70 ఏండ్ల చరిత్రను తిరగరాసిన విద్యార్థిని.. మతోన్మాద శక్తులపై లెఫ్ట్ విజయం


70 ఏండ్ల చరిత్రను తిరగరాసిన విద్యార్థిని.. మతోన్మాద శక్తులపై లెఫ్ట్ విజయం

70

ఒక విద్యార్థిని మతోన్మాద శక్తుల మీద విజయం సాధించింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తన పోరాటాన్ని ఆపకుండా ముందుకు సాగి పంజాబ్ యూనివర్సిటీలో జయకేతనం ఎగరవేసింది. పంజాబ్ యూనివర్సిటీ స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో స్టూడెంట్ ఫర్ సొసైటీ (SFS) చారిత్రాత్మక విజయం సాధించింది. ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘమైన ఏబీవీపీ, ఆకాలీదళ్,కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘాలను ఓడించి చారిత్రిక విజయం సాధించింది.

70 ఏండ్ల పంజాబ్ యూనివర్సిటీ చరిత్రలో ఒక విద్యార్థిని స్టుడెంట్ కౌన్సిల్ టాప్ పోస్టును గెలుపొంది చరిత్రను సృష్టించింది. దాదాపు 60 శాతం అమ్మాయిలు ఉన్న ఈ యూనివర్సిటీలో ప్రతి సారి అబ్బాయిలే పోటీ చేసేవారు.గతంలో మూడు సార్లు SFS నుండి అమ్మాయిలను పోటీలో నిలబెట్టినప్పటికీ వారు స్వల్ప తేడాతో ఓటమిని చవిచూశారు.

అయితే ఈ సారి మాత్రం పట్టువదలని ఆత్మవిశ్వాసంతో విద్యార్థులలో కలసిపోయి.. సమస్యలపై పోరాటాలు చేస్తూ తమదైన స్థానం సంపాదించుకున్నారు. 2010లో ఏర్పడిన SFS మొదటి నుండి విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తూనే నిరంతరం విద్యార్థుల, బస్తీ వాసుల సమస్యలపై పాలక వర్గాలను ముచ్చెమటలు పట్టించింది. యూనివర్సిటీ సమస్యలపై జరిగే ప్రతీ నిరసనలో ఎస్ఎఫ్ఎస్ విద్యార్థుల భాగస్వామ్యం తప్పక ఉంటుంది. గతంలో యూనివర్సిటీ ఫీజులను పెంచినప్పుడు ఎస్ఎఫ్ఎస్ తీవ్రమైన ఆందోళనలు నిర్వహించింది. ఈ ఆందోళనలో 40 మంది ఎస్ఎఫ్ఎస్ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఇలా ఎన్నో పోరాటాలు చేసిన SFS తరపున విద్యార్థుల కౌన్సిల్‌కు పోటీ చేసిన కనుప్రియ కౌన్సిల్ టాప్ పోస్టుకు ఎన్నికైంది. అంతే కాకుండా ఈ కౌన్సిక్‌కు ఎన్నికైన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది.

SFSలో భాగస్వామ్యులైన విద్యార్థులు అప్పట్లో ప్రత్యేక తెలంగాణ కోరుతూ ర్యాలీలు కూడా నిర్వహించారు. వీరి పోరాటాలు 80వ దశకంలో ఓయూ విద్యార్థులు చేసిన పోరాటాలను తలపిస్తుంటాయి. పంజాబ్ యూనివర్సిటీలోని SFS సంస్థకు తెలంగాణతో ప్రత్యేక అనుబంధం ఉంది. అభివృద్ది పేరుతో ఆదివాసులని నిర్వాసితులను చేస్తూ పోలవరం ప్రాజెక్ట్‌ను కట్టడాన్ని SFS వ్యతిరేకించడమే కాకుండా ముంపు ప్రాంతాలైన 7 మండలాల్లో క్షేత్ర పర్యటన చేసి ఒక నివేదికను పంజాబ్‌లో విడుదల చేసింది. ఇక్కడి ఆదివాసీలకు మద్దతుగా చండిఘర్‌లో ఆందోళనలు నిర్వహించింది.

తెలంగాణలోని విద్యార్థి సంఘాలు తాము నిర్వహించే మీటింగుల్లో పంజాబుకు చెందిన మేధావులను, హక్కుల కార్యకర్తలను ముఖ్య వక్తలుగా ఎలా అయితే ఆహ్వానిస్తుందో.. SFS కూడా తెలంగాణ మేధావులని, విద్యార్థి సంఘాల నాయకులని ఆహ్వానించి రెండు రాష్ట్రాల్లో జరిపే ప్రజాతంత్ర ఉద్యమాల్లో ఐక్యతను పెంపొందిస్తుంది.

మతోన్మాదం పెట్రేగి పోతున్న నేటి పరిస్థితిలో ప్రజాతంత్ర భావాలు గల SFS గెలుపొందడం హర్షించదగ్గ పరిణామం.

Keywords : SFS, Kanu Priya, Punjab University, Student Council, Won, ఎస్ఎఫ్ఎస్, కనుప్రియ, పంజాబ్ యూనివర్సిటీ, విద్యార్థి సంఘం
(2019-03-19 18:19:05)No. of visitors : 971

Suggested Posts


0 results

Search Engine

ఒక సంఘీభావ ప్రదర్శన – ఒక విచారం – ఒక ఉత్తేజం
జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
more..


70