ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ను తొలిగించడమే ఆరెస్సెస్‌-బీజేపీ అసలు లక్ష్యం...జిగ్నేష్ మెవాని


ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ను తొలిగించడమే ఆరెస్సెస్‌-బీజేపీ అసలు లక్ష్యం...జిగ్నేష్ మెవాని

ఎస్సీ,

ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు తొలగించడమే ఆరెస్సెస్‌-బీజేపీ ప్రధాన ఎజెండా అని గుజరాత్‌ ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేష్ మేవానీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని రద్దు చేయడం, కుల ఆధారిత రిజర్వేషన్‌లకు ముగింపు పలకాలనేవి ఆరెస్సెస్‌-బీజేపీల దీర్ఘకాలిక లక్ష్యాలని అన్నారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశ్యంతో దేశంలో రిజర్వేషన్‌ విధానాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. అంతేకానీ, ఇది పేదరికాన్ని అంతం చేసే లక్ష్యంతో అమలు చేస్తున్నది కాదని తెలిపారు. కోల్‌కతాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకున్న వైనం.. కుల ఆధారిత రిజర్వేషన్‌ను పూర్తిగా తొలగించాలనే ఆరెస్సెస్‌-బీజేపీ ఎజెండాను నిజం చేస్తున్నట్టుగా ఉన్నదని తెలిపారు. సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు ఆధారంగా కల్పించే రిజర్వేషన్లకు స్వస్తి చెప్పేందుకు ఇది తొలి అడుగ్గా ఉన్నదని, ఈ నిర్ణయంవల్ల తనతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఇతర కులాల పేదలు లబ్ధి పొందడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే రిజర్వేషన్‌ పేదరికాన్ని తొలగించేందుకు కాదన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. కుల వ్యవస్థ వల్ల సామాజికంగా, విద్యారంగంలో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఆయా రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించడమే రిజర్వేషన్‌ లక్ష్యమని తెలిపారు. అలాగే, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి వ్యతిరేకంగా పొత్తుపెట్టుకున్నందుకు బీఎస్పీ చీఫ్‌ మాయావతి, ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌లకు అభినందనలు తెలిపారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఇతర విపక్ష పార్టీలు పొత్తు పెట్టుకోవాలని అన్నారు.

Keywords : jignesh mevani, ebc, Quota Law BJPʹs Agenda, Remove Caste-Based Reservation, Gujarat independent MLA, dalit
(2019-04-13 01:28:07)No. of visitors : 209

Suggested Posts


0 results

Search Engine

ʹఆ తొమ్మిది మందిʹ అద్భుత మానవుల కరచాలనం
మోడీ విధానాలే తన వైఖరి అని తేల్చి చెప్పిన కెసిఆర్
వికీలీక్స్‌ ఫౌండర్‌ జూలియన్ అసాంజే అరెస్ట్‌
బీజేపీకి ఓటు వేయకండంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న‌ రైతు !
ʹప్రొఫెసర్ సాయిబాబాను తక్షణమే విడుదల చేయాలిʹ
Condemn the denial of bail to human rights defender Dr. GN Saibaba
Open Letter to KCR from Varavara Raoʹs wife
కేసీఆర్‌కు వరవరరావు సహచరి బహిరంగ లేఖ
ఓట్లడిగే నైతిక హక్కు.. ఈ పార్టీలకు లేదు...!!
లేబర్ ఆఫ్ లవ్... ఇది మన కథే..!
ఈ దేశం మరోసారి మోసపోకూడదు.
బీమా కోరేగావ్ కేసులో మరో మంగళవారం.. పూణే కోర్టులో ఆ రోజు ఏం జరిగింది..?
సాయిబాబా,వరవరరావులని విడుదల చేయాలి - వివిధ పార్టీలకు 100మంది మేధావుల లేఖ
After 12 Years In Jail For 157 Charges, Nirmalakka Is Set Free
విద్వేష‌ రాజకీయాలను ఓడించండి - 200 పైగా రచయితల విఙప్తి
ఫాసిజమై మారుతోంది ప్రజాస్వామ్య నాటకం
బీజేపీ వ్యతిరేక ప్రచారానికి డైరెక్టర్ ʹపా రంజిత్ʹ మద్దతు
మోడీ, బీజేపీ సర్కారును కూలదోయండి : దేశానికి ఫిల్మ్ మేకర్స్ అభ్యర్థన
Solidarity Statement from the US Coalition to Free Professor G.N. Saibaba
పోలీసుల ప్రయత్నం విఫలం... నక్కా వెంకట్రావుకు బెయిల్ మంజూరు
వరవరరావు సహచరి హేమలత‌ ఛీఫ్ జస్టిస్‌కు రాసిన బహిరంగ లేఖ
Release of Hemalataʹs Open Letter to Chief Justice of India
The worse health deterioration of Prof G.N. Saibaba
ముస్లిం కుటుంబంపై మూక దాడి.... పాకిస్తాన్ వెళ్ళిపోండి అని బెదిరింపు
అన్నీ దోపిడీ దొంగ పార్టీలే - బూటకపు ఎన్నికలను బహిష్కరించండి : మావోయిస్టు పార్టీ
more..


ఎస్సీ,