ముక్కుపచ్చలారని పిల్లలను పిడాత చంపిందెవరు? - ఎన్.వేణుగోపాల్


ముక్కుపచ్చలారని పిల్లలను పిడాత చంపిందెవరు? - ఎన్.వేణుగోపాల్

ముక్కుపచ్చలారని

వీక్షణం పత్రిక‌ మే 2019 సంచికలో వీక్షణం ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ రాసిన సంపాదకీయం

ఇరువై మంది చిన్న పిల్లలు, గలగలలాడే కళకళలాడే పడుచుపిల్లలు, ఇప్పుడిప్పుడే బతుకంటె ఏందో నేర్చుకుంటున్న పిల్లలు, రెండేండ్లు కోళ్ల ఫారాల్ల కోళ్ల తీర్గ చదువుల మునిగిపోయిన పిల్లలు ఉరి పోసుకోని చచ్చిరి, మందు దాగి చచ్చిరి, రైలు కింద పడి చచ్చిరి. రాజ్జమేలె మారాజులకు కంట్లె నీటి చుక్క కనబడకపాయె. వాడోడు వీడోడు అయ్యయ్యో అన్నాక గప్పుడే మేలుకున్నట్టు ఏదో ఒక మాట మాత్రం అనిరి. మన చావుకు ఇంకోడు ఏడ్వకుంటె ఏమాయె గాని, అసలు ఎందుకు జచ్చిండ్రో, ఏమేమయిందో తెలుసుకోవాలెగద. డాక్టరో ఇంజనీరో కాకపోతే బతుకే లేనట్టు, అవి కాక మిగిలినవి చదువులే కావన్నట్టు ఉలేఉలే చేసిన నాయకులుండిరి, ఆంధ్రోళ్ల కాలేజీలుండె. మారె, అక్కడొద్దు, మా సర్కారు కాలేజిలనే చదివిపిస్తమంటె ఆ కాలేజిల చెప్పెటోడు ఒకడుంటె ఒకడుండకపాయె. వచ్చినోడు సక్కగ జెప్పడాయె. కష్టమో నష్టమో మీద పడ్డంక తప్పుతదా అని ఆ ప్రైవేటు కాలేజిల్లనే జేర్పిస్తె జైళ్లల్ల బెట్టినట్టే బెట్టిరి. బిడ్డలను చూద్దామన్న చూడనియ్యకపోయిరి. చచ్చినా పైసలు కట్టకుంటె పీనుగయిన ఇయ్యక పోయిరి. ఇటువంటి కోళ్ల ఫారాల కాలేజీలన్ని ఆంధ్రోళ్లయి, మన తెలంగాణ రాంగనె వాళ్లను తరిమి కొడ్తమంటె అదే నిజమనుకుంటిమి. తెలంగాణొచ్చి ఐదేండ్లయిపాయె, ఆ చైతన్యోనిది, నారాయణోనిదే రాజ్జెమాయె. ఇంటర్మీడియట్ బోర్డని ఒకటుంటె అది ఆ చైతన్య, నారాయణల పెంపుడు కుక్క తీర్గ పని చెయ్యబట్టె. ఇట్ల తల్లిదండ్రులు, సర్కారు కాలేజిలు, ప్రైవేటు కాలేజిలు, ఇంటర్మీడియట్ బోర్డు, సర్కారు అన్ని పాపం పసి పోరగాండ్ల ఉసురు తీసుకుంటాంటె ఇయన్ని చాలయన్నట్టు ఇంకో మెకాన్ని పిల్లల మీదికి తోలిండ్రు పెద్దసార్లు. అదేదో కంపిని, గ్లోబరీనానో ఏదో ఓ అంటె నా రాని కంపిని. పదిలక్షల మంది పిల్లల జాతకాలన్ని దాని చేతుల బెట్టిండ్రు. ఆ కంపినికి చాతకాదురయ్యా అంటె ఆళ్లకే ఇయ్యిమని పైనుంచి ఒత్తిడి అన్నరు. ఆడు జేసిన కథలు తీరొక్కటి. పరీక్ష రాయకపోయినా పాసు జేసిండు. 99 మార్కులు వచ్చెటట్టు అవ్వల్ దర్జగ రాస్తె 00 మార్కులు ఏసిండు. ఫస్టియర్ ల తొంబై మార్కులు వచ్చిన మషూర్ పిల్లకు సెకండియర్ ల పది మార్కులేసి ఫెయిల్ చేసిండు. ఐఐటో ఏదో పెద్ద పరీక్షల దేశంలనే పేరెన్నికగన్నోనికి ఇక్కడ ఒక్క మార్కేసి ఫెయిల్ జేసిండు. మార్కుల మెమో ఎట్ల తయారు చెయ్యల్నో గూడ తెల్వదు. ఒక్కొక్క సబ్జెక్టు రెండు సార్లు రాసి రెండు తీర్ల మార్కులేసిండు. ఒక హాల్ టికెట్ నంబరు గొడితె ఇంకో హాల్ టికెట్ మార్కుల మెమో ఇస్తండు. అట్ల పిల్లలను అరిగోస పెట్టిండు. పదిలక్షల మంది పిల్లల్ల మూడు లక్షల మందిని ఫెయిల్ జేసి పారేసిండు. అండ్ల ముప్పై నలబై వేలయినా మంచిగ చదివేటోళ్లు, నూటికి తొంబై ఎనిమిది, తొంబై తొమ్మిది తెచ్చుకునేటోళ్లు ఉన్నరు. తల్లిదండ్రులే కోప్పడ్డరో, తోటి పిల్లగాండ్లల్ల నాదాన్ అయితదనుకున్నరో, ఎంత పెద్ద చదువులు చదవాల్నని ఎన్నెన్ని కలలు గన్నరో, ఆ కలలన్ని కూలిపోయినయని నారాజ్ అయిండ్రో పిల్లలు అఘాయిత్యం జేసిండ్రు. ఎందుకిట్ల అయిందని అడుగుటానికి పోతే సర్కారు పోలీసులను ఉసి గొలిపె. పిల్లలను, తల్లిదండ్రులను, దోస్తులను కొట్టబట్టిరి, పోలీసు స్టేషన్ల పెట్టబట్టిరి. సిగ్గుశరం ఉన్న సర్కారైతె, అయ్యో పాపం అనాలె గద మొదలు. ఎక్కడ అన్యాలం జరిగిందో చూస్త, బరాబర్ గ సరి చేస్త అని నమ్మకం జెప్పాలె గద. మీ బతుకులతోటి చెలగాటమాడినోడు ఎవడైనా సరే వాడ్ని చింతకు గట్టి చీరుత అనాలె గద. ఏమీ అనకపాయె. ఆ కంపెనీ దొరవారి దగ్గరి దోస్తుదేనని ఊరు కోడై కూస్తాండె. ఎట్ల పాడయితదుల్లా. మన తెలంగాణ, బంగారి తెలంగాణ అంటె నమ్మి నానబోస్తె పుచ్చి బుర్రలైపాయె గద నాయనా...
- ఎన్.వేణుగోపాల్

Keywords : telangana, inter students, suicides, kcr
(2020-07-05 03:53:38)No. of visitors : 922

Suggested Posts


మనలో మనిషి మహాశ్వేత - ఎన్.వేణుగోపాల్

గిరిజనులు, గిరిజన సంస్కృతి, గిరిజనులతో మమేకత్వం ఆమెను ఒక చిన్నా పాపలా మార్చేస్తాయి. చాలా అమాయకంగా "మంచి వాళ్లందరూ గిరిజనులు, చెడ్డ వాళ్లందరూ గిరిజనేతరులు" అని, వెంటనే "నువ్వు గిరిజనుడివా కాదా" అని అడిగింది....

GST ఎవరి కోసం... అసలు కథేంటి - ఎన్. వేణుగోపాల్ (1)

జిఎస్టి వల్ల నెరవేరే అసలు మేలు భారత ప్రజలకూ కాదు, భారత ఆర్థిక వ్యవస్థకూ కాదు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్నుల విధానంతో ఏకీకృత మార్కెట్ ఏర్పాటు చేసుకుని, దానిమీద తిరుగులేని అధికారం సంపాదించడానికీ, ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న చిన్న ఉత్పత్తిదారు లను, వ్యాపారులను దెబ్బతీసి....

ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్

దేశం ఆర్థిక మాంద్యంలో ఉన్నదని కొంత కాలంగా వస్తున్న వార్తలు.. విశ్లేషణలు... నిజాలు.. అబద్దాలు... ప్రజలను గందరగోళ పరుస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నదన్నది నిజం.

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.

తెలంగాణలో భూకుంభకోణాలు...పాలకుల నాటకాలు ‍- ఎన్.వేణుగోపాల్

హైదరాబాద్‌లోని మియాపూర్‌, హఫీజ్‌పేట ప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు అన్యాక్రాంత మయ్యాయని, అక్రమ రిజిస్ట్రేషన్ల పాలయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు నష్టపోయిందని జూన్‌ మొదటి వారంలో వార్తలు గుప్పుమన్నాయి. దాదాపు మూడువారాల పాటు ప్రచార సాధనాలన్నీ ఆ వార్తలతో మార్మోగి పోయాయి.....

క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్

కాల్పులు జరిగినప్పుడు తాము, తమ స్నేహితులు ఎలా పరిగెత్తారో, ఎలా తుపాకిగుండ్లకు దొరక్కుండా తప్పించుకున్నారో చెప్పారు. అయితే తమ స్నేహితుల్లో కొందరు తప్పించుకోలేక పోయారని కూడా చెప్పారు. కాల్పులు మొదలు కాగానే ఖోఖో ఆడుతున్న ఉత్కల్‌ గ్రామానికి చెందిన సుక్కి, అదే గ్రామానికి చెందిన తన స్నేహితురాలితో కలిసి పరిగెత్తింది.

ఎవరి కోసం... అసలు కథేంటి -ఎన్. వేణుగోపాల్ (2)

ఇంత గందరగోళం, పద్నాలుగు సంవత్సరాల వెనుకాముందులు, చర్చోపచర్చలు, వివాదాలు, అభ్యంతరాలు ఎందుకు వెల్లువెత్తాయో అర్థం చేసుకోవాలంటే భారత పాలకవర్గాల ముఠాతగాదాలు అర్థం చేసుకోవాలి. బహుళ జాతి సంస్థల ఆదేశాలు, దళారీ బూర్జువా వర్గపు బేరసారాలు, వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా రాజకీయ వాదనలు....

పదహారంటె సగమాయె, బిడ్డోడిపాయె, ఎందుకైనట్లిట్ల?

ఇగ ఈ రాజ్జెం కొడుకు చేతుల బెట్టి, నేన్ ఢిల్లి పోత, ఆడ చక్రం తిప్పెదున్నది. ఆడ చక్రాలన్ని నాకోసమే ఎదురు చూస్తానయి అని ఒక్కతీర్గ జెప్పె. గాలి మోటరేస్కోని ఆడంగ ఈడంగ చెంగడ బింగడ ఎగిరె. కొసాకరికి ఏమయింది? ఇంటి మాలచ్చిమి ఓడిపాయె. రెక్కల్ల బొక్కల్ల అరుసుకున్న మేనల్లుడు ఓడిపాయె....

అరాచక రాజ్యంలో భక్తి ముసుగులో అరాచక మూక‌

మత విశ్వాసాల కోసం వందల మందిని, వేలమందిని ఊచకోత సాగించవచ్చునని చూపినవారు దేశాధినేతలుగా ఉండగలిగినప్పుడు ఆ మత విశ్వాసాల కోసమే చట్టాన్ని ధిక్కరించవచ్చునని, సమాజంలో బీభత్సం సృష్టించవచ్చునని భక్తులు అనుకోవడం సహజమే.

మోడీ కుట్ర విప్పిచెప్పిన సాహసికి లేఖ

ఈ ఉత్తరం నీకందుతుందా, అందినా ఎప్పుడు అందుతుంది, నువ్విది చదవగలవా నాకు తెలియదు. ఈసారి నిన్ను జైలులో కలవడానికి వచ్చినప్పుడు కృతనిశ్చయురాలైన నీ సహచరి శ్వేతా భట్ ఈ ఉత్తరం ప్రతిని నీకు తెచ్చి ఇవ్వవచ్చు. కాని ఇప్పుడైతే ఆమె ఎంతో పోరాడవలసి ఉంది, ఎంతో సంబాళించుకోవలసి ఉంది. నా ఉత్తరం అనే చిన్న విషయం ఆమె మరిచిపోవచ్చు కూడ.

Search Engine

కరోనా సోకింది... ఉద్యోగం పోయింది...జర్నలిస్టు ఆత్మహత్య‌
రెక్కవిప్పిన రెవల్యూషన్ వరవరరావు
కేరళ:పావంగడ్ పట్టణంలో మావోయిస్టుల పోస్టర్లు,బ్యానర్లు... దళిత,గిరిజన,మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు
ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు
జూలై 4,5 తేదీల్లో విరసం యాభయ్యో ఆవిర్భావ సభలు... ఆన్ లైన్ లో
పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు
తమిళనాడు కస్టడీ మరణాలు: 5గురు పోలీసుల అరెస్టు... పటాకులు పేల్చి డ్యాన్సులు చేసిన జనం
బొగ్గు గని కార్మికుల మూడు రోజుల సమ్మెకు ప్రజా ఫ్రంట్ మద్దతు
తూచ్..మేము మందు కనిపెట్టలేదు...కరోనా మందుపై యూ టర్న్ తీసుకున్న పతంజలి
జ్యుడిషియల్ టీం పై పోలీసుల వేధింపులు... పోలీస్ స్టేషన్‌ను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఆదేశం
అఖిల్ గొగొయ్ ని విడుదల చేయాలంటూ1200 మంది ఖైదీల నిరాహార దీక్ష
143 Bangladesh intellectuals demand the release of Varavara Rao
దేశంలో రోజుకు ఐదు కస్టోడియల్ మరణాలు
బొగ్గుగని కార్మికుల దేశవ్యాప్త సమ్మెకు పౌరహక్కుల సంఘం మద్దతు
హక్కుల కార్యకర్త సోనీ సోరీని హత్య చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారా ?
జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా....ఇలాంటి హత్యలు ఎన్నో!
పోలీసుల క్రూరత్వం... తండ్రీ కొడుకుల హత్య...మాట‌ల‌కంద‌ని హింస‌
మూడురోజుల పాటు మావోయిస్టుల భారీ బహిరంగ సభ...వేలాదిగా పాల్గొన్న జనం
ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుడిపై సినిమా... మతోన్మాద శక్తుల హెచ్చరికలు
అఫ్ఘ‌నిస్తాన్ మావోయిస్టు పార్టీ చైర్మన్ కామ్రేడ్ జియా అమర్ రహే !
ఇప్పుడు పోరాటం ఒక్కటే...మన ఉనికిని నిలబెడుతుంది -అరుంధతీ రాయ్
రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ పంజాబ్ లో ఆందోళనలు...రాష్ట్రపతికి లేఖ‌ !
రమాకాంత్ అమర్ రహే! ఈ విప్లవ యోధుడి అమరత్వానికి ఇరవై నాలుగేళ్లు...
A very worrying letter from Gautamʹs partner Sahba. Remember that Maharashtra is the epicenter of the Covid epidemic.
వరవరరావుతో సహా హక్కుల కార్యకర్త‌లందరినీ విడుదల చేయాలి....500 మంది ప్రముఖుల లేఖ !
more..


ముక్కుపచ్చలారని