ప్రజా కోర్టులో తేలిన నిజం.. బాక్సైట్ తవ్వకాలు, భూకబ్జాలే ఎమ్మెల్యే హత్యకు కారణం


ప్రజా కోర్టులో తేలిన నిజం.. బాక్సైట్ తవ్వకాలు, భూకబ్జాలే ఎమ్మెల్యే హత్యకు కారణం

ప్రజా

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేస్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను ఆదివారం డుంబ్రిగూడ మండలం లివిటిపుట్టు వద్ద మావోయిస్టులు కాల్చి చంపారు. దీనికి హకుంపేట మండలం గుడ గ్రామంలోని క్వారీ కారణమని ప్రాథమికంగా నిర్థారణకు వచ్చినా.. అసలు కారణాలు మాత్రం ఇంకా చాలా ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా మావోయిస్టులు ఒక నిర్ణయం తీసుకునే ముందు దాన్ని ప్రజా కోర్టులో ఉంచడం తప్పని సరి. ఏ నిర్ణయం కూడా సొంతంగా తీసుకోరనే విషయం తెలిసిందే. సర్వేశ్వరరావు, సోమ హత్యకు ముందు కూడా ప్రజాకోర్టు నిర్వహించారని సమాచారం. విశాఖ రేంజ్ డీఐజీ కూడా విలేకరులతో మాట్లాడుతూ కేవలం మావోయిస్టుల మాత్రమే కాదని.. ప్రజలు కూడా వాళ్లతో కలసి ఉన్నారని చెప్పారు. అంటే మావోయిస్టులు ఈ ఘటనకు ముందు ప్రజాకోర్టు నిర్వహించినట్లు స్పష్టంగా అర్థం అవుతోంది.

బాక్సైట్ తవ్వకాలు.. కబ్జాలు

అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమపై ఆ ప్రాంతంలో చాలా ఆరోపణలు వెల్లువెత్తాయి. వైసీపీ టికెట్‌పై గెలిచిన ఇతను కడప ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తితో కలసి రెండు క్వారీలు నిర్వహిస్తున్నట్లు ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు. పైకి బ్లాక్ చిప్స్ అని.. ప్రభుత్వ రోడ్ల నిర్మాణం కోసమని చెబుతున్నా.. అక్కడి నుంచి అక్రమంగా బాక్సైట్ తరలిస్తున్నట్లు సమాచారం. ఈ క్వారీ వ్యాపారానికి అడ్డు రాకూడదనే గత ఎన్నికల్లో తనపై పోటీ చేసిన సోమతో రాజీ చేసుకొని.. ఇద్దరూ కలసి క్వారీ వ్యాపారాన్ని నిరాటంకంగా సాగిస్తున్నారని ఆదివాసీలు అంటున్నారు. అక్కడ బాక్సైట్ తవ్వకాలకు అనుమతి లేదని సీఎం చంద్రబాబు చెబుతున్నా.. పరిశీలకులు మాత్రం అక్కడ జరిగేది బాక్సైట్ మైనింగే అని తేల్చారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అక్కడ బాక్సింగ్ తవ్వకాలు యధేచ్చగా సాగుతున్నాయని విమర్శించారు. మరోవైపు తన అక్రమ వ్యాపారానికి, మైనింగ్‌కి సీఎం చంద్రబాబు సహకరిస్తారనే ఒప్పందంతోనే పార్టీ మారినట్లు కూడా స్థానికులు చెబుతున్నారు. మరోవైపు సర్వేశ్వరరావు పాడేరులో అక్రమంగా భవనాలు నిర్మించడమే కాక.. ఆర్టీసికి చెందిన స్థలాన్ని లీజుకు తీసుకొని.. లీజు పూర్తయిన తర్వాత కూడా తన ఆధీనంలోనే ఉంచుకున్న విషయంపై పలు రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పించాయి. ఈ విషయం పాడేరు, అరకు ప్రాంతంలోని ప్రజలందరికీ తెలిసినా.. అధికార పార్టీ నాయకుడు కావడంతో ఎవరూ ధైర్యంగా ముందుకు వచ్చి పిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఒక ప్రజాప్రతినిధి ఇలా ప్రజావ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో విషయం మావోయిస్టుల వరకు చేరింది. క్వారీకి సంబంధించి మావోయిస్టులు పలు హెచ్చరికలు చేసినప్పటికీ సర్వేశ్వరరావు దురుసుగా వెళ్లాడని సన్నిహితులు చెబుతున్నారు.

పర్యావరణానికి హానీ చెయ్యొద్దని హెచ్చరించారు..

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సోమ చేస్తున్న అక్రమ బాక్సైట్ తవ్వకాలపై మావోయిస్టులు ముందే హెచ్చరించారా అంటే అవుననే అంటున్నారు ఆ ప్రాంతవాసులు. బాక్సైట్ తవ్వకాల వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని వెంటనే ఆ తవ్వకాలను నిలిపేయాలని మావోయిస్టులు హెచ్చరించినట్లు స్థానికులు చెబుతున్నారు. అడవులు దెబ్బతిని.. ఆదివాసీల మనుగడ కష్టమవుతోందని.. విలువైన ఖనిజ సంపదను విదేశాలకు తరలించవద్దని మావోయిస్టులు వారికి స్పష్టం చేసినట్లు సమాచారం. ఇప్పటికే క్వారీలు, బాక్సైత్ తవ్వకాల వల్ల తాము చాలా నష్టపోతున్నామని ఆదివాసీలు మొరపెట్టుకోవడం.. తమ హెచ్చరికలు కూడా వారిద్దరు ఖాతరు చెయ్యకపోవడంతో మావోయిస్టులు వారిని ప్రజా కోర్టుకు పిలిచినట్లు తెలుస్తోంది.

ప్రజా కోర్టులో ఏం జరిగింది..!

సర్వేశ్వరరావు, సోమ.. ఇద్దరికీ తాము చేస్తున్న అక్రమ మైనింగ్‌పై మావోయిస్టులు ఏనాటికైనా స్పందిస్తారని ముందే ఊహించినట్లు సన్నిహితులు చెబుతున్నారు. అయితే తాము కూడా ఆదివాసీలమే కదా.. కావాలంటే వాళ్లతో రాజీ చేసుకుందాం అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఆదివారం రోజు క్వారీకి సంబంధించిన పనుల కోసమే బయలుదేరిని వీరికి.. డుంబ్రిగూడ మండలంలో మావోయిస్టులు, ప్రజలు వారిని అడ్డుకున్నారు. ఎమ్మెల్యేను దాదాపు అరగంట సేపు ప్రజా కోర్టులో విచారించినట్లు ప్రత్యక్ష సాక్షులు మీడియాకు చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలను కిడారి ఒప్పుకున్నట్లు ఆ సమయంలో దగ్గరగా ఉన్న ఎమ్మెల్యే సహాయకుడు చెప్పడం గమనార్హం. పార్టీ మారడానికి అతను టీడీపీ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నాడో కూడా విచారణలో బయటపడినట్లు ఎమ్మెల్యే డ్రైవర్ చెప్పాడు. దీంతో ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కిడారి, సోమలను మావోయిస్టులు కాల్చి చంపారని తెలుస్తోంది.

Keywords : bauxite mining, quarry, araku, maoists, kidari sarveswararao, environment, బాక్సైట్ మైనింగ్, క్వారీ, పర్యావరణం, మావోయిస్టులు, అరకు ఎమ్మెల్యే
(2019-06-25 06:58:43)No. of visitors : 1845

Suggested Posts


0 results

Search Engine

ప్రభుత్వ మైనింగ్ కంపెనీలను ప్రైవేట్ పరం చేసే కుట్రను ఎదుర్కుందాం...పౌరహక్కుల సంఘ‍ం
ʹఊపాʹ చట్టమే మరో ఎమర్జెన్సీ - ఎన్.నారాయణ రావు
దప్పికగొన్న భూమి - పి.వరలక్ష్మి
కోటీశ్వరుల పెళ్లి... 40 టన్నుల చెత్త‌ !
ʹమావోయిస్టు పార్టీ సభ్యుడవడం నేరంకాదని సుప్రీం కోర్టు చెప్పిందిʹ
నాగురించి కాదు జైళ్ళలో మగ్గుతున్న ఆదివాసుల గురించి మాట్లాడండి - వరవరరావు
వీవీ,సాయిబాబా తదితరులను వెంటనే విడుదల చేయాలి.....23న హైదరాబాద్ లోధర్నా
అడవి బిడ్డలను అరిగోస పెడ్తున్నరు
ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు
This TV reporter is winning praise for relentlessly questioning an errant BJP leader
ఇవ్వాళ్ళే సభ..అందరికి ఆహ్వానం
తమ‌ను జంతువుల్లా చూశారన్న ఆదివాసులు.. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
ఆ 67 మంది ఆదివాసులను మా ముందు హాజరుపర్చండి...హైకోర్టు ఆదేశం
ʹవ్యక్తిత్వమే కవిత్వం..వరవరరావు కవిత్వ విశ్లేషణʹ ...17 న సభ‌
83 ఏండ్ల స్టాన్ స్వామి ఇంటిపై పోలీసుల దాడి.. విరసం ఖండన
ʹచోళ రాజుల కాలం దళితులకు చీకటి యుగంʹ అన్నందుకు డైరక్టర్ పా రంజిత్ పై కేసు !
అనారోగ్యంతో నడవ‌లేకపోతున్నా వైద్య సహాయం ఇవ్వడం లేదు....జైలు నుండి అనూష లేఖ‌ !
యోగీ ʹరామరాజ్యంʹలో... జర్నలిస్టు నోట్లో మూత్రం పోసి కొట్టిన పోలీసులు..!
పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులు కిరణ్, నర్మదలను వెంటనే కోర్టులో హాజరుపరచాలి
యోగీ ఆదిత్యనాథ్‌పై సుప్రీం ఆగ్రహం.. ఆ జర్నలిస్ట్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశం
పచ్చని కొండల్లో మైనింగ్ చిచ్చు.. తమ జీవనం దెబ్బతీయొద్దంటూ ఆదివాసీల నిరవధిక దీక్ష
నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారు..సుప్రీంను ఆశ్రయించిన జర్నలిస్టు భార్య‌
భావ ప్రకటనా స్వేచ్చపై కత్తి...యోగి పాలనలో జర్నలిస్టుల అరెస్టులు
One Year of Bhima Koregoan Arrests: Protest Held in Delhi
మానవత్వం యూ టర్న్ తీసుకుంది..!
more..


ప్రజా