ʹజనతన సర్కార్ʹలో ప్రయాణం -
ఉత్కంఠ భరిత అనుభవాలు

ʹజనతన ఉత్కంఠ భరిత అనుభవాలు Maoists, Police, Journalists, Janthana sarkar>

సీపీఐ మావోయిస్టు పార్టీ ఇంటర్వ్యూ కోసం వెళ్ళిన మాకు అనేక కొత్త కొత్త అనుభవాలు ఎదురయ్యాయి. ప్రయాణమంతా ఉత్కంటభరితంగా సాగింది. పోయేప్పుడు వచ్చేటప్పుడు మాకు ఎదురైన అనుభవాలను మీకోసం....
మొదటి రోజుః
మధ్యాహ్నం ఎండ కాస్తోంది కానీ వాతావరణం చల్లగానే ఉంది. ఏ ఊరూ లేని చోట రోడ్డు పక్కగా మేం ఐదుగురం నిలబడి ఉన్నాం. నలుగురం జర్నలిస్టులం మమ్ములను తీసుకొచ్చిన వ్యక్తి మరొకతను. మా భుజాలకు బ్యాగులు. పక్కనే బైక్ లు ఆపుకొని ఉన్న మమ్ములను రోడ్డు పంటి పోతున్న వాళ్ళు వింతగా చూస్తున్నారు. మమ్ములను అడవిలోకి తీసుకెళ్ళే వ్యక్తి కోసం మేం ఎదురుచూస్తున్నాం. అప్పటికే అనుకున్న సమయం కన్నా ఆలస్యమైంది. మా ఎదురు చూపులు ఫలించాయి ఓ వ్యక్తి మా దగ్గరికి వచ్చాడు. అతనెవరో నాకు తెలియదు కానీ పదండి అన్నాడు. అతన్ని చూస్తే ఆదివాసి యువకుడిలాగా ఉన్నాడు. వెంటనే ఆలస్యం లేకుండా బయలు దేరాం. రెండు బైక్ లమీద ఆరుగురం వ్యక్తులం... ఒక బైక్ ఆదివాసీ యువకుడు డ్రైవ్ చేస్తూ. మరో బండి మరో జర్నలిస్టు మితృడు డ్రైవ్ చేస్తూ...మాప్రయాణం మొదలైంది. ఆ రోడ్డు మీదనే చాలా దూరం ప్రయాణించిన తర్వాత ముందుపోతున్న ఆదివాసీ యువకుడు నడుపుతున్న బైక్ హటాత్తుగా పక్కనే ఉన్న సన్న బాటలోకి మళ్ళింది. వెనక మా బైక్ కూడా ఆ బైక్ ను అనుసరించింది. సాయంత్రం అవుతోంది. మా ప్రయాణం సాగుతూనే ఉంది. ముందు పోతున్న బైక్ హటాత్తుగా ఆగింది. ముందు చాలా మంది మనుషుల కదలిక ఉన్నట్టుంది అని ఆ ఆదివాసీ యువకుడు అన్నాడు. నేను తలెత్తి చూసాను. ఎవ్వరూ కనపడలేదు. నాతోపాటు ఉన్న మితృలు కూడా అదే మాటన్నారు. కానీ యువకుడు అటువైపు తీక్షణం గా చూస్తూ. ʹమీరిక్కడె ఉండండి. నేను పోయి చూసివస్తా అన్నాడు.ʹ మేము అక్కడేఆగాం. ఓ బైక్ తీసుకొని ఆ యువకుడు ముందుకు పోయాడు. మేము అతని కోసం ఎదిరి చూస్తున్నాం. పది నిమిషాల్లో వచ్చిన ఆయువకుడు ముందు దాదాపు యాబై మంది గ్రేహౌండ్స్ పోలీసులున్నారు. ప్రతి వాహనాన్ని , ప్రతి మనిషిని చెక్ చేస్తున్నారు అని చెప్పాడు. మమ్మల్ని వెనక్కి మళ్ళించాడు. కొద్ది దూరం పోగానే అడవి లోపలికి తీసుకెళ్ళాడు. పోలీసులు చీకటి పడ్డ దాంక ఉంటారు. వాళ్ళు వెళ్ళి పోగానే వెల్దామని చెప్పాడు. ఈ మధ్య పోలీసుల దాడులు బాగా పెరిగి పోయాయని జాగ్రత్తగా పోవాలన్నాడు. నాకేమో చాలా ఎగ్జైటింగ్ గా ఉంది . జనతన సర్కార్ ను చూడాలని, అక్కడి ప్రజలతో, మావోయిస్టు నాయకులతో ఇంటర్వ్యూలు చేయాలని ఉత్సుకతతో ఉన్న నేను ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా అని ఎదిరి చూస్తూ మితృలతో ముచ్చట్లు పెడుతూ ఉండగానే చీకటి పడింది. ఆ యువకుడు లేచాడు నేను ముందు పోయి చూసి వస్తాను . మీరిక్కడె కూర్చొండి అని చెప్పి బైక్ తీసుకొని వెళ్ళి పోయాడు. నేను నాతో ఉన్న జర్నలిస్టు మితృలు బ్యాగులు భుజాలమీద వేసుకొని రడీగా నిలబడ్డాం. పది నిమిషాలయ్యింది. అతను రాలేదు. బైక్ శబ్ధం కూడా వినపడటం లేదు. మనసులో ఆందోళన మొదలయ్యింది . మరో పది నిమిషాలయ్యింది. దూరం నుండి బైక్ శబ్ధం వినిపించింది. అందరం ముందుకొచ్చి నిలబడ్డాం . వచ్చింది ఆదివాసీ యువకుడే.... వెళ్ళి పోయారు. పదండి వెళ్దాం అన్నాడు. అప్పటికే చీకటైంది. మళ్ళి బైక్ లు బయలు దేరాయి. ఈ సారి నేను ఆ ఆదివాసీ యువకుడు నడిపే బైక్ మీద కూర్చున్నాను. ఇక ఆ యువకుడి తో ముచ్చట్లు మొదలు పెట్టాను. అతను ఆదివాసీయే కానీ చదువుకున్నట్టున్నాడు. ఆదీవాసీలతో నాకు గతంలో అనుభవముంది. వాళ్ళు పెద్దగా మాట్లాడరు. ఎంత పెద్ద ప్రశ్న వేసినా జవాబు చిన్న ముక్కతోనే సరిపెడతారు. కానీ ఈ యువకుడు బాగానె మాట్లాడుతున్నాడు. అతని పేరడిగాను.... నవ్వాడు.... కృష్ణ అన్నాడు... అది అతని అసలైన పేరు కాదని నాకు తెలుసు. అయినా నేను మళ్ళి రెట్టించలేదు. బైక్ లు చిన్న బాట లో నడుస్తున్నాయి. రోడ్డు బాగుటుందా అని కృష్ణను అడిగాను. రోడ్డా అని నవ్వాడు కృష్ణ . బాగుంటుందన్నాడు. బైక్ ఎత్తేస్తోంది. హెడ్ లైట్ వెలుతురులో చూస్తే అక్కడ బాటలాంటిదేమీ కనపడటం లేదు. అయినా రోడ్డు మీద వెళ్తున్నట్టే బైక్ నడిపిస్తున్నాడు. అప్పటికే వర్షాలతో అడవంతా బురదమయమైంది. బైక్ టైర్లు జారి పోతున్నాయి. వెనక వచ్చే మితృలు అప్పటికే రెండు సార్లు కింద పడ్డారు. వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. ఆగుదాం అన్నాను కృష్ణ బైక్ ఆపాడు. లైటు వెలుతురులో ముందు పొలాలు కనిపించాయి. పక్కన వేరే దారేమైనా ఉందేమోనని చూశాను. ఏమీ కనిపించలేదు. పొలం గట్ల మీం చి పోవచ్చేమోనని చూశాను. అవి మైదాన ప్రాంతాల్లో ఉన్న గట్ల లాంటివి కావు వాటి వెడల్పు జానెడు కూడా ఉండదు. మరి పోవడం ఎట్లా అని నేను ఆలోచిస్తుండగానే వెనక బైక్ మీదున్న మితృలు మాదగ్గరికి వచ్చేశారు. మళ్ళీ ముగ్గురం బైక్ మీద కూర్చున్నాం. కృష్ణ బైక్ స్టార్ట్ చేసి పొలం గట్ల వైపు దూకించాడు. బురదతో నిండి, అడుగేస్తే జారిపడే జానెడు వెడల్పు కూడా లేని గట్టుపై ముగ్గురం కూర్చున్న మాబైక్ ఒకటో గేర్లో వెళ్తోంది. పడిపోవడం గ్యారంటీ అని నిర్ణయించుకున్నా. మానసికంగా సిద్దపడిపోయిన. దాదాపు నావెనక కూర్చున్న మిత్రుడిది అదే పరిస్తితి. కానీ కృష్ణ మాత్రం మామూలు రోడ్డు మీద నడిపినంత మామాలుగా బైక్ నడుపుతున్నాడు. నాకైతే ఆకాశంలో తీగమీద నడిచినట్టు అనిపించింది. వెనక బైక్ మీద వస్తున్న మితృలు వస్తున్నారా లేదా అని వెనక్కి చూద్దామంటే బైక్ బ్యాలెన్స్ తప్పేట్టుగా ఉంది. అసలు వాళ్ళు పడిపోయారో వస్తున్నారో తెలియదు. అలా కొంత దూరం అలా ప్రయాణించి పొలాలు దాటి వెనక వస్తున్న వాళ్ళ కోసం ఆగాం. నిమిషం వ్యవధిలో వాళ్ళు కూడా వచ్చేశారు. బైక్ జారకుండా కిందపడకుండా ఆ ముగ్గురు కూర్చున్న బైక్ కూడా రావడం నాకు ఆశ్చర్యమనిపించింది. ఆ బైక్ నడుపుతున్న జర్నలిస్టు మితృడికి కూడా తానెలా నడిపానా అని అనిపించిందట. అప్పటికే మేము చాలా దూరం వచ్చిన ఫీలింగ్ లో ఉన్నాం. ఇంకెంత దూరం వెళ్ళాలని కృష్ణను అడిగాను. ఇంకొద్ది దూరమే ఉంది తొందరగా వెళ్తాం అన్నాడు కృష్ణ. మళ్ళీ ప్రయాణం మొదలు.... తోవంతా (అసలు తోవ అనొచ్చా ? ) బురదమయమై ఉండటంతో జానెడు పొలం గట్ల మీద దిగ్విజయం గా వచ్చిన మేము. గట్లు లేని మామూలు చోట చాలా సార్లు పడి పోయాం. అలా పడుతూ లేస్తూ బట్టలన్నీ బురదకొట్టుక పోయి , తడుస్తూ ఆరుతూ వెళ్తున్న మాకు ఓ వాగు అడ్డొచ్చింది. ( అది మాకు అడ్డు రావడమేంది ? మేమే దాని దగ్గరికి వెళ్ళాం ) నీళ్ళు మోకాళ్ళ దాకా వస్తున్నాయి. బైక్ లు తోసుకుంటూ వెళ్ళాలా అని కృష్నని అడిగాను. బైక్ స్టార్ట్ చేసే వెల్దామన్నాడు. అందరం దిగి పోయాం అతను బైక్ స్టార్ట్ చేసి వాగులోకి దూకించాడు. నాకు లోపల ఆందోళనగానే ఉంది. అసలే చీకటి, ఏమీ కనిపించడం లేదు. వాగు ఏస్పీడ్ లో వెళ్తుందో కూడా తెలియడం లేదు. కృష్ణ రిస్క్ చేస్తున్నాడేమో అనిపించింది. నేను ఆలోచనల్లోంచి తేరుకునే లోపే కృష్ణ అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. మరో బైక్ ను కూడా మా జర్నలిస్టు మితృడు ఉత్సాహంతో వాగు దాటించాడు. మళ్ళి బురదలో మా ప్రయాణం... ఇంతలో మేము ఓ ఊరు దగ్గరికి చేరుకున్నాం ఇంకా ఊర్లోకి అడుగు పెట్టక ముందే కొంత మంది.బాట మధ్యలో నిలబడి చేయి అడ్డు పెట్టి మమ్ములను ఆపారు. వాళ్ళు తమ భాషలో ఎదో అడుగుతున్నారు. కృష్ణ జవాబు చెబుతున్నాడు. మేము కిందికి దిగి ఎవరికైనా తెలుగు వచ్చేమో అని చూసాం కానీ వారు తమ భాషలోనే మాట్లాడుతున్నారు. కృష్ణ జవాబులు వారికి సంతృప్తి ఇవ్వలేదని అర్దమైంది. అలా పదిహేను నిమిషాలు గడిచి పోయాయి. మేం జనతన సర్కార్ పరిదిలోకి వచ్చామని. మా పై ఇక్కడి ప్రజలకు ఏమాత్రం అనుమానం కలిగినా మమ్మల్ని అరెస్టు చేస్తారనే విషయం మాకర్దమైంది. కృష్ణకు కూడా ఏం చేయాలో అర్దం కావడం లేదు. వాళ్ళకు నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. మా అదృష్టం బాగున్నట్టుంది. ఇంతలో ఓవ్యక్తి వచ్చాడు. కృష్ణ చేతిలో చేయి కలిపాడు. అతనికి కృష్ణ తెలుసు. ఆ వెంటనే క్షణాల్లో అక్కడెవరూ లేరు. ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళి పోయారు. పోతూ పోతూ చేతులు పైకెత్తి పిడికిళ్ళు భిగించి మాకు లాల్ సలామ్ లు చెప్పి వెళ్ళారు. మేం మళ్ళీ బైక్ లు ఎక్కి ఊరు దాటామో లేదో ఊరవతల పెద్ద గుంపు ఉంది అంతా పిల్లలే. ఎనిమిదేళ్ళనుండి పదిహేనేళ్ళ లోపుంటాయి అందరికి. అందరూ అడ్డంగా నిలబడి మళ్ళీ మమ్ములను ఆపారు. ఇది జనతన సర్కార్ కు సంభంధించిన రెండో చెక్ పోస్ట్. ఆ పిల్లలతో కృష్ణ మాట్లాడి ఊర్లో కలిసినతని పేరు చెప్పగానే పిల్లలు పక్కకు తప్పుకొని ఏదో ఆటలో మునిగి పోయారు. మళ్ళీ బురదల్లో, పొలం గట్ల మీదనుండి, వాగుల్లో నుండి మా ప్రయాణం.... మధ్యలో ఊర్లు వస్తూనే ఉన్నాయి. మమ్ములను ఆపడం ప్రశ్నించి పంపించడం అలా సాగుతూనే ఉన్నాం. టైం ఎంతైందన్నది కూడా తెలియదు. ఆరోజు రాత్రి ఓ ఊరు దాటి రెండున్నర గంటల ప్రయాణం తర్వాత ఓ పెద్ద వాగు దగ్గరికి చేరుకున్నాం. నాకైతే నది లాగే అనిపించింది. కానీ అది వాగని కృష్ణ చెప్పాడు. దాంట్లోంచి నడిచి వెళ్ళలేం. అది చాలా వేగంగా ప్రవహిస్తోంది. పడవలో తప్ప వెళ్ళలేం. అవతలి ఒడ్డుకు ఈదుకుంటూ వెళ్ళి పడవ్ను నడిపే వాళ్ళను తీసొస్తానన్నాడు కృష్ణ. కానీ అంత రాత్రి ... ఎంత లోతుందో, ఎంత వేగంగా పారుతుందో తెలియని వాగులో ఈత కొట్టుకుంటూ వెళ్ళడం దుస్సాహసమేనని కృష్ణను మేం వారించాం. కృష్ణ కూడా అందుకు ఒప్పుకొని ఈ రాత్రి ఇక్కడే ఉండి పొద్దున్నే బయలుదేరుదామన్నాడు. అప్పుడు మొదలైంది నాకు ఆకలి. మొదలవడం కంటే గుర్తొచ్చిందంటే బాగుంటుంది. మధాహ్నం తిన్నది ఎప్పుడో అరిగి పోయింది. తినడాని మా ఎవ్వరి దగ్గర ఏమీ లేదు. తెచ్చుకున్న బిస్కట్ ప్యాకెట్లు ఎప్పుడో అయిపోయాయి. తాగుదామంటే మంచి నీళ్ళు కూడా లేవు. అవి లేవని గుర్తొచ్చిన తర్వాత ఆకలి దాహం ఇంకా పెరిగి పోయాయి. ఆ వాగులో నీళ్ళు తాగుదామని ఓ మితృడు అన్నాడు. కృష్ణ టార్చ్ వేస్తే నీళ్ళను చూసాం అవి ఎర్రటి రంగులో చెత్త చెదారంతో నిండి ఉన్నాయి. ఇవి తాగితే రోగాలు రావడం ఖాయమని అర్దమైంది. మరి ఏం చేద్దామనే ప్రశ్నకు ఓ మితృడి పరిష్కారం... వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళి చివరి ఊరిలో పడుకుందాం. వాళ్ళదగ్గర ఏమైనా తిందాం అని... అందరికి ఒక్క సారి ప్రయాణం గుర్తుకొచ్చింది. ఆ ఊరికి వెళ్ళాలంటే రెండున్నర గంటలు పడుతుంది మావల్ల కాదన్నారు. నాది అదే పరిస్తితి. ఏం చేద్దాం ? ʹʹనాదగ్గర బ్రెడ్ ప్యాకెట్ ఉంది. నేను ఆ ఊరెళ్ళి మంచి నీళ్ళు తీసుకొని వస్తానుʹʹ అని కృష్ణ లేచాడు. ఆయన మాటలతో మా అందరి మీద పన్నీరు చల్లినట్టైంది. మమ్ములను తోవలోంచి కొద్దిగా అడవిలోకి తీసుకెళ్ళి బురదలేని చోటు వెతికి అక్కడ ఉండమని చెప్పి మరో మితృన్ని తీసుకొని కృష్ణ బయలు దేరాడు. మేం కింద కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నాం. ఓ మితృడు అన్నాడు. నీళ్ళున్న చోటికి జంతువులొస్తాయి. పోలీసులు కూడా వస్తారు అని. నేను ఆ మాటలను వింటూ వింటూనే ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు. మంచాలు, పరుపులు, రగ్గులు,దుప్పట్లు, ఫ్యాన్లు ఏసీలూ ఎన్ని ఉన్నా పట్నంలో రాత్రి మూడైనా, నాలుగైనా నిద్రరాని నాకు ఆ అడవిలో తడిచిన బట్టలతో నేల మీద పురుగు,పుట్ర, పాములు అనే భయం లేకుండా ఎలా నిద్ర పోయానో నాకే ఆశ్చర్యం. ఓ రాత్రి మంచి నీళ్ళు తీసుకొని వచ్చిన కృష్ణ నన్ను నిద్ర లేపాడు. బ్రెడ్డు ముక్కలిచ్చాడు. ఆ క్షణాన ఆబ్రెడ్డు ముక్కలు నాకు ప్యారడైజ్ బిర్యానీకన్నా అద్భుతమైన రుచిగా అనిపించాయి. ఒకటి రెండు బ్రెడ్ పీస్ లు తినడమే ఎక్కువైన నేను ఐదు పీస్ లు ఆదరాబాదరా తినేసి అమృతం లాంటి మంచి నీళ్ళు తాగాను. మళ్ళీ క్షణాల్లో నిద్రపోతున్నానని కూడా తెలియకుండా నిద్రలోకి జారుకున్నాను. ( ఇంకా ఉంది )

Keywords : Maoists, Police, Journalists, Janthana sarkar
(2024-04-24 18:56:58)



No. of visitors : 4522

Suggested Posts


దండకారణ్యంలో ఐదు రోజులు...
ఉత్కంఠ భరిత అనుభవాలు...
మావోయిస్టు నేతతో ఇంటర్వ్యూ....

చుట్టూ దట్టమైన అడవి.... బోరున వర్షం...జర్రుమని జారుతున్న కాలి బాటలో... జానెడు వెడల్పు కూడా లేని పొలం గట్ల పైనుంచి.... నడుముకు పైదాక ఎత్తుతో ఉరకలెత్తే వాగులలోనుంచి....బైక్ మీద ముగ్గురు కూర్చొని ఆకాశంలో తీగ మీద నడిచినట్టు....

తెలంగాణ ను విఫలం చేయడానికి బాబు కుట్రలు చేస్తున్నాడు - మావోయిస్టు నేత హరిభూషణ్

ప్రజలు పోరాడి సాధించికున్న తెలంగాణ రాష్ట్రాన్ని విఫల ప్రయోగంగా నిరూపించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి....

కేసీఆర్ ను చిన జీయర్, రామేశ్వర్ రావులు నడిపిస్తున్నారు...

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావును నడిపిస్తున్నది చినజీయర్ స్వామి, పెట్టుబడిదారుడైన రామేశ్వర్ రావు లాంటి వాళ్ళేనని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి .....

జనతన సర్కార్ లో ప్రయాణం... మూడవ రోజు...

మహిళా గెరిల్లాలు మా అందరికి రక్షణగా తుపాకులు పట్టుకొని కాపలా కాస్తున్నారు. పురుష గెరిల్లాలు వంట వండుతున్నారు.విప్లవంలో స్త్రీలు ఆకాశంలో సగమని మావో చెప్పిన సూక్తి గుర్తుకు వచ్చింది. దండకారణ్యంలో మావోయిస్టు గెరిల్లాల్లో మహిళా గెరిల్లాలు ఆకాశంలో సగం కన్నా ఎక్కువ అని అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను, గెరిల్లాల దైనందిన కార్యక్రమాలను చూసిన తర్వాత అర్థమైంది.....

జనతన సర్కార్ లో ప్రయాణం... నాల్గవ రోజు....

అచ్చంగా నట్టడివి నివాసులైన కోయ, చెంచు ఆదివాసీ తెగలకు చెందిన ఇద్దరు మావోయిస్టు పార్టీ నాయకత్వ స్థానంలోకి ఎదిగి విప్లవోద్యమానికి నాయకత్వం వహిస్తున్నారంటే.. ఇంతకన్నా విప్లవానికి హామీ ఏం కావాలని మాలో ఓ మిత్రుడు అంటే.. నిజమేననిపించింది....

జనతన సర్కార్ లో ప్రయాణం.... రెండవ రోజు

ఒక కర్రతో పామును ఒత్తి పట్టి మరో కర్రతో దానిని కొట్టి చంపాడు. ఆ తర్వత చెప్పాడతను అది తెల్ల కట్ల పామని అది కరిస్తే రెండు నిమిషాల్లో ప్రాణం పోతుందని. పామును చూసినప్పుడు దాన్ని చంపుతున్నప్పుడు వేయని భయం దాని గురించి విన్న తర్వాత అనిపించింది. కొద్ది సేపు నిద్ర పట్టలేదు.....

హరిభూషణ్ తో ఒకరోజు....

2015 ఆగస్టు నెలలో ఓ రోజు ఓ పిలుపు వచ్చింది మావోయిస్టు పార్టీ నాయకులతో ఇంటర్వ్యూ ఉంటుంది వస్తావా అని. వెంటనే రెడీ అయిపోయిన. పిలుపు వచ్చిన రెండో రోజనుకుంటా బయలు దేరాము. నాతో పాటు మరో రెండు పత్రికలు,

జనతన సర్కార్ లో ఉత్కంఠభరిత ప్రయాణం... చివరి రోజు

ʹపోలీసులుంటే ఏమైతది డైరెక్ట్ వెళ్దాం. మావోయిస్టుల ఇంటర్వ్యూ కోసం పోయొస్తున్నం అని నిజం చెబుదాంʹ అని ఓ జర్నలిస్టు మితృడు అన్నాడు. ʹమనను ఏం చేయరు కానీ మనం ఇంటర్వ్యూ చేసిన వీడియోలు డిలీట్ చేస్తే ఎట్లా ʹ అని మరో జర్నలిస్టు మితృడు అనుమానం వెలిబుచ్చాడు. ఇలా మేం మాట్లాడుకుంటుండగానేఎత్తు ప్రాంతానికి.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹజనతన ఉత్కంఠ భరిత అనుభవాలు Maoists, Police, Journalists, Janthana sarkar />