అగ్రకులాలకు రిజర్వేషన్లు సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం, రాజ్యంగ విరుద్ధం


అగ్రకులాలకు రిజర్వేషన్లు సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం, రాజ్యంగ విరుద్ధం

అగ్రకులాలకు

మోడీ ప్రభుత్వం కీలకమైన 2019 లోక్‌సభ ఎన్నికల ముందు అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు నిన్న రాజ్యసభలో ఆమోదం పొందింది. అయితే ఆర్థిక కారణాలతో రిజర్వేషన్లు ఇవ్వడమనేది రాజ్యాంగ విరుద్దం. అయినా సరే మోడీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై వెనక్కు తగ్గలేదు. ఈ రిజర్వేషన్లు ఎలా రాజ్యాంగ విరుద్దమో వరలక్ష్మి ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు. అది యధాతథంగా..
---------------------------------------------------------------------------------------------------

అగ్రకులాల పేదల కోసమని చెప్పి తీసుకొస్తున్న కొత్త రిజర్వేషన్ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం. దీన్ని ప్రజాస్వామికవాదులందరూ నిరసించాలి. రిజర్వేషన్లు ఉన్నది ఆర్థిక సమానత్వాన్ని సాధించడానికో, పేదరికాన్ని నిర్మూలించడానికో కాదు. అది రిజర్వేషన్ పరిధిలో సాధ్యమయ్యేదీ కాదు. తరతరాలుగా ఏ అవకాశాలకైతే కొన్ని సమూహాలు అమానవీయ కులవ్యవస్థ, పితృస్వామ్యం వల్ల దూరమయ్యారో వాటిని కల్పించడం కోసం. అది ఆయా సమూహాల హక్కు కూడా. దళితుల, వెనకబడిన కులాల, స్త్రీల క్రియాశీల భాగస్వామ్యాన్ని అన్ని రంగాల్లో పెంచకపోతే సమాజ ప్రజాస్వామికీకరణ అసాధ్యం. పేదరిక నిర్మూలనకైతే ఎన్నో పథకాలు ఉంటాయి. దానికి రిజర్వేషన్ కు సంబంధం లేదు.

అయితే అగ్రకులాల్లో కుల ఆధిపత్య స్వభావం వల్లనైతేనేమి, మొత్తంగా నిరుద్యోగం వల్లనైతేనేమి తమకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడానికి రిజర్వేషన్ విధానమే కారణమని ఆక్రోశం వ్యక్తమవుతూ ఉంటుంది. నీకు ఉద్యోగం రాకపోవడానికి కారణం మొత్తంగా నిరుద్యోగ సమస్య కానీ రిజర్వేషన్ విధానం కాదు అని చెప్పినా అర్థం చేసుకోడానికి సిద్ధంగా ఉండరు. అన్ని దేశాల్లో నిరుద్యోగ సమస్య మీద ప్రజలకు ప్రభుత్వంపై ఆగ్రహం కలిగితే ఇక్కడ కింది కులాల మీద అసూయ, ద్వేషం కలుగుతుంది. మెరిట్ లేకపోయినా దళితులకు సీట్లిస్తున్నారు అని అభ్యంతర పెట్టేవాళ్ళు, మెరిట్ లేకపోయినా డబ్బున్నవాడు సీటు కొనుక్కోవడం గురించి అభ్యంతరపెట్టరు. డబ్బు పోసి మెడికల్ సీటు కొనుక్కుంటే, మరి ప్రజల ప్రాణాలకు భద్రత ఎక్కడ అని అడగరు. సామాజిక సమానత్వాన్ని, రాజ్యాంగాన్ని అంగీకరించని ఆరెస్సెస్ ఇటువంటి ఆధిపత్య కులదురహంకార వాదనల్ని, మూర్ఖత్వాన్ని బాగా పెంచిపోషిస్తుంది. ఆ దిక్కుమాలిన వాదానికి ఇప్పుడు అధికారిక స్థానం కల్పించారు. కొత్త రిజర్వేషన్ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమైనదే కాదు, అగ్రకుల దురహంకారపూరితమైనది కూడా.

దీనివల్ల అగ్రకులాల్లోని పేదలకు మేలుకలుగుతుందనే వాదనలో కూడా అసలు కామన్ సెన్స్ లేదు. 8 లక్షల సంవత్సరాదాయం, ఇల్లు, పొలము ఉన్న వాళ్ళను కూడా పేదల కింద లెక్క వేసాక ఇక నిజంగా పేదలకు అన్యాయమే జరుగుతుంది. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత సెంటు పొలము, సొంత ఇళ్లు, గౌరవప్రదంగా, ఆరోగ్యంగా బతకడానికి కనీస సంపాదన లేని అగ్రకులాల్లోని పేదలు, ఇవన్నీ ఉన్న అగ్రకులాలవారితో రిజర్వేషన్ లో పోటీ పడవలసి వస్తుంది. అంతే కాదు సంపన్నులు కూడా ʹమేమూ పేదలమేʹనని రేషన్ కార్డులు, పించన్లు, ఫీజు రీఎంబర్స్ మెంట్లు పొందినట్లు రిజర్వేషన్లు పొందడానికి ముందుకువస్తే అప్పుడు నిజంగా నష్టపోయేది పేదలే. ఈ బిల్లు కింది కులాల రిజర్వేషన్ల పట్ల అసూయపడేవాళ్ళను సంతృప్తి పరచడానికి, ఓట్లు కొల్లగొట్టడానికి, రిజర్వేషన్ల అసలు అర్థానికి, సామాజిక న్యాయభావనకు తూట్లు పొడవడానికి ఆరెస్సెస్ ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వం వేసిన మాస్టర్ ప్లాన్.
- వరలక్ష్మీ విరసం

Keywords : అగ్రవర్ణాలు, పేదలు, రిజర్వేషన్లు, బిల్లు, రాజ్యాంగ సవరణ, మోడీ ప్రభుత్వం, EBC Reservations, Amendment, Modi
(2019-03-19 07:11:17)No. of visitors : 213

Suggested Posts


0 results

Search Engine

ఒక సంఘీభావ ప్రదర్శన – ఒక విచారం – ఒక ఉత్తేజం
జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
more..


అగ్రకులాలకు