పూణే పోలీసులు చూపించినవి కల్పిత లేఖలు : సుధా భరద్వాజ్

పూణే

మోడీ హత్యకు కుట్ర చేశారని ఆరోపిస్తు పూణే పోలీసులు హక్కుల కార్యకర్తలు వెర్నన్ గొన్జాల్వెస్, అరుణ్ ఫెరీరా, సుధా భరద్వాజ్, గౌతమ్ నావాల్కర్, విరసం నేత వరవరరావుల ఇళ్లలో సోదాలు చేసి అరెస్టులు చేసి పెద్ద కుట్రకు తెరతీశారు. ఎల్గార్ పరిషత్ కేసుకు సంబంధించిన విచారణలో రోనా విల్సన్ వద్ద లేఖలు లభించాయని.. వాటి ఆధారంగానే కేసులు నమోదు చేశామని పూణే పోలీసులు చెబుతున్నారు. అయితే అసలు ఆ లేఖలే నకిలీవని.. కల్పిత లేఖలతో అరెస్టులు ఎలా చేస్తారంటూ సుధా భరద్వాజ్ తమ లాయర్ వృందా గ్రోవర్ ద్వారా ఒక లేఖ విడుదల చేశారు.

హక్కుల కార్యకర్తగా పని చేస్తున్న పని చేస్తున్న న్యాయవాది సుధా భరద్వాజ్ డైరీలోని పేజీలు ఉపయోగించి సొంత దస్తూరీతో ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఆ లేఖలో ఆమె పోలీసుల ఆరోపణలను ఖండిస్తూ 9 పాయిట్లు రాశారు. అవి ఏంటంటే..

1. నా (సుధా భరద్వాజ్) తోపాటు, మానవ హక్కుల సంఘాల లాయర్లు, ఇతర ఉద్యమకారులు, సంస్థలను నేరాల్లో ఇరికించేందుకు పోలీసులు పూర్తిగా కల్పిత లేఖను సృష్టించారు.

2. బహిరంగంగా అందుబాటులో ఉన్న వాస్తవాలు, నిరాధార ఆరోపణలతో పోలీసులు ఈ లేఖలు సృష్టించారు.

3. చట్టబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన సమావేశాలు, సెమినార్లు లాంటి వాటిని పోలీసులు మావోయిస్టులకు నిధులు సమకూర్చేందుకు నిర్వహించామని చెబుతున్నారు.

4. హ్యూమన్ రైట్స్ లాయర్లు, ఆ సంస్థల కార్యకలాపాలు అడ్డుకోడానికి, వారిపై ద్వేషం కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగా వారికి మచ్చతెస్తున్నారు.

5. లాయర్స్ అసోసియేషన్ అయిన ఐఏపీఎల్‌ అధ్యక్షుడు జె.హోస్పేట్ సురేష్ లాయర్లపై దాడులకు వ్యతిరేకంగా మాట్లాడారని ఆ సంఘం చట్టబద్ధతనే రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

6. నేను మోగాలో జరిగిన ఏ కార్యక్రమానికీ, ఎప్పుడూ 50 వేల రూపాయలు ఇవ్వలేదని స్పష్టంగా చెప్పాను. మహారాష్ట్రకు చెందిన అంకిత్, లేదా కాశ్మీరీ వేర్పాటు వాదులతో సంబంధాలున్న కామ్రేడ్ అంకిత్ గురించి కూడా నాకు తెలీదు.

7. నాకు గౌతమ్ నవ్‌లాఖా, లాయర్ ప్రసాద్ చౌహాన్ గురించి కూడా తెలుసు. నన్ను నేరాల్లో ఇరికించడానికే వారి పేర్లు చెబుతున్నారు. వారిపై చేసిన ఆరోపణలు కూడా నిరాధారమైనవే.

8. జగదల్‌పూర్ లీగల్ ఎయిడ్ గ్రూప్‌కు కూడా ఎలాంటి నిషేధిత సంస్థ నుంచి ఏ నిధులూ కేటాయించలేదు. వారు చట్టబద్ధంగా, న్యాయంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

9. బస్తర్, చత్తీస్‌గఢ్‌లో మానవ హక్కుల ఉల్లంఘనను బయటపెట్టిన న్యాయవాదులు, ఉద్యమకారులు, సంస్థలపై ద్వేషం కలిగించడానికి, వారిని నేరాల్లో ఇరికించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇలా 9 పాయింట్లు రాసి పోలీసుల ఆరోపణలను ప్రవ్నించారు. చివరిలో "ఈ లేఖలు కల్పితమని మరోసారి స్పష్టం చేస్తున్నా. వీటిని జులై 4న రిపబ్లిక్ టీవీలో చూపించినపుడే నేను వాటిని ఖండించాను. నన్ను పుణెకు దూరంగా ఉంచాలని వారు కోరిన సమయంలో కనీసం పుణె కోర్టుకు గానీ, ఫరీదాబాద్‌ సీజేఎం ఎదుటగానీ ఈ లేఖలు సమర్పించలేదు" అని చెప్పారు.

Keywords : వరవరరావు, హక్కుల కార్యకర్తలు, సుధా భరద్వాజ్, పూణే పోలీసులు, కల్పిత లేఖలు, varavararao, rights activists, arrests, fake letters, pune police, sudha bharadwaja
(2024-04-24 19:29:17)



No. of visitors : 1302

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


పూణే