వివాహేతర సంబంధాలు – IPC సెక్షన్ 497 - అసలు నిజాలు

వివాహేతర

సుప్రీంకోర్టు నిన్న ఒక పురాతన చట్టాన్ని కొట్టిపారేసింది. ఎప్పుడో దశాబ్ధాల కాలం నాటి ఆ చట్టం వల్ల స్త్రీలను ఒక వస్తువుగా పరిగణించాల్సి వస్తోందని.. ప్రస్తుతం అలాంటి చట్టం ఉండటం సరి కాదని సుప్రీం తీర్పు చెప్పింది. అయితే ఆ తీర్పు విన్న చాలా మంది.. అక్రమ సంబంధాలకు సుప్రీం పచ్చజెండా ఊపిందని.. మన సంస్కృతి, సాంప్రదాయాలను నాశనం చేసే చట్టమంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. అయితే నిజంగా ఆ తీర్పు అలాంటి అవకాశాన్ని ఇస్తోంది. సెక్షన్ 497 ఏం చెబుతోంది.. ఇకపై జరిగేది ఏమితో సీనియర్ జర్నలిస్ట్ వనజ తన ఫేస్‌బుక్‌లో కొన్ని విషయాలు రాశారు. అవి యధాతథంగా..
---------------------------------------------------------------------------------------

IPC సెక్షన్ 497.. ఈ సెక్షన్ ను సుప్రీమ్ కోర్ట్ కొట్టివేసినప్పటినుంచి చాలా హాహాకారాలు వినిపిస్తున్నాయి. ఇకనుంచి పెళ్లి అన్నదానికి పవిత్రతే ఉండదని, అందరూ బరితెగించి బజారున పడతారని ఇలా. కొంచెం అభ్యుదయవాదులనుకున్న వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యో మరి ఎందుకో ఏవేవో పోస్టులు పెడుతున్నారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ సెక్షన్ గురించి చెపుదామని ఈ నాలుగు మాటలు.

ఐపిసి సెక్షన్ 497 ఏం చెప్తుందంటే భార్య ʹతన భర్త అనుమతిʹ లేకుండా ఇతర పురుషునితో వివాహేతర సంబంధం కలిగి ఉంటే, ఆ భర్త అలాంటి సంబంధం కలిగి ఉన్న పురుషుడి పైన నేరం నమోదు చేసిి ఐదేళ్ల వరకు శిక్ష వేయించవచ్చు. కానీ ఆ సంబంధానికి భర్త అనుమతి ఉంటే అది నేరం కాదు. మరి అలా సంబంధం పెట్టుకున్న పురుషుడికి ఒకవేళ పెళ్ళయి ఉంటే అతని భార్య సంగతేమిటి? ఆమె కూడా అతని మీద కేస్ పెట్టొచ్చా? ఈ సెక్షన్ ప్రకారం అలా కేస్ పెట్టటానికి ఆమెకి హక్కు లేదు. కేవలం పురుషుడు తనకు హక్కుగా ఉన్న స్త్రీ తన అనుమతి లేకుండా ఇతర పురుషుడితో ఇష్టంగా గానీ అవతలి పురుషుడి బలవంతం వల్ల గాని శారీరకంగా కలిసినప్పుడు మాత్రమే నేరం అవుతుంది. ఇది ఒక స్త్రీ శరీరం మీద ఇద్దరు పురుషుల హక్కుకు సంబంధించిన చట్టం మాత్రమే. అందుకే సుప్రీం కోర్టు ఈ సెక్షన్ ను కొట్టివేస్తూ ఒక మాట అన్నది. ʹHusband is not the master of his wifeʹ భార్యకు భర్త యజమాని కాడు. నిజానికి ఇది ఎప్పుడో తుప్పు పట్టిపోయిన చట్టం. ఎప్పుడో ఏదైనా కక్ష సాధించటం కోసం కానీ కుట్ర పూరితంగా గానీ దశాబ్దానికి ఒకటి కూడా ఈ సెక్షన్ కింద కేసులు నమోదు కావటం లేదు. సెక్షన్ 377 లాగా బ్రిటిష్ వాళ్ళు తమ చట్టాల నుంచి యథాతథంగా మన నెత్తిమీద పెట్టిన చట్టాల్లో ఇది ఒకటి.

అయితే దీనితో వివాహేతర సంబంధాలకు సుప్రీం కోర్ట్ పచ్చ జెండా ఊపిందా అంటే లేదు. ఇది కేవలం నేరశిక్షాస్మృతి కింద నేరం కాదు కానీ ఒక ground for divorce గా కొనసాగుతుంది. అంటే ఈ వివాహేతరబంధాల కారణంగా విడాకులు అడిగే హక్కు కొనసాగుతుంది. కుటుంబ చట్టాల్లో దీనికి gender వివక్ష లేదు. స్త్రీ పురుషులిద్దరూ ఆ కారణంగా విడాకులు అడిగే అవకాశం ఉంటుంది. వివాహబంధంలో ఒక క్షోభ కారకంగా కుటుంబ చట్టాల్లో ముఖ్యంగా గృహ హింస నిరోధక చట్టంలో కూడా ఇది కొనసాగుతుంది.

స్త్రీల పట్ల సానుకూల ధోరణి ప్రదర్శించే కొందరు మిత్రులు కూడా వివాహేతర సంబంధాల మోజులో పడి భార్యలను పట్టించుకోకుండా తిరిగే భర్తలకు ఇక అడ్డూ అదుపు ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. ఆ భార్య గతేమిటి ఆమె ఎక్కడ చెప్పుకోవాలి అంటున్నారు. సెక్షన్ 497 ఉన్నప్పుడు కూడా ఆమెకు దాన్ని ఒక నేరంగా నమోదు చేసే అవకాశం లేదు. అలాంటి కారణాలతో పోలీస్ స్టేషన్ కు పోయి ఆ పురుషుడి మీద పెట్టటానికి ఏ కేస్ లేక, తెలిసి తెలియని అజ్ఞానపు పోలీసు సలహాతో 498 A కేసులు పెట్టి వాటిని రుజువు చేయలేక భంగపడిన భార్యలు ఈ దేశంలో లక్షల్లో ఉన్నారు.

గృహ హింస నిరోధక చట్టం కింద నమోదయ్యే కేసుల్లో (గృహ హింస ఉన్నప్పటికి నమోదు దాకా వచ్చేవి కేవలం 10 శాతం మాత్రమే అని గుర్తు పెట్టుకోవాలి) దాదాపు సగం పైన ఫిర్యాదులు తమ భర్తల వివాహేతర సంబంధాలు లేదా చట్టవిరుద్ధంగా చేసుకున్న రెండో, మూడో పెళ్లిళ్ల గురించే ఉంటాయి. కానీ కోరలు లేని ఈ చట్టం వల్ల ఆ స్త్రీలకు ఒరిగేదేమీ ఉండటంలేదు. చాలా మంది స్త్రీలు భార్యను పిల్లలను గాలికి ఒదిలేసి వివాహేతర సంబంధాల్లోకి, సహజీవనాల్లోకి, దొంగపెళ్ళిళ్ళకి పాల్పడే భర్తలకు శిక్ష ఉండాలని కోరుకుంటారు. కానీ అన్ని చట్టాలు స్త్రీలకేనా ఆని ఈసడించే ఈ దేశంలో అటువంటి పురుషులని శిక్షించే చట్టం ఒక్కటి కూడా లేదు.

అయితే అలాంటి పురుషులని శిక్షించాలా అంటే దానికి సమాధానం చెప్పే ముందు ఇంకా చాలా చూడాలి. ఇది ఒక grey area. పెళ్లి అనేది ఒక బాధ్యత. ఒకసారి పెళ్లి చేసుకుని పిల్లలని కన్నాక వాళ్ళ పట్ల బాధ్యత చూపటం మానవ ధర్మం. కానీ భార్యా పిల్లలను గాలికి ఒదిలేసి ఇతర సంబంధాల్లోకి వెళ్ళే అనేక మంది పురుషులు తాము చేసుకున్న పెళ్ళికి గౌరవప్రదంగా విడాకులతో ముగింపు పలికి పిల్లల బాధ్యత తీసుకోవాలని గానీ వారి భవిష్యత్తుకు ఏదైనా ఏర్పాటు చేయాలని గాని అనుకోరు. తమ సంబంధాలను ప్రశ్నించినందుకు ఆ భార్యని పిల్లలని శిక్షించాలని చూస్తారు. ఆ భార్యలు చివరికి ఏళ్ల తరబడి కోర్టుచుట్టూ తిరిగి రెండు వేలో మూడు వేలో maintenance గా పొందితే అది కూడా ఆ భర్తలు ఇవ్వకుండా తిరుగుతారు. ఎందుకంటే అలా ఇవ్వకపోయినా ఏమీ కాదు కాబట్టి. రెండు లక్షలు జీతం వచ్చే government ఉద్యోగస్తుడి భార్య పిల్లలకు కూడా 10 వేలు maintenance జారీ చేయటానికి గిజగిజలాడిపోయే judiciary తమ తీర్పును లెక్కచేయకుండా maintenance ఇవ్వకుండా తిరిగే భర్తల పట్ల చాలా ఉదారంగా ఉంటుంది. దాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణించాలన్న స్పృహ కూడా ఉండదు. 498 A దుర్వినియోగం అయిపోతుంది అంటూ వ్యాఖ్యానాలు చేయటానికి మాత్రం వెనకాడదు. భర్తలు వివాహేతర సంబంధంలో కి వెళ్లినప్పుడు సర్దుకుపొమ్మని చెప్పే కుటుంబాలు, పోలీసు స్టేషన్ కౌన్సిలింగులు, చివరికి కోర్టులు కూడా అదే స్త్రీ వివాహేతర బంధం లోకి వెళ్లినప్పుడు ఎంతో సీరియస్ గా తీసుకుంటాయి. కుటుంబాల్లో అది హింసకు, హత్యలకి కూడా దారి తీస్తుంది. పురుషుడికి వివాహేతర సంబంధం వల్ల్ల పెద్దగా నష్టం ఉండదు. కానీ స్త్రీ భార్యగా తన హక్కుల్ని మాత్రమే కాదు పిల్లల మీద హక్కులను కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఈ మధ్య కాలంలో ఒకటి రెండు తీర్పులు దాని భిన్నంగా ఉన్నా కూడా మన judiciary లో కూడా పాతుకుపోయిన ఫ్యూడల్ తత్వం దానికి అంగీకరించడు. కాబట్టి ఒకే ʹతప్పుʹ స్త్రీ పురుషులు ఇద్దరూ చేసినా దానికి వచ్చే సామాజిక స్పందన చాలా భిన్నం అని అర్ధం చేసుకోవాలి. అందుకే ఈ తీర్పు సంధర్భంగా రాజ్యాంగం ముందు స్త్రీ పురుషులిద్దరూ సమానమే అన్న ధర్మాసనం వ్యాఖ్య కూడా చాలా కీలకం. కాబట్టి సెక్షన్ 497 కొట్టేయటాన్ని స్వాగతిద్దాం. దాంతో పాటే గ్రౌండ్ మీద ఉన్న ఈ సమస్యలకు ముఖ్యంగా వివాహ బంధాల్లో వివాహేతర బంధాల వల్ల నిర్లక్ష్యానికి గురవుతున్న భార్యలు ముఖ్యంగా పిల్లలకు కూడా ఒక పరిష్కారం చూపిస్తే బావుంటుంది.

ఒక్క సెక్షన్ 497, 377 మాత్రమే కాడు బ్రిటిష్ వాడు మనమీద రుద్దిన అనేక స్త్రీ వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక సెక్షన్లు చట్టాలు ఉన్నాయి. అవన్నీ అప్పటి విక్టోరియన్ నీతి సూత్రాల, రాజధర్మం ఆధారంగా చేసిన చట్టాలు. ఇప్పుడు రాజులు లేరు రాజరికాపు లేదా ఫ్యూడల్ వ్యవస్త్త ఆధారంగా చట్టాలు ఉండటటం డెమొక్రసీ లో పనికిరాదు. 70 ఏళ్ల స్వతంత్ర భారతం ఇప్పటికైనా ఈ వలస కాలపు విక్టోరియన్ రాజరికాపు చట్టాలను సమూలంగా బుట్ట దాఖలు చేసి కొత్త ప్రజాస్వామ్యాపు చట్టాలను తేవాలి.
- వనజ.సి

Keywords : సెక్షన్ 497, సుప్రీంకోర్టు, తీర్పు, స్త్రీ హక్కులు, అక్రమ సంబంధాలు, section 497, supreme court, marital status
(2024-05-07 22:18:25)



No. of visitors : 3651

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


వివాహేతర