ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

ఫేస్

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను. మేము మావోయిస్టు నాయకులతో ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు... ఇంటర్వ్యూ అయిపోయి వచ్చేప్పుడు ఆ సాయంత్రం మమ్ములను అన్నం తినడానికి పిలిచారు. ఓ పాల్తిన్ టెంట్ కింద అన్నం పెడుతున్నారు. జర్నలిస్టులము వచ్చామని ప్రత్యేకంగా మేక కూర వండారు. అందరూ లైన్ లో వెల్తున్నారు. మేం కూడా లైన్ లో జాయిన్ అయ్యాం. ఒక గిన్నెలో తలకాయ కూర వడ్డిస్తున్న అతను నన్ను ఆకర్షించాడు. అసలే నాకు తలకాయ కూరంటే ఇష్టం. నేను అతని వైపే చూస్తూ నడుస్తున్న. అమాయకపు చూపులు... పలకరింపులో ఆప్యాయత.... ఏదో సాధించాలని కళ్ళల్లో కనిపిస్తున్న ధీక్ష. ఇంతలో నావంతొచ్చింది. అతని దగ్గరికి పోయి అన్నా నాకు ఈ కూర చాలా ఇష్టం కొంచెం ఎక్కువ వేయమన్నా... అతను నా మొహంలోకి చూసి ఓ నవ్వు నవ్వి అన్నా, నువ్వు నాకు తెలుసు.... నేను మీ ఫేస్ బుక్ ఫ్రెండ్ ని అన్నాడు. నేను ఒక్క సారి షాక్ అయ్యాను. నిత్య పోరాటంలో ఉండి... ఇతను ఫేస్ బుక్ అకౌంట్ మేంటేన్ చేస్తున్నాడా ! నాకు అర్దం కాలేదు. నా మొహం చూసి నా భావాలను పసిగట్టినట్టున్నాడు. నేను పార్టీలోకి వచ్చి రెండు నెలలే అయ్యింది. అంతకు ముందు ఫేస్ బుక్ అకౌంట్ మేంటేన్ చేసేవాడిని. మీ పోస్టులన్నీ రెగ్యులర్ గా చూసే వాడిని అని చెప్పాడు. అతనెవరు ? ఏ వూరు ? పేరేంటి తెలుసుకోవాలనె కుతూహలం కలిగింది నాకు. కానీ అడిగినా వాళ్ళు చెప్పరు. అందకని నా కుతూహలాన్ని నాలోనే దాచుకున్నాను. ఆ తర్వాత మేం మా పని ముగించుకొని అక్కడినుండి వచ్చేశాం. 25 రోజుల తర్వాత సెప్టెంబర్ 15 మంగళవారం నాడు పొద్దున వరంగల్ జిల్లా మేడారం వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు మృతి అనే వార్త వచ్చింది. వాళ్ళ పేర్లు శృతి, విద్యాసాగర్ రెడ్డి అని తెలిసింది. కొద్ది సేపటి తర్వాత చనిపోయిన ఆ మావోయిస్టు గెరిల్లాల ఫోటోలు వచ్చాయి. ఆ ఫోటోలు చూడగానే షాక్ తిన్నాను. దుంఖం వచ్చింది. నాకా రోజు దండకారణ్యంలో ప్రేమగా అన్నం తినిపించిన.. సార్ నేను మీ ఫేస్ బుక్ మితృడిని అని చెప్పిన ఆ అమాయకపు చూపుల... ఆప్యాయత పలకరింపుల... నామితృడు.... ఒక్క సారి పరిచయంతోనే నామీద విపరీతమైన ప్రభావం చూయించిన స్వార్దరహిత మానవుడు.... శ్రమ జీవి... విప్లవకారుడు.... విద్యాసాగర్ రెడ్డి. ఎప్పుడో ఫేస్ బుక్ లో మితృడై 25 రోజుల కింద నాకు ప్రత్యక్షంగా పరిచయమైన ఆ మితృడు విగతజీవుడై ఫేస్ బుక్, వాట్సప్ లో మెసేజ్ అయ్యి, వార్త అయ్యి ఇవ్వాళ్ళ నాముందుకు వచ్చాడు. నేను ఆరోజు అతని గురించి తెలుసుకుందామనుకున్న వివరాలన్నీ ఈ రోజు తెలిశాయి. అతని అమరత్వం నాకు అతని వివరాలు కాకుండా అతను నాడిచిన బాట గురించి తెలుసుకొమ్మని చెబుతోంది.
- యంవీ రమణ

Keywords : Maoists, Police, Vidyasagar reddy, Shruthi, Waranagal.
(2024-04-27 10:49:54)



No. of visitors : 13913

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ‌ (వీడియో)

మావోయిస్టు పార్టీ ద‌క్షిణ బ‌స్త‌ర్ డివిజ‌న్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌క్స‌ల్బ‌రీ వేడుక‌లు ప్ర‌పంచానికి ఇప్ప‌డు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్క‌రిద్ద‌రు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్ర‌జా విముక్తి గెరిల్లాలతో క‌లిసి క‌దంతొక్కారు.

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

ఆ శవాలు మాట్లాడుతున్నవి...

శరీరాన్ని చీల్చేసినట్టుగా, పొడిచేసినట్టుగా కనపడుతున్న ఆ శవాలు మాట్లాడుతున్నవి. పురుగులు పట్టిన ఆ శవాలు మాట్లాడుతున్నవి.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఫేస్