ఆనాడు జైల్లో కలిసిన కేసీఆర్‌కు లేఖ ఇచ్చిన వీవీ.. ఈనాటికీ పరిస్థితులేం మారలేదు..!


ఆనాడు జైల్లో కలిసిన కేసీఆర్‌కు లేఖ ఇచ్చిన వీవీ.. ఈనాటికీ పరిస్థితులేం మారలేదు..!

ఆనాడు

ప్రభుత్వాలకు తమ విధానాలపై పోరాటం చేసే వాళ్లంటే ఎప్పుడూ కోపమే. ప్రజా పక్షాన్ని, ప్రజల గొంతుకను అణచివేయడం ఈ రోజు మొదలైంది కాదు. పాలించే పాలకుడు మారవచ్చునేమో కాని వారి విధానాలు ఏమాత్రం మారవు. గత నెల రోజుల నుంచి దేశంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ విషయం అర్థమవుతూనే ఉంది. ప్రధాని మోడీ హత్యకు కుట్ర పన్నారనే బూటకపు ఆరోపణలతో దేశవ్యాప్తంగా హక్కుల కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు వారిని ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉంచారు.

గత కొన్ని వారాలుగా విరసం నేత, విప్లవ రచయిత వరవరరావు కూడా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. ఇలా అక్రమంగా రాజ్యపు అణచవేతకు గురికావటం వరవరరావుకు కొత్తేమీ కాదు. గత ప్రభుత్వాలు నక్సలైట్లకు సహకరిస్తున్నాడనే నెపంతో
ఆనాడు జైల్లో ఉంచారు... నేడు గృహనిర్బంధంలో ఉన్నారు. అప్పుడు వైఎస్ ప్రభుత్వాధినేతగా ఉంటే ఈ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంతే తేడా.

ఈ రోజు అక్రమ అరెస్టులంటూ మొసలి కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వరవరరావును జైల్లో బంధించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆనాడు యూపీఏ సర్కారులో కేంద్ర కార్మిక శాఖా మంత్రిగా ఉన్న నేటి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు.. వరవరరావు అనారోగ్యంగా ఉన్నారని తెలిసి కలవడానికి స్వయంగా చంచల్‌గూడ జైలుకు వచ్చారు. అప్పుడు వీవీ తనకు అనారోగ్యం సహజకారణాల వల్ల కలిగింది.. ఇదే విషయంపై నన్ను పరామర్శించడానికి వస్తున్నట్లయితే అది అనవరసం. కాని మీ దృష్టికి కొన్ని విషయాలను తీసుకొని రావాలనుకుంటున్నాను అని మూడు పేజీల లేఖను కేసీఆర్‌కు ఇచ్చారు. (ఆ లేఖను కింద చదువవచ్చు). ఈ లేఖలో ఆనాడు ప్రజా సంఘాల కార్యక్తలు, హక్కుల కార్యకర్తలను ప్రభుత్వం ఎలా బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపింది వివరించారు. జైళ్లలో రాజకీయ ఖైదీలు అనుభవిస్తున్న వివక్షను ఆయన దృష్టికి తీసుకొని వచ్చారు.

ఆనాడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా వీవీ వద్దకు వెళ్లిన కేసీఆర్.. ఈ రోజు ప్రభుత్వాధినేతగా ఉండి కూడా అక్రమ గృహ నిర్బంధంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా తెలంగాణ ప్రభుత్వం ప్రజల గొంతులను తీవ్రంగా అణగదొక్కుతోంది. అక్రమ కేసులు బనాయించి మరీ ఉద్యమనాయకులను జైళ్లలోకి నెడుతోంది. స్వయంగా తెలంగాణ పోలీసులు ఏవిధంగా పూణే పోలీసులకు సహకరించారు అందరూ కళ్లారా చూశారు. నాడు ఉద్యమనాయకుడిగా ఉన్న కేసీఆర్‌కు వీవీ కావాల్సి వచ్చింది. కాని మరి నేటి పరిస్థితి..!

అందుకే అందరూ అనుకుంటున్నది ఏంటంటే.. ఆనాటికీ.. ఈనాటికీ ఏం మారింది..? నిర్బంధం రూపు మార్చుకుంది అంతే..!

వీవీ రాసిన లేఖ యధాతథంగా..

3 సెప్టెంబర్ 2005

శ్రీ. కె. చంద్రశేఖరరావు,
కేంద్ర కార్మిక శాఖా మంత్రి గారికి,

నమస్కరించి

ఈ రోజు ఈ జైల్లో నన్ను మీరు పరామర్శించడానికి వస్తున్నారని ఈ ఉదయం పత్రికల్లో చదివాను.

మీరు హైదరాబాదు వచ్చి నేను జైల్లో ఉండి అనారోగ్యంగా ఉన్నానని విన్నందు వల్ల వస్తున్నారేమో గానీ నా జీవితానికి ప్రత్యేకించి ప్రజా సంఘాల, ప్రజాస్వామ్య ఉద్యమాలకి ఈ రోజు చాలా ముఖ్యమైనది. సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ఇదే రోజు, నేనే విజ్ఞప్తి చేస్తున్న సమయంలో డాకర్టర్ రామనాథం గారిని వరంగల్‌లో ఆయన క్లీనిక్‌లో ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ చంపేసారు. వాళ్లు మఫ్టీలో ఉన్న పోలీసులేనని, ఆయన శరీరంలో సర్వీస్ రివాల్వర్‌లోని బుల్లెట్లు బయటపడ్డాయని లోకానికంతా తెలుసు. తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో ప్రారంభమైన ప్రజా సంఘాల కార్యకర్తల హత్యలు కాంగ్రెస్-తెరాస పాలనలో కూడా కొనసాగుతున్న సమయంలో మీరు నన్ను కలుస్తున్నారు. తెలంగాణ జన సభ నాయకుడు కె. కనకాచారిని మహబూబ్‌నగర్ మక్తల్‌ రోడ్డుపై అగస్టు 21న ʹనర్సా కోబ్రాస్ʹ చంపేసారు. 1996 ఏప్రిల్ 6న గద్దర్‌పై ʹగ్రీన్ టైగర్స్ʹ దాడి చేసిన నాటి నుంచి ఇవ్వాళ ʹనర్సా కోబ్రాస్ʹ ʹకాకతీయ కోబ్రాస్ʹ దాక ప్రభుత్వ/పోలీసు సృష్టేననేది స్పష్టమే.

ఆనాడు డాక్టర్ రామనాథం నా స్థానంలో, డాక్టర్ బాల గోపాల్ స్థానంలో ప్రాణత్యాగం చేసాడని నేను నమ్ముతున్నాను. అట్లే ఇవ్వాళ కనకాచారి నా స్థానంలో, కళ్యాణరావు స్థానంలో ప్రాణాలు పోగొట్టుకున్నాడని భావిస్తున్నాను.

నాకు 65 సంవత్సరాలు. విరసం అధ్యక్షుడు జి. కళ్యాణరావు గారికి 60 సంవత్సరాలు. మా ఇర్వురి ఆరోగ్యాలు బాగులేక పోవడం సహజమే. కాని అసహజమైన విషయమేమిటంటే బయట కూడా మా ప్రాణాలకు భద్రత లేని స్థితి ఇవ్వాళ ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం స్వయంగా కల్పిస్తున్నది. మీరింకా యూపీఏలో ఉన్నార గనుక ఈ సందర్భంగా మీ ముందు ఈ కింది డిమాండులు పెడుతున్నాను.

1. విప్లవ రచయితల సంఘంపై వెంటనే నిషేధం ఎత్తివేయాలి. భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవించి ఏ విరసం సభ్యునిపై కూడా ఎటువంటి కేసులు పెట్టరాదు. వేధింపులకు గురి చేయరావు.

2. నేను, కళ్యాణరావు, గద్దర్‌తో పాటు సీపీఐ మావోయిస్టుల తరపున శాంతి చర్చల్లో ప్రతినిధులుగా వ్యవహరించినాం. అది కాకుండా మాపై గత ఏడాదిగా సీపీఐ మావోయిస్టులపై ఉన్న నేరారోపణలన్నీ పెడుతున్నారు. ఇప్పటికే అనంతరపురం, జడ్చర్ల, అచ్చంపేట కేసుల్లో మా ఇద్దరిని హాజరుపరిచారు. నన్ను మంథని కేసులో హాజరుపరిచారు. ఇంకా మాపై చిలకలూరిపేట, ఒంగోలు వంటి నేరారోపణల్లో పీటీ వారెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేరారోపణ కేసులన్నీ ఉపసంహరించుకొని మమ్ములను బేషరతుగా విడుదల చేయాలి.
నన్ను గానీ, మమ్ములను గానీ అనారోగ్య కారణాలపై కాదు శాంతి గురించి దౌత్యనీతితో వ్యవహరించిన కారణంగా భేషరతుగా కేసులు ఉపసంహరించుకొని విడుదల చేయాలి.

3. సీపీఐ మావోయిస్టు, ఆరు ప్రజా సంఘాలపై నిషేధాన్ని ఎత్తి వేయాలి. ఈ నిషేధం సాకుగా ప్రజలపై, ప్రజా సంఘాలపై ప్రజా భద్రత చట్టాన్ని ఉపయోగించరాదు.

4. నర్సా కోబ్రాస్, కాకతీయ కోబ్రాస్‌తో పోలీసులకు సంబంధాలు లేవని, పరోక్షంగా ప్రభుత్వ మద్దతు లేదని ప్రజలంతా నమ్మాలంటే తొమ్మిది సంవత్సరాలుగా ప్రజా సంఘాల కార్యకర్త హత్యలలో నిందితులను అదుపు చేయాలి. పారదర్శకంగా విచారించి శిక్షించాలి.

5. బూటకపు ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ అనే అస్పష్టమైన డిమాండు కాకుండా ప్రతీ ఎన్‌కౌంటర్‌ను హత్యా నేరం కింద నమోదు చేసి బాధ్యులను విచారించి శిక్షించాలి.

6. చర్చలలో సీపీఐ ఎంఎల్ జనశక్తి ప్రతినిధిగా పాల్గొన్న రియాజ్ ఎన్‌కౌంటర్‌పై వెంటనే చర్యకు పూనుకోవాలి.

7. ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌లతో టీఆరఎస్ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు గల్లా వసంత్, ఆంధ్రప్రదేశ్ చైతన్య మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు లక్ష్మీ (కర్నూలు), తెలంగాణ జనసభ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుదర్శన్ (నిజామాబాద్), ఏఐపీఆర్ఎఫ్ జిల్లా కమిటీ సభ్యుడు లక్ష్మయ్య (గుంటూరు) టిజెపి మండల నాయకుడు సమ్మయ్య (ఎన్‌కౌంటర్)లు కూడా చనిపోయారు. కనుక ఈ ప్రజా సంఘాల, ఎన్నికల పార్టీల కార్యకర్తల ఎన్‌కౌంటర్లను వెంటనే హత్యా నేరాలుగా విచారించాలి.

8. 1994-95లో ఏడు సంవత్సరాల జీవిత ఖైదును పూర్తి చేసిన వారికి సత్ప్రవర్తనపై విడుదల చేయాలని జైల్లో రాజకీయ ఖైదీలు, జీవిత ఖైదీలు నాలుగు నెలలు పోరాటం చేసారు. నాలుగు వందల మంది విడుదలయ్యారు. ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవే ప్రమాణాలతో కొందరు జీవిత ఖైదీలను విడుదల చేసింది.

కాని ఈ క్రమంలో ఎంత వివక్ష చూపారంటే మూడన్నర సంవత్సరాలు మాత్రమే జైల్లో ఉన్న జీవిత ఖైదీ గౌరు వెంకటరెడ్డి (ఎంఎల్ఏ శ్రీమతి గౌరు చరిత, కాంగ్రెస్ భర్త అయినందున) విడుదలయ్యారు కానీ పదమూడేళ్లుగా జైల్లో ఉన్న సముద్రాల మల్లేశు, శీలం రమేశ్‌లను గానీ.. పదేళ్లుగా జైల్లో ఉన్న గణేష్, శంకర్‌లను గానీ విడుదల చేయలేదు.

రాజకీయ ఖైదీల పట్ల చూపుతున్న వివక్ష మాని వీరిని వెంటనే విడుదల చేయాలని డిమాండు చేస్తున్నాను.

మీరు, ముఖ్యమంత్రి చర్చలు జరిపి ఒప్పందానికి వచ్చిన నాడే తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో మీ వైఖరి గురించిన అభిప్రాయాలను స్పష్టంగా రాసాను. నేను ఆ అభిప్రాయాలకు కట్టుబడి ఉన్నాను. పులిచింతల, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపలేని, 610 జీవో అమలు చేయించలేని మీరు తెలంగాణ సాధన కోసం ఏం చేయగలరో ప్రజల్లో విశ్వాసం కలగాలంటే అది ప్రభుత్వంలో ఉండటం వల్ల కాదు ప్రజల్లో ఉండటం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది.

అందాక కనీసం 2004 జూన్ 16 నుంచి 2005 జనవరి దాకా రాష్ట్రంలో ఉన్న సాపేక్ష శాంతినైనా సాధించడానికి నిర్థిష్టమైన కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇవ్వండి.

ఇట్లు
వరవరరావు

పేజి 1:

పేజి 2:

పేజి 3:


వీవీ జైలు నుంచి విడుదలైనప్పటి చిత్రం

Keywords : varavararao, kcr, house arrest, chanchalguda jail, వరవరరావు, గృహ నిర్బంధం, చంచల్‌గూడ జైలు, కేసీఆర్
(2019-02-15 23:53:23)No. of visitors : 987

Suggested Posts


0 results

Search Engine

రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
stand against the threat of imminent arrest of Prof. Anand Teltumbde - Students, Faculty and Alumni of IIT Kharagpur
Health of imprisoned DU Professor G.N. Saibaba is seriously deteriorating
Drop the false charges against Prof. Anand Teltumbde Immediately: Trade Unions
ఆపరేషన్ సమాదాన్ కు నిరసనగా భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించిన మావోయిస్టులు...31న బంద్ కు పిలుపు
రిపబ్లిక్ డే ఉత్సవాలను బహిష్కరించిన ఈశాన్య రాష్ట్రాలు
పుణె కోర్టులో నాలుగోసారి కలలూ కన్నీళ్లూ
నల్గొండ‌లో... ఫిబ్రవరి 9,10 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల
COSTISA demands quashing of fabricated FIR against Prof. Anand Teltumbde!
దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు
Dragging Anand Teltumbde into ʹterroristʹ allegations and raiding his house is an attack on freedom of expression : Swami Agnivesh
మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్‌ తెల్తుంబ్డే
Immediate and Complete Withdrawal of all Charges against Dr. Anand Teltumbde
ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని అరిచింది ఏబీవీపీ విద్యార్థులే.. సంచలన వాస్తవాలు బయటపెట్టిన మాజీ నాయకులు
మనను ఆక్రమిస్తున్న ఈ వ్యాధిని ప్రతిఘటిద్దాం- అరుంధతీ రాయ్
A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ను తొలిగించడమే ఆరెస్సెస్‌-బీజేపీ అసలు లక్ష్యం...జిగ్నేష్ మెవాని
more..


ఆనాడు