విద్వేష‌ రాజకీయాలను ఓడించండి - 200 పైగా రచయితల విఙప్తి

విద్వేష‌

దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా ఓట్లు వేయాలని దేశప్రజలకు ప్రముఖ రచయితలు పిలుపునిచ్చారు. ప్రముఖ రచయితలు అరుంధతీరాయ్, ఆనంద్ తేల్తుంబ్డే, రొమిల్లా థాపర్, గిరీష్ కర్నాడ్, ఓల్గా, నయనతార సెహగల్, కేఎన్ పణిక్కర్ వంటి 210 మంది రచయితలు దేశ రాజధాని ఢిల్లీలో సమావేశమై ఓ ప్రకటన విడుదల చేశారు.

బీజేపీ అధికారంలోకి వచ్చాక హేతువాదులపై, రచయితలపై, హక్కుల కార్యకర్తలపై ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై దేశ‌వ్యాప్తంగా దాడులు పెరిగిపోయాయని ఆ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు.

దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 210 మంది రచయితల సంతకాలతో కూడిన ప్రకటన పూర్తి పాఠం మీకోసం..

సమానత్వం కలిగిన, వైవిధ్యభరితమైన భారతదేశం కోసం ఓటువేద్దాం. విద్వేషపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటువేద్దాం.

త్వరలో జరగనున్న ఎన్నికలు ఈదేశం ఎటువైపు పోనున్నదో నిర్ణయిస్తాయి. ఈ దేశంలోని పౌరులందరికీ రాజ్యాంగం సమాన హక్కుల్ని గ్యారెంటీ చేసింది. మనకు నచ్చిన ఆహారాన్ని తీసుకోగలిగే స్వేచ్ఛ, ఆరాధనా స్వేచ్ఛ, నచ్చిన రీతిలో బతికే స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ, అభ్యంతరం తెలిపే స్వేచ్ఛ, రాజ్యాంగం మనకు కల్పించింది. కాని గత కొన్ని సంవత్సరాలుగా ఈ దేశపౌరులు మత, కుల, లైంగిక, జాతి, ప్రాంతీయ పరంగా వివక్షకు గురవుతున్నారు; దాడులనెదుర్కుంటున్నారు; మూకుమ్మడి దాడుల్లో హత్యలకు గురవుతున్నారు. విద్వేషపూరిత రాజకీయాలు ఈ దేశాన్ని నిలువునా చీలుస్తున్నాయి. భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి; రోజురోజుకూ మరింత ఎక్కువమంది దేశంలో పూర్తిస్థాయి పౌరులుగా జీవించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. రచయితలను, కళాకారులను, చలనచిత్ర నిర్మాతలను, సంగీత కారులను, ఇతర సాంస్కృతికరంగ వ్యక్తులను వేటాడి వేధించి, బెదిరించి, నిషేధాలు విధించి ఇబ్బందులు పెడుతున్నారు. అధికారంలో ఉన్నవారిని ఎవరైనా నిలదీస్తే, ప్రశ్నిస్తే, వారిని వేధించి,తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.

మేమందరమూ ఈ పరిస్థితి మారాలని కోరుతున్నాం. హేతువాదులను, రచయితలను, కార్యకర్తలను హతమార్చే పరిస్థితులు, వేటాడే పరిస్థితులు పోవాలనుకుంటున్నాం. మహిళలపై, దళితులపై, ఆదివాసీలపై, మైనారిటీలపై మాటల ద్వారా గాని, చేతల ద్వారా గాని, హింసకు పూనుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ ఉద్యోగాలు, చదువు, విద్యా పరిశోధనావకాశాలు, ఆరోగ్యం, సమాన అవకాశాలు కల్పించేటందుకు అవసరమైన వనరులు, చర్యలు కావాలని కోరుకుంటున్నాం. మరీ ముఖ్యంగా మన దేశ ప్రజాస్వామ్యం, వైవిధ్యం పరిరక్షించబడాలని, మరింత పెంపొందాలని వాంఛిస్తున్నాం.

దీనిని మనం ఏవిధంగా సాధించాలి? అత్యవసరంగా కావల్సిన ఈ మార్పును ఎలా తీసుకురావాలి? ఇందుకోసం మనం చేయవలసినవి చాలా ఉన్నాయి. ఐతే వాటిలో కీలకమైన మొదటి అడుగు ఒకటుంది.

మనం వెనువెంటనే వేయగలిగిన ఆ మొదటి అడుగు విద్వేష రాజకీయాలను మన ఓటుతో ఓడించడమే. ప్రజలమధ్య చీలికలను ఓడిద్దాం. అసమానతలను ఓడిద్దాం, హింస వ్యతిరేకంగా, బెదిరింపులకు వ్యతిరేకంగా, నిషేధాలకు వ్యతిరేకంగా ఓటువేద్దాం. రాజ్యాంగం మనకు ఇచ్చిన హామీలనన్నింటికీ తిరిగి జీవం పోయాలంటే ఇలా ఓటు చేయడమే మార్గం. అందుకే వైవిధ్యభరితమైన, సమానత్వం కలిగిన భారతదేశం కోసం ఓటు వేయాలని మేం పౌరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.




Keywords : arundhathi ray, girish karnad, anand telthmde, romilathapar, bjp
(2024-04-24 18:37:47)



No. of visitors : 1513

Suggested Posts


ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...

ఇక నిన్న సాయంత్రం నుండి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారంచేశారు. వాట్సప్, ఫేస్ బుక్ ల్లో ఆ ఫోటోలను విస్త్రుతంగా ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు. కొందరు అమాయకంగా నమ్మి షేర్లు చేస్తుండగా మరి కొందరు కావాలనే ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ధ్వంసమైన ఇళ్ళు, వందలాది శవాలు, శవ ఊరేగింపు , శవాల మూకుమ్మడి ఖననం మొదలైన ఫోటోలున్నాయి.

బీజేపీ గెలుపుకు ఎమ్ ఐ ఎమ్ సహాయం ?

బీహార్ లో బీజేపీ గెలవాలనిఎమ్ ఐ ఎమ్ కోరుకుంటుందా ? తాను 40 సీట్లకు పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్, జేడీయూ,ఆర్జేడీ ల ఓట్లను చీల్చి బీజేపీ గెలుపుకు మార్గం సుగుమం చేస్తోందా ? అవుననే అంటున్నాయి....

Congress, BJP, CPI(M) join hands in Sikkim

Setting aside ideological differences, the Congress, the BJP and the CPI (M) have joined hands in Sikkim to fight Chief Minister Pawan Kumar Chamlingʹs Sikkim....

బీజేపీకి ఓటు వేయకండంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న‌ రైతు !

ʹబీజేపీకి ఓటు వేయకండి..మళ్ళీ ఆ పార్టీకే ఓటు వేస్తే అందరినీ టీ అమ్ముకునేలా చేస్తుందిʹ అని సూసైడ్ లెటర్ రాసి ఓ వృద్ద రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరాఖండ్ హరిద్వార్‌ జిల్లాకు చెందిన

గోడు వెళ్ళబోసుకున్న అన్నదాత - ఆత్మహత్య చేసుకోమన్న కేంధ్రమంత్రి

తాజాగా ఓ కేంద్ర మంత్రి మరో అడుగు ముందుకు వెళ్లి, తన గోడు చెప్పుకుంటున్న ఓ రైతును ʹవెళ్లి చావు పోʹ అని కసురుకున్న దిగ్భ్రాంతికరమైన సంఘటన రాజస్థాన్‌లోని టోంక్‌లో జరిగింది....

కలిసి పోటీ చేద్దాం - కాంగ్రెస్ కు బీజేపీ పిలుపు

జాతీయ స్థాయిలో బద్ద శతృవులుగా ఉన్న బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేయడమా ! ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కలిసి పోటీ చేద్దాం రమ్మంటూ బీజేపీ కాంగ్రెస్ ను పిలిచింది....

BJP Worker Avinash Kumar Das Shot Dead In Patna: CCTV Footage

Avinash Kumar was out for a morning walk near Daldali Road when he was shot dead at about 7 am. The CCTV camera at a nearby temple was an eyewitness to the ghastly crime.....

ఎంఐఎంకు బీజేపీ ఆర్థిక సహాయం - రాజ్ థాక్రే

ఎంఐఎంకు బీజేపీ ఆర్థిక సహాయం అందిస్తున్నదని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే ఆరోపించారు. ఇతర పార్టీల ఓట్లు చీల్చి తాను లాభపడటం కోసం బీజేపీ.. ఎంఐఎం ను పావుగా వాడుతోందని....

యువతులగురించి నీచంగా మాట్లాడిన‌ బీజేపీ ఎంపీ

ఛత్తీస్‌గఢ్‌లోని కోబ్రా పార్లమెంటు నియోజక వర్గం ఎంపీ బన్సీలాల్‌ మహతో యువతులు, బాలికల గురించి జుగుస్సాకరంగా మాట్లాడాడు, బాలికలపై ఆయన చేసిన లైంగిక వ్యాఖ్యలు ఇప్పుడు పెనుదుమారం రేపుతున్నాయి.....

బీజేపీ అధిష్ఠానంపై పార్టీ అగ్రనేతల ఫైర్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి బాధ్యులెవరో తేల్చాలంటూ ఆ పార్టీ అగ్ర నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్ జోషి, శాంతకుమార్, యశ్వంత్ సిన్హా మంగళవారం రాత్రి ఓ ఉమ్మడి....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


విద్వేష‌