గెలిచినమంటే చేసిందంతా మంచిదని కాదు!


గెలిచినమంటే చేసిందంతా మంచిదని కాదు!

గెలిచినమంటే

(వీక్షణం జనవరి సంచిక సంపాదకీయ వ్యాఖ్య‌)

అయ్యా కారు సార్లు, మళ్లొకసారి భారీ బహుమతి తోని గెల్చినమని పొంగిపోతండ్రా ఏంది, మురిసి ముక్కలైతండ్రా ఏంది? అట్ల గాదు నాయిన. అసలు గెలుస్తమా లేదా అనుకున్నది మీరే గద. వచ్చే ఏడు అయితే గెల్వమేమోనని ముందుగాల వోట్లు పెట్టిచ్చుకున్నది మీరేగద. ఇగ జూడు వంద, అగ జూడు నూట పది అనుకుంటనే, మీ పెగ్గెల మీద మీకే నమ్మిక లేనట్టు మళ్ల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మీరేగద. సారలు తాగబోయించింది మీరే గద. కొసాఖరికి సర్కారు నిలబెట్టనీకి సరిపోతయో లేదో అని చిన్న చిన్న పార్టీలను పిలిచి మాట ముచ్చట బెట్టింది మీరే గద. ఇప్పుడు ఏదో ఎటమటమై నాలుగు సీట్లు ఎక్కువ రాంగనే ఎగిరెగిరి పడుడు మంచిది గాదు. సరే, మాట కోసం జనమంత మీకే ఏసిండ్రనుకుందాం. మళ్ల మీకే సర్కారు ఒప్పజెప్పిండ్రనుకుందాం. దాని అర్థం ఏందన్నమాట? మీరు ఆ నాలుగేండ్లల్ల జేసిన తప్పుడు పనులన్ని బారా ఖూన్‌ మాఫ్‌ అన్నరని అనుకుంటాండ్రా ఏంది? ఇప్పుడు గెల్వంగనె మీరు ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెట్టిందంత మాఫ్‌ అయిపోతాదయ్య? నేరెళ్లల ఉసికె లారీల కింద తొక్కి చంపిన మా అన్నదమ్ములు బతికి వస్తరానయ? మల్లన్నసాగర్‌ పేరు మీన మా బతుకులు ముంచిన కోపం చల్లార్తదానయ? మాలమాదిగోళ్లకు భూములు ఇస్తనని చెప్పి ఎగ్గొట్టింది మంచిదే అన్నట్టానయ? ఓపెన్‌ కాస్టులు తవ్వనే తవ్వ, బొందలగడ్డలు చెయ్యనే చెయ్య అని మాట మారిస్తిరి గద, ఇప్పుడు గెలిచిన్రంటె, రా బొందలగడ్డలు చెయ్యి అని మేం పిలిచి చెప్పినట్టా? వీపు మీద కొడితిరి, కడుపుమీద కొడితిరి, అయ్యో దెబ్బతగిలెరో అని ఏడుస్తనంటె, ఏడ్వటానికి గుడ కుదరదు అని ఏడ్చే జాగ, ధర్నా చౌకో, అదేందో మూసేస్తిరి. ఇప్పుడు గెలిచిన్రంటె అది మూసేసుడు మంచిదేనని మేం అన్నట్టా? అన్నేండ్లు మా పిల్లల కొలువుల కోసమె కొట్లాడ్తిమి. ఎక్కంగనె కొలువులు ఇస్తమంటిరి. నాలుగేండ్లాయె ఎక్కడి గొంగడి అక్కడ్నేనాయె. పిల్లగాండ్లు ఒర్లబట్టిరి. ఇప్పుడు గెల్చిన్రంటె, మేమే మాకు కొలువులేమొద్దు తియి, నువు నీ ఇష్టమొచ్చినప్పుడే ఇద్దువుగాని అని చెప్పినట్టా? చంద్రబాబు రాజ్జెంల, రాజశేఖర్రెడ్డి రాజ్జెంల కన్న ఎక్కువ నీ రాజ్జెంల పోలీసులు అరిగోస పెట్టబట్టిరి. గెలిపిచ్చినమంటె, మంచిది, మా పిల్లలను చంపు, మమ్ములను కొట్టిపిచ్చు అని నీకు ఇజాజత్‌ ఇచ్చినట్టా? ఆంధ్రోని మీద కొట్లాడెటప్పుడు ఎంత ముద్దుగ ఎన్ని మాటలు చెపితివి, ఒక్కటంటె ఒక్కటి చెయ్యకపోతివి. ఇప్పుడు గెలిపిచ్చినమంటె, మంచోనివి నాయిన, చెప్పిన మాట చెయ్యలె, నీ అంత అవ్వల్‌ దర్జ లేడు అని గొంగడి కప్పినట్టనుకుంటానవా, ఏంది? మారె, అది వేరు ఇది వేరు. అట్ల ఓట్లు పడంగనే చేసిందంత మంచేనని ఒప్పుకున్నట్టే అనుకుంటె ఆ యాబై ఎనిమిదేండ్లల్ల తెలంగాణను అరిగోస పెట్టినోళ్లే గెలిచిండ్రు గద, సర్కారు గట్టిండ్రు గద. మళ్ల అరిగోస పెట్టిండ్రు గద. మళ్ల గెలిచిండ్రు గద. దేశమంతట గుడ గంతే గద. అంటేందన్నమాట? ఓట్లల్ల గెలుసుడు, జనానికి మంచి జేసుడు ఒకటి కాదు. జనానికి చెడ్డ జేసినోడు గుడ ఓట్లల్ల గెలువొచ్చు. జనానికి మంచి జేసినోడు గుడ ఓట్లల్ల ఓడిపోవచ్చు. అందుకని, సారూ, గెలిచినమని ఉచ్చిలి పడకుండ్రి. ఇప్పటికైన మంది మీద గింతంత నెనరు చూపుండ్రి. ఆంధ్రోడి సర్కారు వద్దేవద్దు అని ఎందుకనుకున్నమో, మన తెలంగాణల మన రాజ్జెం అని ఎందుకన్నమో యాజ్జేసుకోండి. ఒక్కపారి తెలంగాణోళ్ల మన్సుల జొర్రి ఏమనుకుంటాండ్రో తెలుసుకోండి. చేయిదేమున్నది, ఓటు ఎట్లైన ఏస్తది, మన్సుల ఏమున్నదో తెల్వాలె గద...

Keywords : telangana, trs, elections
(2019-03-16 09:02:14)No. of visitors : 212

Suggested Posts


అక్రమ నిర్బంధానికి పదేళ్ళు! - ఎన్. వేణు గోపాల్ (Part-1)

వాళ్లు గదిలోకి వస్తూనే, మేం ఎవరమో, ఏం చేస్తున్నామో కూడ కనుక్కోకుండానే మామీద పడ్డారు. కళ్లకు గంతలు కట్టారు. చేతులు వెనక్కి విరిచి కట్టారు. మేం జర్నలిస్టులమనీ, రచయితలమనీ చెపుతున్నా పట్టించుకోకుండా పోలీసు మార్కు ప్రవర్తన రుచి చూపించి ఒకటి రెండు దెబ్బలు వేశారు. జీపుల్లోకి తోశారు. ఔరంగాబాద్ లోనే ఉన్న వాళ్ల రహస్య స్థావరానికి తీసుకుపోయారు....

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ʹమావైపు లేకపోతే వాళ్లవైపు ఉన్నట్టేʹ అని ప్రపంచాన్ని బెదిరించిన జార్జి బుష్ లాగ ʹదీన్ని విమోచనం అనకపోతే రజాకార్ల వైపు ఉన్నట్టేʹ.

నిజాం రాజు గొప్పవాడా... దుర్మార్గుడా... ఒక పరిశీలన - ఎన్ వేణు గోపాల్

అసలు ఒక పాలన గురింది మాట్లాడేటప్పుడు ఆ పాలకుడి మంచిచెడులు, ఇస్తాయిష్టాలు, అభిరుచులు ప్రధానంగా చర్చ జరిగితే ఇంత దురదృష్టకరంగానే ఉండక తప్పదు. ఎందుకంటే ప్రతిపాలకుడిలోనూ మంచీచెడూ ఉంటాయి. మంచి ప‌నుల ఉదాహరణలు ఎన్ని ఇవ్వవచ్చునో చెడ్డపనుల ఉదాహరణలు అంతకు కొన్నిరెట్ల చూపించవచ్చు...

ఎవరివీ ప్రపంచ తెలుగు మహాసభలు - ఎన్. వేణు గోపాల్

తెలంగాణ వాదులలో అధికార పీఠాలు ఎక్కినవారు ఇప్పుడు మాట మారుస్తుండవచ్చు గాని అప్పుడు మాత్రం తెరాస నాయకులతో సహా ఎందరో తెలంగాణ వాదులు ఆ తిరుపతి తెలుగు మహాసభలకు వ్యతిరేకంగా మాట్లాడారు, నిరసన ప్రదర్శనలు జరిపారు. తెలంగాణ జాగృతి సంస్థతో పాటు తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, తెలంగాణ ధూం ధాం వంటి ఎన్నో సంస్థలు బహిష్కరణ పిలుపునిచ్చాయి.....

తెలంగాణొస్తే ఏమొచ్చింది ? - ‍ ఎన్.వేణు గోపాల్

ʹతెలంగాణొస్తే ఏమొచ్చిందా, చూడండిʹ అని తెలంగాణ ప్రభుత్వ సమర్థకులు సోషల్‌ మీడియాలో మాటిమాటికీ కాలు దువ్వుతున్నారు. సంక్షేమ పథకాల గురించి ఊదర కొడుతున్నారు. నిండిన చెరువులు, మత్తడి దూకుతున్న చెరువులు, కనుచూపు మేర విస్తరించిన పంట పొలాలు, చిరునవ్వుల ముఖాలు ఫొటోలు ప్రదర్శిస్తున్నారు. అయితే ఎంత కర్కోటక పాలనలోనైనా ఏవో కొన్ని సంక్షేమ పథకాలు ఉంటాయి, ఇటువంటి ప్రదర్శ

అబ‌ద్ధాల కేసులో అన్యాయ‌మైన తీర్పు - ఎన్.వేణుగోపాల్

ఆ వాదనలన్నీ విన్నతర్వాత కూడ న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ అబద్దపు వాదనలనే ఆమోదిస్తూ, చట్టంలో నిర్దేశించిన గరిష్ట శిక్షను ఎట్లా విధించారో అర్థమవుతుంది. వర్గ సమాజంలో న్యాయస్థానం అనేది పాలకవర్గపు చేతిలో పనిముట్టగా, వ్యవస్థ పరిరక్షణకు సాధనంగా పని చేస్తుందనే అవగాహన అందరికీ తెలిసిన నిజమే గాని, ఈ తీర్పు చదివితే ఆ అవగాహన ఎట్లా నూటికి నూటయాభై పాళ్ల వాస్తవమైనదో.....

ప్రపంచ తెలుగు మహాసభలు ఏం సాధించాయి ? - ‍ ఎన్. వేణు గోపాల్

తెలుగు భాష మీద , తెలుగు సాహిత్యం మీద, తెలుగు చరిత్ర మీద, తెలుగు సంస్కృతి మీద ఎటువంటి గౌరమూ, శ్రద్ద లేకుండా కేవలం తమ ప్రాపకం పెంచుకోవడానికి తమకీర్తిని చాటుకోవడానికి విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి అందులో ముడుపులు కైంకర్యం చేయడానికి ఈ సభలు జరిగాయి...

అక్రమ నిర్బంధానికి పదేళ్ళు! - ఎన్.వేణుగోపాల్ (Part-2)

మాట్లాడుకోవడం మానవ సహజం. అది నేరం కాదు. తప్పు కాదు. మనిషిని మాట్లాడకుండా ఆపగల అధికార శక్తి ఏదీ లేదు. మాట్లాడడాన్ని నేరంగా ప్రాసిక్యూషన్ చిత్రించినా దాన్ని నేను అంగీకరించను. మనిషిగా తోటి మనుషులతో మాట్లాడకుండా ఉండబోను. మనిషిని మనిషిగా గౌరవించే మానవీయ వ్యవస్థ కోసం నా శక్తిమేరకు కృషి చేయకుండా ఉండబోను....

ʹసామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళుʹ వివాదం - ఎన్. వేణుగోపాల్

అణచివేతకు గురైన కులాల మీద, శూద్ర కులాల మీద, దళిత కులాల మీద ఇంకా దుర్మార్గమైన, నీచమైన, నిందార్థపు వ్యాఖ్యలు, సామెతలూ ఎన్నో ఉన్నాయి. అవి హిందూ పవిత్ర గ్రంథాలనబడేవాటికి కూడ ఎక్కాయి. మత ఆమోదాన్ని కూడ పొందాయి. వాటిని ఎవరూ ఎప్పుడూ ఖండించి, ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా, భాషను సంస్కరించుకోవడానికి ఉద్యమం జరపలేదు. ఇవాళ ఒక మాట తమను అవమానించిందని వీథికెక్కుతున్న....

అదానీ కోపం..ఈపీడబ్ల్యూ సంపాదకుడి రాజీనామా - ఎన్.వేణు గోపాల్

అదానీ గ్రూపు కంపెనీలకు రు. 500 కోట్ల ప్రయోజనం కలిగిస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం గురించి ఇపిడబ్ల్యు వెబ్‌ సైట్‌ మీద అంతకు కొద్ది రోజుల ముందు...

Search Engine

జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
more..


గెలిచినమంటే