విశాఖ ఉత్స‌వ్‌ను బ‌హిష్క‌రించండి : మావోయిస్టు అధికార ప్ర‌తినిధి జ‌గ‌బంధు


విశాఖ ఉత్స‌వ్‌ను బ‌హిష్క‌రించండి : మావోయిస్టు అధికార ప్ర‌తినిధి జ‌గ‌బంధు

విశాఖ

సామాన్యుల కడుపు కొట్టి ధనవంతుల, సామ్రాజ్యవాద, కార్పొరేట్‌ కంపెనీల లాభాల కోసం ఈ నెల 28, 29, 30న చంద్రబాబు ప్రభుత్వం నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవ్‌ను బహిష్కరించాలని మావోయిస్టు పార్టీ ఆంధ్ర,ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్‌ కమిటీ (ఎఒబి ఎస్‌జెడ్‌సి) అధికార ప్రతినిధి జగబంధు పిలుపునిచ్చారు. ప్రకృతి విపత్తులు, ఇతర సమస్యలతో ఉన్న ప్రజలను పట్టించుకోకుండా టూరిజం పేరిట విశాఖ ఉత్సవ్‌ను నిర్వహిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడం, ʹరోమ్‌ నగరం తగలబడుతుంటే.. రోమ్‌ చక్రవర్తి పిడేలు వాయిస్తున్నట్టుʹగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రం, జిల్లా తీవ్ర దుర్భిక్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా ఉత్సవాలను నిర్వహించడం దారుణమన్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో 12 మండలాల్లో తితలీ తుఫాన్‌ ప్రభావంతో తీవ్ర నష్టం కలిగిందని, సహాయక చర్యల్లోనూ అనేక అవకతవకలు జరిగాయని జగబంధు ఆరోపించారు. తుఫాన్‌ బాధితులకు సాయం చేసేందుకు వెళ్లిన వివిధ ప్రజా సంఘాలకు చెందిన 14 మంది నేతలను ప్రభుత్వ అరెస్టు చేసిందన్నారు. అలాగే పెథాయ్‌ తుఫాన్‌, తీవ్ర కరవుతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, దీంతో జిల్లాను కరువుగా ప్రకటించాలని, రుణమాపీ చేయాలని రైతులు ఎన్ని ఆందోళనలు చేసినా పాలకులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన పథకాన్ని ʹనవ ప్రయాసʹ సంస్థకు అప్పగించవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసనలు చేస్తున్నా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టు పట్టించుకోకపోగా, నిరసనలు తెలుపుతున్న వారిపై పోలీసులపై లాఠీచార్జిలు చేస్తున్నారన్నారు. మన్య ప్రాంతంలో జీవో 97 రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Keywords : maoist, jagabandhu, vishaka uthsav
(2019-01-15 21:36:26)



No. of visitors : 540

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

ఆ శవాలు మాట్లాడుతున్నవి...

శరీరాన్ని చీల్చేసినట్టుగా, పొడిచేసినట్టుగా కనపడుతున్న ఆ శవాలు మాట్లాడుతున్నవి. పురుగులు పట్టిన ఆ శవాలు మాట్లాడుతున్నవి.....

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

Search Engine

A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ను తొలిగించడమే ఆరెస్సెస్‌-బీజేపీ అసలు లక్ష్యం...జిగ్నేష్ మెవాని
కన్నయ్య, ఉమర్‌, అనీర్బన్‌ లపై మూడేళ్ళ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు
కాగితం మీద అక్షరానికి కట్టుబడ్డ కవి
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకం
మానవత్వం మరచి ఆంబులెన్సును అడ్డుకున్న పోలీసులు.. క్షతగాత్రులపై దాడి
కలాల్లో ఇంకిపోని సిరా, టకటకలు మానని కీబోర్డులు...
కలాల్లో ఇంకిపోని సిరా.. అరుంధతీ రాయ్‌కి జైలు జీవితం అనుభవించిన సామాజిక కార్యకర్త రాసిన ఉత్తరం
A ten year Sahas from US written a reply to Professor Saibabaʹs letter.
Varavara Rao written a letter about Nomula Satyanarayana from Pune jail
అగ్రకులాలకు రిజర్వేషన్లు సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం, రాజ్యంగ విరుద్ధం
దళిత నటి విషాద గాథ‌ !
కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మారణహోమాన్ని చూడలేక రాజీనామా చేసిన ఐఏఎస్
ప్ర‌మాదంలో ప్రైవ‌సీ
తొలగించబడిన చట్టం కింద‌ 22 మంది అరెస్టు...సుప్రీం సీరియస్
నాలుగున్నర దశాబ్దాల నిత్య నిర్బధం - ఎన్.వేణుగోపాల్
శ్రీకాకుళం జిల్లా జైలు - వెట్టిచాకిరీకి నిలయం
గెలిచినమంటే చేసిందంతా మంచిదని కాదు!
దాడిచేస్తున్నా.. ఎత్తిన కెమెరా దించలేదు..
ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌
సాయిబాబా లాంటి వాళ్ల కష్టాల ముందు నాదెంత : వరవరరావు
కలలకు సంకెళ్లు వేసిన రాజ్యం
మైనింగ్ పేరుతో ప్రకృతి విధ్వంసం.. ʹఆపరేషన్ అనకొండʹతో రంగంలోకి ప్రభుత్వం
మానవ హక్కుల హననానికి పాల్పడిన అధికారికే ప్రమోషన్.. చత్తీస్‌గడ్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం
రామ మందిరం గురించి రాసిన రచయితకు హిందుత్వ సంస్థల బెదిరింపులు
more..


విశాఖ