మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్‌ తెల్తుంబ్డే


మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్‌ తెల్తుంబ్డే

మీ

(2018 జనవరి 1న భీమా కోరేగాంలో హింసాకాండకు సంబంధించి పౌరహక్కుల కార్యకర్త, ప్రముఖ మేధావి ఆనంద్ తెల్తుంబ్డే పై పూణే పోలీసులు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేయడానికి సుప్రీంకోర్టు ఈ నెల 14న తిరస్కరించింది. ముందస్తు బెయిల్ కోసం సెషన్స్ కోర్టుకు దరఖాస్తు చేసుకునేందుకు ఆయనకు సుప్రీంకోర్టు నాలుగు వారాల వ్యవధినిచ్చింది. ఈ నేపథ్యంలో తనను అరెస్ట్ చేసే ప్రమాదం ఉందని తనకు ఈ దేశ ప్రజల మద్దతు కావాలంటూ ప్రజలకు ఆనంద్ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ పాఠం మీ కోసం)

నాతో పాటు నిందితులైన మరో తొమ్మిదిమంది ఇప్పటికీ జైలులో ఉన్నారు. చట్టపరమైన ప్రక్రియల వేధింపులకు గురవుతున్నారు. మీ అందరి సహకారమూ మద్దతూ కోరే అవకాశం నాకు వచ్చిన విధంగా వారికి రాలేదు. మీరు ఇప్పుడు నాకు అండగా నిలిస్తే అది కేవలం నాకు, నా కుటుంబ సభ్యులకు మాత్రమే గాక మా అందరికీ తోడ్పడుతుంది. మీరు ఈ దేశంలో పాలిస్తున్న ఫాసిస్టు మూకలను ఎదిరించి నిలిచే వారున్నారన్న స్పష్టమైన సందేశం ఇచ్చినవారౌతారు.*

*నేను అహమ్మదాబాద్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థిని. ఐఐటి ప్రొఫెసరును. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటిడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నాను. పెట్రోనెట్‌ ఇండియాకు గతంలో మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ సిఇవోగా పని చేశాను. 26 పుస్తకాలు రచించాను. ఎకనామిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీకి కాలమిస్టును. కులం-వర్గం, సామాజిక అంశాలు, ప్రభుత్వ విధానాలపై అసంఖ్యాకంగా వ్యాసాలు రాశాను. ఒక మేధావిగా, ప్రజాతంత్ర హక్కుల కోసం, విద్యా హక్కు కోసం కృషి చేస్తున్నాను. అటువంటి నేను ఈ రోజు ʹఅర్బన్‌ మావోయిస్టుʹగా ముద్రపడి అరెస్టయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాను. స్వతంత్రానంతర భారతదేశంలో ప్రభుత్వం పన్నిన అతినీచమైన కుట్ర ఇది. మీ మద్దతు నాకిప్పుడు కావాలి.*

*నాపై పూనే పోలీసులు దాఖలు చేసిన తప్పుడు ఫిర్యాదును ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని నేను చేసుకున్న అభ్యర్థనను 14-1-2019న సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి మీడియా ద్వారా మీకు ఈ పాటికే తెలిసివుంటుంది. అదే ఉత్తర్వులో నాకు ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవడానికి నాలుగు వారాల వ్యవధిని ఇచ్చారు. ఇంతవరకూ నేను పూనే పోలీసులు నాపై మోపిన ఆరోపణలన్నీ కల్పితాలేనని, కట్టుకథలని, కుట్రపూరితంగా ఈ కేసును నాపై బనాయించారని కోర్టులో రుజువు చేసుకోగలుగుతానన్న విశ్వాసంతో ఉన్నాను. అందుకే మిత్రుల సహాయాన్ని ఇంతవరకూ కోరలేదు. నా నమ్మకం వమ్మైంది. ఇప్పుడు పూనే లోని సెషన్స్‌ కోర్టు స్థాయి నుండి సుప్రీంకోర్టు స్థాయి వరకు ఎక్కడో ఒక దగ్గర బెయిలు తెచ్చుకోడానికి స్వల్ప వ్యవధి మాత్రమే నా వద్ద మిగిలింది. నన్ను అరెస్టు చేసే ప్రమాదం నుంచి కాపాడుకోడానికి అందరి దృష్టిలోనూ పడేలా ఒక బలమైన ప్రచార ఉద్యమాన్ని నడిపి వివిధ తరగతుల ప్రజానీకం నుండి మద్దతు సేకరించాల్సిన తరుణం వచ్చింది.*
*చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అరెస్టవ్వడమంటే సంవత్సరాల తరబడి నిర్బంధానికి, వేధింపులకు గురవడమేనని మనలో చాలా మందికి బహుశా తెలియదేమో. ఒక కరుడుగట్టిన నేరస్తుడు సైతం ఒకటో, రెండో సంవత్సరాల శిక్షతో బైటపడే వీలుంది. కాని ఈ చట్టం కింద అరెస్టయితే ఏ నేరమూ చేయని వ్యక్తి సైతం సంవత్సరాల తరబడి జైలులోనే మగ్గిపోతాడు. రాజకీయ నేతల ఆదేశాల ప్రకారం ఈ చట్టం కింద కేసును బనాయించిన పోలీసులు తమ వద్ద తగిన సాక్ష్యాధారాలున్నాయన్న ప్రకటనలో నిరపరాధులను సైతం ఏళ్ల తరబడి జైలులోనే ఉంచే వీలుంది. నేను అరెస్టుకు భయపడడం లేదు. కాని నా లైబ్రరీలోని పుస్తకాలు నా జీవితంలో విడదీయలేని భాగం అయిపోయాయి. సగం సగం రాసుకున్న రాత ప్రతులు, పరిశోధనా వ్యాసాలు, ప్రచురణకర్తలకు రాసి పంపుతానని అంగీకరించిన గ్రంథాల ప్రతులు, నా ల్యాప్‌టాప్‌-ఇవన్నీ కూడా నా జీవితంలో విడదీయలేని భాగాలైపోయాయి. ఎందరో రీసెర్చి విద్యార్థులు నా వద్ద గైడెన్సుకు రిజిస్టరు చేసుకున్నారు. వారికి నేనిస్తున్న గైడెన్సు మధ్యలో ఆగిపోయి వారి భవిష్యత్తుకూ నష్టం కలుగుతుంది. నా కార్యకలాపాలపై మా సంస్థ పెట్టిన ఖర్చు వృథా అవుతుంది. నన్ను బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ లోకి తీసుకున్న సంస్థలకూ ఇబ్బంది కలుగుతుంది.* *అసంఖ్యాకంగా ఉన్న నా మిత్రులకు దూరం అవుతాను. నా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా నా భార్యకు (ఆమె బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ మనుమరాలు) నా కుమార్తెలకు ఇబ్బంది కలుగుతుంది. 2018 ఆగస్టు నుంచీ నాకేమీ కానున్నదో అన్న ఆందోళనలో వారంతా ఇప్పటికీ తీవ్ర మనోవేదనకు లోనై వున్నారు. నేను నిరుపేద కుటుంబం నుండి వచ్చాను. నా మేధో కృషితో దేశంలోని అత్యుత్తమ సంస్థలలో చదువుకోగలిగాను. ఐఐఎం, అహమ్మాదాబాద్‌లో చదువుకున్న వాడిగా నేను చాలా సుఖవంతమైన జీవితం గడిపే వీలుంది. అయితే చుట్టూ వున్న సమాజంలో జరుగుతున్న అవకతవకలను నేను విస్మరించలేకపోయాను. అందుకే నేను, నా కుటుంబం సాధారణ జీవితం గడపడానికి సరిపడా మాత్రమే సంపాదించి తక్కిన సమయంలో నా మేధోపరమైన కృషి ద్వారా నేను నివసిస్తున్న రాష్ట్రంలో నా చుట్టూ వున్న ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలను సరిచేయడానికి కృషి చేస్తున్నాను. ఈ రకమైన నా దృక్పథం వలనే నేను విద్యార్థి దశలో ఉన్న కాలం నుండే పౌర హక్కుల సంఘంలో భాగస్వామినయ్యాను. ప్రస్తుతం దాని ప్రధానకార్యదర్శిగా ఉన్నాను. విద్యా హక్కు కోసం ఏర్పడిన అఖిలభారత వేదిక అధ్యక్షవర్గ సభ్యుడిగా కూడా ఉన్నాను. నా అసంఖ్యాకమైన రచనలలో గాని, నిస్వార్థపూరితమైన కార్యకలాపాలలో గాని చట్ట వ్యతిరేకమైనదేదీ ఇసుమంతైనా లేదు. నా యావత్తు విద్యా సముపార్జన దశలోగాని, నాలుగు దశాబ్దాలు సాగిన నా ఉద్యోగంలో గాని ఒక్క మచ్చ కూడా లేదు. అత్యున్నత స్థాయి నిజాయతీతో, నిబద్ధతతో నేను వ్యవహరించాను. అందువలన ఈ రాజ్యం, ఈ రాజకీయ వ్యవస్థ నన్ను ఒక నేరస్తుడిగా అతి నీచమైన రీతిలో ముద్రవేసి నిలబెడతాయని నేను కలలో కూడా ఊహించలేదు. ఈ దేశంలోని రాజ్య వ్యవస్థ అమాయకులైన పౌరులను నేరగాళ్లుగా చిత్రీకరించి అసలైన దొంగలను, దోపిడీదారులను రక్షిస్తూ, తీవ్ర అసమాన తలకు కారణం అవుతోంది. గత సంవత్సరం జరిగిన ʹఎల్గర్‌ పరిషత్‌ʹ అనే అత్యంత నిరపాయకరమైన కార్యక్రమాన్ని సైతం ఒక నేరపూరితమైన కుట్రగా మార్చి వేసింది ప్రభుత్వం. అందులో మానవ హక్కుల ఉద్యమకారులు, మేధావులు, ప్రజా ఉద్యమాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాని ప్రభుత్వానికి అందులో కుట్ర మాత్రమే కనపడింది! తనను వ్యతిరేకించే వారిపై అత్యంత నీచమైన తీరులో ప్రభుత్వమే కుట్ర పన్ని కేసుల్లో ఇరికించడం కనీస ప్రజాస్వామ్య విలువలు కూడా లేవనడానికి సంకేతం*.

*ఇప్పుడీ కేసు ఒక ముఖ్యమైన ఘట్టానికి చేరింది. నేను అమాయకంగా పెట్టుకున్న నమ్మకాలన్నీ వమ్మయ్యాయి. అరెస్టు తప్పదన్న పరిస్థితిలో నేను హతాశుడినై వున్నాను. నాతో పాటు నిందితులైన మరో తొమ్మిదిమంది ఇప్పటికీ జైలులో ఉన్నారు. చట్టపరమైన ప్రక్రియల వేధింపులకు గురవుతున్నారు. మీ అందరి సహకారమూ మద్దతూ కోరే అవకాశం నాకు వచ్చిన విధంగా వారికి రాలేదు. మీరు ఇప్పుడు నాకు అండగా నిలిస్తే అది కేవలం నాకు, నా కుటుంబ సభ్యులకు మాత్రమే గాక మా అందరికీ తోడ్పడుతుంది. మీరు ఈ దేశంలో పాలిస్తున్న ఫాసిస్టు మూకలను ఎదిరించి నిలిచే వారున్నారన్న స్పష్టమైన సందేశం ఇచ్చినవారౌతారు*.

*అందువలన మీరు సంతకాల సేకరణ, పత్రికా ప్రకటనలు, వ్యాసాలు, మరే ఇతర పద్ధతుల ద్వారానైనా గాని మీ ఆగ్రహాన్ని, నిరసనను, అభ్యంతరాన్ని ప్రకటించి ఈ ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టడానికి ముందుకు రావాలని కోరుతున్నాను.*

Keywords : anand teltumbde, pune, bhima koregaon case
(2019-04-17 16:52:53)No. of visitors : 405

Suggested Posts


ముంబై కదిలింది.. అన్నదాతకు అన్నం పెట్టింది..

తమకు అన్నంపెట్టే రైతుల పోరాటానికి ముంబై నగరం అండగా నిల్చింది. తినీ, తినక 200 కిలోమీటర్లు నడిచి వచ్చిన 50 వేల రైతుల ఆకలి తీర్చేందుకు తమ చేతనైన రీతిలో ముంబై నగరం నడుం బిగించింది..

గడ్చిరోలీలో జరిగింది ఎన్కౌంటర్ కాదు,సామూహిక‌ హత్యలు - నిజ నిర్దారణ బృందం రిపోర్ట్

అవి కచ్చితంగా బూటకపు ఎన్‌కౌంటర్లని 44 మందితో కూడిన నిజనిర్థారణ కమిటీ తేల్చి చెప్పింది. మూడు పౌర హక్కుల, మానవహక్కుల సంఘాలు చేసిన నిజనిర్దారణలో ఈ విషయం తేలినట్టు ఆ సంస్థలు ప్రకటించాయి.

NO ENCOUNTER HAPPENED IN GADCHIROLI ON APRIL 22ND 2018

The killings of at least 37 Maoists by the combined force of the CRPF and the C-60, the elite unit of the Gadchiroli Police, on 22nd and 23rd April 2018 raises some very disturbing questions

Media ignores...35 Thousands of farmers long march from Nashik to Mumbai

Farmers taking out a protest march under the banner of All India Kisan Sabha en route from Nashik to Mumbai in Maharashtra Besides pressing for their long-standing demands, the agitating farmers have also been opposing acquisition ...

ఇంద్రావతిలో విషాద ఘోష - పాణి

నదులతో, వాగులతో, విశాలమైన అటవీ ఆకాశాల్లో జీవించే ఆదివాసులు ఇప్పుడొక స్వప్నాన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. నదిలో పారే నీళ్లను ఎలా వడిసిపట్టి పంటలు పండించుకోవాలో వాళ్లు ఆలోచిస్తోంటే ప్రభుత్వం ఆ పారే నీళ్లలోకి ఆదివాసులను శవాలుగా విసిరేస్తున్నది. ఇదీ భామ్రాగడ్‌ విషాదం.

Gadchiroli Encounter, a Fake and Cold-blooded Mass Murder, Says Fact-finding Teamʹs Report

ʹThe C-60 police and CRPF surrounded the Maoists on all sides and opened fire indiscriminately by using sophisticated weapons like Under Barrel Grenade Launchers (UBGL) with an intention to kill them. As such it is a cold-blooded mass murder,ʹ says the report.

గడ్చిరోలిలో 5గురు మహిళలతో సహా 7 గురు మావోయిస్టులను చంపేసిన పోలీసులు

మహారాష్ట్ర గడ్చరోలి జిల్లా జిగ్ణూరు వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో 7 గురు మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. చనిపోయినవారిలో గడ్చిరోలి జిల్లా అహిరి తాలూకా లింగంపల్లి గ్రామానికి చెందిన అయితు అలియాస్ అశోక్ (దళ కమాండర్) , చత్తీస్ గడ్, బీజాపూర్ జిల్లా కవాండే గ్రామానికి చెందిన‌ సరిత, మహారాష్ట్ర సిరొంచకు చెందిన చంద్రు, అహిరి తాలూకా....

రైతుల పోరాటానికి దిగి వచ్చిన ఫడ్నవీస్ సర్కార్ !

ఎర్రటి ఎండలో విరామమెరుగక నడుస్తూ ఎముకలు కొరికే చలిలో రొడ్డు పక్కనే సగం నిద్ర పోయి. జనం పెట్టింది తింటూ అర్దాకలితో... పాదాలు బొబ్బలెక్కి, చర్మాలు ఊడిపోయి నెత్తురోడే కాళ్ళతో, మహిళలు, వృద్దులు చేసిన పోరు యాత్రకు మహారాష్ట్ర ఫడ్నవీస్ సర్కార్ దిగిరాక తప్పలేదు....

After arrest of seven ʹCPI (Maoist) membersʹ, teacher questioned on ʹNaxal linksʹ ends life

DAYS AFTER he was questioned by the Maharashtra Anti Terrorism Squad (ATS) in connection with the arrests of seven alleged members of the banned Communist Party of India (Maoist), Mumbai schoolteacher Prabhakar Macha committed suicide on January 23....

stand against the threat of imminent arrest of Prof. Anand Teltumbde - Students, Faculty and Alumni of IIT Kharagpur

We, the undersigned students, faculty, alumni and others from IIT Kharagpur are shocked with the threat of imminent arrest of our ex-colleague, Prof. Anand Teltumbde. This comes in the aftermath of rejection of the appeal he filed at the Supreme Court regarding the baseless FIR lodged against him by the Pune police under the pretext of the Bhima-Koregaon

Search Engine

ʹఆ తొమ్మిది మందిʹ అద్భుత మానవుల కరచాలనం
మోడీ విధానాలే తన వైఖరి అని తేల్చి చెప్పిన కెసిఆర్
వికీలీక్స్‌ ఫౌండర్‌ జూలియన్ అసాంజే అరెస్ట్‌
బీజేపీకి ఓటు వేయకండంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న‌ రైతు !
ʹప్రొఫెసర్ సాయిబాబాను తక్షణమే విడుదల చేయాలిʹ
Condemn the denial of bail to human rights defender Dr. GN Saibaba
Open Letter to KCR from Varavara Raoʹs wife
కేసీఆర్‌కు వరవరరావు సహచరి బహిరంగ లేఖ
ఓట్లడిగే నైతిక హక్కు.. ఈ పార్టీలకు లేదు...!!
లేబర్ ఆఫ్ లవ్... ఇది మన కథే..!
ఈ దేశం మరోసారి మోసపోకూడదు.
బీమా కోరేగావ్ కేసులో మరో మంగళవారం.. పూణే కోర్టులో ఆ రోజు ఏం జరిగింది..?
సాయిబాబా,వరవరరావులని విడుదల చేయాలి - వివిధ పార్టీలకు 100మంది మేధావుల లేఖ
After 12 Years In Jail For 157 Charges, Nirmalakka Is Set Free
విద్వేష‌ రాజకీయాలను ఓడించండి - 200 పైగా రచయితల విఙప్తి
ఫాసిజమై మారుతోంది ప్రజాస్వామ్య నాటకం
బీజేపీ వ్యతిరేక ప్రచారానికి డైరెక్టర్ ʹపా రంజిత్ʹ మద్దతు
మోడీ, బీజేపీ సర్కారును కూలదోయండి : దేశానికి ఫిల్మ్ మేకర్స్ అభ్యర్థన
Solidarity Statement from the US Coalition to Free Professor G.N. Saibaba
పోలీసుల ప్రయత్నం విఫలం... నక్కా వెంకట్రావుకు బెయిల్ మంజూరు
వరవరరావు సహచరి హేమలత‌ ఛీఫ్ జస్టిస్‌కు రాసిన బహిరంగ లేఖ
Release of Hemalataʹs Open Letter to Chief Justice of India
The worse health deterioration of Prof G.N. Saibaba
ముస్లిం కుటుంబంపై మూక దాడి.... పాకిస్తాన్ వెళ్ళిపోండి అని బెదిరింపు
అన్నీ దోపిడీ దొంగ పార్టీలే - బూటకపు ఎన్నికలను బహిష్కరించండి : మావోయిస్టు పార్టీ
more..


మీ