పోలీసుల వలయంలో ఇంద్రవెల్లి...స్వరాష్ట్రంలోనూ అమరులకు నివాళులు అర్పించుకోలేని దుస్థితి


పోలీసుల వలయంలో ఇంద్రవెల్లి...స్వరాష్ట్రంలోనూ అమరులకు నివాళులు అర్పించుకోలేని దుస్థితి

పోలీసుల

ఇంద్రవెల్లి నెత్తుటి మడుగై 38 ఏండ్లయ్యింది. ఇప్పటికీ ఆ గాయం సలుపుతూనే ఉన్నది. వందమందికి పైగా ఆదివాసులను కాల్చి చంపిన నయా డయ్యర్లు నేటికీ రాజ్యమేలుతూనే ఉన్నారు. తమతో కలిసి జీవించి తమ హక్కులకోసం ప్రాణాలర్పించిన ఆదివాసీ యోధులకు నివాళులు అర్పించడానికి కూడా సమైక్య పాలకులు ఒప్పుకోలేదు. ప్రతి ఏప్రెల్ 20వ తేదీన ఇందవెల్లితో సహా చుటూ అనేక కిలోమీటర్ల మేర తుపాకులు పహారా కాస్తాయి. లాఠీలు స్వైర విహారం చేస్తాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినా న్ని అధికారికంగా నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరూ స్వేచ్చగా నివాళులు అర్పించవచ్చని ప్రకటించిన టీఆరెస్..అధికారంలోకి వచ్చాక సమైక్య పాలకులను మించి నిర్భందాన్ని కొనసాగిస్తోంది. ఇంద్రవెల్లి అమరుల స్తూపం దగ్గరికి రాకుండా ఆదివాసులను అడుగడుగునా అడ్డుకుంటోంది.

శనివారం సాయంత్రం వరకు 144 సెక్షన్తో పాటు 30 యాక్ట్ అమల్లో ఉంటుందని పోలీసులు ప్రకటిం చారు. పోలీసులు షరతులతో కూడిన అనుమ తులు ఇస్తున్నారు. ఇంద్రవెల్లి మండలం నుంచే కాకుండా చుట్టుపక్కల గిరిజన ప్రాంతాల నుంచి ఆదివాసులు రాకుండా అడ్డుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సభలు, సమావే శాలను నిర్వహించుకునేందుకు అనుమతులు లేవం టూ పోలీసులు హెచ్చరిస్తు న్నారు. ఇప్పటికే ఇంద్రవెల్లి మండల పరిసర ప్రాంతాలు పోలీసులరక్షణ వలయంలో ఉన్నాయి. ఇంద్రవెల్లి వైపు వచ్చే రహదారులను నిర్బంధిం చారు. రహదారులపై ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అనుమానిత వ్యక్తులపై నిఘా పెడు తున్నారు. శనివారం పోలీసు ఆంక్షలు కొనసాగు తాయంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

స్వరాష్ట్రం వచ్చిందని ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినంపై ఇక ఆంక్షలు తొలగిపోతాయని ఆదివాసులు సంబరపడ్డారు. అయితే సమైక్య‌ పాలకుల మాదిరిగానే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పోలీసు ఆంక్షలు విధించడంతో ఆదివాసులు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి కూ డా పోలీసులు ఇంద్రవెల్లి సంస్మరణ దినోత్సవం పై ఉక్కుపాదం మోపడం వారికి ఆగ్ర హం తెప్పిస్తోంది. ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందంటూ మండిపడుతున్నారు. ఆనాటి సమైక్య‌ పాలకుల పాలనను ప్రశ్నించిన టీఆర్ ఎస్ నేతలే ప్రస్తుతం వారి వారసత్వ పాలననే కొనసాగించడంపై ఆదివాసులు, ప్రజా స్వామ్య వాదులు, మేధావులు మండి పడుతున్నారు. ఎన్నికల సమయంలో నక్సల్స్ ఎజెండానే తమ ఎజెండా అని చెప్పుకున్న టీఆర్ఎస్ పార్టీ ప్రస్తు తం ఇంద్రవెల్లి మండలంలో కొనసాగుతున్న నిర్బంధ పరిస్థితుల పై జవాబు చెప్పాలంటూ ఆదివాసులు, మేధావులు, ప్రజా స్వామ్యవాదులు డిమాండ్ చేస్తు న్నారు.

Keywords : indravelli, adilabad, police, telangana, trs, kcr
(2019-05-20 08:44:29)No. of visitors : 264

Suggested Posts


ఇంద్రవెల్లి ఘటన జరిగిన మూడురోజులకు రాడికల్స్ వేసిన కరపత్రం పూర్తి పాఠం

ఏప్రిల్ 20 తేదీ సాయంకాలం నాలుగు గంట లకు గిరిజన ప్రదర్శన, ఆరు గంటలకు బహిరంగసభ ఉంటాయని ఆదిలాబాద్ జిల్లా అంతటా గోండు, కొలామ్ తెలుగు భాషల్లో పోస్ట‌ర్లు పడ్డాయి. కరపత్రాలు పంచ‌ బడ్డాయి. ఈ ప్రదర్శనకు ముప్పైవేల మంది పైగా గిరిజనులు హాజరవుతారని అంచనా వేయబడింది.

Search Engine

కూతురు పెండ్లికి వెళ్ళడం కోసం ఓ తండ్రికి ఇన్ని ఆంక్షలు పెట్టిన వీళ్ళు కమ్యూనిస్టులా ?
Boycott the EU Elections - Britain and Ireland communist parties
ఈ నేల 25న ఏవోబి బంద్ కు పిలునిచ్చిన మావోయిస్టు పార్టీ
ధిక్కారస్వరాలను వినిపిద్దాం...పీడితుల కోసం పోరాడుతున్న వారిని విడిపించుకుందాం
కోరాపుట్ ఎన్ కౌంటర్: నిజ నిర్దారణ బృందాన్ని అడ్డుకున్న పోలీసుల స్పాన్సర్ సంఘం
ఒడిశా బూట‌కపు ఎన్ కౌంటర్ కు నిరసనగా దండకారణ్య బంద్
ʹవీరన్న దూరమైనా పీడిత వర్గాల పోరాటంలో జీవించే ఉంటాడుʹ
ప్రొ.సుజాత సూరేపల్లికి TVV కి విరసం సంఘీభావం
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నేడు మావోయిస్టులా..?
సాయిబాబా నుండి సూరేపల్లి సుజాత వరకూ...! -ఎస్.ఏ. డేవిడ్
నిర్వాసితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తే.... హ‌క్కుల‌ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు
బీజేపీ మళ్ళీ అధికారానికొస్తే....
Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditions
వరంగల్ లో విద్యార్థులు, రచయితలు, మహిళలతో సహా ప్రజా సంఘాల నేతల అరెస్టు..ఖండించిన విరసం
#CloudyModi మేఘాల చాటున మోడీ యుద్దం... నెటిజనుల సెటైర్లు
ఈ దేశ విముక్తి పోరాటంలో తన నెత్తురుతో ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన కామ్రేడ్ స్వరూపకు జోహార్లు !
నరేద్ర‌ మోడీపై టైమ్ మ్యాగజైన్ సంచలన కథనం
సంస్కరణలు-ప్రజాస్వామ్యం
రాజస్థాన్ లో దళిత మహిళపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ రేపు హైదరాబాద్ లో నిరసన ప్రదర్శన
ఈ దేశం దళితులకేమిచ్చింది ?
భారత మాతకు పాకిస్తాన్ బిడ్డ రాసిన ఉత్తరం
ఎడ్సిమెట్ట ఆదివాసులపై హత్యాకాండ ‍- ఆరేళ్ళ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు
అవును నేను మావోయిస్టునే..!
సీజేకు క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం కోర్టు ముందు ఆందోళ‌న నిర్వహించిన‌ మహిళల అరెస్ట్
తమ పక్కన కూర్చొని భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల అహంకారులు
more..


పోలీసుల