మోడీ ప్రభుత్వానికి ఎంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనే వివరాలే తెలియదంటా..!

మోడీ

అన్నం పెట్టే రైతును ఆదుకోవడానికి ఏ ప్రభుత్వమూ సరైన చర్యలు తీసుకోవట్లేదు. వేలు, లక్షలు పెట్టుబడి పెట్టి.. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతు అమ్ముకుందాం అంటే గిట్టుబాటు ధర ఉండదు. ఒక వైపు ప్రకృతి వైపరిత్యాలతో నష్టం.. అన్నింటినీ అధిగమించి పంట చేతికి వచ్చి మార్కెట్‌కు వెళితే దళారుల చేతిలో మోసపోవడం ఎప్పుడూ జరుగుతూనే ఉంది. దీంతో కుంగి కృషించిన రైతు.. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు.

రుణమాఫీ, పంట పెట్టుబడి అంటూ ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి అప్పటికప్పుడు ఓట్లు దండుకోవడమే కాని ఏ ప్రభుత్వం కూడా రైతును దీర్ఘకాలికంగా ఆదుకునే విధానాలు రూపొందించడంలో విఫలమయ్యాయి. గత ప్రభుత్వాల దగ్గర ఎంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనే వివరాలు ఉండేవి. కాని మోడీ ప్రభుత్వం వచ్చాక గత మూడేళ్ల నుంచి ఎంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనే డేటానే లేకపోవడం ఈ ప్రభుత్వ చిత్తశుద్దిని తెలియజేస్తోంది.

ఇండియాలో జరిగే ఆత్మహత్యల్లో 11.7 శాతం రైతుల ఆత్మహత్యలే అని ఒక అధ్యయనం తేల్చింది. అసలు మన దేశంలో ఎంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనే ప్రశ్నకు.. గత మూడేళ్ల సమాచారం తమ వద్ద లేదని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ పార్లమెంటుకు తెలియజేశారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇలాంటి సమాచారాన్ని సేకరిస్తుందని.. అయితే గత మూడేళ్లుగా (2016 నుంచి) రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన డేటా ఏదీ వెలువడ లేదని ఆయన చెప్పడం గమనార్హం.

రైతు ఆత్మహత్యలపై కేంద్ర వ్యవసాయ శాఖను ఆరా తీయగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. హోంశాఖ పరిధిలో పని చేసే నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రతీ ఏటా ఒక డేటాను ప్రచురిస్తుంది. ʹభారత దేశంలో ఆకస్మిక మరణాలు, ఆత్మహత్యలుʹ పేరిట ప్రచురించే ఈ డేటాను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లెక్కలు తెప్పించి ప్రచురిస్తుంది. కాని దేశంలో చివరి సారిగా 2015లో మాత్రమే ఈ గణాంకాలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఎలాంటి లెక్కాపత్రాలు లేవు.

మోడీ హయాంలో జరిగిన పలు ఆందోళనలు, ఉద్యమాల సమయాల్లో పలువురు రైతులు మరణించిన సందర్భాలు ఉన్నాయి. గత ఏడాది మాందసార్‌లో ఐదుగురు రైతులు పోలీసులు కాల్పుల్లో మరణించారు. ఆ లెక్క తప్ప ఆత్మహత్య చేసుకున్న వారి వివరాలు మాత్రం ఇంత వరకు పొందు పరచలేదు. అయితే ఇదే విషయాన్ని హోం శాఖ దృష్టికి తీసుకొని వెళ్లగా.. ప్రస్తుతం 2016కు సంబంధించిన రిపోర్టు పరిశీలన జరుగుతుందని త్వరలోనే వెల్లడిస్తామని చెబుతున్నారు.

Keywords : రైతులు, ఆత్మహత్యలు, గణాంకాలు, మోడీ ప్రభుత్వం, వ్యవసాయ శాఖ, farmer, suicides, statistics,
(2024-04-24 18:51:38)



No. of visitors : 2185

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మోడీ