మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించం - చత్తీస్‌గడ్ సీఎం


మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించం - చత్తీస్‌గడ్ సీఎం

మావోయిస్టు

బుల్లెట్‌కు బుల్లెట్ సమాధానం కాదు.. మావోయిస్టులతో చర్చలే మేలు అంటూ రెండు రోజుల క్రితమే ఒక ఇంటర్యూలో చెప్పిన చత్తీస్‌గడ్ సీఎం భూపేష్ భగేల్ రెండు రోజుల్లో మాట మార్చారు. తాము కూడా బీజేపీ ప్రభుత్వానికేం తీసుపోమంటూ తమ మాటల ద్వారా తెలియ జేస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు అరాచకం సృష్టిస్తున్నాయని, మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని బాధపడ్డారు. ఎంతో మంది బాధితులుగా మారారని మొసలి కన్నీరు కార్చారు.

తాజాగా బస్తర్ ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థే కొనసాగుతుందని.. మరింత బలోపేతమైన ప్రణాళికతో ముందుకు వెళ్తామని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దేశంలో కశ్మీర్ తర్వాత అత్యధిక ఎక్కువ సంఖ్యలో భద్రతా బలగాలు మోహరించిన ప్రాంతంగా బస్తర్ పేరుగాంచింది. ఇక్కడ గత మూడు దశాబ్దాలుగా మావోయిస్టులు ప్రజలతో మమేకమై జీవిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి గత బీజేపీ ప్రభుత్వం రోజుకో ఎన్‌కౌంటర్‌లా ముందుకు సాగింది. అయితే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి సానుకూల వాతావరణం తీసుకొస్తామని చెప్పింది.

బస్తర్ ప్రాంతంలో దాదాపు 70 వేల మంది భద్రతా బలగాలు మోహరించి ఉన్నాయి. సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీ వంటి పారామిలటరీ దళాలు వీటిలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో మావోయిస్టుల అణచివేతే లక్ష్యంగా ప్రభుత్వాలు ఇక్కడ వీరిని రంగంలోకి దింపాయి. అయినా సరే ప్రజలు నిత్యం వీరి ఆగడాలపై తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేకమైన ప్రణాళికను అనుసరించి ముందుకు సాగుతామని.. రుణమాఫీ, సంపూర్ణ మద్య నిషేధం వంటివి కచ్చితంగా అమలు చేస్తామని సీఎం భూపేష్ చెప్పారు.

ఏదేమైనా బస్తర్ ప్రాంతంలో నిక్షిప్తమై ఉన్న అపార ఖనిజాల తరలింపునకే ప్రతీ ప్రభుత్వం కొమ్ము కాస్తోంది. కార్పొరేట్లకు అనుకూలంగా భద్రతా బలగాలను ఇక్కడ దింపి.. ప్రకృతి వనరుల తరలింపును ఎన్నాళ్లుగానో అడ్డుకుంటున్న మావోయిస్టులను అణచివేస్తున్నారు. ఈ విషయంలో ఏ ప్రభుత్వమైనా వైఖరి ఒకటే అని భూపేష్ వ్యాఖ్యలద్వారా మరో సారి వెల్లడైంది.

Keywords : మావోయిస్టులు, బస్తర్, చత్తీస్‌గడ్, భూపేష్ భగేల్, maoists
(2019-03-15 21:02:27)No. of visitors : 326

Suggested Posts


0 results

Search Engine

జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
more..


మావోయిస్టు