ఇవి పరువు హత్యలు కావు.. దేశం పరువు తీసే హత్యలు


ఇవి పరువు హత్యలు కావు.. దేశం పరువు తీసే హత్యలు

ఇవి

ప్రేమించి పెళ్లి చేసుకున్నదుకు మిర్యాలగూడలో దళిత యువకుడు ప్రణయ్ హత్యకు గురయ్యాడు. తన కళ్ళ ముందరే సహచరున్ని అత్యంత దారుణంగా కిరాయి హంతకుల చేత గొంతు నరికేసి హత్య చేయించారు అమృత తండ్రి, బాబాయి. కూతురు గర్భవతి అన్న కనికరం కూడా తండ్రికి లేదు. కన్నబిడ్డల జీవితం కన్నా కులమే ముఖ్యమనుకునే ఆధిపత్య కుల ఉన్మాదం మంథని మధుకర్‌ను, రాజేష్‌ను, భువనగిరి నరేష్‌ను ఇట్లా ఎంతో మందిని చంపేసింది. ఇటువంటి సంఘటనలు రోజురోజుకూ దిగ్భ్రాంతికరంగా పెరిగిపోతున్నాయి.

తనకిష్టమైన జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం యువతీ యువకులకు అత్యంత సహజమైన విషయం. పితృస్వామిక ఫ్యూడల్ కుటుంబ వ్యవస్థ మనుషుల మధ్య ప్రేమను కూడా అసహజంగా, అక్రమంగా చూస్తుంది. అనేక విధి నిషేధాలు విధిస్తుంది. కరడుగట్టిన కుల వ్యవస్థ దీనికి తోడై అత్యంత హింసాత్మకంగా అందులో జోక్యం చేసుకుంటుంది. వ్యక్తి స్వేచ్ఛను గౌరవించాల్సిన ఆధునిక రాజ్యాంగం చేష్టలుడిగి చూస్తూ ఉండిపోతున్నది.

కుల అంతరాలు పోవాలంటే కులాంతర వివాహాలు జరగాలన్నాడు అంబేద్కర్. అంబేద్కర్ సోషల్ ఇంటిగ్రేషన్ స్కీం కింద కులాంతర వివాహాలను ప్రోత్సహించాలానే విధానం కాగితాల్లో రాసుకొని ఏండ్లు గడుస్తున్నా దాని గురించిన కనీస అవగాహన కూడా జనంలో వ్యాపింపజేయలేదు. కులాన్ని మరింతగా కాపు గాసి పరిరక్షించే బూర్జువా రాజకీయ పార్టీలు, కుల ఆధిపత్యాన్ని తమ అధికార నిర్వహణ కోసం వాడుకుంటున్నాయి. దీనిని మరింత గట్టిపరిచే పని సంఘపరివార్ చేస్తోంది.

కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు, అందులో ఒకరు దళిత కులానికి చెందినవారు ఉంటే, రెండున్నర లక్షల రివార్డును కేంద్ర ప్రభుత్వం గత డిసెంబర్‌లో ప్రకటించింది. ఇదెంత పైపై ప్రకటనో, ఆచరణలో ఎంత కుట్రపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదో రోజురోజుకూ దళితుల మీద జరుగుతున్న దాడులు స్పష్టం చేస్తున్నాయి.

అమృత, ప్రణయ్ లాగా కుల సంకుచిత్వాలను, అగ్రకుల దాష్టీకాలను ఎదిరించి ఒక్కటైన జంటలు నిజానికి నవశకానికి నాంది వంటివాళ్ళు. వీళ్ళ ప్రేమ, సాహసం ఇట్లా అంతమైపోవడం దేశానికి సిగ్గు చేటైన విషయం. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు, అందునా దళితులకు అండగా ఉండాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సినిమాల్లో చూపించే చవకబారు ప్రేమ కథలు కాదు, మన దేశంలో ప్రేమకు ఎన్ని సవాళ్ళుంటాయో, ఎంత యుద్ధం చేయాలో యువతీ యువకులకు తెలియజెప్పాలి. ప్రణయ్ హాంతకులను ప్రభుత్వం శిక్షించాలని డిమాండ్ చేస్తూ, ఇక మీదట ఇలాంటి దారుణాలు జరక్కుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేద్దాం. దానికోసం ప్రజాస్వామికవాదులు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు ఆ దిశగా కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది.

- విరసం

Keywords : caste system, caste discrimination, murder, honor killings, virasam, miryalaguda, pranay, amruta, marutirao, కుల వివక్ష, హత్య, మిర్యాలగూడ, విరసం, ఖండన
(2019-06-22 19:53:45)No. of visitors : 1238

Suggested Posts


0 results

Search Engine

ప్రభుత్వ మైనింగ్ కంపెనీలను ప్రైవేట్ పరం చేసే కుట్రను ఎదుర్కుందాం...పౌరహక్కుల సంఘ‍ం
ʹఊపాʹ చట్టమే మరో ఎమర్జెన్సీ - ఎన్.నారాయణ రావు
దప్పికగొన్న భూమి - పి.వరలక్ష్మి
కోటీశ్వరుల పెళ్లి... 40 టన్నుల చెత్త‌ !
ʹమావోయిస్టు పార్టీ సభ్యుడవడం నేరంకాదని సుప్రీం కోర్టు చెప్పిందిʹ
నాగురించి కాదు జైళ్ళలో మగ్గుతున్న ఆదివాసుల గురించి మాట్లాడండి - వరవరరావు
వీవీ,సాయిబాబా తదితరులను వెంటనే విడుదల చేయాలి.....23న హైదరాబాద్ లోధర్నా
అడవి బిడ్డలను అరిగోస పెడ్తున్నరు
ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు
This TV reporter is winning praise for relentlessly questioning an errant BJP leader
ఇవ్వాళ్ళే సభ..అందరికి ఆహ్వానం
తమ‌ను జంతువుల్లా చూశారన్న ఆదివాసులు.. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
ఆ 67 మంది ఆదివాసులను మా ముందు హాజరుపర్చండి...హైకోర్టు ఆదేశం
ʹవ్యక్తిత్వమే కవిత్వం..వరవరరావు కవిత్వ విశ్లేషణʹ ...17 న సభ‌
83 ఏండ్ల స్టాన్ స్వామి ఇంటిపై పోలీసుల దాడి.. విరసం ఖండన
ʹచోళ రాజుల కాలం దళితులకు చీకటి యుగంʹ అన్నందుకు డైరక్టర్ పా రంజిత్ పై కేసు !
అనారోగ్యంతో నడవ‌లేకపోతున్నా వైద్య సహాయం ఇవ్వడం లేదు....జైలు నుండి అనూష లేఖ‌ !
యోగీ ʹరామరాజ్యంʹలో... జర్నలిస్టు నోట్లో మూత్రం పోసి కొట్టిన పోలీసులు..!
పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులు కిరణ్, నర్మదలను వెంటనే కోర్టులో హాజరుపరచాలి
యోగీ ఆదిత్యనాథ్‌పై సుప్రీం ఆగ్రహం.. ఆ జర్నలిస్ట్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశం
పచ్చని కొండల్లో మైనింగ్ చిచ్చు.. తమ జీవనం దెబ్బతీయొద్దంటూ ఆదివాసీల నిరవధిక దీక్ష
నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారు..సుప్రీంను ఆశ్రయించిన జర్నలిస్టు భార్య‌
భావ ప్రకటనా స్వేచ్చపై కత్తి...యోగి పాలనలో జర్నలిస్టుల అరెస్టులు
One Year of Bhima Koregoan Arrests: Protest Held in Delhi
మానవత్వం యూ టర్న్ తీసుకుంది..!
more..


ఇవి