జనతన సర్కార్ లో ప్రయాణం... మూడవ రోజు...

జనతన

టెంటుపై కురుస్తున్న వర్షం.., సన్నగా వీస్తున్న గాలి.. కదులుతున్న మహావృక్షాల ఆకులు, రెమ్మలు.. అంతా.. కలసి... ఓ గొప్ప వీనుల విందైన సంగీతం�� రెండు రోజులుగా సాగిన ప్రయాణ బడలికతో మిత్రులు నిద్రకు ఉపక్రమించారు. నేను మరో జర్నలిస్టు మిత్రుడు చర్చించుకుంటున్నాం. ఆ వర్షంలోనూ మాకు రక్షణగా టెంటుకు బయట ఓ గెరిల్లా ఉన్నాడు. చీకటి కదా.. ఏదైనా అవసరం కోసమని.. మాకు కూడా ఓ బ్యాటరీ ఇచ్చారు. ఆదివాసీ జీవితాల గురించీ, పాలక వర్గాల బాధ్యత గురించీ చర్చించుకుంటున్నాం. ఎందుకో యథాలాపంగా సహచర మిత్రుడు తన చేతిలోని బ్యాటరీ లైట్ తో టెంటు చివరలకు చూశాడు. అంతే.. తెల్లటి పామొకటి మేం పడుకున్న టెంటులోకి వాననుంచి రక్షణ కోసమేమో.. వస్తున్నది. దాన్ని చూసిన మిత్రుడు రక్షణగా ఉన్న గెరిల్లాను పిలిచాడు. వెంటనే అలర్ట్ అయి వచ్చిన గెరిల్లా టెంటులోకి వస్తున్న పామును ఏ గాబరాలేకుండా.. నింపాదిగా రెండు దెబ్బలేసి చంపాడు. ఇక దాని గురించి మర్చిపోండని చెప్పి చాలా యధాలాపంగా తన పనిలో నిమగ్నమయ్యాడు. రాత్రి.. అనుకోని అతిథిగా వచ్చిన పాము.. రేగిన కలకలంతో మాకు నిద్ర రాలేదు. తోటి సహచర జర్నలిస్టు మిత్రులు ఇదేమీ పట్టనట్లు నిద్రపోతున్నారు. ఇక మనమైనా సెంట్రిగా.. ఉందామని నిర్ణయించుకుని.. తెల్లారిందాకా.. మెలకువతోనే ఉన్నాం.
మేమంతా.. నిద్రనుంచి మేల్కొనక ముందే.. ఓ గెరిల్లా వచ్చి.. అన్నా లేవండి.. పనులు ముగించుకుంటే.. మన కార్యక్రమంలోకి వెల్లొచ్చు అని చెప్పగానే.. మిత్రులందరినీ నిద్రలేపాం. కాలకృత్యాలకు పోవడానికి తయారవండనే.. సూచనతో.. బయలు దేరాం. అంతలోనే మరో గెరిల్లా వచ్చి తలా ఒక ప్లాస్టిక్ కవర్ చేతికిచ్చాడు. అది ఎందుకో అర్థం గాక.. ఇదేంటని అడిగాం. ఆ కవర్ లోనే నీళ్లు పట్టుకుని కాలకృత్యాలకు వెళ్లాలని చెప్పడంతో.. అక్కడినుంచి నడక ప్రారంభించాం.

మాకు మార్గం చూపించే గెరిల్లా ఒక పెద్ద కర్ర తీసుకుని రాత్రి కొట్టి చంపిన పామును సున్నితంగా కర్రపై వేసుకుని మాకు ముందు నడిచాడు. కొంత దూరం పోయాక ఆ పామును ఓ పుట్టలో వేసి మట్టి కప్పాడు. దాన్ని చూసిన నేను.. ఏమిటి? పామును అందులో వేశావ్? అని ప్రశ్నించాను. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం విన్న తర్వాత నాకు మతిపోయింది. ఏదైనా.. ప్రాణి కదా.. దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. చనిపోయిన పాము అని దాన్ని అలాగే వదిలేస్తే..మనకు మానవీయత ఉన్నట్లు కాదు కదా.. అన్నాడు. నిజంగా నేను సిగ్గుతో తలదించుకున్నాను. సాటి మనుషులకే గౌరవం ఇవ్వని ప్రపంచం నుంచి పోయిన మాకు.. ఒక చనిపోయిన పాముకు, దాని దేహానికి ఆదివాసులు.. , మావోయిస్టు గెరిల్లాలు.. ఇస్తున్న గౌరవాన్ని చూసిన తర్వాత..మానవీయతను, నాగరికతను ఎవరి నుంచి ఎవరు నేర్చుకోవాల్సి ఉన్నదో తెలిసివచ్చింది.
అలాగే.. మావోయిస్టులు, నక్సలైట్లు హింసావాదులనీ, అమానవీయంగా హింసాప్రవృత్తితో ఉంటారని అంటున్న ప్రభుత్వాలు, బయటి ప్రపంచంలో ఉన్న నాగరికులు, కొంతమంది మేధావులు చేస్తున్న ప్రచారం ఎంత బూటకమో.., ఎంత దుర్మార్గమో చెప్పకనే చెప్పింది.
చేతిలో ప్లాస్టిక్ కవర్లు పట్టుకున్న మమ్మల్ని నిద్రించిన టెంటు దగ్గరి నుంచి ఓ కిలోమీటర్ దూరం అడవిలో నడిపించి ఓ ప్రవహిస్తున్న వాగు దగ్గరికి తీసుకెళ్లాడు.
అక్కడికి చేరుకోగానే.. మరో అనుభవం ఎదురైంది. అక్కడికి కొద్ది దూరంలోనే ఓ చెట్టుదగ్గర ఇద్దరు మహిళా గెరిల్లాలు సెంట్రీ చేస్తున్నారు. వారి రక్షణలోనే అన్నట్లు.. మేం మా కాలకృత్యాలు, ముఖం కడుక్కోవడాలు కార్యక్రమాన్ని కానిచ్చాం.
నవనాగరికత, పరిశుభ్రత గురించి ఎంతో గొప్పలు పోయే మనం బయటి ప్రపంచంలో కాలకృత్యాల విషయంలో ఎలా ప్రవర్థిస్తామో చెప్పాల్సిన పనిలేదు. ఇంత చాటు దొరికితే చాలు, లేదా అటు మల్లి మన పని కానిచ్చేస్తాం. ఒకటికైనా.., రెంటికైనా.
అనాగరికులు, అజ్ఞానులు, నాగరికత తెలియని వారని అనుకుంటున్న ఆదివాసులు దట్టమైన అడవిలో మూడడుగులు వేస్తే మనిషి కనిపించనంత దట్టమైన అడవిలో.. కాలకృత్యాలకు కిలోమిటర్ దూరం.., తాము ఎంచుకున్న ప్రాంతానికే వెళ్లి మాత్రమే తమ కృత్యాలను తీర్చుకుంటారంటే.. వారు పరిశుభ్రతకు ఎంతటి విలువ ఇస్తారో..ప్రకృతిని ఎంత పవిత్రంగా చూస్తారా.., ప్రేమిస్తారో.. వేరే చెప్పాలా..?
తిరిగి వచ్చేటప్పటికి మా టెంటుకు కొంత దూరంలో వంట కార్యక్రమం నడుస్తున్నది. పురుష గెరిల్లాలు వంటపనిలో మునిగి ఉన్నారు. విప్లవంలో స్త్రీలు ఆకాశంలో సగమని మావో చెప్పిన సూక్తి గుర్తుకు వచ్చింది. దండకారణ్యంలో మావోయిస్టు గెరిల్లాల్లో మహిళా గెరిల్లాలు ఆకాశంలో సగం కన్నా ఎక్కువ అని అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను, గెరిల్లాల దైనందిన కార్యక్రమాలను చూసిన తర్వాత అర్థమైంది.
అంతలోనే�� ఇద్దరు గెరిల్లాలు వేడి వేడి ఉప్మా పట్టుకొచ్చి అందులోకి పుంటికూర పచ్చడి, మామిడి కాయ పచ్చడి పెట్టారు. ఎంత అద్బుతంగా రుచగా ఉందో. ఎప్పుడో ఓ అజ్ఞాత విప్లవ కవి.. చెప్పిన కవితా పాదాలు గుర్తుకు వచ్చాయి. విలాసవంతమైన విప్లవకర జీవితంలో తరచుగా దొరకనిది అన్నం మాత్రమే.. అంటూ.. కాలే కడుపుతో పారే సెలయేటి నీళ్లతో కడుపునింపుకుంటున్నప్పుడు ఆ నీళ్లు అమృతంగా ఎంత శక్తినిచ్చాయో..నని అంటాడు.
రుచికరమైన ఉప్మాతో నకనకలాడుతున్న మా కడుపులను నింపుకుంటున్న మాకు దూరంగా గెరిల్లాలు రెగ్యూలర్ గా చేసే వ్యాయామం, ఎక్సరైసైజ్ లు, లెఫ్ట్, రైట్ కాషన్లు వినిపించాయి. ఆ దట్టమైన అడవిలో.. ఎటు చూసినా.. అక్కడ గెరిల్లాలు ఏదో పనిమీద ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలో కొందరు ఎండిపోయిన చెట్టు మొదళ్లకు వంట కోసం పొయ్యిల కట్టెలు కొడుతున్నారు. కొందరు ఎక్కడినుంచో నీళ్లు తెస్తున్నారు. మరికొందరు తమకు కేటాయించిన టెంటుల్లో కూర్చొని చదువుకుంటున్నారు. మరికొందరు ఆదివాసీ గెరిల్లాలు తెలుగును, హిందీని నేర్చుకోవడానికి కుస్తీ పడుతున్నారు.
ఎటు చూసినా.. ఎత్తైన చెట్లతో దట్టమైన అడవి. ఎటు చూసినా ఆలివ్ గ్రీన్ దుస్తుల్లో మావోయిస్టు గెరిల్లాలు. ఒక వైపు ప్రకృతికి ప్రాణం పోస్తున్న అడవి.., మరో వైపు నూతన సమాజానికి ఊపిరి పోస్తున్న గెరిల్లాలు.. ఇదంతా.. గమనిస్తూ.. ఆ అనుభూతులన్నింటినీ మా గుండెలోతుల్లోకి వంపుకుంటూ మా టెంటులోకి చేరి.. ఇంటర్వ్యూ కోసం.. నాయకత్వం నుంచి పిలుపుకోసం ఎదురు చూస్తున్నాం.
మేం ఆశించినట్లుగా నాయకత్వం నుంచి పిలుపు రాలేదు. పన్నెండు కావస్తుంది. ఎక్కడో దూరంగా బెల్ మోగిన చప్పుడైంది. కొద్ది సేపట్లోనే మాకు అన్నం పట్టుకుని మరో ఇద్దరు గెరిల్లాలు వచ్చారు. దంపుడు బియ్యంతో వండిన అన్నం, బొబ్బర్ల చారు, పచ్చడి, ఏదో ఆకు కూర .. కడుపార తిన్నాం.
మళ్లీ మేం మా సహచర మిత్రులతో కలిసి గెరిల్లా జీవితం, చేగువేరా మెక్సికో, క్యూబా దేశాల్లో తాన గెరిల్లా జీవితాన్ని వర్ణించిన దానికి ఏమీ తీసిపోకుండా ఎదురవుతున్న అనుభవాలతో.. మాకు మేం.. పోల్చుకుని చూసుకుంటున్నాం. సాయంత్రం నాలుగైంది. చాయ్ వచ్చింది.
హైదరాబాద్ ఇరానీ చాయకు అలవాటు పడిన మాకు రెండో రోజు సాయంత్రానికి మావోయిస్టు గెరిల్లాలు ఇచ్చే పాల పొడి చాయకు అలవాటు పడిపోయాం.
ఇక్కడనే ఓ అనుభవాన్ని పంచుకోవాలి. మాకు చాయ్ తెచ్చిన గెరిల్లా ను అడిగా.. ఇక్కడ అన్ని గ్రామాల్లో ఆవులు, బర్రెలు,మేకలు ఉన్నాయి కదా.. వాటికి పాలు పిండి చాయ్, పెరుగు , పాలు తాగొచ్చు కదా..? అని అడిగాను. వెంటనే ఆ ఆదివాసీ మావోయిస్టు గెరిల్లా ఇచ్చిన సమాధానం విని నోరెళ్లబెట్టాం. ఆవు తన బిడ్డ కోసం ఇవ్వాల్సిన పాలను మనం పిండుకుని తాగితే తప్పు కదా? ఆవు నుంచి మనం పాలు పిండుకుంటే.. దాని బిడ్డకు పాలు సరిపోవు కదా.. అది పాపం కదా.. అంటూ�� దూడకు దక్కాల్సిన పాలను మనం పిండుకుని తాగడం అనైతికమని, అన్యాయమని చెప్పుకొచ్చిన మాటలు విని నాలో నేను కుచించుకుపోయాను. నాగరికులుగా మనకు మనం చెప్పుకుని ఊరేగుతున్న మనం.. ఏనాడైనా.. ఆవునుంచి పాలను పిండుకుంటున్న మనం దాని బిడ్డకు పాలు సరిపోతున్నాయో లేదోనని ఏనాడైనా ఆలోచించామా..? ఇక్కడ ఎవరు నాగరికులు? ఎవరు మానవతా వాదులు, మానవీయత కలవారు? ఎదుటి వ్యక్తిని ఏమార్చి ఎంత వీలైతే అంత దక్కించుకుందామని, దోచుకు తిందామని ఆలోచించే నాగరిక సమాజంలోని మనుష్యులకు ఆ ఆదివాసీకి ఉన్న మానవీయత ఎందుకు లేదు? అది ఎందుకు ఆవిరయ్యింది?
సాయంత్రం మూడున్నర నాలుగు గంటల సమయం. మాకు కొద్ది దూరంలో గెరిల్లాల కోలాహలం. అది గెరిల్లాలకు డ్రిల్ పీరియడ్ ఏమో..? కబడ్డీ ఆడుతున్న సప్పుడు��
ఎప్పుడు ఏమూలనుంచి శత్రువు దాడి చేస్తాడో తెలయని పరిస్థితిలో భుజాలకు ఏకే ఫార్టీసెవన్ తుపాకులతో.. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూనే యుద్ధ భూమిలో తుపాకీ మోతల చప్పుళ్ల మధ్య విప్లవ గెరిల్లాలు ఎంత ఉల్లాసంగా దినచర్యను కొనసాగిస్తున్నారో చూసిన తర్వాత.. ఇది
సాధారణ మనిషికి సాధ్యమయ్యే పనేనా.. అని అనిపించింది.
సాయంత్రం ఐదు కావస్తుంది. మళ్లీ రాత్రి భోజనం వచ్చింది. అడవిలో లైట్ల వెలుగులో అన్నం తినాలనుకుంటే.. వెలుతురుకు అడవిలోని పురుగులన్నీ వచ్చి వాలుతాయిని వెలుతురున్నప్పుడే మావోయిస్టు గెరిల్లాలు తింటారు. అలాగే.. దండకారణ్యంలోని ఆదివాసులు కూడా చీకటి పడక ముందే తింటారని తర్వాత తెలుసుకున్నాం. అందుకోసం మేమూ.. అన్నం తిన్నామనిపించాం. ఎందుకంటే.. తినాలన్నంత ఆకలి లేదు. ఆ అవసరమూ అనిపించలేదు. కాకుంటే.. రెగ్యులర్ కార్యక్రమంలో భాగంగా ఓ కార్యక్రమాన్ని ముగించేశాం.
దట్టమైన అడవి.., చిక్కటి రాత్రి.. వర్షం లేదు. వాతావరణం వెచ్చగా అహ్లాదకరంగా ఉంది. రాత్రి పూట చదువుకోవడానికి ఏమైనా పుస్తకాలు ఇస్తే బాగుంటుందని గెరిల్లాలను అడిగాం. వారు తమ దగ్గరున్న సాహిత్యాన్ని అందజేశారు. దాన్ని బ్యాటరీ వెలతురులో చదవడానికి ఉపక్రమించాం. మా టెంటుకు కొంచెం దూరంలోనే.. మాకు రక్షణగా ఉన్న గెరిల్లాకు తోడు మరో ఇద్దరు కూడా కలిసి బ్యాటరీ వెలుతురులో చదువు నేర్చుకుంటున్నారు. వారు తమదైన కోయ భాష యాసలో తెలుగు అక్షరాలను పలుకుతుంటే.. మా వంతు సాయం చేద్దామని జర్నలిస్టు మిత్రుడు వారి దగ్గరికి చేరాడు. ఒక్కో అక్షరాన్ని ఎలా పలకాలో చెబుతుంటే.. వారు తమదైన యాసలో తెలుగు అక్షరాలను పలుకుతుంటే.. అదో వింతైన అనుభూతి.. పట్టరాని ఆనందం.
మరో గెరిల్లా.. తనదగ్గర ఉన్న టార్చ్ లైట్ బల్బ్ ఫిలమెంట్ ఎగిరిపోయిందని, దాన్ని బాగు చేసి వెలిగించేందుకు గెరిల్లా పడుతున్న ఆరాటం చూసిన తర్వాత.. విప్లవంలో.. ప్రతి ఒకరూ.. ఒక శాస్త్రవేత్తగా ఎలా రూపుదిద్దుకుంటారో.. ఎదుగుతారో.. అర్థమైంది. ఇక మాలో ఒకరు మాకు ఇచ్చిన సాహిత్యం చదువుతుంటే.. మిగతా మిత్రులం వింటూ.. చర్చించుకుంటూ రాత్రి నిద్రకు ఉపక్రమించాం. ( ఇంకా ఉంది )
-ఎస్.మల్లారెడ్డి

Keywords : Maoists, Naxalite, Dandakarnyam, Mao, Sentry, Women, Man
(2024-04-24 18:35:27)



No. of visitors : 5301

Suggested Posts


దండకారణ్యంలో ఐదు రోజులు...
ఉత్కంఠ భరిత అనుభవాలు...
మావోయిస్టు నేతతో ఇంటర్వ్యూ....

చుట్టూ దట్టమైన అడవి.... బోరున వర్షం...జర్రుమని జారుతున్న కాలి బాటలో... జానెడు వెడల్పు కూడా లేని పొలం గట్ల పైనుంచి.... నడుముకు పైదాక ఎత్తుతో ఉరకలెత్తే వాగులలోనుంచి....బైక్ మీద ముగ్గురు కూర్చొని ఆకాశంలో తీగ మీద నడిచినట్టు....

తెలంగాణ ను విఫలం చేయడానికి బాబు కుట్రలు చేస్తున్నాడు - మావోయిస్టు నేత హరిభూషణ్

ప్రజలు పోరాడి సాధించికున్న తెలంగాణ రాష్ట్రాన్ని విఫల ప్రయోగంగా నిరూపించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి....

కేసీఆర్ ను చిన జీయర్, రామేశ్వర్ రావులు నడిపిస్తున్నారు...

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావును నడిపిస్తున్నది చినజీయర్ స్వామి, పెట్టుబడిదారుడైన రామేశ్వర్ రావు లాంటి వాళ్ళేనని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి .....

జనతన సర్కార్ లో ప్రయాణం... నాల్గవ రోజు....

అచ్చంగా నట్టడివి నివాసులైన కోయ, చెంచు ఆదివాసీ తెగలకు చెందిన ఇద్దరు మావోయిస్టు పార్టీ నాయకత్వ స్థానంలోకి ఎదిగి విప్లవోద్యమానికి నాయకత్వం వహిస్తున్నారంటే.. ఇంతకన్నా విప్లవానికి హామీ ఏం కావాలని మాలో ఓ మిత్రుడు అంటే.. నిజమేననిపించింది....

జనతన సర్కార్ లో ప్రయాణం.... రెండవ రోజు

ఒక కర్రతో పామును ఒత్తి పట్టి మరో కర్రతో దానిని కొట్టి చంపాడు. ఆ తర్వత చెప్పాడతను అది తెల్ల కట్ల పామని అది కరిస్తే రెండు నిమిషాల్లో ప్రాణం పోతుందని. పామును చూసినప్పుడు దాన్ని చంపుతున్నప్పుడు వేయని భయం దాని గురించి విన్న తర్వాత అనిపించింది. కొద్ది సేపు నిద్ర పట్టలేదు.....

ʹజనతన సర్కార్ʹలో ప్రయాణం -
ఉత్కంఠ భరిత అనుభవాలు

మేం జనతన సర్కార్ పరిదిలోకి వచ్చామని. మా పై ఇక్కడి ప్రజలకు ఏమాత్రం అనుమానం కలిగినా మమ్మల్ని అరెస్టు చేస్తారనే విషయం మాకర్దమైంది. కృష్ణకు కూడా ఏం చేయాలో అర్దం కావడం లేదు. వాళ్ళకు నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు.....

హరిభూషణ్ తో ఒకరోజు....

2015 ఆగస్టు నెలలో ఓ రోజు ఓ పిలుపు వచ్చింది మావోయిస్టు పార్టీ నాయకులతో ఇంటర్వ్యూ ఉంటుంది వస్తావా అని. వెంటనే రెడీ అయిపోయిన. పిలుపు వచ్చిన రెండో రోజనుకుంటా బయలు దేరాము. నాతో పాటు మరో రెండు పత్రికలు,

జనతన సర్కార్ లో ఉత్కంఠభరిత ప్రయాణం... చివరి రోజు

ʹపోలీసులుంటే ఏమైతది డైరెక్ట్ వెళ్దాం. మావోయిస్టుల ఇంటర్వ్యూ కోసం పోయొస్తున్నం అని నిజం చెబుదాంʹ అని ఓ జర్నలిస్టు మితృడు అన్నాడు. ʹమనను ఏం చేయరు కానీ మనం ఇంటర్వ్యూ చేసిన వీడియోలు డిలీట్ చేస్తే ఎట్లా ʹ అని మరో జర్నలిస్టు మితృడు అనుమానం వెలిబుచ్చాడు. ఇలా మేం మాట్లాడుకుంటుండగానేఎత్తు ప్రాంతానికి.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


జనతన