాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే - హెచ్ 143) ఒక ప్రకటనలో ఖండించింది. జర్నలిస్టుల ఇండ్లల్లో ఎలాంటి సెర్చి వారెంటు లేకుండానే కుటుంబ సభ్యులతో సహా అందరిని నిర్భంధించి సోదాలు నిర్వహించడం అక్రమమని యూనియన్ అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి క్రాంతి లు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి జీవనాడి లాంటి వ్యక్తి వరవరరావు 78 ఏళ్ల వయస్సులో హత్య....కుట్ర అంటూ వేధించడాన్ని తెలంగాణ సమాజం హర్షించదు అనే విషయాన్ని కేంద్రంలోని బి జె పి ప్రభుత్వం తెలుసుకుంటే మంచిదని వారన్నారు. వరవరరావు పై పెట్టిన కేస్ లను వెంటనే ఎత్తివేయాలి, జర్నలిస్ట్ ల కదలికల పై అనుమానం ఉంటే ముందుగా జర్నలిస్ట్ సంఘాల కు తెలియజేయాలని విషయాన్ని మరిచి అర్దరాత్రుల్లో ఇంట్లో చొరబడి సోదాలు చేయడం కరెక్ట్ కాదని టి యు డబ్ల్యూ జె అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్ లు విమర్శించారు. ఈ అక్రమ అరెస్టు, సోదాలను తీవ్రంగా ఖండిస్తన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

మరో ప్రకటనలో పోలీసులు తాము గతంలో చేసిన మోడీ హత్య కుట్రపై అవాస్తవాలను ప్రజలను నమ్మించడానికే ఈ అక్రమ అరెస్టులు సోదాలు చేసిందని టీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, విరాహత్ అలీలు ఒక ప్రకటనలో అన్నారు. ఉనికిని చాటుకోవడానికే సోదాల పేరుతో హైదరాబాద్‌లో విరసం నేత వరవరరావుతో పాటు మరికొందరి ఇళ్లపై.. జర్నలిస్టులు కుర్మానాథ్, టేకుల క్రాంతి ఇళ్లపై దాడులకు పూనుకోవడం, అక్రమంగా అరెస్టు చేయడం విచారకరమని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇది పత్రికా స్వేచ్ఛకు, భావప్రకటనా స్వేచ్ఛకు తూట్లు పొడవటమేనని.. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు తెలిపారు.

Keywords : పూణే పోలీసులు, సోదాలు, దాడులు, జర్నలిస్ట్స్, జర్నలిస్టు సంఘాలు, pune polce,illegal search, journalists, tuwj
(2024-04-24 20:02:37)



No. of visitors : 1017

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


వరవరరావు