కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..


కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..

కాశ్మీర్

కొన్ని పుస్తకాలు చదివాక నాలుగు వాక్యాలు రాయకుండా (రాసుకోకుండా) ఉండలేము. కాంగ్రెస్స్ గవర్న్మెంట్ లో యూనియన్ మినిస్టర్ గా పని చేసిన సైఫుద్దీన్ సోజ్ (81 సంవత్సరాలు) రాసిన పుస్తకం Kashmir: Glimpses of History and the story of struggle ఈ సంవత్సరం మేలో వచ్చింది. కాంగ్రెస్స్, బీజేపీ నాయకులంతా కట్టగట్టుకొని తిట్టిపోసిన పుస్తకం ఇది. ఈ పుస్తకావిష్కరణకు రావాల్సిన రాహుల్ గాంధీ చివరి నిమిషంలో రాక పోవటానికి కారణం సైఫుద్ధీన్ ఈ పుస్తకంలో కాశ్మీర్ సమస్యకు నెహ్రూను కూడా బాధ్యడ్ని చేయటమే. పటేల్ 37 అడుగుల విగ్రహ నిర్మాణం జరిగాక, ఈ పుస్తకంలో సైఫుద్దీన్ ప్రస్తావించిన పటేల్ ప్రస్తావన విశేషమైనది. హైదరాబాద్ ను మాకు వదిలేసి, కాశ్మీర్ ను మీరు తీసుకోమని పటేల్ అప్పటి పాకిస్తాన్ ప్రధాన మంత్రి లియాక్వత్ ఆలీఖాన్ ను కోరటం గురించి సైఫుద్దీన్ వక్కాణించి చెప్పారు. దానికి కావాల్సిన ఆధారాలు కూడా ఇచ్చారు. ఈ పుస్తకం మీద రాసిన ఒక రివ్యూలో ఒక బీజేపీ ఆయన (పేరు రాజేశ్ సింగ్) పుస్తకాన్ని మొత్తంగా బీజేపీ బాషలో తులనాడుతూ ʹపటేల్ ఆ మాట ఎందుకన్నాడంటే, ఎటూ పాక్ నాయకత్వం దానికి ఒప్పుకోదని తెలిసేʹ అంటూ వెనుకేసుకొని రావటం నవ్వు తెప్పించింది.
సైఫుద్ధీన్ తన పుస్తకం మొదటి చాప్టర్స్ అంతటిలో కాశ్మీర్ చరిత్ర గురించే రాశారు. ఆయన రాసిన ప్రతి పదానికి చారిత్రక, రాతపూర్వక ఆధారాలు ఇచ్చారు. కల్హానా రాసిన రాజతరంగిణితో మొదలు పెట్టి ప్రపంచ యాత్రికులు వివిధ కాలాల్లో దర్శించిన కాశ్మీర్ సౌందర్యాన్ని గురించి రాస్తూ ఆయా కాలాల్లో కాశ్మీర్ లో ప్రజల పరిస్థితుల గురించి పరిచయం చేస్తారు. మొఘలులు దండయాత్ర తరువాత కాశ్మీర్ లో వర్ధిల్లిన హిందూ ముస్లిం ఐక్యత, కాశ్మీర్ అభివృద్ధికి వారు అందించిన సహకారం, కాశ్మీర్ లో నిర్మించిన ఉద్యానవనాలు, విభిన్న వాస్తు నిర్మాణాలకు సంబంధించిన సమాచారం ఇచ్చారు. తరువాత పాలించిన ఆఫ్ఘనులు మొఘలులంతా నాగరికత కలిగిన జాతికాదనీ, వారి చేతిలో కాశ్మీరీలు నానా పాట్లు పడ్డారని రాశారు. నిష్పక్షపాతంగా ముస్లిం రాజుల్లో ఉండే తేడాలని ఆయన తేటతెల్లం చేశారు. అసలు కాశ్మీర్ లో ఇస్లాం రావటానికి ఈ ముస్లిం రాజుల పాలన కారణం కాదనీ, అంతకు ముందే కొంత మంది సూఫీల ప్రభావం కాశ్మీర్ సమాజం మీద ఉందనీ, ఇప్పటికీ కాశ్మీర్ లో హిందూమత ఆదరణకు, పరమత సహనానికి కారణం ఆ సూఫీ తత్వం కాశ్మీర్ సమాజం వంట పట్టించుకోవటమేనని అంటారు. ఆఫ్ఘనుల కాలంలో ప్రజలు తీవ్రంగా పీడనను గురి అయ్యారనీ, వ్యభిచారానికి కూడా పన్నుఉండేదనీ, ఆ కారణంగా మహిళలు వ్యభిచారంనుండి బయటకు రాలేక పోయేవారనీ చదవటం తీవ్ర బాధను కలిగించింది. ఎదురు తిరిగిన వారిని చేతులు తాళ్ళతో కట్టేసి జీలం నదిలో పడవేసేవారనీ చదివాక ఎన్నో ఆలోచనలు వచ్చాయి. దుర్మార్గమైన బానిస, భూస్వామ్య వ్యవస్థలు అవలీలగా ప్రాణాలు తీసేశాయి. అదే దుస్థితి ఈ నాటికీ కాశ్మీర్ కు కొనసాగటం ఎలా అర్ధం చేసుకోవాలి. అన్ని వ్యవస్థల కంటే ప్రజాస్వామ్యంలో రిఫైండ్ అని మొన్న ఎవరో ఒకాయన ఉవాచిస్తున్నాడు.
నువ్వు, నేనూ కూర్చొని సాయంకాలం స్నేహాన్ని పంచుకొంటూ ఆనందిస్తుంటాము. ఎక్కడో సుదూరంలో మనిద్దరిని ఎవరో అమ్మి, కొంటుంటుంటారు. ఎలా ఉంది ఈ ఆలోచన? ఇప్పుడు సామ్రాజ్యవాద దేశాలు మన మార్కెట్ తో బాటు మనల్ని కొనటంలా కాదు. మొత్తంగా భూభాగాన్ని కొనేయటం. అదే కాశ్మీర్ కు జరిగింది. అక్కడి ప్రజలకు సంబంధం లేకుండా బ్రిటిష్ వాళ్లు 75 లక్షలకు కాశ్మీర్ ను సిక్కు రాజులకు అమృత్ సర్ లో అమ్మేశారు. ʹఅమృత్ సర్ ఒప్పందంʹగా పేరుగల ఈ కొనుగోలును నెహ్రూ తరువాత కాలంలో దుర్మార్గం అన్నాడు. గాంధీ ʹఅత్యంత నీచమైన వ్యాపార ఒడంబడికʹ అన్నాడు. కాశ్మీర్ ను కొనటం అంటే అక్కడి అందమైన ఉద్యానవనాలు, మంచు కొండలూ, అందమైన శాలువాలే కాదు; అక్కడి ప్రజల నెత్తురూ చెమటను కూడా వాళ్లు కొనేశారు. ఆనాటి నుండి కాశ్మీరుల పరిస్థితి మరింత దిగజారింది. 18వ శతాబ్దం మొదటి నుండి తరువాత 100 సంవత్సరాలు సిక్కుల ధన కాంక్షకు కాశ్మీర్ సమాజం బలి అయిపోయింది. డోగ్రాల పాలన వారికి అణచివేతనే మిగిల్చింది. ఆవు రాజకీయాలకు ఆనాడే వారు శిక్షలకు గురి అయ్యారు.
కాశ్మీరులు అబద్ధాలు చెబుతారనీ, మోసగాళ్లు అనీ వివిధ ప్రపంచ యాత్రికులు అనటాన్ని సైఫుద్ధీన్ బాధతో తిరస్కరించారు. దీర్ఘ కాలంగా వారిని పీడించిన బానిసత్వపు వెలుగులో కాశ్మీరీలను అర్ధం చేసుకోవాలని సర్ వాల్టర్ రోపర్ లారెన్స్ వాక్యాలని ఆయన ఉటంకించారు (సర్ వాల్టర్ రోపర్ లారెన్స్ ʹకాశ్మీర్ వ్యాలీʹ అనే పుస్తకాన్ని రాశారు. కాశ్మీర్ ప్రజలను బాగా అర్ధం చేసుకొని రాసిన మొదటి ట్రెవలాగ్ అది)
ఆయన రాసిన స్వాతంత్రానంతరం జరిగిన పరిణామాలు చాలా అథెంటిక్ గా ఉన్నాయి. స్వాలంబన ఇచ్చి పాలించమని అడిగితే పాకిస్తాన్ బదులు చెప్పకుండా కాశ్మీర్ ను ఆక్రమించే ప్రయత్నం, ʹకాశ్మీర్ లో ఏముంది? రాళ్లు తప్పʹ అన్న పటేల్ నిరాసక్త మాటలు, అన్ని అవరోధాలనూ పెళ్లగించుకొంటూ ఏర్పాటు చేసుకొన్న జమ్మూకాశ్మీర్ రాజ్యాంగం ... వీటన్నిటి కంటే ఆసక్తి కలిగే విషయం ఏమిటంటే వాళ్ల రాజ్యాంగంలో వారు భూపరిమిత చట్టాన్ని ప్రవేశ పెట్టటం, జమీందారీలను రద్దు చేయటం. అప్పటి వరకూ పాసివ్ గా ఉన్న నెహ్రూ ప్రభుత్వం ఉలిక్కి పడింది. నెహ్రూ హిందూ మతవాదుల (జమ్మూలో ఉన్న రాజు హరిసింగ్) వత్తిడికి లొంగి పోయాడు. నేషనల్ కాన్ఫెరెన్స్ నాయకుడూ, కాశ్మీర్ ప్రజల ప్రియతముడు అయిన షేక్ అబ్దుల్లా పై నిఘా పెరిగింది. షేక్ అబ్దుల్లాకూ, నెహ్రూకు మధ్య జరిగిన గుసగుసల సంభాషణ (షేక్ అబ్దుల్లా ఆయన ఆత్మ కథలో రాసుకొన్నాడు) ప్రఖ్యాతి చెందింది. నెహ్రూ తన గుసగుసలలో హెచ్చరిచ్చినట్లుగానే షేక్ అబ్దుల్లా ప్రబుత్వాన్ని రద్దు చేసి ఆయనను జైలు పంపాడు. కాశ్మీర్ ప్రజల మనస్సు గాయపడింది. వారు ఎన్నో శతాబ్దాలుగా ఎదురు చూసి, పోరాడి సాధించుకొన్న స్వాతంత్ర్యం ముక్కలైపోయింది. భారత్ ను వారు ఏనాడూ తమది అనుకోలేక పోయారు. 1987లో ఫరూక్ అబుల్లాను గద్దెనెక్కించటానికి జరిపిన రిగ్గింగ్, నిర్బంధం, కాండిడేట్స్ మీద జరిగిన భౌతిక దాడులూ కాశ్మీర్ యువకులలో అశాంతి లేపి వారిని మిలెటెన్సి వైపు తోశాయని సైఫుద్ధీన్ అంటారు.
పండిత్ ల వలసకు ఆనాటి గవర్నర్ జగన్మోహన్ బాధ్యుడని అంటారు సైఫుద్దీన్.1990లో గవర్నర్ కాగానే ఆయన అమలు చేయదలిచిన మారణకాండకు ముందుగా పండిత్ లను ఆయనే బయటకు పంపించారట. వాళ్ళను పోలీసుల సహాయంతో వాహనాలు అందచేసి మరీ జమ్ముకు తరలించారు. ఇక్కడ ఉంటే మా బాధ్యత కాదని కూడా వారిని హెచ్చరించారు.
సైఫుద్ధీన్ కాశ్మీర్ ప్రజలు కోరుకొంటున్న ఆజాదీ అసాధ్యం అంటారు. సంభాషణల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చునని ఆయన నమ్మకం. వాజ్ పాయ్, ముషారత్, మన్మోహన్ సింగ్ గతంలో చెప్పిన మాటలు కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ఉపకరిస్తాయని అంటారు. చరిత్ర ఇంత గుణపాఠం చెప్పాక కూడా ఆయన ఈ తీర్పును ప్రకటించటంతో విచారం వేస్తుంది. అలాగే ఆయన పుస్తకంలో మిలిటెంట్స్ చేసిన హింసనే ప్రధానంగా పేర్కొనడం, ఆర్మీ ఘాతుకాల మీద అంత దృష్టి పెట్టకపోవటం (సంఘటనలు వివరించేటపుడు) నిరాశ కలిగిస్తుంది. అది ఆయన పరిమితిగానే భావిస్తూ, తన సొంత కూతురుని మిలిటెంట్స్ కిడ్నాప్ చేసినా కూడా వైయుక్తంగా ఆలోచించకుండా కాశ్మీర్ ప్రజల గురించిన ఆయన పడిన తపన ఈ పుస్తకంలో ప్రతిబింబిస్తుంది. 81 సంవత్సరాల వయసులో పరిస్తితులు అన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆయన ఈ పుస్తకాన్ని బయటకు తెచ్చిన సాహసం గొప్పది.
- రమా సుందరి

Keywords : kashmir, nehru, vallabhbaipatel, sifudden soz, rahul gandhi, bjp, congress
(2021-02-23 06:32:50)No. of visitors : 2209

Suggested Posts


పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తిరుగుబాటు

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీరులో తిరుగుబాటు తీవ్రమయ్యింది. తమపై పాకిస్థాన్‌ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ పాక్ అణచివేత నుండి తమకు విముక్తి కల్పించాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.....

మా పిల్లలను హత్యలు చేస్తున్న మీతో మాట్లేడేది లేదు - రాజ్ నాథ్ కు షాకిచ్చిన కాశ్మీరీలు

భద్రతా దళాల దాడులతో, ప్రజల ఆందోళనలతో అల్లకల్లోలంగా ఉన్న కాశ్మీర్ లో పర్యటించడానికి వెళ్ళిన కేంధ్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కాశ్మీరీలు షాకిచ్చారు. 46 మంది చనిపోయి, 2,400 గాయాలపాలై, 15 రోజులుగా కర్ఫ్యూలో మగ్గుతున్నకశ్మీర్ లో....

అబద్దాలు చెప్పలేక జర్నలిస్టు రాజీనామా

అతడో ఆత్మాభిమానం ఉన్న జర్నలిస్టు. అందుకే యాజమాన్యం చెప్పిన మాట కాదన్నాడు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి తన అసలైన జర్నలిస్టుగా పాత్రికేయ ప్రపంచానికి చాటి చెప్పుకున్నాడు....

మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు

ప్ర‌జ‌లు మానసిక‌ జబ్బుల భారిన ప‌డుతున్నారు. మ‌తిస్తిమితం కోల్పోవ‌డం, తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వ్వ‌డం, విప‌రీతంగా భ‌యాందోళ‌న‌ల‌తో రోధిస్తూ ప‌లువురు అప‌స్మార‌క స్తితికి చేరుకుంటున్నారు. గ‌డిచిన 12 రోజుల్లో... మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో ఆసుపత్రుల్లో చేరుతున్న‌వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంద‌ని SHMS ఆసుప‌త్రి వైద్యులు

కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఇదీ!

కశ్మీర్ లో అంతా సవ్యంగా ఉందని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కశ్మీర్ ప్రజలను ఎప్పుడూ ఆశ్చర్యపరచలేదు. అది ఒక అరిగిపోయిన మాట అయిపోయింది. తెలివితేటల వెలుగు కోల్పోయిన అబద్ధం అది. కశ్మీరీలకు ఆసక్తి కలిగించేదేమంటే, ప్రజల సొంత మేలు కోసం వారి మీద ఇలా విరుచుకుపడడం అవసరమైందనే ప్రభుత్వ ప్రచారంలోని తర్కాన్ని ప్రపంచం ఎట్లా ఆమోదిస్తున్నదనేదే.

పెల్లెట్లు వద్దంటే ఇక బుల్లెట్లే - సీఆర్‌పీఎఫ్‌

పెల్లెట్లు వద్దంటే బుల్లెట్లు వాడాల్సి వస్తుందని సీఆర్‌పీఎఫ్‌ జమ్మూకాశ్మీర్‌ హైకోర్టుకు తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లో గత 32 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 13 లక్షల పెల్లెట్లను ఉపయోగించినట్లు జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టుకు....

దుఃఖమూ నేరమైన చోట - పి.వరలక్ష్మి

ఒక చావును దేశం వేడుక చేసుకుంటుంది. అటు వైపు ఒక దుఃఖిత సమూహం శవయాత్రకు పోటెత్తుతుంది. దశాబ్దాలుగా అది నిషిద్ధ దుఃఖం. వాళ్ళ దుఃఖానికి సంఘీభావం నేరం. అవును, మాట్లాడుతున్నది కశ్మీర్ గురించే.....

సైన్యంపై రాళ్ళు రువ్వడం దేశ ద్రోహం సరే... సైన్యం సృష్టించే అరాచకాన్ని ఏమనాలి ?

26 ఏండ్ల ఫరూఖ్‌ అహ్మద్‌ థర్ అనే ఓ యువకుడు దగ్గరి బందువు చనిపోతే పక్క గ్రామం వెళ్తుండగా ఎదురు పడ్డ కొందరు సైనికులు అతనిపై దాడి చేసి తాళ్ళతో బందించి. జీపు బానెట్‌పై కూర్చోబెట్టారు. దాదాపు తొమ్మిది గ్రామాల్లో జీపును తిప్పారు. తొమ్మిది గ్రామాల గుండా జీపు ప్రయాణిస్తున్నప్పుడు సైనికులు బిగ్గరగా అరిచారు. రండీ...మీ మనిషిపైనే దాడి చేసేందుకు బయటకు రండీ.....

కాశ్మీర్ లో మరో సాల్వజుడుం

ఓ వీడిసీ సబ్యుడి చేతిలో ఓ తల్లి, ఆమె కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే ముస్తాఖ్ అహ్మద్ అనే వీడీసీ సభ్యుడు.. షమిమా అక్తర్ అనే మహిళ, ఆమె మూడేళ్ల బాబు తాహిద్ పై నేరుగా తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు.....

నెత్తురోడుతున్న కాశ్మీర్ - పోలీసు పెల్లెట్లకు 11ఏండ్ల విద్యార్థి బలి

శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం రాత్రి ఓ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడి శరీరమంతా పెల్లెట్ల గాయాలతో నిండి ఉన్నది. శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది....

Search Engine

మరింత ప్రమాదంలో సాయిబాబా ఆరోగ్యం - ʹమహాʹ ముఖ్యమంత్రికి కుటుంబ సభ్యుల‌ లేఖ
దీనికి బెయిల్ అని పేరు పెట్టడమే విచిత్రం -విరసం
అమరుల అంత్య క్రియలు - మావోయిస్టు సైన్యం కవాతు
వరవర రావుకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్... ముంబైలోనే ఉండాలని ఆదేశం
టీ షాప్ నడుపుకుంటున్న ముస్లిం యువతిపై ʹహిందూ జాగర‌న్ మంచ్ʹ మూక దాడి
Dr. G. N. Saibaba tested Covid positive: Family demands monitoring and shifting to a private hospital
జి. ఎన్. సాయిబాబాను వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి మార్చాలి..... సాయిబాబా భార్య‌ డిమాండ్
ప్రొఫెసర్ సాయిబాబాకు కరోనా - ఆయన ప్రాణాలకు ప్రమాదం
ʹమోడీప్లానింగ్ ఫార్మర్ జెనోసైడ్ʹ హ్యాష్ ట్యాగ్ తీయబోం - కేంద్రానికి స్పష్టం చేసిన ట్విట్టర్
రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్
రైతుల ఉద్యమం: జర్నలిస్టు అరెస్టు ఖండించిన CASR
రాకేశ్ తికాయత్ కన్నీళ్ళతో కూడిన‌ పశ్చాత్తాపం పాత గాయాలను మాన్పుతుందా ?
రేప్ చేస్తానంటూ మహిళా జర్నలిస్టును బెదిరించిన‌ ఏబీవీపీ కార్యకర్త అరెస్ట్
ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే ‍- మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన
రైతుల ఉద్యమం....నిజాలు రాస్తున్నందుకు జర్నలిస్టు అరెస్ట్
రిపబ్లిక్ డే నాడు నిరసనల్లో పాల్గొన్న 100 మంది రైతులు మిస్సింగ్
CDRO strongly condemns the continuing targeting and intimidation of the farmersʹ protests/ foisting false cases against farmersʹ leaders and arrest of protesting farmers
నిరసనల్లో ఉన్న రైతులను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ బోరున విలపించిన‌ రైతు నాయకుడు
జనవరి 30 న తెలంగాణ వ్యాప్తంగా నిరహార దీక్షలు - రైతు సంఘాల ప్రకటన‌
రైతులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్న పోలీసులు..... వెనక్కి తగ్గేది లేదంటున్న రైతులు
కుట్రలను తిప్పి కొడతాం, పోరాటం కొనసాగిస్తాం - రైతు సంఘాల ప్రకటన‌
నిన్న డిల్లీలో జరిగి సంఘటనల వెనక అసలు కథ‌ !
ఫ్యాక్ట్ చెక్: ఎర్ర కోట వద్ద జాతీయ జెండాకు అవమానం జరగలేదు...ఖాలిస్తాన్ జెండా ఎగిరేయలేదు
నిర్బందపు బారికేడ్లను బద్దలుకొట్టిన రైతులు - ఎర్రకోటపై రెపరెపలాడిన రైతు జెండా
వ్యవ‌స్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరె
more..


కాశ్మీర్