జనతన సర్కార్ లో ప్రయాణం.... రెండవ రోజు

జనతన

పొద్దున్నే పక్షుల కిల కిల రావాలు, సెలయేటి గలగలలు నన్ను నిద్రలేపాయి అని మీరనుకుంటే పొరపాటే నా వీపు మీద ఏదో కుట్టింది. చీమో పురుగో తెలియదు కాని వీపు మీద మంట నన్ను నిద్ర లేపింది. అప్పటికే సన్నని వెలుగొచ్చింది. ఆకాశంలోంచి సూర్యుడు తొంగి చూస్తున్నాడో నిటారుగా నిలబడ్డాడో తెలియదు. దట్టమైన చెట్ల వల్ల నాకేమి కనపడటం లేదు. వెలుగు మాత్రం వుంది. అప్పటికే నాతో పాటు ఉన్న మితృలు లేచారు. చుట్టూ చూసాను కృష్ణ కనిపించలేదు. అర్దమైంది పడవ ఏర్పాట్లకు వెళ్ళాడని. రాత్రి డబ్బాలో తెచ్చిన మిగిలి ఉన్న నీళ్ళతో మొహం కడుకున్నాం. అప్పుడు చూసాను వాగును. మేము వాగుకన్నా చాలా ఎత్తులో ఉన్నాం. వాగు నదిలాగా పారుతోంది. మెల్లగా కిందికి దిగాం. అక్కడ కృష్ణ నిలబడి ఉన్నాడు. అవతలి ఒడ్డు స్పష్టంగా కనపడుతోంది. అక్కడ కొందరు ఓ పడవలాంటి దాన్ని నీళ్ళలోకి తోస్తున్నారు. అప్పటికే కృష్ణ వాళ్ళతో మాట్లాడాడు. అందరం కాలకృత్యాలు తీర్చుకొని రడీగా ఉన్నాం. ఇంతలో నాటు పడవ వచ్చింది. దాన్ని పడవ అనలేము. ఒక్క మనిషే కూర్చునేందుకు వీలున్న వెడల్పుంది ఒకరి వెనక ఒకరు ఓ నల్గురు కూర్చోవచ్చు. ఆ నాటు పడవతో పాటు ముగ్గురు మనుషులొచ్చారు. దాంట్లో మా బైక్ లు, మేము ఆ వాగు దాటగలమా అని అనుమానం కలిగింది. కానీ పడవ వాళ్ళు అతిమామూలుగా తమ పని చేసుకపోతున్నారు. ఓ బైక్ ను పడవ మీదికి ఎక్కించి నిలబెట్టారు. నేను కూడా ఎక్కి కూర్చున్నాను. బైక్ ను పడి పోకుండా పట్టుకుందామని ప్రయత్నించాను. ఆ అవసరం ఏర్పడలేదు. బైక్ ను ఎలా నిలబెట్టారో తెలియదు కానీ అది ఏమాత్రం కదలడం లేదు. పడవ నడిపే వాళ్ళు దాంట్లో కూర్చోలేదు. వాళ్ళు ముగ్గురు ఈదుకుంటూ ఆ నాటు పడవను తోసుకుంటూ తీసుకెళ్ళారు. సురక్షితంగా అవతలి ఒడ్డుకు వెళ్ళాం. మిగతా మామితృలు మరో బైక్ కూడా ఒడ్డుకు చేరుకుంది. వాళ్ళ పడవ నడిపే నైపుణ్యం చూస్తే నిజంగా అద్భుతమనిపించింది. దీన్ని ప్రతిభ అని అనరా ? ఇక మళ్ళీ మా బైక్ ప్రయాణం మొదలైంది. కొంతసేపు ప్రయాణించిన తర్వాత ఓక ఊరును చేరుకున్నాం. ఊరి బయట ఖచ్చితంగా మమ్ములను ఆపుతారనుకున్నా. కానీ ఆశ్చర్యంగా ఎవ్వరూ ఆపలేదు. అప్పటికే మేము వస్తున్నామనే విషయం వాళ్ళకు తెలుసు. అప్పటికే నిద్రలేచి చాలా సేపయ్యింది. ఛాయ్ కోసం మన్సు పీకుతోంది. కృష్ణ ను అడిగాను ఛాయ్ దొరుకుతుందా అని. చూస్తాను అని మమ్ములను ఒక చోట కూర్చోబెట్టి వెళ్ళి పోయాడు. అక్కడున్న బోరింగు దగ్గర మేము మొహాలు కడుకుంటుండగా మరో మనిషిని వెంట తీసుకొని కృష్ణ వచ్చాడు. ఛాయ్ కాదుకదా డికాక్షన్ కూడా దొరికే ఛాన్స్ లేదని చెప్పాడు. దానితో పాటే మరికొన్ని వెన్నులో చలి పుట్టించే విషయాలు చెప్పాడు. నిన్న రాత్రి మేం పడుకున్న వాగుకు దగ్గరలో ఉన్న ఓ ఊరిపై వందలాది మంది గ్రేహౌండ్స్ పోలీసులు దాడి చేశారని , గ్రామ మిలీషియా ఎదురు దాడిలో ముగ్గురు పోలీసులు చని పోయారని చెప్పాడు. రాత్రి మేము మంచి నిద్రలో ఉండగా ఆ సంఘటన జరిగింది. ఒక్క సారి ఒళ్ళు జలదరించింది. కొద్దిగా అటు ఇటు అయినా మా పరిస్థితి... ! ఇంకా ఎక్కువ ఆలోచించే సాహసం చేయలేదు. మేము ఇప్పుడున్న ఊర్లో వాళ్ళు కూడా కొందరు ఐదు రోజులుగా పోలీసు స్టేషన్ లో చిత్రహింసలు అనుభవిస్తున్నారు. సంతకు పోయినప్పుడు వాళ్ళను పోలీసులు పట్టుకపోయారు. వాళ్ళను విడిపించడం కోసం ఆ ఊరి వాళ్ళు ఆ చుట్టుపక్కల ఊరి వాళ్ళు కలిసి పోలీసు స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఉన్నారు. పరిస్థితి అంత బాగాలేదనిపించింది. ఆ విషయమే కృష్ణతో అన్నాను. ʹʹవెంటనే కృష్ణ ఏమైతది ఏం కాదు. మనం సేఫ్ గా వెళ్తాం. ఇక్కడికి పోలీసులు వచ్చే అవకాశమే లేదు. ఒక వేళ వచ్చినా వేలాది బలగాలు తప్ప వందలమంది కూడా రాలేరు. వస్తే కూడా మనకు గంట రెండుగంటల్ ముందే తెలిసిపోతుందిʹʹ అన్నాడు. మళ్ళి బురదలో జారుకుంటూ పడుతూ లేస్తూ మా బైక్ ప్రయాణం మొదలైంది... తోవలో ఎన్నో ఊర్లను దాటాము కానీ ఎక్కడా మమ్ములను ఆపలేదు. నాలుగైదుగంటల ప్రయాణం తర్వాత దూరంగా ఆలీవ్ గ్రీన్ డ్రస్సుల్లో తుపాకులు పట్టుకున్న ఇద్దరు మహిళలు కనిపించారు. వాళ్ళు ఆపుతారనుకున్నాను కానీ వాళ్ళ పక్కనుండే వెళ్ళినా వాళ్ళు మమ్ములను ఆపలేదు పైగా మమ్ములను పట్టించుకోనట్టే ఉన్నారు. నాకర్దమైంది ఇది పూర్తిగా జనతన సర్కార్ పట్టున్న ప్రాంతమని. ఇక మనస్సు ప్రశాంతమైంది. అలా కొద్ది దూరం వెళ్ళాక ఓ గుడిసె దగ్గర కృష్ణ బైక్ ఆపాడు. మమ్ములను ఆ గుడిసెలో కూర్చోపెట్టి తను వెళ్ళి పోయాడు. మరొకతను వచ్చి పక్కనే వున్న వాగుకు మమ్మల్ని స్నానాకి తీసుకెళ్ళాడు. అతను తనతో పాటు కొన్ని ప్లాస్టిక్ కవర్లు పట్టుకొచ్చాడు. అవి దేనికో నాకు అర్దం కాలేదు. ఆయనను అడిగాను అవి ఎందుకు అని. లెట్రిన్ వెళ్ళినప్పుడు ఇందులో నీళ్ళు తీసుకెళ్ళడానికన్నాడు. నాకు ఆశ్చర్యమేసింది. అక్కద పెద్ద వాగు పారుతోంది. అలాంటప్పుడు ఈ కవర్లు దేనికని ! మళ్ళీ ఆయనే చెప్పాడు. ఈ వాగుకు కింది భాగాన అనేక ఆదివాసీలు గూడేలున్నాయి. అక్కడి ప్రజలంతా ఈ వాగు నీరే ఉపయోగించుకుంటారు. వాటిని మనం కలుశితం చేస్తే ఎట్లా అని ప్రశ్నించాడు. నాకు హైదరాబాద్ లోని మూసీ నది గుర్తుకొచ్చింది. తమ స్వార్దం కోసం నదులనే కలుశితం చేస్తున్న కార్పోరేట్లు వాళ్ళకు మద్దతుగా నిలబడ్డ ప్రభుత్వాలు గుర్తుకొచ్చారు. తమ స్వార్దం తప్ప ఇంకేమీ పట్టించుకోని కాంక్రీట్ జంగల్లోంచి వచ్చిన మేము ఈ అడవిలో ప్రతిక్షణం పక్కవాడి గురించే ఆలోచించే మనుషులను చూసాము. విషయం చిన్నదిగానే అనిపించవచ్చు కానీ వాళ్ళు ఆలోచించే తీరు చూస్తే జనతన సర్కార్ నడిచే తీరు అర్దమైంది. స్నానం చేసిన తర్వాత విపరీతంగా ఆకలి మొదలైంది. మేము గుడిసె దగ్గరికి పోయే సరికి ఓ నలుగురు మావోయిస్టు గెరిల్లాలు మాదగ్గరికి అన్నం తీసుకొని వచ్చారు. ఎరుపు, తెలుపు కలిసిన రంగుతో అన్నం పుంటి కూర తొక్కు... ఆ బియ్యం ఎరువులు లేకుండా ఆదివాసులు పండించినవి. గతంలో పోడు వ్యవసాయం తప్ప తెలియని ఆదివాసులకు మావోయిస్టు పార్టీ ఎక్కువ దిగుబడినిచ్చే వ్యవసాయ పద్దతులను నేర్పించింది. అక్కడ జనతన సర్కార్ సారధ్యంలో ప్రజలు స్వచ్చందంగా చిన్న చిన్న ప్రాజెక్టులు కట్టుకున్నారు. ఎటువంటి కెమికల్ ఎరువులు వాడకుండా పంటలు పండించడం నేర్చుకున్నారు. అక్కడ భూమి లేని ఆదివాసీ ఉండడు. ప్రతి ఊరిలో అక్కడి గ్రామ శాఖ అందరికీ సమానమైన భూమి పంచుతుంది. భూమిని ధనంతో కొలిచే మనలాంటి వాళ్ళకు ఆశ్చర్యమనిపించే మరో విష్యమేంటంటే... ప్రతి ఏడాది భూమిని తిరిగి పంచుతారు. అలా ఎందుకని హిందీ వచ్చిన ఓ గ్రామస్తుడిని అడిగాను. గ్రామంలో కొందరు చని పోతూ ఉంటారు. కొందరు పుడుతూ ఉంటారు. దాని ప్రకారం మనుషులు పెరిగిన కుటుంభానికి, తగ్గిన కుటుంభానికి వాళ్ళ వాళ్ళ అవసరాలమేరకు భూమి పంపకం ప్రతి ఏడు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుందని చెప్పాడతను. ఒక ఉప్పు తప్ప వాళ్ళకు అవసరమైనవన్నీ అక్కడే పండించుకుంటారు. అలాంటి బియ్యం హైదరాబాద్ లో కిలో వందరూపాయలుంటుంది. ఎప్పుడూ లేనటువంటి అద్భుతమైన రుచి... పుంటి కూరతో కడుపునిండా అన్నం తిన్నాం. అక్కడ రాత్రయితే పురుగులొస్తాయి కాబట్టి రాత్రి కాక ముందే కొంచెం వెలుగుండగానే అన్నం తింటారు. అన్నం తినగానే మమ్ములను అక్కడినుండి కొద్ది దూరంలో మరో చోటిక్లి తీసుకెళ్ళారు. అక్కడ పాల్తీన్ కవర్ తో ఓ టెంట్ వేసి ఉంది. దాంట్లో పడుకొమ్మని చారు. కింద కూడా ఒక పాల్తీన్ కవర్ వేసి ఉంది. దాని చుట్టూ కొసలు పైకి లేపి చుట్టూ కట్టె పుల్లలు నేలలో పాతారు. వర్షమొస్తే నీళ్ళు పాల్తీన్ మీదకు రాకుండా, పాములు రాకుండా ఆ ఏర్పాటు. మాకు ఓ టార్చ్ లైట్ ఇచ్చారు. దగ్గర్లోనే మరో టెంట్ లో ఇద్దరు దళ సబ్యులు పడుకున్నారు. ఏదైనా అవసరమైతే వాళ్ళను లేపమన్నారు. ఒక్కర్ని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పారు. అప్పటికే బాగా అలసి పోయి ఉన్నామేమో నాకు నిద్ర ఊపుతోంది. టార్చ్ పట్టుకున్న మా జర్నలిస్టు మితృడు టార్చ్ ఆన్ చేసి చుట్టూ చూస్తున్నాడు. అన్నా పాము అన్నాడు దిగ్గున లేచాము. టార్చ్ వెలుగులో తెల్లని పాము కనపడుతోంది. మేము పడుకున్న పాల్తీన్ వైపే వస్తోంది. అప్పుడే అక్కడికి చేరుకున్న మావోయిస్టు దళసబ్యుడు ఏ మాత్రం ఆందోళన పడకుండా రెండు కర్రలు తీసుకొని ఒక కర్రతో పామును ఒత్తి పట్టి మరో కర్రతో దానిని కొట్టి చంపాడు. ఆ తర్వత చెప్పాడతను అది తెల్ల కట్ల పామని అది కరిస్తే రెండు నిమిషాల్లో ప్రాణం పోతుందని. పామును చూసినప్పుడు దాన్ని చంపుతున్నప్పుడు వేయని భయం దాని గురించి విన్న తర్వాత అనిపించింది. కొద్ది సేపు నిద్ర పట్టలేదు. దండకారణ్యంలో పాము కాటుతో చని పోయిన గోదావరిఖనికి చెందిన మావోయిస్టు నాయకుడు గుండేటి శంకర్ గుర్తుకు తెచ్చుకున్నాం. వీళ్ళు ఇంత త్యాగం ఎలా చేయగల్గుతున్నారు. మనము మన కుటుంభము తప్ప మరేదీ పట్టని ఈ సమాజంలో ఇలాంటి స్వార్ద రహిత మానవులుంటారా ? ఉంటారు కాదు ఉన్నారు. ఇప్పుడు మేం వాళ్ళ మధ్యనే ఉన్నాం.... అలా ఆలోచిస్తున్న నేను పాము గురించి మర్చి పోయి గాఢ నిద్రలోకి వెళ్ళి పోయాను. (ఇంకా ఉంది)
-యంవీ రమణ

Keywords : Maoists, Police, Snake, Boat, Encounter
(2024-04-27 10:02:37)



No. of visitors : 4839

Suggested Posts


దండకారణ్యంలో ఐదు రోజులు...
ఉత్కంఠ భరిత అనుభవాలు...
మావోయిస్టు నేతతో ఇంటర్వ్యూ....

చుట్టూ దట్టమైన అడవి.... బోరున వర్షం...జర్రుమని జారుతున్న కాలి బాటలో... జానెడు వెడల్పు కూడా లేని పొలం గట్ల పైనుంచి.... నడుముకు పైదాక ఎత్తుతో ఉరకలెత్తే వాగులలోనుంచి....బైక్ మీద ముగ్గురు కూర్చొని ఆకాశంలో తీగ మీద నడిచినట్టు....

తెలంగాణ ను విఫలం చేయడానికి బాబు కుట్రలు చేస్తున్నాడు - మావోయిస్టు నేత హరిభూషణ్

ప్రజలు పోరాడి సాధించికున్న తెలంగాణ రాష్ట్రాన్ని విఫల ప్రయోగంగా నిరూపించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి....

కేసీఆర్ ను చిన జీయర్, రామేశ్వర్ రావులు నడిపిస్తున్నారు...

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావును నడిపిస్తున్నది చినజీయర్ స్వామి, పెట్టుబడిదారుడైన రామేశ్వర్ రావు లాంటి వాళ్ళేనని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి .....

జనతన సర్కార్ లో ప్రయాణం... మూడవ రోజు...

మహిళా గెరిల్లాలు మా అందరికి రక్షణగా తుపాకులు పట్టుకొని కాపలా కాస్తున్నారు. పురుష గెరిల్లాలు వంట వండుతున్నారు.విప్లవంలో స్త్రీలు ఆకాశంలో సగమని మావో చెప్పిన సూక్తి గుర్తుకు వచ్చింది. దండకారణ్యంలో మావోయిస్టు గెరిల్లాల్లో మహిళా గెరిల్లాలు ఆకాశంలో సగం కన్నా ఎక్కువ అని అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను, గెరిల్లాల దైనందిన కార్యక్రమాలను చూసిన తర్వాత అర్థమైంది.....

జనతన సర్కార్ లో ప్రయాణం... నాల్గవ రోజు....

అచ్చంగా నట్టడివి నివాసులైన కోయ, చెంచు ఆదివాసీ తెగలకు చెందిన ఇద్దరు మావోయిస్టు పార్టీ నాయకత్వ స్థానంలోకి ఎదిగి విప్లవోద్యమానికి నాయకత్వం వహిస్తున్నారంటే.. ఇంతకన్నా విప్లవానికి హామీ ఏం కావాలని మాలో ఓ మిత్రుడు అంటే.. నిజమేననిపించింది....

ʹజనతన సర్కార్ʹలో ప్రయాణం -
ఉత్కంఠ భరిత అనుభవాలు

మేం జనతన సర్కార్ పరిదిలోకి వచ్చామని. మా పై ఇక్కడి ప్రజలకు ఏమాత్రం అనుమానం కలిగినా మమ్మల్ని అరెస్టు చేస్తారనే విషయం మాకర్దమైంది. కృష్ణకు కూడా ఏం చేయాలో అర్దం కావడం లేదు. వాళ్ళకు నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు.....

హరిభూషణ్ తో ఒకరోజు....

2015 ఆగస్టు నెలలో ఓ రోజు ఓ పిలుపు వచ్చింది మావోయిస్టు పార్టీ నాయకులతో ఇంటర్వ్యూ ఉంటుంది వస్తావా అని. వెంటనే రెడీ అయిపోయిన. పిలుపు వచ్చిన రెండో రోజనుకుంటా బయలు దేరాము. నాతో పాటు మరో రెండు పత్రికలు,

జనతన సర్కార్ లో ఉత్కంఠభరిత ప్రయాణం... చివరి రోజు

ʹపోలీసులుంటే ఏమైతది డైరెక్ట్ వెళ్దాం. మావోయిస్టుల ఇంటర్వ్యూ కోసం పోయొస్తున్నం అని నిజం చెబుదాంʹ అని ఓ జర్నలిస్టు మితృడు అన్నాడు. ʹమనను ఏం చేయరు కానీ మనం ఇంటర్వ్యూ చేసిన వీడియోలు డిలీట్ చేస్తే ఎట్లా ʹ అని మరో జర్నలిస్టు మితృడు అనుమానం వెలిబుచ్చాడు. ఇలా మేం మాట్లాడుకుంటుండగానేఎత్తు ప్రాంతానికి.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


జనతన