రిపబ్లిక్ డే ఉత్సవాలను బహిష్కరించిన ఈశాన్య రాష్ట్రాలు


రిపబ్లిక్ డే ఉత్సవాలను బహిష్కరించిన ఈశాన్య రాష్ట్రాలు

రిపబ్లిక్

ఈశాన్య రాష్ట్రాలు రిపబ్లిక్ డే ఉత్సవాలను బహిష్కరించాయి. పౌరసత్వ (సవరణ) బిల్లు, 2016ను వ్యతిరేకిస్తూ.. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు సంస్థలు గణతంత్ర దినోత్సవ వేడుకలను బహిష్కరించాయి. వీటితో పాటు కొన్నిమిలిటెంట్ సంస్థలు కూడా రిపబ్లిక్ డే వేడుకలను బహిష్కరించాలని పిలుపునివ్వడంతో ఈశాన్య రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు.

ఇలా పిలుపునిచ్చిన వాటిల్లో నాగలాండ్‌కు చెందిన ʹనాగ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ʹ(ఎన్‌ఎస్‌ఎఫ్‌), మణిపూర్‌కు చెందిన మరి కొన్ని సంస్థలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్‌ఎస్‌ఎఫ్‌ పౌరసత్వ బిల్లు పట్ల ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలంటూ డిమాండ్‌ చేస్తోంది. ప్రభుత్వం తన ద్వంద్వ వైఖరితో ప్రజలను తప్పు దోవ పట్టింస్తోందని ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో రిపబ్లిక్‌ డే వేడుకలను బహిష్కరించాలంటూ ఎన్‌ఎస్‌ఎఫ్‌ పిలుపునిచ్చింది.

మిజోరాంలో అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలంతా రిపబ్లిక్ డే వేడుకలకు దూరంగా ఉన్నారు. సాధారణ ప్రజానీకం ఎవరూ రిపబ్లిక్ డే వేడుకలకు హాజరుకాకపోవడంతో.. కేవలం మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ఆరు సాయుధ బలగాల బృందాలు మాత్రమే అందులో పాల్గొన్నారు. అంతా కలిపి కేవలం 30 మంది వరకు పాల్గొని ఉండొచ్చని అంచనా.

ఇక మణిపూర్‌కు చెందిన ఐదు పౌరసంస్థలు కూడా పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చాయి. దాంతో అక్కడి ప్రజలు రిపబ్లిక్ డే వేడుకలను బహిష్కరిస్తున్నట్లు బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి వలస వచ్చి ఆరేండ్ల పాటు దేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించాలని కేంద్రం ప్రతిపాదించిన పౌరసత్వ (సవరణ) బిల్లు, 2016ను పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే.

Keywords : manipur, mizoram, nagaland, republic day, india
(2019-10-21 06:43:38)No. of visitors : 290

Suggested Posts


Manipur Maoist to launch Mega Protest to protect Indigenous people from Nov 11

Maoist Communist Party Manipur (MCPM) said that it will organise a week long Mega Protest from November 11, 2017 to protect the Indigenous people of the state.....

Maoist Communist Party Manipur – Summation of 2016

The Maoist Communist Party Manipur after their formation has been striding forward militarily and politically in both national and international level. The year 2016 was however the year where our efforts bore fruits and showed the world our mettle....

Maoists warns Private Hospitals and Schools

It also warned the private hospitals and schools to revise their fees structure within three days and bring down the fees to a fair and acceptable amount. The press release furthers that the fees charged by the private hospitals are unbearable to the people.

Manipur protests: How police and army bullets catalysed a movement for tribal rights

Outside the morgue at Manipurʹs Churachandpur District Hospital last week, mourners had gathered under a marquee. A woman addressed the crowd, talking about...

News from the revolutionary movement in Manipur

Manipur is a territory controlled by the Indian state, that shares a border with Burma. It is inhabited by a population of 2.5 million people, and more than a third of it lives below the poverty line in a predominantly rural economy.

Search Engine

తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్, విరసం కార్యవర్గ సభ్యుడు డా. జగన్ ను విడుదల చేయాలి
దేశవ్యాప్త నిరసనలతో వెనక్కి తగ్గిన పోలీసులు...49 మంది ప్రముఖలపై కేసు విత్ డ్రా
Over 140Telugu Literary Persons Endorse Letter to PM by 49 Celebrities, Condemn FIR
ʹఇది ఆర్టీసీ ఉద్యోగుల పోరాట‌మే కాదు - కేసీఆర్ నియంతృత్వ వ్య‌తిరేక ప్ర‌జాస్వామిక పోరాటంʹ
49 మంది ప్రముఖలపై కేసు ఎత్తివేయాలి ‍-140 మంది తెలుగు రచయితల బ‌హిరంగ‌లేఖ‌ !
ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి టీఆరెస్ ప్రభుత్వం కుట్ర... సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలపాలి ...మావోయిస్టు పార్టీ
చెట్లు నరకొద్దన్నందుకు పోలీసుల దాడి...38 మందిపై కేసు
ఆ 49 మంది కోసం ...ఇక మనమూ తేల్చుకోవాల్సిందే - పాణి
ఆర్టీసీ నష్టాలకు కారణమెవరు ? సమ్మె ఎవరి కోసం ?
జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి
జగన్ ది నరహంతక పాలన.. ఏవోబీ ఎన్ కౌంటర్ కు నిరసనగా అక్టోబర్ 3న బంద్ - మావోయిస్టు నేత గణేష్
more..


రిపబ్లిక్