అతడు ఓటేయలేదు..!


అతడు ఓటేయలేదు..!

అతడు

ఇది మోహన సుందరం అనే రచయిత తన ఫేస్ బుక్ వాల్ పై పెట్టిన పోస్ట్

రాళ్ళ వానలో తడిచిన అతడు
రాజ్యం క్రౌర్యానికి శిలువేయబడ్డ అతడు
జనం ఆగ్రహాన్ని మానవ కవచంగా
భరించిన అతడు
ఓటేయలేదు
మరి ఎప్పటికీ ఓటేయడు.

ఫరూక్ అహ్మద్ దార్ అంటే ఎవరికీ గుర్తుండి ఉండదు. కాశ్మీర్లోని భద్రతా బలగాల పైశాచిక కృత్యం అంటే ముందుగా అతడే గుర్తుకొస్తాడు. కాశ్మీర్ లో భద్రతా బలగాల క్రౌర్యాన్నీ, అంతర్జాతీయంగా ఆ మచ్చని ఈ దేశం ఎప్పటికీ చెరుపుకోలేనంతగా పచ్చపొడిచిన వాడు అతడు. మానవ కవచం గా మారిన వాడు అతడు.2017 శ్రీనగర్ పార్లమెంట్ బై ఎలక్షన్స్ అప్పుడు భద్రతా బలగాలు ప్రజల రాళ్ళ దాడినుంచి రక్షించుకోవడానికి చీల్ బ్రాస్ గ్రామానికి చెందిన ఫరూక్ అనే చిరుద్యోగిని తమ వాహనం బాయనెట్ ముందు తాళ్లతో కట్టేసి ఆ రోజంతా తిప్పారు. ఆ ఫోటో మీడియా లో వైరల్ అవ్వడంతో కాశ్మీర్ లో జరుగుతున్న మానవ హాక్కుల ఉల్లంఘన, మానవ హననం మరోసారి వెలుగులోకి వచ్చాయి. అమ్నెస్టీ లాంటి సంస్థలు ఆ ఘటనపై భారత ప్రభుతాన్ని వివరణ కోరాయి. ప్రపంచ వ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. నిన్న జరిగిన శ్రీనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఫరూక్ ఓటు వేయలేదు. అతడు మెడికల్ ఉద్యోగి కాబట్టి ఎన్నికల విధుల్లో వున్నాడు అని అధికారులు చెబుతున్నా అతడి తల్లి మాత్రం దాన్ని ఖండించారు. ఆమె కూడా తాను ఓటు వేయలేదని, మరెప్పటికీ వేయనని చెప్పారు. ఆమె లాగే శ్రీనగర్ లో ఎవ్వరూ ఓటు వేయలేదు. ఓ పక్క కర్ఫ్యూ కొనసాగుతుండగానే మరోపక్క భద్రతా బలగాలు ఓటర్లను బెదిరించి పోలింగ్ కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేశారు. అయినా జనం తీవ్రంగా ప్రతిఘటించారు. నిన్న జరిగిన పోలింగ్ లో కేవలం 7 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. శ్రీనగర్ ఎన్నికల చరిత్రలోనే నమోదైన అతి తక్కువ పోలింగ్ శాతం ఇది. మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేయకుండా,ఓటు వేయకుండా తమ నిరసన తెలిపిన శ్రీనగర్ వాసులు మరోసారి బాయనెట్లను, తూటాలను ఎదిరించి మరీ తమ ధిక్కారాన్ని ప్రకటించారు.

అవును...
వాళ్లకు కావాల్సింది ఓట్లు కాదు
వాళ్ళకు కావాల్సింది నేతలు కాదు
వాళ్లకు కావాల్సింది స్వేచ్ఛ మాత్రమే
కేవలం స్వేచ్ఛ మాత్రమే...!

-మోహన సుందరం

Keywords : kashmir, army,
(2019-05-20 23:36:41)No. of visitors : 217

Suggested Posts


మా పిల్లలను హత్యలు చేస్తున్న మీతో మాట్లేడేది లేదు - రాజ్ నాథ్ కు షాకిచ్చిన కాశ్మీరీలు

భద్రతా దళాల దాడులతో, ప్రజల ఆందోళనలతో అల్లకల్లోలంగా ఉన్న కాశ్మీర్ లో పర్యటించడానికి వెళ్ళిన కేంధ్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కాశ్మీరీలు షాకిచ్చారు. 46 మంది చనిపోయి, 2,400 గాయాలపాలై, 15 రోజులుగా కర్ఫ్యూలో మగ్గుతున్నకశ్మీర్ లో....

అబద్దాలు చెప్పలేక జర్నలిస్టు రాజీనామా

అతడో ఆత్మాభిమానం ఉన్న జర్నలిస్టు. అందుకే యాజమాన్యం చెప్పిన మాట కాదన్నాడు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి తన అసలైన జర్నలిస్టుగా పాత్రికేయ ప్రపంచానికి చాటి చెప్పుకున్నాడు....

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తిరుగుబాటు

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీరులో తిరుగుబాటు తీవ్రమయ్యింది. తమపై పాకిస్థాన్‌ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ పాక్ అణచివేత నుండి తమకు విముక్తి కల్పించాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.....

పెల్లెట్లు వద్దంటే ఇక బుల్లెట్లే - సీఆర్‌పీఎఫ్‌

పెల్లెట్లు వద్దంటే బుల్లెట్లు వాడాల్సి వస్తుందని సీఆర్‌పీఎఫ్‌ జమ్మూకాశ్మీర్‌ హైకోర్టుకు తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లో గత 32 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 13 లక్షల పెల్లెట్లను ఉపయోగించినట్లు జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టుకు....

దుఃఖమూ నేరమైన చోట - పి.వరలక్ష్మి

ఒక చావును దేశం వేడుక చేసుకుంటుంది. అటు వైపు ఒక దుఃఖిత సమూహం శవయాత్రకు పోటెత్తుతుంది. దశాబ్దాలుగా అది నిషిద్ధ దుఃఖం. వాళ్ళ దుఃఖానికి సంఘీభావం నేరం. అవును, మాట్లాడుతున్నది కశ్మీర్ గురించే.....

సైన్యంపై రాళ్ళు రువ్వడం దేశ ద్రోహం సరే... సైన్యం సృష్టించే అరాచకాన్ని ఏమనాలి ?

26 ఏండ్ల ఫరూఖ్‌ అహ్మద్‌ థర్ అనే ఓ యువకుడు దగ్గరి బందువు చనిపోతే పక్క గ్రామం వెళ్తుండగా ఎదురు పడ్డ కొందరు సైనికులు అతనిపై దాడి చేసి తాళ్ళతో బందించి. జీపు బానెట్‌పై కూర్చోబెట్టారు. దాదాపు తొమ్మిది గ్రామాల్లో జీపును తిప్పారు. తొమ్మిది గ్రామాల గుండా జీపు ప్రయాణిస్తున్నప్పుడు సైనికులు బిగ్గరగా అరిచారు. రండీ...మీ మనిషిపైనే దాడి చేసేందుకు బయటకు రండీ.....

కాశ్మీర్ లో మరో సాల్వజుడుం

ఓ వీడిసీ సబ్యుడి చేతిలో ఓ తల్లి, ఆమె కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే ముస్తాఖ్ అహ్మద్ అనే వీడీసీ సభ్యుడు.. షమిమా అక్తర్ అనే మహిళ, ఆమె మూడేళ్ల బాబు తాహిద్ పై నేరుగా తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు.....

నెత్తురోడుతున్న కాశ్మీర్ - పోలీసు పెల్లెట్లకు 11ఏండ్ల విద్యార్థి బలి

శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం రాత్రి ఓ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడి శరీరమంతా పెల్లెట్ల గాయాలతో నిండి ఉన్నది. శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది....

కాశ్మీరీ చిన్నారుల విషాదం - ʹచదువన్నాఆగుతుంది కానీ చావు ఆగదు..ʹ

ʹమా కోసం చదువన్నా ఆగుతుంది కానీ చావు ఆగదు. ఓ ఇండియా... నీకోసం సింధు వెండిని తీసుకొస్తే.. ఇక్కడ(కాశ్మీర్‌లో) నీకోసం బంగారమే ఉందిʹ అని హిష్మా నజీర్ పలికింది. ఇలాంటి వ్యాఖ్యలతో సంజీవ్ సిక్రి డైరెక్ట్ చేసిన వీడియో....

టీఆర్పీ రేటింగ్స్‌ కోసమే కశ్మీర్‌లో చిచ్చు - మీడియా పై ఓ ఐఏఎస్ ఆగ్రహం

ʹరాజ్యం తన పౌరుల్ని తానే చంపడం.. గాయపర్చడం.. తనను తాను గాయపర్చుకొని.. స్వీయవిధ్వంసం చేసుకోవడమేʹ అని ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ మీడియా తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు, ప్రజల్లో విభజన....

Search Engine

కూతురు పెండ్లికి వెళ్ళడం కోసం ఓ తండ్రికి ఇన్ని ఆంక్షలు పెట్టిన వీళ్ళు కమ్యూనిస్టులా ?
Boycott the EU Elections - Britain and Ireland communist parties
ఈ నేల 25న ఏవోబి బంద్ కు పిలునిచ్చిన మావోయిస్టు పార్టీ
ధిక్కారస్వరాలను వినిపిద్దాం...పీడితుల కోసం పోరాడుతున్న వారిని విడిపించుకుందాం
కోరాపుట్ ఎన్ కౌంటర్: నిజ నిర్దారణ బృందాన్ని అడ్డుకున్న పోలీసుల స్పాన్సర్ సంఘం
ఒడిశా బూట‌కపు ఎన్ కౌంటర్ కు నిరసనగా దండకారణ్య బంద్
ʹవీరన్న దూరమైనా పీడిత వర్గాల పోరాటంలో జీవించే ఉంటాడుʹ
ప్రొ.సుజాత సూరేపల్లికి TVV కి విరసం సంఘీభావం
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నేడు మావోయిస్టులా..?
సాయిబాబా నుండి సూరేపల్లి సుజాత వరకూ...! -ఎస్.ఏ. డేవిడ్
నిర్వాసితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తే.... హ‌క్కుల‌ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు
బీజేపీ మళ్ళీ అధికారానికొస్తే....
Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditions
వరంగల్ లో విద్యార్థులు, రచయితలు, మహిళలతో సహా ప్రజా సంఘాల నేతల అరెస్టు..ఖండించిన విరసం
#CloudyModi మేఘాల చాటున మోడీ యుద్దం... నెటిజనుల సెటైర్లు
ఈ దేశ విముక్తి పోరాటంలో తన నెత్తురుతో ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన కామ్రేడ్ స్వరూపకు జోహార్లు !
నరేద్ర‌ మోడీపై టైమ్ మ్యాగజైన్ సంచలన కథనం
సంస్కరణలు-ప్రజాస్వామ్యం
రాజస్థాన్ లో దళిత మహిళపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ రేపు హైదరాబాద్ లో నిరసన ప్రదర్శన
ఈ దేశం దళితులకేమిచ్చింది ?
భారత మాతకు పాకిస్తాన్ బిడ్డ రాసిన ఉత్తరం
ఎడ్సిమెట్ట ఆదివాసులపై హత్యాకాండ ‍- ఆరేళ్ళ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు
అవును నేను మావోయిస్టునే..!
సీజేకు క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం కోర్టు ముందు ఆందోళ‌న నిర్వహించిన‌ మహిళల అరెస్ట్
తమ పక్కన కూర్చొని భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల అహంకారులు
more..


అతడు