అరుణోదయం ఆయన గానం..విప్లవం ఆయన ప్రాణం


అరుణోదయం ఆయన గానం..విప్లవం ఆయన ప్రాణం

అమరుడు రామనర్సయ్యను మన కళ్ళముందుంచిన ఆ గొంతు...

వీర గాథలతో మన నెత్తురులో ఓ ఉత్తేజాన్ని నింపిన ఆ గొంతు ఇక వినపడదు...

తన డప్పు శబ్దంతో మనను నాట్యం చేయించిన ఆ ముని వేళ్ళు ఇక కదలవు....

దాదాపు నాలుగు దశాబ్దాలపాటు ఈ తెలుగు నేల నలుచెరుగులా విప్లవాన్ని గానం చేసిన అరుణోదయ రామారావు ఇవ్వాళ్ళ (మే5, 2019) మధ్యాహ్నం గుండెపోటుతో మరణించాడు.

అరుణోదయాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న అరుణోదయ రామారావు అసలు ఇంటి పేరు విప్లవం. కర్నూలు జిల్లాలో పుట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వేల సాంస్కృతిక ప్రదర్శ‌నలు ఇచ్చిన రామారావు తనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్నట్టు... ముందు రంగస్థల కళాకారుడు. ఒకానొక రోజు రామారావు ఇచ్చిన ప్రదర్శనను చూసిన సినీ సంగీత దర్శకుడు ఘంటసాల సినీ అవకాశాలిప్పిస్తానని రామారావును మద్రాసు తీసుకొని వెళ్లారు. అయితే సినిమాలో పాటలు పాడితే తన పొట్టనిండుతుందేమో కానీ సమాజానికేం ఉపయోగమన్న ఆయన ఆలోచన రామారావును మళ్ళీ కర్నూలుకు రప్పించింది. విప్లవ కళాకారుడు కానూరి వెంకటేశ్వరరావుతో కలిసి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య‌ను ఏర్పాటు చేశాడు. చాలా కాలం అరుణోదయకు కార్యదర్శిగా ఉన్నాడు. చనిపోయేనాటికి ఆయన అరుణోదయకు అధ్య‌క్షుడు.

రాయలసీమలో పుట్టినా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ‍అండగా నిల్చాడు. తెలంగాణలో జరిగిన అనేక సభల్లో తెలంగాణ కోసం గానం చేశాడు. మిలియన్ మార్చ్, సాగరహారంలలో ఎర్రజెండా పట్టి ముందు నడిచాడు. తెలంగాణ జేఏసీ తీసుకున్న ప్రతి కార్యక్రమంలో రామారావు పాల్గొన్నాడు.

రామారావు కళాకారుడే కాదు రాజకీయ కార్యకర్త కూడా. సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కూడా రామారావు. ఈ దోపిడి సమాజం మారాలంటే నూతన ప్రజాస్వామిక విప్లవమొక్కటే మార్గమని నమ్మిన రామారావు. ఈ దేశంలో సాగుతున్న నూతన ప్రజాస్వామిక విప్లవ జయప్రదం చేయడం కోసం తన జీవితాన్ని విప్లవానికే అంకితం చేసిన వృత్తి విప్లవకారుడు. అతని సహచరి అరుణ కూడా IFTU(Indian Federation of Trade Unions) నాయకురాలు. వీరికి ఇద్దరు పిల్లలు.

విప్లవం కోసం తన యవ్వనాన్ని, జీవితాన్ని ధారబోసి, జీవితమంతా విప్లవాన్ని గానం చేసిన అమరుడు అరుణోదయ రామారావుకు విప్లవ జోహార్లు.

Keywords : అరుణోదయ, రామారావు, మృతి, గుండెపోటు,ఇఫ్టూ, కార్యదర్శి, Arunodaya, Ramarao, IFTU, CPI ML, New Democracy
(2020-01-17 01:41:07)No. of visitors : 933

Suggested Posts


0 results

Search Engine

ఉరిశిక్ష‌లు, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల నియంత్ర‌ణ సాధ్య‌మేనా?
రాజ్యాంగమే నా బలం,ఆ బలంతోనే పోరాటం కొనసాగిస్తా - ఆజాద్
మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసి
వాళ్ళిద్దరి కోసం..!
జేఎన్‌యూ తర్వాత‌...ఇప్పుడు మరో యూనివర్సిటీ విద్యార్థులపై దాడి
మమ్మల్ని ఈ దేశం నుండి బహిష్కరించండి - రాష్ట్రపతికి లేఖ రాసిన ʹఉనాʹ దళితులు
JNU పై దాడి చేసిందెవరో తేల్చి చెప్పిన వార్డెన్ల నివేదిక‌
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ కు బెయిల్...నెల రోజులు సహరన్ పూర్ లోనే ఉండాలని కండీషన్
మోడీషా రాజ్య నిర్బంధంలో మగ్గుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ విడుదలకై ఉద్యమిద్దాం
విద్వేషం అతని మతం.. అణచివేత అతని ఆయుధం..!
మీరు చేస్తే గొప్ప పని ప్రజలు చేస్తే హింసనా జగ్గీ గారు
ఈ ప్రభుత్వమే నిర్బంధ కేంద్రాల్లోకి నెట్టబడే రోజొస్తుంది : అరుంధతి రాయ్
మన చేతుల మీది నెత్తుటి మరకలు కడగడానికి ఎన్ని సముద్రాలు కావాలి?
నిజం ఎప్పటికి బయటకు వస్తుంది?
విరసం అధ్యక్ష కార్యదర్శులుగా అరసవెల్లి కృష్ణ,కాశీం
50 ఏళ్ల.. దుఃఖం, నిర్భంధం, ధిక్కారం, స్పూర్తి... 50 ఏళ్ల విరసం మహాసభలు
విరసం 50 ఏళ్ళ సభలు...నోమ్ ఛామ్ స్కీ సందేశం
సృజ‌నాత్మ‌క ధిక్కారం.. విర‌సం 50 ఏళ్ల స‌భ‌లు ప్రారంభం
విరసం 50 ఏళ్ల సభలు.. పూణే జైలు నుంచి వరవరరావు సందేశం
CPI (Maoist) oppose Citizenship Amendment Act, calls to intensify mass campaign against it
అమిత్ షాకు బహిరంగ లేఖ‌ !
50 ఏళ్ళ ధిక్కారస్వరం...ఈ నెల11,12 తేదీల్లో విరసం రాష్ట్ర‌ మహాసభలు
నెత్తుటి ఏరులు పారినా ఎత్తిన జెండా దించకుండా... మళ్ళీ పిడికిలెత్తిన జేఎన్‌యూ
Cotton University Students Hoist Black Flags, Express Solidarity with JNU
JNU: బాధితులపై బీజేపీ నేతల చవకబారు వ్యాఖ్యలు
more..


అరుణోదయం