మావోయిస్టులతో చర్చలే మేలు.. ఎన్‌కౌంటర్లు ఇక చాలు - చత్తీస్‌గడ్ సీఎం


మావోయిస్టులతో చర్చలే మేలు.. ఎన్‌కౌంటర్లు ఇక చాలు - చత్తీస్‌గడ్ సీఎం

మావోయిస్టులతో

చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో ఇకపై ఎన్‌కౌంటర్ల మోతలు.. మృతదేహాల లెక్కలు ఉండకూడదని.. మావోయిస్టులతో చర్చలే మార్గమని ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ అంటున్నారు. గత 15 ఏండ్లుగా బీజేపీ సీఎం రమణ్‌సింగ్ తూటాకు తూటాతో సమాధానం అనే విధంగా మారణహోమం సృష్టించారని.. తూటాతోనే సమస్యకు పరిష్కారం దొరుకుదుందనుకుంటే ఇప్పటికల్లా శాంతి నెలకొని ఉండేదని ఆయన అన్నారు. సీఎం అయ్యాక భూపేష్ తొలి సారిగా టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

గత మూడు దశాబ్దాలుగా మావోయిస్టుల ప్రభావం.. వారిని అణగదొక్క‌డానికి జరిగిన ఎన్‌కౌంటర్లు, మానవహక్కుల ఉల్లంఘనలకు ఇప్పటికైనా ముగింపు పలకాలని ఆయన అన్నారు. ఎక్కువ మంది భద్రతా సిబ్బందిని మోహరించి.. దూకుడుగా ఎన్‌కౌంటర్లకు పాల్పడటం వల్ల సమస్యను పరిష్కరించామని గత ప్రభుత్వం అనుకుంది. కాని దీని వల్ల ఆదివాసీలు, సామాన్యులు చాలా మంది బాధితులుగా మారారని ఆయన ఆరోపించారు.

నక్సలిజం ఒక రాజకీయ, సామాజిక, ఆర్థిక సమస్యని.. చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నించడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బస్తర్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాంతంలోని ఆదివాసీలు, సామాన్యులు, మేధావులు, వ్యాపారులు, హక్కుల కార్యకర్తలు అందరూ బాధితులుగానే మారుతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు.

బస్తర్ ప్రాంత ప్రజలు ప్రకృతితో మమేకమై జీవించే వారని.. వాళ్లు అలా ప్రకృతి ఒడిలో జీవించడానికికే ఇష్టపడతారన్నారు. కాని ప్రస్తుత పరిస్థితిలో వాళ్లు ప్రశాంతంగా జీవించే హక్కును కోల్పోయారని.. ఆందోళన, అభద్రతా భావం, భయంతో బతుకుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వం ముందుగా వారికి కావాలసిన కనీస అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తుందని.. ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా క్షేత్ర స్థాయిలో తగిన చర్యలు చేపడతామని ఆయన అన్నారు.

Keywords : chattisgarh, maoists, raman singh, bhupesh bhagel, talks, no encounters, చత్తీస్‌గడ్, సీఎం, భూపేష్ భగేల్, చర్చలు, మావోయిస్టులు
(2019-03-16 06:18:29)No. of visitors : 1322

Suggested Posts


0 results

Search Engine

జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
more..


మావోయిస్టులతో