ʹకొలిమిʹకి స్వాగతం

ʹకొలిమిʹకి

ʹహింసను, పీడనను ఎండగడుతూ, వ్యతిరేకిస్తున్న ప్రత్యామ్నాయ సాహిత్యం, సంస్కృతులు కూడ వున్నాయి. ప్రజలపై పెరుగుతున్న అన్ని రకాల హింసలను వ్యతిరేకిస్తూ అణగారిన వర్గాల, కులాల, లింగాల, జాతుల, ప్రాంతాల, మత మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం కవులు, కళాకారులు, బుద్ధిజీవులు నిరంతర ప్రయత్నం చేస్తూనే వున్నారు.ʹ

ʹమానవీయ సమాజాన్ని కలగని అపారమైన త్యాగసంప్రదాయాలు నెలకొల్పిన తెలుగు నేలపై ఇప్పుడు రాజకీయ స్తబ్దత ఆవరించివుంది. కాని ప్రజల జీవితాలలో సంక్షోభం, సంఘర్షణ ఏమీ ఆగిపోలేదు. అవి ఇంకా తీవ్రమై, లోపలి మనిషి విధ్వంసమవుతున్న విషాద పరిస్థితి నెలకొనివుంది. ఈ స్థితిలో ʹసృజనకారులుగా మనమేం చేయవలసి ఉంది, ఏం చేద్దాంʹ అనే ఆలోచనల్లోనుండి పుట్టిందే ఈ ʹకొలిమిʹ వెబ్ పత్రిక.ʹ అని ప్రకటించిన ʹకొలిమిʹ సంపాదకవర్గానికి అభినందనలు...

కొలిమి విజయవంత కావాలని, పీడితులకోసం కొలిమి ఎప్పుడూ రగులుతూ ఉండాలని అవని న్యూస్ కోరుకుంటున్నది

కొలిమి సంపాదకవర్గం ప్రకటన పూర్తి పాఠం

ʹకొలిమంటుకున్నాది
తిత్తి నిండా గాలి
పొత్తంగ ఉన్నాది
నిప్పారిపోనీకు – రామన్నా
పొద్దెక్కిపోనీకు – లేవన్నా…ʹ

— చెర

సాహితీ మిత్రులారా...

ప్రపంచంలోనూ, దేశంలోనూ, తెలుగు భాషా ప్రాంతాలలోనూ సమాజంలో తీవ్రమవుతున్న సంక్షోభాల సందర్భంలో ఉన్నాము. ఈ సంక్షోభం బుద్ధిజీవుల మనసులను కల్లోల పరుస్తున్నది. ఆయా సంక్షోభాల వెనుక ఉన్న వ్యవస్థీకృత అంశాలను అర్థం చేసుకోవలసిన, ఇతరులకు అర్థం చేయించడానికి కళారూపంలో వ్యక్తీకరించవలసిన స్థితిలో కూడ ఉన్నాము. ఈ సంక్షోభం మధ్యనే కొనసాగుతున్న హింసను, పీడనను ఎండగడుతూ, వ్యతిరేకిస్తున్న ప్రత్యామ్నాయ సాహిత్యం, సంస్కృతులు కూడ వున్నాయి. ప్రజలపై పెరుగుతున్న అన్ని రకాల హింసలను వ్యతిరేకిస్తూ అణగారిన వర్గాల, కులాల, లింగాల, జాతుల, ప్రాంతాల, మత మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం కవులు, కళాకారులు, బుద్ధిజీవులు నిరంతర ప్రయత్నం చేస్తూనే వున్నారు. ఈ మొత్తం సామాజిక అనుభవంలో తెలుగు నేలకు ఒక ప్రత్యేకతవుంది. దేశాన్ని ప్రభావితం చేసిన ప్రతి చారిత్రిక మలుపులో తెలుగు పౌర సమాజం తనదైన ప్రత్యామ్నాయ గొంతుకను వినిపిస్తూ వచ్చింది. బుద్ధిజీవులు చూపిన ఆ చైతన్యానికి ప్రధానమైన కారణం ఇక్కడ నిరంతరంగా కొనసాగుతున్న ప్రజా ఉద్యమాలే. నిజమే, మానవీయ సమాజాన్ని కలగని అపారమైన త్యాగసంప్రదాయాలు నెలకొల్పిన తెలుగు నేలపై ఇప్పుడు రాజకీయ స్తబ్దత ఆవరించివుంది. కాని ప్రజల జీవితాలలో సంక్షోభం, సంఘర్షణ ఏమీ ఆగిపోలేదు. అవి ఇంకా తీవ్రమై, లోపలి మనిషి విధ్వంసమవుతున్న విషాద పరిస్థితి నెలకొనివుంది. ఈ స్థితిలో ʹసృజనకారులుగా మనమేం చేయవలసి ఉంది, ఏం చేద్దాంʹ అనే ఆలోచనల్లోనుండి పుట్టిందే ఈ ʹకొలిమిʹ వెబ్ పత్రిక.

కళాసాహిత్యాలు మానవ ఉద్వేగాలు, చైతన్యం, విలువల ఉన్నతీకరణను చిత్రించే మహోన్నత రూపాలు. అవి సామాజిక చలనాలను నమోదు చేస్తాయి, అర్థం చేయిస్తాయి. సమాజ దుస్థితిని అవగాహనకు తెచ్చి, ఆ దుస్థితిని మార్చే ఆచరణ వైపు ప్రజల్ని పురికొల్పుతాయి. అటువంటి ప్రజాస్వామిక విలువలను ప్రతిబింబించే కళనూ, సాహిత్యాన్నీ జనజీవన చిత్రాన్నీ సమాజానికి అందించే ప్రయత్నంలో భాగంగానే ʹకొలిమిʹ వెబ్ పత్రికతో మీ ముందుకు వస్తున్నాం. ఇది మనందరి పత్రిక. ఇదొక ప్రజాస్వామిక, కళా సాహిత్య సాంస్కృతిక వేదిక. భిన్న ఆలోచనలు, సంఘర్షణలకు ఇదొక వాహిక కావాలని మా కోరిక.

కొలిమి మానవ నాగరికతకు పునాది. ముడి సరుకును కొలిమిలో కరిగించి సానబెట్టడంతో ఉత్పత్తిలో భాగమయ్యే పనిముట్లకు ఒక రూపం వస్తుంది. ఈ పనిముట్లతోనే నాగరికత నడకలు నేర్చింది. కొలిమిని రాజేసి గడ్డకట్టుకు పోతున్న వ్యవస్థని కరిగించి చలనం తీసుకువచ్చే మహత్తర కృషిలో ఈ పత్రికతో మా వంతు ప్రయత్నమిది. కొలిమిలో కరిగిన ముడి సరుకు యథాస్థితి నుంచి పురోగామి స్థితికి మారినట్టుగానే ఈ పత్రికతో ఉన్న స్థితి నుంచి ఒక అడుగు పైకి ఎదిగే సామాజిక చైతన్యానికి దోహదపడాలని మా అభిలాష.

ఇంతకు ముందు ఊరి రచ్చబండకు కొలిమి ప్రత్యామ్నాయ వేదికగా ఉండేది. ఈ వేదిక దగ్గర చేరిన ఉత్పత్తి కులాల ప్రజలందరూ తమ కష్టాలనూ, కన్నీళ్లనీ పంచుకునేవాళ్లు. అట్లనే ఈ ʹకొలిమిʹ పత్రికను విభిన్న ప్రాంతాల, అస్తిత్వాల, సమూహాల ప్రజాస్వామిక స్వరాలకు వేదికగా తీర్చిదిద్దాలని మా కోరిక.

సాహిత్యం ఒక సామాజిక బాధ్యత. సృజన వ్యక్తిగతమే. కానీ, అభివ్యక్తి సామూహికం. సామాజికం. ఆ సామాజిక బాధ్యత లోంచే మనం కొత్త దారిని వెతకాలి. సామాన్యుల కోసం పరితపించే కలాలను, గళాలను ఎత్తి పట్టాలి. మా సామాజిక బాధ్యతగా ఇదొక చిన్న ప్రయత్నం మాత్రమే. ప్రతి ఊరిలోనూ కొలిమిలెన్నో అవసరం ఉన్నట్టే ఊరూరా ఇలాంటి కొలిమిలెన్నో రాజేయాల్సే ఉన్నది.

ప్రజావ్యతిరేక సాహిత్యానికి ʹకొలిమిʹ పత్రికలో తావులేదు. కుల వివక్షనూ, హిందుత్వ విద్వేషాన్నీ, భూస్వామ్య అంతరాలనూ, పెట్టుబడిదారీ స్వార్థ ప్రవృత్తినీ, సామ్రాజ్యవాద విస్తరణాకాంక్షనూ ఏ రూపంలోనైనా సమర్థించే రచనలకు ఈ కొలిమిలో చోటు లేదు. సమాజ బహుళత్వాన్ని అంగీకరిస్తూ, ఆదివాసీ, దళిత, బహుజన, మైనారిటీ అస్తిత్వాలను గౌరవించే రచనలకు సాదర ఆహ్వానం. అనవసరమైన వివాదాలకు ఆస్కారం లేని నిర్మాణాత్మక చర్చ, విమర్శలే ఈ కొలిమికి బొగ్గూ నిప్పూ ఊదుడుగొట్టమూ.

ʹకొలిమిʹకి మీ రచనలే ఊపిరి. ప్రతి నెలా ఒకటో తేదీన వెలువడే ఈ ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక కళా సాహిత్య వేదికకు ప్రజాస్వామిక విలువలున్న కవిత్వం, కథలు, పాటలు, సాహిత్య వ్యాసాలు, సాహిత్య విమర్శలు రాసి పంపండి. సాహిత్య పరిచయాలు, సాహిత్య వార్తలు పంపండి. ఈ కొలిమిని రాజేయడంలో మాతో చేతులు కలపండి. మనందరమూ కలిసి ఈ ʹకొలిమిʹని నిరంతర జ్వలన ధారగా మారుద్దాం. రాతిమట్టిముద్దగా ఉన్న ముడి ఇనుమును పదునెక్కిన కొడవలిగా, సుత్తెగా, పాళీగా, కీబోర్డు అక్షరంగా, తుప్పుపట్టిన సమాజావగాహన తాళాన్ని తెరిచే తాళంచెవిగా తయారు చేద్దాం. రండి.

ʹకొలిమిʹ ఎడిటోరియల్ టీం
_____________________

భావన గోపరాజు
అనిశెట్టి రజిత
శివరాత్రి సుధాకర్
మహేందర్ బర్ల
కోడం కుమారస్వామి
అశోక్ కుంబము
చైతన్య చెక్కిళ్ల

Keywords : kolimi, literary magazine,
(2024-04-24 18:32:36)



No. of visitors : 1854

Suggested Posts


కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్

నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ‌ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్.

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి

ఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹకొలిమిʹకి