రామ మందిరం గురించి రాసిన రచయితకు హిందుత్వ సంస్థల బెదిరింపులు


రామ మందిరం గురించి రాసిన రచయితకు హిందుత్వ సంస్థల బెదిరింపులు

రామ

దళితులు, బహుజనులు, ఇతర మతస్థులపై అకారణంగా దాడులు చేసే హిందుత్వ సంస్థలు తమపై ఏమైనా విమర్శలు వస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నాయి. తమ మనోభావాలు భంగపడ్డాయంటూ ఇతరులపై దాడులు చేయడం వారి సహజ ధోరణి. అలాంటి ఘటనే మరొకటి తాజాగా చోటు చేసుకుంది.

గత కొన్నేండ్లుగా దేశంలో రామ మందిర నిర్మాణాన్ని హిందుత్వ సంఘాలు, బీజేపీ పార్టీ వాడుకున్నంతగా ఇతర సంస్థలు వాడుకోలేదు. ఇది హిందుత్వ పార్టీలకు ఒక ఎన్నికల స్టంట్‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే కన్నడ రచయిత కేఎస్ భగవాన్ ఒక పుస్తకాన్ని రాశారు. ʹరామ మందిర యేకే బేడ? (రామ మందిర అవసరం ఏముంది?)ʹ పేరుతో విడుదలైన ఈ పుస్తకంలో చాలా విషయాలను ప్రస్తావించారు. ముఖ్యంగా రాముడు దేవుడే కాదు ఎందుకంటే ఆయన కూడా సాధారణ మానవుల్లాగే ఎన్నో కష్టాలు పడ్డారు, సమస్యలతో సతమతమయ్యారు.. దేవుడికి అన్ని కష్టాలు ఉంటాయా అంటూ ఆలోచింపజేసేలా వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయంటూ మైసూరుకు చెందిన హిందూ జాగరణ్ వేదిక అధ్యక్షుడు పోలీసులకు పిర్యాదు చేశారు. ఆ రచయితను వెంటనే అరెస్టు చేయాలని.. దేవుడిపై అనుచిత వ్యాఖ్యల వల్ల ఎందరో హిందువులు బాధపడ్డారని ఆయన వాదిస్తున్నారు. ఈ సంస్థకు బీజేపీ మద్దతు పలుకుతోంది.

Keywords : రామ మందిరం, రామ మందిర యేకే బేడా, కేఎస్ భగవాన్, హిందూ జాగరణ్ వేదిక, ram temple, ks bhagavan, rama mandira yeke beda
(2019-03-15 23:48:51)No. of visitors : 194

Suggested Posts


0 results

Search Engine

జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
more..


రామ