ʹʹహక్కుల కార్యకర్తల అరెస్టుల‌ను ఖండించిన మావోయిస్టు పార్టీ - దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపుʹʹ


ʹʹహక్కుల కార్యకర్తల అరెస్టుల‌ను ఖండించిన మావోయిస్టు పార్టీ - దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపుʹʹ

ʹʹహక్కుల

ప్రధాని మోడీ హత్యకు కుట్ర చేశారనే తప్పుడు ఆరోపణలతో అరెస్టు చేసిన ఐదుగురు హక్కుల కార్యకర్తలను సీపీఎం మావోయిస్టు పార్టీ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. బ్రాహ్మణీయ హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రజా ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉందని.. ప్రజలందరూ ఈ అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఉద్యమానికి రావాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

భీమా-కోరేగావ్ కుట్రకేసు పేరిట గత జూన్ 6ప సుధీర్ ధావ్లే, రోనా విల్సన్, సురేంద్ర గాడ్గిల్, షోమా సేనంద్, మహేష్ రౌత్‌లను అరెస్టు చేశారని.. మలి విడతలో అగస్టు 28న విప్లవ రచయిత వరవరరావు, హక్కుల కార్యకర్తలు వెర్నోన్ గున్జాల్వేస్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నావల్కర్, సుధా భరద్వాజ్‌ల ఇళ్లల్లో సోదాలు నిర్వహించి పూణే పోలీసులు వారికి అక్రమంగా అదుపులోనికి తీసుకున్నారని.. వీరితో పాటు గోవాలో ఆనంద్ తెల్తంబ్డే, హైదరాబాద్లో ప్రొఫెసర్ సత్యనారాయణ, కూర్మనాథ్, క్రాంతి, రాంచీలో ఫాదర్ స్టాన్ స్వామి ఇళ్లల్లో సోదాలు నిర్వహించారని అన్నారు. మహారాష్ట్ర, పూణే పోలీసులు భీమా-కోరేగావ్‌లో జరిగిన హింసకు అసలు కారకులైన షంభాజీ భీడే, ఇతరులను వదిలేసి.. అసలు ఘటనకు కారకులు కాని వారిపై అక్రమ కేసులు బనాయించారని ఆయన అన్నారు.

పూణే పోలీసులు ఏవో లేఖలు చూపించి.. ఇవి మోడీ హత్యకు కుట్ర చేస్తున్నారని తెలియజెప్తోందని.. ఆ ఐదుగురికి ఈ కుట్రతో సంబంధం ఉందని ఆరోపిస్తూ అరెస్టుల చేశారు. వీరి అరెస్టు కంటే ముందే ఎన్నో నెలల నుంచి ఈ కుట్రకు సంబంధించి పోలీసులు లేని ఆరోపణలను తమ అనుకూల మీడియాకు లీక్ చేశారని.. దీంతో వీరిపై అబద్దపు వార్తలు ప్రచారంలోని వచ్చాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ నిషేధాన్ని ఎదుర్కుంటూ.. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు పార్టీ ఇలాంటి లేఖలు ఏ రోజూ రాయదని.. లేఖలో పేర్కొన్నట్లు ఇలా వారి అసలు పేర్లను ఉదహరిస్తూ మిలటరీ ఆపరేషన్లు చేయమని ఏనాడూ లేఖలు రాయదని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ ప్రభుత్వం, పోలీసులు చేస్తున్న కుట్రే అని ఆయన చెప్పారు.

మోడీ ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లుడుతున్న మేథావులను ఇలాంటి అక్రమ అరెస్టులు చేయించి.. వీరు మోడీ హత్యకు కుట్ర చేస్తున్నారనే వదంతులను వ్యాపింప చేయడం ఒక పెద్ద మోసమని ఆయన చెప్పారు. కావాలనే ఈ వదంతులు వ్యాపింప చేసి.. ధబోల్కర్, గౌరీ లంకేష్, పన్సారే, కలాబుర్గిల హత్యల నుంచి ప్రజల అటెన్షన్‌ను ప్రక్కకు మళ్లించాలనే ఉద్దేశమే ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు.

వినాయక్ సేన్, సోనీ సూరి నుంచి సాయిబాబా వరకు... ఈనాడు గృహ నిర్బంధంలో ఉన్న వరవరరావు, సుధాభరద్వాజ్ మరియు ఇతరులు ఎన్నో ఏండ్ల నుంచి దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, మహిళలు, అణగారిన వర్గానికి ప్రతినిధులుగా వ్యవహించిన మేధావులే. వీరందరికీ అణగారిన వర్గాల తరపున పోరాటం చేసు హక్కు ఉంది. కాని మోడీ అమిత్షా ద్వయం వీరందరినీ అక్రమ కేసుల్లో ఇరికించి నోర్లు మూయాలని చూస్తోందని మావోయిస్టు పార్టీ అభిప్రాయ పడింది.

అవినీతిని అంతం చేస్తా.. నిరరుద్యోగాన్ని నిర్మూలిస్తా.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తా అనే వాగ్దానాలతో గద్దెను ఎక్కిన మోడీ.. ప్రస్తుతం ఈ వాగ్దానాలను నెరవేర్చలేక పోయారని ఆయన అన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం కేవలం అంబానీ, అదానీ, మోడీ, మాల్యాల అవినీతిని బలపరుస్తున్నాయే తప్ప ప్రజల తరపున లేవని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటికే నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్థయాలు ప్రజల నుంచి వ్యతిరేకతను పెంచాయని.. చిన్న, కుటీర పరిశ్రమలను కుదేలు చేసి లక్షలాది మందిని నిరుద్యోగంలోనికి నెట్టేలా నిర్ణయాలు తీసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజలను తమ అపజయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాల నుంచి తప్పించడానికే హక్కుల కార్యకర్తల అరెస్టులను ముందుకు తీసుకొని వచ్చారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా సంఘాల ఉద్యమాలను సమర్థించినా.. ప్రభుత్వం చేసు ప్రజా వ్యతిరేక విధానాలను తిరస్కరించినా.. అర్బన్ నక్సలైట్ అనే పేరు పెడుతోందని.. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం ఒక అయోమయం చేస్తోందని ఆయన అన్నారు.

ప్రజలను ఇంత భయభ్రాంతులకు గురి చేసినా.. ఇంకా ప్రజా పక్షాన్నే ఉంటున్న అందరికీ పార్టీ అభినందనలు తెలుపుతోందని.. కాని ప్రస్తుతం ప్రభుత్వాలు ప్రజలపై రుద్దుతున్న బ్రాహ్మణీయ ఫాసిజపు భావాలను అందరూ వ్యతిరేకించి ప్రజా ఉద్యమాల్లో పాల్గొనాలను ఆయన అన్నారు.

అభయ్,
సీపీఐ మావోయిస్టు పార్టీ,
అధికార ప్రతినిధి,

Keywords : cpi maoist, ahay spokesperson, maoist, bhima koregaon
(2019-05-17 12:22:06)No. of visitors : 890

Suggested Posts


0 results

Search Engine

కోరాపుట్ ఎన్ కౌంటర్: నిజ నిర్దారణ బృందాన్ని అడ్డుకున్న పోలీసుల స్పాన్సర్ సంఘం
ఒడిశా బూట‌కపు ఎన్ కౌంటర్ కు నిరసనగా దండకారణ్య బంద్
ʹవీరన్న దూరమైనా పీడిత వర్గాల పోరాటంలో జీవించే ఉంటాడుʹ
ప్రొ.సుజాత సూరేపల్లికి TVV కి విరసం సంఘీభావం
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నేడు మావోయిస్టులా..?
సాయిబాబా నుండి సూరేపల్లి సుజాత వరకూ...! -ఎస్.ఏ. డేవిడ్
నిర్వాసితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తే.... హ‌క్కుల‌ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు
బీజేపీ మళ్ళీ అధికారానికొస్తే....
Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditions
వరంగల్ లో విద్యార్థులు, రచయితలు, మహిళలతో సహా ప్రజా సంఘాల నేతల అరెస్టు..ఖండించిన విరసం
#CloudyModi మేఘాల చాటున మోడీ యుద్దం... నెటిజనుల సెటైర్లు
ఈ దేశ విముక్తి పోరాటంలో తన నెత్తురుతో ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన కామ్రేడ్ స్వరూపకు జోహార్లు !
నరేద్ర‌ మోడీపై టైమ్ మ్యాగజైన్ సంచలన కథనం
సంస్కరణలు-ప్రజాస్వామ్యం
రాజస్థాన్ లో దళిత మహిళపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ రేపు హైదరాబాద్ లో నిరసన ప్రదర్శన
ఈ దేశం దళితులకేమిచ్చింది ?
భారత మాతకు పాకిస్తాన్ బిడ్డ రాసిన ఉత్తరం
ఎడ్సిమెట్ట ఆదివాసులపై హత్యాకాండ ‍- ఆరేళ్ళ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు
అవును నేను మావోయిస్టునే..!
సీజేకు క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం కోర్టు ముందు ఆందోళ‌న నిర్వహించిన‌ మహిళల అరెస్ట్
తమ పక్కన కూర్చొని భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల అహంకారులు
దళితుణ్ణి పెళ్ళి చేసుకున్నందుకు యువతిని పెట్రోల్ పోసి కాల్చి చంపిన కన్న‌ తండ్రి
ప్రజాపోరాటాల సాక్షిగా ఆ గొంతు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది - అరుణోదయ రామారావుకు అరుణారుణ జోహార్లు.
అరుణోదయం ఆయన గానం..విప్లవం ఆయన ప్రాణం
సర్జికల్ దాడుల రాజకీయాలు
more..


ʹʹహక్కుల