ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...


ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...

ఈ

పుల్వామా దాడికి ప్రతీకారంగా పాక్ లోని బాలకోట్ ఉగ్రవాద స్తావరాలపై భారత దేశం జరిపిన వైమానిక దాడుల్లో ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారు ? 358...350..300..250..200...ఇలా ఒక్కొక్కరు ఒక్కో ‍అంకెను ప్రచారం చేస్తున్నారు బీజేపీ నేతలు.

పాకిస్తాన్ మాత్రం ఓ 12 చెట్లకు తప్ప ఎవ్వరికీ ఏమీ కాలేదని చెబుతోంది. అయితే బీబీసీ, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, అల్ జజీరా తదితర అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా వైమానిక దాడుల వల్ల ఉగ్ర శిభిరాలు ధ్వంసం అవడం కానీ, ఉగ్రవాదులు చనిపోవడం కానీ జరగలేదని వార్తలు రాశాయి.

దేశంలోని బుద్ది జీవులు కూడా ప్రభుత్వం, బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంపై అనుమానాలు వ్యక్తంచేశారు. వీళ్ళే కాకుండా పుల్వామా అటాక్ లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంభ సబ్యులు కూడా ఉగ్రవాదులు చనిపోయారన్న ప్రభుత్వ ప్రచారాన్ని అనుమానించారు. తమకు రుజువులు కావాలని ప్రశ్నించారు.
అయితే అలా మాట్లాడినవారిపై, ప్రశ్నించడమే దేశద్రోహులంటూ దాడి చేసి నోరు మూయించే ప్రయత్నం చేసింది. కాషాయ దళం, నిజాలను తెలుసుకోవాలనుకోవడమే నేరమన్నట్టుగా, ఆర్మీనే అనుమానిస్తారా అని ఎదురుదాడికి దిగుతున్నారు పరివార్ గుంపు.

మరో వైపు ఉగ్రవాదులు చనిపోయిన ప్రూఫ్ లను భారత‌ వైమానిక దళం నిన్న‌ప్రభుత్వానికి అందజేసిందని ఒక వార్తను లీక్ చేశారు. ఇక నిన్న సాయంత్రం నుండి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారంచేశారు. వాట్సప్, ఫేస్ బుక్ ల్లో ఆ ఫోటోలను విస్త్రుతంగా ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు. కొందరు అమాయకంగా నమ్మి షేర్లు చేస్తుండగా మరి కొందరు కావాలనే ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ధ్వంసమైన ఇళ్ళు, వందలాది శవాలు, శవ ఊరేగింపు , శవాల మూకుమ్మడి ఖననం మొదలైన ఫోటోలున్నాయి.

అయితే ఆల్ట్ న్యూస్ అనే వెబ్ సైట్(altnews.in), ది క్వింట్ అనే వెబ్సైట్(thequint.com) టైమ్స్ ఆఫ్ ఇండియా (timesofindia.indiatimes.com) లు ఈ ఫోటోలకు సంబంధించి అసలు నిజాలను బైటపెట్టాయి. వైమానికి దాడి కి సంబధించిన ఫోటోలుగా ప్రచారమవుతున్న ఇవి ఇప్పటివి కాదని పాత ఫోటోలని ఆ మీడియా సంస్థలు తేల్చి చెప్పినవి. అవని న్యూస్ కూడా ఈ ఫోటోలకు సంబంధించి ఫ్యాక్ట్ చెక్ చేసింది. గూగుల్ సహాయంతో ఆ ఫోటోలు ఇప్పటివి కాదని తెలుసుకుంది.

కొన్ని ఫోటోలు బాల్ కోట్ లో 2005 లో వచ్చిన భూకంపం అప్పటి ఫోటోలు, మరికొన్ని 2015 జూన్ లో పాకిస్తాన్ లో వడ దెబ్బకు చనిపోయిన వారి శవాలకు సంబంధించిన ఫోటోస్, మరి కొన్ని2018 ఏప్రెల్ లో ఆఫ్ఘనిస్తాన్ సైన్యం ఒక ఊరిపై దాడి చేసి గ్రామస్తులను అనేక మందిని చంపేయగా ఆ డెడ్ బాడీ ఫోటోస్ ఇప్పుడు వాడుతున్నారు భక్తులు.

ఇలా పాత ఫోటోలతో తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడం బీజేపీ అధికారంలోకి వచ్చాక బాగా పెరిగిపోయింది. ఎన్నికల్లో గెలవడం కోసం అబద్దాలు ప్రచారం చేయడం, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, దాడులు చేయడం..ఇలా ఏది ఉపయోగమనుకుంటే ఆ పని చేస్తూ ఈ మూక తమ పబ్బం గడుపుకుంటోంది. ఇలాంటి అబద్దపు వార్తలు, ఇమేజెస్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాటిలోని నిజానిజాలను తెలుసుకోకుండా షేర్ చేయకండి. ఇమేజస్ ఇప్పటివా కాదా తెలుసుకోవడానికి గూగుల్ సర్చ్ మనకు చాలా ఉపయోగపడుతుంది.

Keywords : airstrike, balakot, pakistan, surgical strike, abhinandan, fake images
(2019-03-19 17:13:15)No. of visitors : 1111

Suggested Posts


బీజేపీ గెలుపుకు ఎమ్ ఐ ఎమ్ సహాయం ?

బీహార్ లో బీజేపీ గెలవాలనిఎమ్ ఐ ఎమ్ కోరుకుంటుందా ? తాను 40 సీట్లకు పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్, జేడీయూ,ఆర్జేడీ ల ఓట్లను చీల్చి బీజేపీ గెలుపుకు మార్గం సుగుమం చేస్తోందా ? అవుననే అంటున్నాయి....

కలిసి పోటీ చేద్దాం - కాంగ్రెస్ కు బీజేపీ పిలుపు

జాతీయ స్థాయిలో బద్ద శతృవులుగా ఉన్న బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేయడమా ! ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కలిసి పోటీ చేద్దాం రమ్మంటూ బీజేపీ కాంగ్రెస్ ను పిలిచింది....

Congress, BJP, CPI(M) join hands in Sikkim

Setting aside ideological differences, the Congress, the BJP and the CPI (M) have joined hands in Sikkim to fight Chief Minister Pawan Kumar Chamlingʹs Sikkim....

గోడు వెళ్ళబోసుకున్న అన్నదాత - ఆత్మహత్య చేసుకోమన్న కేంధ్రమంత్రి

తాజాగా ఓ కేంద్ర మంత్రి మరో అడుగు ముందుకు వెళ్లి, తన గోడు చెప్పుకుంటున్న ఓ రైతును ʹవెళ్లి చావు పోʹ అని కసురుకున్న దిగ్భ్రాంతికరమైన సంఘటన రాజస్థాన్‌లోని టోంక్‌లో జరిగింది....

BJP Worker Avinash Kumar Das Shot Dead In Patna: CCTV Footage

Avinash Kumar was out for a morning walk near Daldali Road when he was shot dead at about 7 am. The CCTV camera at a nearby temple was an eyewitness to the ghastly crime.....

ఎంఐఎంకు బీజేపీ ఆర్థిక సహాయం - రాజ్ థాక్రే

ఎంఐఎంకు బీజేపీ ఆర్థిక సహాయం అందిస్తున్నదని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే ఆరోపించారు. ఇతర పార్టీల ఓట్లు చీల్చి తాను లాభపడటం కోసం బీజేపీ.. ఎంఐఎం ను పావుగా వాడుతోందని....

బీజేపీ అధిష్ఠానంపై పార్టీ అగ్రనేతల ఫైర్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి బాధ్యులెవరో తేల్చాలంటూ ఆ పార్టీ అగ్ర నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్ జోషి, శాంతకుమార్, యశ్వంత్ సిన్హా మంగళవారం రాత్రి ఓ ఉమ్మడి....

యువతులగురించి నీచంగా మాట్లాడిన‌ బీజేపీ ఎంపీ

ఛత్తీస్‌గఢ్‌లోని కోబ్రా పార్లమెంటు నియోజక వర్గం ఎంపీ బన్సీలాల్‌ మహతో యువతులు, బాలికల గురించి జుగుస్సాకరంగా మాట్లాడాడు, బాలికలపై ఆయన చేసిన లైంగిక వ్యాఖ్యలు ఇప్పుడు పెనుదుమారం రేపుతున్నాయి.....

యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌

డ్రైఫ్రూట్స్ అమ్ముకునేఇద్దరు కశ్మీరీలపై కాషాయ మూక దుర్మార్గంగా కర్రలతో దాడికి దిగింది. బాధితులు లక్నోలో కొన్నేళ్లుగా వీధి వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు.

నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో బుధవారం రోజున ఓ వార్త చానల్‌ ముజఫర్‌నగర్‌లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులతో మాట్లాడించే కార్యక్రమం చేపట్టింది.

Search Engine

ఒక సంఘీభావ ప్రదర్శన – ఒక విచారం – ఒక ఉత్తేజం
జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
more..


ఈ