పదమూడేండ్లుగా ఓటెయ్యని గ్రామం.. ఈ సారి కూడా ఓటెయ్యొద్దని తీర్మానించుకున్నారు..!


పదమూడేండ్లుగా ఓటెయ్యని గ్రామం.. ఈ సారి కూడా ఓటెయ్యొద్దని తీర్మానించుకున్నారు..!

అదొక మారుమూల గ్రామం. అక్కడ పిల్లలు చదువుకోవాలంటే ప్రతీరోజు 20 కిలోమీటర్లు నడవాలి. కాని వాళ్లకు అంత దూరం నడవాలన్న ఆయాసం లేదు.. చాలా దూరమన్న భయమే లేదు.

ఇన్నాళ్లూ ఆ చిన్నారులు ఏ రోజూ ఇంటికి దూరంగా ఉన్నామనే భయమే లేకుండా బతికారు. తమ ఇంటికి దూరంగా ఉన్న హాస్టల్లో ఆడుకుంటూ చదువుకున్నారు. అయితే మొన్న దీపావళి సెలవలు ఇచ్చారు.

ప్రతీసారి స్కూల్, హాస్టల్‌కి సెలవలు వస్తూనే ఉంటాయ్.. కాని ఈ సారి సెలవలకు ముందు జరిగిన ఒక ఘటన వీరి జీవితాలనే మార్చేసింది.

చత్తీస్‌ఘడ్‌లోని నిలవాయ అనే ఒక గ్రామం గత 13 ఏండ్లగా ఎన్నికలకు దూరందా ఉంది. కమ్యూనిస్టు సిద్ధాంతాలు, మావోయిస్టు భావజాలాలను ఆ గ్రామ ప్రజలు పాటిస్తూ కనీసం ఓటింగ్‌కు కూడా రాకుండా దూరంగా ఉన్నారు. పత్రికలు, టీవీలు ఈ గ్రామం గురించి ఎన్నో సార్లు రిపోర్ట్ చేసినా గ్రామస్తుల వైఖరిలో మాత్రం మార్పు రాలేదు.

కేవలం 159 కుటుంబాలు ఉన్న ʹనీలవాయʹ గ్రామం పేరు గత నెల 30న దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. దూరదర్శన్ కెమెరామేన్‌ను మావోయిస్టులు చంపారన్న ఓకే ఒక ఘటన మీడియాలో సంచలనంగా మారింది.

అసలు విషయం..

ఇంతకూ దూరదర్శన్ రిపోర్టర్లు అంత మంది పోలీసు బలగాల సహాయంతో అదే గ్రామానికి ఎందుక బయలు దేరారు..? గత 13 ఏండ్లుగా ఓటే వేయని, మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతానికి వెళ్లాలనే ఆలోచన ఎందుకు వచ్చింది..? స్థానిక పత్రికల విశ్లేషణ మేరకు.. ఆ ప్రాంతంలో ఎలాగైనా ఓటింగ్ జరిపించాలనే ఉద్దేశ్యం మేరకు ముందస్తు భద్రత కోసం పోలీసుల బయలు దేరారని.. దీన్ని మీడియాలో కవర్ చేయాలనే ఉద్దేశంతోనే దూరదర్శన్ విలేఖరులు వెంట వెళ్లారనే వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే ప్రభుత్వ ఆలోచనను ముందే పసిగ్టిన మావోయిస్టులు ఆ గ్రామానికి వస్తున్న బలగాలను అడ్డుకున్నాయి.

ఆ గ్రామాన్ని గత కొన్నేళ్లుగా పట్టించుకునే లేదు..!

గత కొన్నేండ్లుగా ఓటేయని గ్రామంలో ఓటేయించాలని.. ఆ గ్రామ ప్రజలను మీడియా ముందుకు తీసుకొని రావాలని ప్రభుత్వం ఆలోచించింది. అందుకే కొంత మంది మీడియా వాళ్లను ఆ గ్రామానికి పంపాలని భావించింది. ఆ ఆలోచనలో భాగంగానే ప్రభుత్వ మీడియా అయిన దూరదర్శన్ జర్నలిస్టు, కెమేరామేన్ అను అక్కడకు పంపింది.

అసలు విషయం ఏంటంటే ఆ గ్రామాన్ని గత కొన్నేండ్లుగా పట్టించుకున్న నాథుడే లేడు. కనీసం ఆ గ్రామం ఉన్న నియోజక వర్గ ఎమ్మెల్యే కూడా ఏనాడూ అటువైపు చూడలేదు. ఆ గ్రామస్థులు ప్రభుత్వ చౌక దుకాణానికి వెళ్లాలంటే 7 కిలోమీటర్ల నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. ప్రపంచం నుంచి వేరు చేయబడినట్లుగా ఎంతో దూరంలో ఉండే ఆ గ్రామానికి కనీసం ప్రభుత్వ అధికారులు కూడా రాని పరిస్థతి. అందుకే మా గ్రామానికి మీరు రావొద్దు ఓట్లు అడగొద్దు అంటూ చేతితో బ్యానర్లు రాసి ప్రదర్శించారు. ఇదే ఈ గ్రామ ప్రజలపై ప్రభుత్వానికి కోపం వచ్చేలా చేసిన ఘటన.

ఆ గ్రామం దంతెవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే.. గతంలో సల్వాజుడుంకు నేతృత్వం వహించిన మహేంద్రకర్మ భార్య. అందుకే ఈ గ్రామ ప్రజలు ఆమె నాయకత్వాన్ని కోరుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామం నుంచి ఈ సారైనా ఓటేయించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుగా దూరదర్శన్ సిబ్బందిని పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అసలేం జరిగింది..?

ఆ కాల్పులు జరిగిన రోజు పోలీసులు, మీడియా చెప్పనట్లు ఏక పక్షంగా మావోయిస్టులు కాల్పుల జరపలేదని ఒక పత్రిక రిపోర్ట్ చేసింది. ఆ గ్రామానికి చెందిన ఒక యువకుడు ఎదురుపడి దూరదర్శన్ సిబ్బందితో వస్తోన్న పోలీసు బలగాలతో కూడా మాట్లాడాడు. స్వయంగా అతనే ఘటన తర్వాత దంతెవాడ ఎస్పీకి కూడా చెప్పినట్లు తెలుస్తోంది. కాని ఆ ప్రదేశంలో ఫైరింగ్ ఓపెన్ చేసి ఇద్దరు జర్నలిస్టు మృతికి పోలీసులు కారణం అయ్యారు. ఈ విషయం బయటకు పొక్కకుండా వేరే కథనాలు అల్లినట్లు స్థానికులు చెబుతున్నారు.

Source : https://thewire.in/politics/chhattisgarh-elections-dantewada-naxals

Keywords : chattisgarh, dantewada, elections, doordarshan, journalist, encounter, maoists, చత్తీస్‌ఘర్, దంతెవాడ, ఎన్నికలు, దూరదర్శన్
(2019-03-16 12:12:07)No. of visitors : 630

Suggested Posts


0 results

Search Engine

జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
more..


పదమూడేండ్లుగా